Sat, February 06, 2016

Type in English and Give Space to Convert to Telugu


విష్ణువును చేరే మార్గమేంటి?
కల చరాచర జగత్తంతా విష్ణుమయమేనని వివరించి చెప్పే కథా సందర్భం ఇది. మహాభారతం శాంతిపర్వంలో వృత్రాసురుడికి సనత్కుమారుడు ఈ విషయాలన్నింటినీ తెలియచెప్పాడు. లోకమంతా విష్ణువులోనే ఉంది. ఆయనే సృష్టికర్త. సమయం వచ్చినప్పుడు సంహరించేది కూడా ఆయనే. మళ్లీ తగిన సమయానికి సృష్టిని జరిపేది కూడా ఆ విష్ణువే. మహాప్రళయ కాలంలో ఈ జగత్తంతా ఆయనలోనే లయమవుతుంటుంది. అటువంటి విష్ణువును జ్ఞానంతోకానీ, తపస్సుతోకానీ, యజ్ఞంతోకానీ ఎవరూ పొందలేరు. ఇంద్రియ నిగ్రహంతోనూ, యోగంతోనూ మాత్రమే ఎవరైనా సరే ఆ స్వామిని చేరటానికి వీలుంటుంది. బాహ్య, అభ్యంతర కర్మలతో మనసును శుద్ధిచేసుకొని విష్ణువును ఆరాధించగలిగితే ముందుగా పరలోకాన్ని ఆ తర్వాత మోక్షాన్ని పొందవచ్చు.

జన్మజన్మల ప్రయత్నం
స్వర్ణకారుడు మంచి ఆభరణాన్ని తయారుచేయటానికి లోహాన్ని అగ్నిలో చాలాసార్లు శుద్ధి చేసినట్లు జీవుడు కూడా ఎంతో ప్రయత్నంతో ఎన్నెన్నో జన్మలలో మనస్సును శుద్ధి చేసుకొని ఉంటే తప్ప విష్ణువును పొందటం సాధ్యంకాదు. ఒక్కొక్కసారి శమదమాదులతో ఎంతో గొప్ప యజ్ఞయాగాలను చేసినప్పుడు, ఆ యజ్ఞయాగాలన్నీ త్రికరణ శుద్ధిగా జరిగినప్పుడు ఆ ఒక్కసారికే మనశ్శుద్ధి జరిగే అవకాశముంటుంది. శరీరానికి అంటిన మురికిని ఏదో చిన్న ప్రయత్నం చేసి పోగొట్టుకోవచ్చు. కానీ మనస్సును శుద్ధి చేసుకోవటం చాలామందికి అంత సులభంగా కుదిరే పనికాదు. ఏ కొద్దిమందో సత్పురుషులు అని అనిపించుకున్న వారికి మాత్రం కుదరవచ్చు. వందల జన్మల నుంచి పట్టుకొని వస్తున్న దోషం పోవాలంటే ప్రయత్నపూర్వకంగా నిరంతరం ఇంద్రియా నిగ్రహాన్ని పాటిస్తూనే ఉండాలి. శ్రీహరంటే అన్ని ప్రాణాలలోనూ ఉండే జీవం అని కూడా అనవచ్చు. ఆ స్వామే క్షరుడుగా, అక్షరుడుగా కూడా ఉండటం విశేషం. పదకొండు ఇంద్రియాల రూపంలో ఉన్న వైకారిక సృష్టి అచ్చంగా ఆ విష్ణుస్వరూపమే.

శ్రీహరి భక్తులు అనిపించుకోవాలంటే..
ఆ విష్ణువే సూర్యుడి రూపంలో కిరణాలతో జగత్తును గ్రహిస్తాడు. ఆయన పాదాలే భూమి. ఆ స్వామి శిరస్సే స్వర్గం. బాహువులే దిక్కులు. చెవులు ఆకాశం. సూర్యచంద్రులే ఆయన కళ్లు. ఆయన జ్ఞానవృత్తినే మహత్తత్వం అని అంటారు. జలం అంతా ఆయన నాలుక. గ్రహాలన్నీ ఉండేది ఆయన కనుబొమల మధ్యనే. నక్షత్ర మండలం ఆ స్వామి కళ్లనుంచి ఏర్పడింది. అందుకే ఆ శ్రీహరిని సర్వభూత స్వరూపుడు అని, ఈ విశ్వానికంతటికీ ఆది అని, నాధుడు అని పెద్దలంతా అంటూ ఉంటారు. రజోగుణం, తమోగుణం, సత్వగుణం అనే మూడు గుణాలు నారాయణ స్వరూపాలే. కనుక నారాయణుడు కానిదంటూ సృష్టిలో ఏదీలేదు. ఆ స్వామే సత్యం కనుక ఆ సత్యాన్ని దాని ఆధారంగా ఉండే సన్మార్గాన్ని అందరూ అనుసరించాలి. అలా అనుసరించగలిగినవారే శ్రీహరి భక్తులు అని అనిపించుకుంటారు. వారికి మాత్రమే ఆ స్వామి అనుగ్రహించే మోక్షాన్ని పొందే అర్హత దక్కుతుంది. కనుక శ్రీమహావిష్ణువు అనుగ్రహం మోక్షం, కావాలనుకున్నవారు ఎవరైనాసరే సత్యాన్ని, సన్మార్గాన్ని ఆచరించాలే తప్ప వేరొక పద్ధతి ఏదీ లేదు అని సనత్కుమారుడు వివరించి చెప్పాడు. ఈ వివరణ ఆనాటి వారే కాదూ మరి ఏనాటి వారికైనా సరే ఆచరణయోగ్యమే.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

మనసంతా పొరుగు కథలపైనే!

మహేష్‌బాబు లాంటి ఒకరిద్దరు కథానాయకులు తప్ప దాదాపుగా మిగిలిన తెలుగు హీరోలందరూ రీమేక్‌ చిత్రాలపై మోజు ప్రదర్శించేవాళ్లే. పొరుగు భాషలో ఒక మంచి సినిమా...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net