Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu


భాగవతానికి అంత పవిత్రత వచ్చిందిలా..
భాగవతం అంటే ఏదో మామూలుగా కనిపించే ఓ గ్రంథం మాత్రం కాదు. పురాణాల వరుసలో దానికెంతో ప్రాధాన్యం ఉంది. ఆ ప్రాధాన్యానికి కారణం ఆ పురాణానికున్న పవిత్రతే. ఈ విషయాన్ని వివరించి చెబుతుంది ఈ కథా సందర్భం. ఇది భాగవతం మూడో స్కంధంలో కనిపిస్తున్న విషయం. భాగవతం శ్రీమన్నారాయణుడి చరిత్రలు అనే దారాలతో అల్లినది, మానవాళి సంరక్షణకు ఉపయుక్తమైనది అయిన గొప్ప కవచంలాంటిది. అది వేదాల అర్థాలను విస్తరింపచేస్తుంటుంది. అసలు ఆ పురాణ సృష్టికర్త సంకర్షణుడు. ఆయనే వాసుదేవుడు అనే పేరుతో ప్రకాశించే దేవాదిదేవుడు. జ్ఞానస్వరూపుడు, దివ్యపురుషుడు అయిన ఆ సంకర్షణుడు తానై సృష్టించిన వేదసారమైన భాగవతాన్ని చూసి ఎంతో ఆనందిస్తుండేవాడు.

తొలిగా సనత్కుమారుడికి ఉపదేశం
ఆ సంకర్షణుడు ఆ మహాపురాణాన్ని ఎలాగైనా సరే మానవాళికి అందేలా చెయ్యాలి, ఆ భాగవత సేవనంతో మానవులు తరించాలి అని అనుకున్నాడు. అల్పమైన సుఖాల కోసం అర్రులుచాస్తూ వాటిని పొంది కూడా దుఃఖాన్నే అనుభవిస్తున్నారు మానవులు. అటువంటి వారిని దుఃఖాల నుంచి దూరం చేయటానికి సమర్థమైంది భాగవతం. అందుకే సంకర్షణుడు ఓ రోజున ఆ భాగవతాన్ని పాతాళలోకానికి తన వెంట తీసుకువెళ్లాడు. అక్కడ ప్రశాంతంగా ఏకాంతంలో ధ్యానం చేస్తూ ఆ ధ్యానంలో తనను తానే దర్శించుకొన్నాడు. ఆ తర్వాత మెల్లగా కళ్లు తెరచి చూశాడు. సనకసనందనాదులు స్వామిని స్తుతిస్తూ కనిపించారు. అదేసమయానికి ఆకాశగంగలో స్నానం చేసిన నాగకన్యలు అక్కడి కొచ్చారు. వారంతా ఆ సంకర్షణ భగవానుడిని చూసి ఆ స్వామే తమకు భర్తగా కావాలని ఆ పరమపురుషుడిని స్తుతించి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందారు. అప్పుడు సనకసనందనాదులు తదితరులంతా మళ్లీ ఆ దేవదేవుడిని సంస్తుతించారు. అప్పుడు ఆ స్వామి మరింత ప్రసన్నుడై తనవెంట తెచ్చుకొన్న భాగవతాన్ని లోక కల్యాణం కోసం తొలిగా సనత్కుమారుడికి సాదరంగా ఉపదేశించాడు. ఆ తర్వతా సనత్కుమారుడు సాంఖ్యాయనుడికి ఉపదేశించాడు. ఆ సాంఖ్యాయనుడు పరాశరుడికి, పరాశరుడు బృహస్పతికి, ఆ బృహస్పతి మైత్రేయుడికి మహాభాగవతాన్ని ఉపదేశించారు. మైత్రేయుడు భాగవతాన్ని విదురుడికి వివరించి చెప్పాడు. ఆ తర్వాత అలా అలా గురుశిష్య పరంపరలో మహాభాగవతం వ్యాస, శుక మహర్షుల ద్వారా లోకానికంతటికీ అందివచ్చింది. ఇలా భాగవత అవతరణం జరిగిన వివరాలను శుకమహర్షి పరీక్షిన్మహారాజుకు తెలియచెప్పాడు.

భగవంతుడి లీలల కథాసారం..
భాగవతమంటే భగవంతుడి లీలల కథాసారం. భాగవతులు అని అంటే భగవద్భక్తులు. నిర్మల భక్తినిండిన పవిత్ర మనస్కులైన మానవులు భగవంతుని కృపకు సులభంగా అర్హులయ్యే విషయాలను భాగవతం వివరిస్తోంది. మానవాళిలో చాలామంది మోక్షమనే ఉత్తమమైన విషయాన్ని మరిచిపోతారు. అల్పమైన కోర్కెలను తీర్చమంటూ దేవుడిని ప్రార్థిస్తుంటారు. భక్తులంతా తన బిడ్డలే కనుక ఆర్తితో తనను కీర్తించే ఆ భక్తులు కోరిన కోర్కెలను ఆ స్వామి తీరుస్తూనే ఉంటాడు. అయితే కోరిన కోర్కెలు తీరతాయి కదాని మానవాళి సుఖంగా మాత్రం ఉండదు. ఎందుకంటే కోర్కె అనేది అసలు ఉండనే ఉండకూడదు. ఉంది అనంటే అది ఒక అంతం లేని పాశంలా ఉంటుంది. అది చుట్టుకోవటం మొదలు పెట్టిందంటే మనిషికి దుఃఖం తప్ప సుఖమనేది ఉండనే ఉండదు. ఈ విషయం తెలియక సామాన్య మానవులు దేవుడు తమ కోర్కెలను తీర్చినా ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటూ దుఃఖంలోనే పడి కొట్టుమిట్టాడుతుంటారు. అదే సంసార సాగరం. ఆ సంసారసాగరాన్నుంచి బయటపడి ఇప్పుడు సుఖంగా ఉంది అని అనుకొనే స్థితే మోక్షం. ఆ మోక్షాన్నిచ్చేదే భాగవతం. ఈ భాగవతానికే ఇంతశక్తి ఎందుకుంది అనంటే దీని సృష్టికర్త సంకర్షణ రూపుడైన వాసుదేవుడు కనుక. ఇలా మోక్షాన్ని ప్రసాదించే పవిత్ర గ్రంథం కనుకనే ఈ నాటికీ భాగవతానికి అంత గొప్పస్థానం ఉంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

పరిశ్రమ వదిలి వెళ్లిపోదామనుకున్నా!

మానవీయ కోణాల్ని స్పృశిస్తూ సినిమాలు తీయడంలో దర్శకుడు మదన్‌ది ప్రత్యేక శైలి. మనిషి, మనసు, అనుబంధాల మధ్య సంఘర్షణల్ని ఆయన తెరపైకి తీసుకొచ్చే విధానం బాగుంటుంది.

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net