Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu


భక్తానుగ్రహరూపిణి భ్రమరాంబిక
ష్టాదశ శక్తిపీఠాలలో శ్రీశైలం ఒకటి. ఇక్కడున్న భ్రమరాంబికను భక్తులు త్రికరణశుద్ధిగా ఆర్తితో కొలిస్తే చాలు ఆ అమ్మ అనుగ్రహిస్తుందంటారు. ఆ జగజ్జనని భ్రమరాంబికగా అవతరించిన నాటి విశేషాల సారాంశమిది. భ్రమరాంబ అనే పేరున జగజ్జనని దివ్య అవతారం ఎలా జరిగిందో తెలియజెప్పే కథాంశమిది. ఎప్పుడు అధర్మం ప్రబలితే అప్పుడు ఆదిపరాశక్తి ఆ అధర్మాన్ని ఎలా సర్వనాశనం చేస్తుందో ఈ కథ వివరిస్తోంది. దేవీభాగవతం దశమస్కంధంలో ఈ కథ ఉంది. జగజ్జనని చేష్టలు చిత్రవిచిత్రంగా ఉంటాయని అచింత్యవ్యక్తరూపగా ఆమె ఉన్నందున ఇలా జరుగుతుంటుందని నారాయణ మహర్షి నారదుడికి వివరించాడు.

