Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu


సకల దేవతా శక్తిరూపిణి మహిషాసురమర్దని
ముల్లోకాలను తన అధర్మ బుద్ధితో ముప్పతిప్పలు పెట్టిన మహిషాసురుడి మర్దన సంఘటనకు సంబంధించిన కథ ఇది. ఆ అసురుడిని సర్వదేవతా శక్తిస్వరూపిణియైన ఆదిపరాశక్తి మర్దించింది. ఈ మహిషాసురమర్దని విశేషాలను వివరించే కథలు పలు పురాణాలలో ఉన్నాయి. ఆ అమ్మ దివ్యస్వరూపం, దివ్యశక్తి ఇక్కడ వివరంగా కనిపిస్తాయి.

మహిషాసురుడి ఆగడాలు నానాటికీ ఎక్కువై దేవతలు తల్లడిల్లసాగారు. బ్రహ్మదేవుడి వరంతో తిరుగులేని బలం కలిగి దేవతలనందరినీ ఎన్నో రకాలుగా చీల్చి చెండాడసాగాడు మహిషాసురుడు. శివుడు, విష్ణువు సహితం ఆ రాక్షసుడిని ఏమీ చేయలేకపోయారు. మహిషుడు ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించేసి దేవతల రాజ్యాన్నంతటినీ స్వాధీనం చేసుకున్నాడు. దేవతల పదవులలో తన దానవులను నియమించాడు. నూరేళ్లలా సాగిన ఘోర సంగ్రామంలో జయం సాధించి మహిషుడు అలా ఇంద్ర పదవిని చేజిక్కించుకున్నాడు. దీంతో దేవతలు దిక్కులేనివారయ్యారు. కొంతకాలానికి ఒక్కొక్కరూ కూడబలుక్కొని బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి తమ బాధలన్నీ చెప్పుకొన్నారు. ఆ రాక్షసుడికి తాను వరం ఇచ్చిన కారణంగానే అంతటి బలం ఏర్పడిందని దేవతలు బాధపడవలసి వచ్చిందని బ్రహ్మ తెలుసుకొని అందరినీ ఓదార్చాడు. ఆ రాక్షసుడు కేవలం స్త్రీ వల్ల మాత్రమే తనకు మరణం కలగాలని కోరుకున్న సంగతి బ్రహ్మదేవుడికి గుర్తుకు వచ్చింది. దీన్ని ఆధారంగా చేసుకొని వాడిని సంహరించటానికి కావాల్సిన పథకాన్ని రూపొందించటానికి పరమేశ్వరుడిని వెంటపెట్టుకొని బ్రహ్మాది దేవతలంతా విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లారు. దేవతలంతా విష్ణుమూర్తితో కలసి సమస్యను సంపూర్ణంగా చర్చించారు. అప్పుడు విష్ణుమూర్తి జాగ్రత్తగా ఆలోచించి అందరికీ ఓ పథకాన్ని చెప్పాడు. సకల దేవతాంశలనూ, తేజశ్శక్తులనూ కలబోసుకొని ఓ స్త్రీమూర్తి ఆవిర్భవిస్తే మహిషాసురుడిని ఆమెతో సంహరింపచేయవచ్చన్నాడు. విష్ణుమూర్తి చెప్పిన ఉపాయానికి అందరూ అంగీకరించారు. ముందుగా బ్రహ్మదేవుడి ముఖం నుంచి ఓ తేజోరాశి ఆవిర్భవించింది. పద్మరాగ మణికాంతులను వెదజల్లుతున్న ఆ తేజోరాశిని దేవతలు చూస్తుండగానే శివుడి నుంచి వెండిలాగా ధగధగలాడుతున్న మరో కాంతి పుంజం అక్కడ కనిపించింది. విష్ణుమూర్తి నుంచి నీలం రంగులో మూర్తీభవించిన సత్వగుణం లాగా ఉన్న తేజస్సు వెలువడింది. యముడు, అగ్ని, కుబేరుడు, వరుణుడు ఇలా ఒకరేమిటి సకల దేవతల నుంచి అప్పటికప్పుడు తేజస్సులు వెలువడి ఒక దివ్య తేజోరాశి అయిన స్త్రీమూర్తిగా రూపుదాల్చింది. ఆ దివ్య స్త్రీమూర్తికి అష్టాదశ భుజాలు, తెల్లని ముఖం, నల్లని కన్నులు, ఎర్రని పెదవులు, చిగురుటాకుల వంటి అరచేతులు, శరీరమంతటా దివ్యాభరణాలు, అష్టాదశ బాహువులు మొదలైనవి కనిపించాయి. క్షణకాలంలోనే అష్టాదశ భుజాలు వెయ్యి భుజాలు అయ్యాయి. అలా మహిషాసుర సంహారిణికి సకల దేవతా శరీర సంభూతగా స్త్రీమూర్తి అక్కడ అవతరించింది. ఆ రూపాన్ని దేవతలు మహాలక్ష్మీ రూపం అన్నారు. ఆ మహాలక్ష్మీ రూపం దేవకార్య సిద్ధి కోసం ఏర్పడింది. అందులో శంకరుడి తేజస్సు ఆమెకు ముఖం అయింది. అది తెల్లటి రంగుతో తేజరిల్లింది. యముడి తేజస్సు ఆ తల్లికి నల్లని పొడవైన కురులయ్యాయి. అగ్నిదేవుడి తేజస్సు ఎర్రని, నల్లని రంగులతో మూడు రంగులుగా మారింది. సంధ్యాకాలం తేజస్సులు దట్టమైన కనుబొమలయ్యాయి. మన్మథుడి ధనుస్సులా ఆ కనుబొమలు మెరిసిపోయాయి. వాయుదేవుడి తేజస్సు ఆమెకు చెవులయ్యాయి. కుబేరుడి తేజస్సు ఆ మహాదేవికి ముక్కు అయింది. ప్రజాపత్య తేజస్సు ఆ మాతకు దంతాలుగా మారాయి. కార్తికేయుడి తేజస్సు పైపెదవి గానూ, అరుణ తేజస్సు కింద పెదవిగానూ రూపొందాయి. శ్రీమహావిష్ణువు తేజస్సుతో అష్టాదశ భుజాలు, వసువుల తేజస్సుతో వేళ్లు ఏర్పడ్డాయి. చంద్రుడి తేజస్సు వక్షోజాలయ్యాయి. ఇంద్రుడి తేజస్సుతో మధ్యభాగం ఏర్పడింది. వరుణుడి తేజస్సుతో కాళ్లు, పృధ్వి తేజస్సుతో కటి ప్రదేశం ఏర్పడి దివ్య స్త్రీమూర్తి అలరారింది. ఆ దివ్య స్త్రీమూర్తికి ఆయుధాలు, ఆభరణాలను ఇవ్వమని దేవతలందరికీ శ్రీమహావిష్ణువు చెప్పాడు. వెనువెంటనే దేవతలంతా ఆ ఆజ్ఞను పాటించారు. క్షీరసముద్రుడు ఎరుపురంగులో ఉన్న సన్నని వినూత్న దివ్య వస్త్రాలను ఆ మహాలక్ష్మికి సమర్పించాడు. దాంతో పాటు ఒక చక్కటి హారాన్ని, చూడామణిని, రత్నమయకుండలాలను, కడియాలను బహూకరించాడు. విశ్వకర్మ కేయూరాలను, త్వష్ట చక్కని నూపురాలను ఇచ్చారు. మహాసముద్రుడు కంఠాభరణాన్ని, ఉంగరాలను ఇచ్చాడు. దివ్యమైన వైజయంతీ మాలను వరుణుడు ఇచ్చాడు. హిమవంతుడు సింహాన్ని వాహనంగా సమర్పించాడు. అలా సర్వాలంకార శోభిత అయిన ఆ మహాదేవి సింహవాహనాన్ని అధిరోహించింది. వెంటనే దేవతలంతా మళ్లీ ఆయుధాలను ఆమెకు బహూకరించారు. విష్ణువు సుదర్శన