Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu


వినవేడుక.. వేంకటాద్రి మహిమ
లియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశుడు కొలువుతీరి ఉన్న వేంకటాద్రి మహిమ ఎన్ని తరాల పాటు ఎన్ని యుగాలపాటైనా ఇంకా ఇంకా వినాలన్న ఆసక్తి కలుగుతూనే ఉంటుంది. నమ్మిన వారికి జన్మజరామృత్యు భయాన్ని పోగొట్టి కోరిన కోర్కెలను తీర్చి కలి బాధలను నివారించే ఆ శ్రీనివాసుడి నిలయం వేంకటాచలం. సప్తగిరులుగా విలసిల్లుతున్న ఆ వేంకటాద్రికి ఉన్న నామ విశేషార్థాలేమిటి? అనే విషయాన్ని వివరంగా చెప్పే కథా సందర్భం ఇది. బ్రహ్మ పురాణాంతర్గతంగా ఉన్న శ్రీవేంకటాచల మహాత్మ్యంలో ఈ విషయాలన్నీ ప్రస్తావితమై ఉన్నాయి. దిలీప చక్రవర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా వేంకటాద్రి మహిమను దూర్వాస మహర్షి వివరించి చెప్పాడంటే ఈ కొండ ఎందరెందరి భక్తులకు అండదండగా ఉంటూ ఆ భక్తుల గుండెల్లో ఎంతగా కొలువుతీరి ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. సువర్ణముఖి నది ఒడ్డున మూడు యోజనాల విస్తీర్ణం, ముఫ్పై యోజనాల పొడవుతో ఉన్న పర్వతమే వేంకటాచలం. ఇది పర్వత రాజమైన మేరు పర్వతానికి పుట్టిన పుత్రుడు. మేరువు తనకు పుత్రుడు కలుగగానే అతడి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని వేంకటుడు అని పేరుపెట్టాడు. వేంకట శబ్దానికి పాపాలను హరించేదని, ఇహపరాలను ప్రసాదించేదనే అర్థం ఉంది. ‘వేం’ అనే శబ్దానికి అమృతమని, ‘కట’ శబ్దానికి ఐశ్వర్యమని మరికొందరు పండితులు అర్థాలు చెబుతుంటారు. అందుకే ఆ శబ్దాన్ని పలికితే అటు అమృతత్వం, ఇటు ఐశ్వర్యమూ లభించి భక్తులు ఆనందనందనులవుతుంటారు. మేరు పుత్రుడికి తొలిగా అలా వేంకటాద్రి అనే పేరు స్థిరపడింది. ఆ పర్వతం శ్రీమన్నారాయణుడికి నివాస స్థలం కావటంతో నారాయణాద్రి అయింది. వృష, వృషభ అనే పదాలకు ధర్మం అనే అర్థం ఉంది. ఆ పర్వత దర్శనం, సేవనం అనేవి ధర్మబుద్ధిని కలిగిస్తాయి. ఆ అద్రికి వృషాద్రి అని, వృషభాద్రి అని పేర్లొచ్చాయి. ఆంజనేయస్వామిని ఆయన తల్లి అంజనాదేవి ఆ పర్వతం మీదనే ప్రసవించటం వల్ల అంజనాద్రి అనే పేరొచ్చింది. వేంకటాద్రిని ఇప్పుడున్న చోటికి ఆదిశేషుడు తీసుకొచ్చిపెట్టాడు. అందుకే ఆ పర్వతానికి శేషాద్రి అనే పేరొచ్చింది. శేషుడు మేరుపుత్రుడిని అసలిక్కడికి ఎందుకు తెచ్చాడనంటే దాని వెనుక ఓ గొప్ప విశేషాంశముంది. ఓసారి శేషుడికి, వాయుదేవుడికి వాదం జరిగింది. ఆ వాదంలో ఒకరినొకరు నేనే గొప్ప, నేనే గొప్ప అని అనుకోసాగారు. ఇంతకీ ఈ వాదం జరగటానికి కారణమేమంటే ఒకసారి శ్రీమహావిష్ణువు తాను ఏకాంతంలోకి వెళుతూ శేషుడిని వాకిలి దగ్గర కాపలాగా ఉండమన్నాడు. అలాగేనన్నాడు శేషుడు. ఆ తర్వాత కొద్దిసమయం గడిచింది. వాయుదేవుడు వైకుంఠవాసుడిని చూడాలంటూ వచ్చాడు. శేషుడు వాయుదేవుడిని అడ్డగించాడు. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. ఇంతలో శ్రీమహావిష్ణువు లోపలి నుంచి బయటకు వచ్చాడు. విషయం తెలుసుకొని వాయుదేవుడు లోకాలన్నిటికీ కావలసిన వాడని, శేషుడి కన్నా గొప్పవాడని అన్నాడు. కానీ ఆదిశేషుడు తాను లోకాలన్నిటినీ తన పడగల మీద మోస్తున్నందువల్ల తానే గొప్పవాడినన్నాడు. తామిద్దరిలో ఎవరు గొప్పోనని తెలుసుకోవడానికి బలాబలాలను పరీక్షించదలుచుకున్నానన్నాడు. ఆ స్వామి చిరునవ్వు నవ్వుతూ సరేనన్నాడు. వాయుదేవుడు ఆ బలప్రదర్శనకు అంగీకరించాడు. అప్పుడు ఆదిశేషుడు జంబూనది తీరంలో మూడు యోజనాల విస్తీర్ణం, ముఫ్పై యోజనాల పొడవుతో ఉన్న మేరుపుత్ర పర్వతం ఉందని, దాన్ని తాను తన శరీరంతో చుట్టి గట్టిగా పట్టుకొని ఉంటానని, శక్తి ఉంటే వాయుదేవుడు ఆ పర్వతాన్ని పెకలించుకుపోవచ్చన్నాడు. ఆ పరీక్షకు అంతా సిద్ధం కావటంతో ముందుగా శేషుడు వెళ్లి దాన్ని గట్టిగా చుట్టికూర్చున్నాడు. ఆ తర్వాత వాయుదేవుడు ఎన్నో విధాలుగా తన శక్తినంతా ఉపయోగించి మేరు పుత్ర పర్వతాన్ని కదిలించాలని చూశాడు. కానీ సాధ్యపడలేదు. వాయువు దెబ్బకు లోకాలన్నీ గడగడలాడుతున్నాయి. కానీ పర్వతం కదల లేదు. దాంతో బ్రహ్మాది దేవతలంతా సకల లోక క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని శేషుడి దగ్గరకొచ్చి ప్రార్థించారు. అప్పుడు శేషుడు కొద్దిగా మాత్రమే తన పట్టు వదిలాడు. అదే అదనుగా భావించి వాయుదేవుడు ఒక్క ఉదుటున మేరుపుత్ర పర్వతాన్ని కదిలించాడు. ఆ వేగానికి ఆ పర్వతం ఈనాడు ఇప్పుడున్న ప్రదేశానికొచ్చిపడింది. అలా వేంకటాద్రి స్థాపన జరిగింది. అనంతర కాలంలో శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చి ఆ పర్వతం మీద ఉన్న పుష్కరిణి సమీపంలో వేంకటాచలపతిగా నిలిచి ఉన్నాడు. ఇలా వేంకటాద్రి మహాత్మ్యాన్ని ఈ కథా సందర్భం వివరిస్తోంది.
- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

వెండితెరపై కోట్ల ‘కాంతి’

సినిమా అనేది కచ్చితంగా వ్యాపారమే. ఏ కథానాయకుడికి ఎంత మార్కెట్‌ ఉంది? అనే లెక్కలు ఎప్పుడూ అవసరమే. పెట్టిన ప్రతీపైసాకీ గ్యారెంటీ ఉందన్న నమ్మకం కుదిరిన...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net