పూర్వం పాతాళలోకంలో అరుణుడు అనే మహాదైత్యుడుండేవాడు. ఆయనకు దేవతలను జయించాలనే కోరిక అధికంగా ఉండేది. ఎన్నో రకాలుగా ఆలోచించి చివరకు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేయటం తప్ప తన కోరిక తీరేందుకు మరో ఉపాయం లేదనుకున్నాడు. వెంటనే బ్రహ్మదేవుడిని ఉద్ధేశించి తీవ్రంగా తపస్సు చేశాడు. గంగాతీరంలో పండుటాకులనే తింటూ గాయత్రీ మహామంత్రాన్ని జపిస్తూ ఘోరంగా తపస్సు చేశాడు. ఆ తపస్సు ప్రభావంతో వాడి శరీరం నుంచి తపోగ్ని బయలుదేరి జగత్తునంతటినీ దహించివేయటం ప్రారంభించింది. అలా ఎందుకు జరుగుతుందో, ప్రపంచమంతా అగ్నికి అలా ఎందుకు ఆహుతి అవుతుందో ఎవరికీ అర్థంకాలేదు. వెంటనే దేవతలంతా కలసి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి శరణువేడారు. ఆయన గాయత్రీ సహితుడై హంస వాహనాన్ని ఎక్కి అరుణుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చాడు. రెండో అగ్నిదేవుడిలా ఆ దైత్యుడు వెలిగిపోతూ ఉండటాన్ని బ్రహ్మదేవుడు గమనించాడు. అరుణుడికి బ్రహ్మదేవుడు గాయత్రితో సహా ప్రత్యక్షమయ్యేసరికి ఎంతో ఆనందం వేసింది. దానికి తోడు బ్రహ్మదేవుడు ఆ దైత్యుడిని ఏదో ఒక వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆయన బ్రహ్మకు, గాయత్రీదేవికి నమస్కరించి యుద్ధంలోకానీ, మరొక చోటకానీ శస్త్రాలతోకానీ, పురుషులతోకానీ, స్త్రీలతోకానీ, రెండు, నాలుగు పాదాలున్న జీవులు, జంతువులతోకానీ తనకు మృత్యువు కలుగకుండా కావలసినంత బలం ఇమ్మన్నాడు. బ్రహ్మదేవుడు ఆయనకు ఆ వరాన్నిచ్చి అంతర్థానమయ్యాడు. అరుణుడు తిరిగి పాతాళలోకానికి చేరుకున్నాడు. తన వారందరికీ బ్రహ్మదేవుడు తనకిచ్చిన వరం గురించి చెప్పాడు. వెంటనే ఇంద్రుడి మీదకు యుద్ధానికి బయలు దేరమని తన వారందరినీ ఆజ్ఞాపించాడు. ఈ విషయం తెలుసుకున్న దేవేంద్రుడు వణికిపోయి బ్రహ్మదేవుడు దగ్గరకు వెళ్లి వేడుకొన్నాడు. ఆ ఇద్దరూ కలిసి విష్ణువును వెంటపెట్టుకొని శివుడి దగ్గరకు వెళ్లారు. అలా దేవతలంతా ఒక చోట కూడి అరుణుడి బారి నుంచి ప్రపంచాన్ని ఎలా కాపాడాలా అని ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే అరుణుడు తన బలగాలతో కలిసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. సూర్యుడు, చంద్రుడు, దిక్పాలకులు లాంటి వారందరినీ పక్కకునెట్టి వారి స్థానాలలో తానే ఉండి ప్రపంచాన్ని ఏలసాగాడు. అలా దేవతలంతా శివుడిని వెతుక్కుంటూ వచ్చి తమ కష్టమంతా చెప్పుకున్నారు. ఇంతలో వారందరికీ అశరీరవాణి వినిపించింది. దేవతలందరూ కలసి జగన్మాతను ఆశ్రయిస్తే శత్రుసంహారం జరుగుతుందని చెప్పింది. అరుణుడు గాయత్రి జపతత్పరుడని, ఆ రాక్షసుడు గాయత్రీమాత మంత్ర జపాన్ని విడిచిపెట్టేలా చెయ్యమని అశరీరవాణి పలికింది. ఆ మాటలను విన్న దేవతలంతా ఎంతో ఆనందించారు. వెంటనే ఇంద్రుడు బృహస్పతిని పిలిచి అరుణుడి దగ్గరకు వెళ్లి ఆయన గాయత్రీ మంత్రజపాన్ని విడిచిపెట్టేలా చేయమని అన్నాడు. పని కోసం బృహస్పతి వెళ్లగానే దేవతలంతా కలసి జగన్మాతను ఉపాసించారు. బృహస్పతి అరుణుడి దగ్గరకు వెళ్లగానే అరుణుడు ఎందుకు వచ్చావు? అని అడిగాడు. అప్పుడు బృహస్పతి చాలా చాకచక్యంగా తాను, అరుణుడు ఒకలాంటి వారమేనని, అలాంటప్పుడు వచ్చినందువల్ల తప్పులేదు కదా అన్నాడు. అరుణుడికి ఆ మాటలు వినేసరికి కోపం మితిమీరింది. దేవజాతికి చెందిన బృహస్పతికి, ఆ జాతికి శత్రువైన తనకు సామ్యమేమిటని మండిపడ్డాడు. అప్పుడు బృహస్పతి దేవతలు ఆరాధించే గాయత్రీమాతను అరుణుడు ఉపాసిస్తున్నాడని కాబట్టి అరుణుడు దేవతలలాంటి వాడేనని వివరించాడు. తాను ఏ పరిస్థితులలోనూ దేవతల లాంటి వాడిని కాబోనని ఒకవేళ గాయత్రీ మంత్రాన్ని జపిస్తున్నందువల్ల అలా జరుగుతుంటే ఆ మంత్రాన్నే తాను విడిచిపెడతానని అన్నాడు. ఆయనలో దురభిమానం పెరిగిపోయి ఆ క్షణంలో గాయత్రీ మంత్రాన్ని విడిచిపెట్టాడు. ఆ మరుక్షణంలోనే కాంతిహీనుడయ్యాడు, శక్తి నశించింది. ఇంతలో దేవతల ప్రార్థనలకు సంతోషించిన దేవి ప్రత్యక్షమైంది. దేవతలంతా ఆమెకు అరుణుడు, ఆయన అనుచరుల దురాగతాలన్నిటినీ విడమరచి చెప్పారు. అప్పటివరకూ జగన్మాత ఒక గుప్పిట మూసి ఉంచింది. దేవతల కష్టాలు వినగానే ఆమె గుప్పిట విప్పింది. వెంటనే చిత్రవిచిత్రమైన భ్రమరాలన్నీ కోటానుకోట్లుగా బయలుదేరి అరుణుడుని, ఇతర దైత్యులందరినీ చుట్టుముట్టి సర్వనాశనం చేశాయి. ఆ నాటి నుంచి ఆమె విచిత్ర భ్రమర ముష్టిక అయింది. భ్రమరాలను అన్నిటినీ వదలి అలా దైత్య సంహారం చేసినందున భ్రమరీదేవిగా, భ్రమరాంబగా ఆమె పిలుపులందుకొంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

మణిరత్నం వీరాభిమానిని!

హను రాఘవపూడి... తీసింది ‘అందాల రాక్షసి’ ఒక్కటే. దాని చుట్టూ బోలెడు కామెంట్లు.. కాంప్లిమెంట్లు. ‘మణిరత్నం ప్రభావం కుర్రాడిపై చాలా ఎక్కువ ఉంది’ అనుకొన్నారు చాలామంది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net