Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu


మనశ్శాంతి మన చేతుల్లోనే..
చాలా మంది మనశ్శాంతి లేదని బాధపడుతుంటారు. ఆ స్థితి రావటానికి కారణమేమిటని సమీక్షించుకోరు. ఇది ఈనాటి వారి విషయమే కాదు. మహాభారత కథలో ధృతరాష్ట్రుడు చేసిందీ ఈ పనే. అందుకే ఆయన మనశ్శాంతికి దూరమై ఎందుకు అలమటించాడు... అనే విషయాన్ని వివరించే కథ మహాభారతం ఉద్యోగ పర్వంలో కనిపిస్తుంది. ఈ కథను పరిశీలిస్తే మనశ్శాంతి మన చేతుల్లోనే ఉందని అవగతమవుతుంది.

కౌరవులకూ, పాండవులకూ యుద్ధం జరగకుండా చూడటానికి జరిగిన రాయబారాల్లో సంజయుడి దౌత్యం ఒకటి. కౌరవుల పక్షాన పాండవుల దగ్గరకు సంజయుడు రాయబారిగా వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి పొద్దుపోవటంతో ధృతరాష్ట్ర మహారాజును దర్శించి రాయబారం విఫలమైందని క్లుప్తంగా చెప్పి, ఇతర విశేషాలన్నీ మరుసటి రోజు ఉదయాన్నే నిండు సభలో అందరి సమక్షంలో చెబుతానని ఇంటికి వెళ్లిపోయాడు. సంజయుడు అలా పూర్తి విషయాలు చెప్పకుండా వెళ్లడంతో ఆ మహారాజు తీవ్రంగా మథన పడసాగాడు. కౌరవులకూ, పాండవులకూ నడుమ ఏర్పడిన తీవ్ర పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోననే ఆందోళనతో ధృతరాష్ట్రుడి మనస్సు అల్లకల్లోలమైంది. కాస్తంతసేపు ఎవరైనా వచ్చి మంచి మాటలు చెప్పి మనశ్శాంతి కలిగిస్తే బాగుండునని అనుకున్నాడు. ఆ ఆలోచన రాగానే వెంటనే విదురుడికి కబురు వెళ్ళింది. మహారాజు అంత రాత్రివేళ విదురుడికి కబురు చెయ్యటం అదే మొదటి సారి. విదురుడు రాజాజ్ఞను పాటించి, వెంటనే బయలుదేరి వచ్చి నమస్కరించి కూర్చున్నాడు. తనకు నిద్రపట్టడం లేదని, మంచి మాటలేవైనా చెప్పాలని అడిగాడు రాజు. విదురుడు సూటిగానే మాటలందుకున్నాడు. నిద్రపట్టక పోవటానికి గల కారణం దుర్బలురకైతే బలవంతులతో విరోధం తెచ్చుకోవటంగా గుర్తించవచ్చన్నాడు. ఇతరుల సంపదల్ని హరించిన వారికీ, మితిమీరిన కామ వాంఛలు ఉన్న వారికీ, దొంగలకు మాత్రమే రాత్రిపూట నిద్రపట్టదని అన్నాడు. ఈ లక్షణాలేవీ ధృతరాష్ట్రుడికి లేనప్పుడు నిద్ర పట్టక పోవటానికి కారణమేదో తనకు తెలియటం లేదన్నాడు విదురుడు. కలత చెందిన ధృతరాష్ట్రుడు ప్రస్తుతం తనకేవైనా ధర్మ వచనాలు చెప్పాలని కోరాడు. విదురుడు ఆ సందర్భంలో ధృతరాష్ట్రుడు చేసిన అన్యాయపు పనుల్ని వివరించి అలాంటివి చేసినందు వల్లనే మనశ్శాంతి కరవైందన్నాడు. ఉత్తమ గుణాలు, ఉన్నత ఆశయాలు కలిగి ఉన్న ధర్మరాజు నిత్యం ధర్మమార్గంలోనే ప్రవర్తిస్తూ ధృతరాష్ట్రుడిని గౌరవిస్తూ ఎంతో వినయంగా ప్రవర్తిస్తున్నా, ధర్మరాజుకు అన్యాయం కలిగేలా ధృతరాష్ట్రుడు ప్రవర్తించాడని, అందుకే అంతటి అశాంతి ఏర్పడిందన్నాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు లాంటి దుష్టుల్ని నమ్మి ప్రోత్సహిస్తూ రాజ్యభారాన్ని వారికి అప్పగించటం అపఖ్యాతికి కారణమైందన్నాడు. ఇలాంటి ఘోరమైన తప్పిదాలు చేసి శాంతి కావాలంటే ఎలా వస్తుందని అన్నాడు. మంచి స్వభావం కలిగినవాడు, నిరంతరం మంచి మార్గంలో ప్రయత్నం చేసేవాడు, కష్టాల్ని ఎదుర్కొనే గుణం కలిగినవాడు, ధర్మమార్గంలో నడిచేవాడు అయిన మనిషి ఎప్పుడూ వంచనకు గురికాడని, అలాంటి వారు దుష్టుల్ని గమనించి దూరంగా వారిని ఉంచుతారని అన్నాడు. భోగలాలసత మీద ఆలోచన లేకుండా కాలం గడుపుతూ, ఎవరినీ నొప్పించని విధంగా మాట్లాడుతూ, తమకు అందుబాటులోకి రాని వాటిని విపరీతంగా ఆలోచించకుండా ఉంటూ, ఏవైనా వస్తువులు పోతే వాటి కోసం బాధపడకుండా, కష్టాలు వచ్చినప్పుడు అధైర్యపడకుండా ఉండటం సత్పురుషుల లక్షణం అని అన్నాడు. ఏ పని ప్రారంభించినా దానిని నిర్విఘ్నంగా పూర్తిచేయటం, ఎలాంటి పరిస్థితుల్లోనూ సోమరితనాన్ని దరి చేరనీయకపోవడం, మనసును స్వాధీనంలో ఉంచుకోవటం లాంటి పనులు చేస్తే అశాంతితో అలమటించాల్సిన అవసరం ఉండదన్నాడు. పొరపాటున ఎవరైనా తమను నిరాదరించినప్పుడు తొందరపడి వారి మీద కోపాన్ని తెచ్చుకోవటం, ఎదుటి వారు ఆదరించారు కదా అని, వారు ఎలాంటి వారు అని ఆలోచించకుండా విపరీతంగా వారిని పొగుడుతూ ఆనందించటం మంచిది కాదన్నాడు. ‘స్వధర్మాన్ని విడిచిపెట్టి ఇతరుల బాటల్లో నడిచేవాడు, స్నేహితులతో సరిగా మెలగనివాడు, ఎదుటివాడు అడగకుండానే వారితో సంభాషణలకు దిగేవాడు, అనర్హులకు ఉపదేశాలిచ్చేవాడు ఇలాంటి వారంతా మూర్ఖులతో సమానం. విద్య, దానగుణం ఎంతగా ఉన్నా అహంకారం మాత్రం ఉండకూడదు. తనమీద ఆధారపడ్డ వారిని విస్మరించి తానొక్కడే పొట్టనింపుకోకూడదు. ప్రజా సమూహంతో ఎప్పుడూ విరోధం తెచ్చుకోకూడదు. ఆ విరోధం రాజును పదవీభ్రష్టుడిని చేసి తీరుతుంది. ఇలాంటి విషయాలన్నీ మనసులో ఉంచుకొని నడుచుకుంటే అశాంతి దూరమై మనశ్శాంతి చేకూరుతుంది’ అని విదురుడు ధృతరాష్ట్రుడికి ధర్మప్రబోధం చేశాడు.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

‘శ్రీశ్రీ’ డబ్బింగ్‌ పూర్తి

అలనాటి తెలుగు సూపర్‌స్టార్‌ కృష్ణ, ఆయన భార్య విజయ నిర్మల కీలక పాత్రధారులుగా తెరకెక్కిన ‘శ్రీశ్రీ’ చిత్రం దాదాపు పూర్తయ్యింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net