చక్రం నుంచి అలాంటిదే మరొకటి సృష్టించి ఇచ్చాడు. శంకరుడు త్రిశూలాన్ని, వరుణుడు మంచి శంఖాన్ని, అగ్ని దేవుడు శతఘ్నిని, వాయువు ధనుస్సును, ఎప్పటికీ తరిగిపోని బాణాలతో ఉన్న అంబుల పొదిని ఇచ్చారు. దేవేంద్రుడు వజ్రాయుధం నుంచి మరో వజ్రాయుధాన్ని, ఐరావతానికి అలంకరించిన గంట లాంటి గంటను యముడు తన కాలదండం లాంటి దండాన్ని, బ్రహ్మదేవుడు గంగాజలంతో నిండిన కమండలాన్ని ఆ మాతకు సమర్పించారు. వరుణుడు తన పాశాయుధాన్ని, కాలుడు ఖడ్గాన్ని, చర్మంతో చేసిన డాలును సమర్పించారు. విశ్వకర్మ ప్రత్యేకంగా గండ్రగొడ్డలిని సృష్టించి ఇచ్చాడు. కుబేరుడు సురతో నిండిన సువర్ణపాత్రను ఇచ్చాడు. కౌమోదకి గదను త్వష్ట సమర్పించాడు. ఇలా అనేకానేక ఆయుధాలతో ఆ శక్తి స్వరూపిణి అలరారింది. ఆ తర్వాత సకల దేవతా సంరక్షణ కోసం ఆ తల్లి కదిలింది. ఆమె అందం గురించి మహిషాసురుడు విన్నాడు. తన మంత్రులతో రాయబారం పంపాడు. కాలం మూడిన మహిషాసురుడు మాత శక్తిని తక్కువగా అంచనా వేశాడు. ఆ రాక్షసుడి పక్షాన ఆ మాత దగ్గరకు వచ్చిన బాష్కలుడు, దుర్ముఖుడు, తామ్రుడు, చిక్షురుడు, మాత చేతిలో మరణం పొందారు. బిడాల, అసిలోములు మహిషాసురుడి పక్షాన మాత దగ్గరకు వచ్చి యుద్ధానికి దిగడంతో కోపగించిన ఆ తల్లి వారందరినీ సంహరించింది. చివరకు మహిషాసురుడే ఆమె దగ్గరకు వచ్చి నిలిచాడు. జీవించాలనే కోరిక ఉంటే పాతాళానికి పారిపొమ్మని ఆ మాత హెచ్చరించింది. ఆయన ఆ మాటలేవీ పట్టించుకోక ఆ దివ్య స్త్రీమూర్తిని కేవలం ఓ సామాన్య అబలగానే భావించి నోటికొచ్చినట్లు పేలాడు. ఆమెతో ద్వంద్వ యుద్ధానికి దిగాడు. వారిద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఆ మాత ఆయన మీదకు వదిలిన చక్రాయుధంతో ఆ దానవుడు నేలకొరిగి మరణించాడు. అన్నాళ్లపాటు అంత ఘోరంగా యుద్ధం జరిగినా సింహ వాహనం మీద చిరునవ్వుతో ప్రసన్న వదనంతో ఆ తల్లి ఉండిపోయింది. రణరంగం నుంచి బయటకు వచ్చి ఒక పవిత్ర స్థలంలో నిలిచింది. అప్పుడామె దగ్గరకు బ్రహ్మాదిదేవతలంతా మహిషాసురమర్దని స్తుతిచేశారు. సకల లోకాలూ ఆ క్షణం నుంచి శాంతితో వర్ధిల్లాయి.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

జైగంగాజల్‌ ట్రైలర్‌ విడుదల

ప్రకాశ్‌ ఝా దర్శకత్వంలో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న జైగంగాజల్‌ చిత్ర ట్రైలర్‌ను విడుదల....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net