Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu


దక్షిణ గంగా మహత్వం
ర్మదా నది అని అంటే అందరికీ తెలిసిందే. ఈ నదికి ఇంకా అనేక నామాలున్నాయి. వాటన్నిటినీ ఉదయాన ఒక్కసారి స్మరిస్తే చాలా పుణ్యం లభిస్తుంది అని అంటున్నాయి స్కంద మహాపురాణం రేవాఖండం అయిదు, ఆరో అధ్యాయాలు. ఈ నదికి అసలు పరమేశ్వరుడు స్వయంగా గంగ కన్నా మరింత విశిష్టతను సమకూర్చి భారతావనిలో దక్షిణ దిక్కున ప్రవహించమని, ఆ కారణంగా దక్షిణగంగ అనే పేరు వస్తుందని చెప్పాడు. ఈ నదిలో నిల్చొని ఈశ్వర ధ్యానం చేస్తే పార్వతీ అమ్మవారి కరుణ లభిస్తుంది. దక్షిణ గంగకు మహతి అనే పేరుంది. మహాదేవుడి ప్రేరణతో మహావేగంగా ప్రవహించే నది కనుక మహతీనది అని పేరొచ్చింది.

మహాదేవుడు తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శూలాగ్రం నుంచి కొన్ని బిందువులు రాలాయి. ఆ బిందువులే నర్మదా నదిగా అయ్యాయి. శూలాగ్రం నుంచి ఆవిర్భవించటంతో శోణ అనే పేరొచ్చింది. మేఘాల వంటి దిగ్గజాలు బాగా కలచి వేస్తున్నప్పటికీ ఈ నది నీరు మంచి రుచిగా ఉండటంతో సురస అని పేరొచ్చింది. సంసార పరంగా అనుభవించే కష్టాలన్నిటినీ పోగొట్టి తనలో స్నానం చేసే వారికి పుణ్యాన్ని ప్రసాదించే కృపామూర్తి కనుక నర్మదకు కృప అని పేరొచ్చింది. పూర్వం కృతయుగంలో దివ్య మందార పుష్పాలను అలంకరించుకొని మందంగా అంటే మెల్లగా ప్రవహిస్తున్న కారణంగా ఈ నదిని మందాకిని అని అన్నారు. సురసిద్ధ పూజ్యురాలైన ఈమె మహార్ణవాన్ని చీల్చుకొని వేగంగా భూలోకానికి వచ్చిన కారణంగా మహార్ణవ అని పేరొచ్చింది. ఎలుగుబంట్లు, ఏనుగులు, కలచి వేస్తుండగా విచిత్రాలైన ఉత్పల పుష్పాల (నల్ల కలువలు)తో ప్రవహిస్తున్న కారణంగా చిత్రోల్పల అని పేరొచ్చింది. సర్వదిక్కులనూ మహారవం (గొప్పధ్వని) చేస్తూ చుట్టుముడుతూ ప్రవహిస్తున్నందు వల్ల రేవ అని అన్నారు. భార్యాపుత్రులతో, మహాదుఃఖాలతో ఆవరించిన శాపాలతో ఉన్న మానవాళిని విపాపులను అంటే పాపరహితులను చేస్తున్న కారణంగా విపాశ అనే పేరొచ్చింది. సంసార పాశాల నుంచి నిత్యం విడిపిస్తూ ఉంటుంది కనుక విపాశ అని అన్నారు. నర్మదా జలం ఎంతో విమలంగా అంటే ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. ఈ కారణంగానే విమల అని అన్నారు. చంద్ర, సూర్య కిరణాలు వంటి కరాలు (తరంగాలు) కలిగి ఉండి ప్రవహిస్తూ విశ్వాన్నంతటినీ సంతోషపరుస్తున్న కారణంగా కరభ అని కీర్తి అందుకొంటోంది. తనను చూసిన వారందరినీ రంజింప చేస్తున్నందున రంజన అని అన్నారు. తనలో మునిగిన వారిని, తన ఒడ్డున ఉన్న గడ్డి, తీగలు, పొదలు, చివరకు పశుపక్ష్యాదులను స్వర్గానికి చేరుస్తుంది కనుక నర్మదను వాయువాహిని అని స్తుతిస్తుంటారు. ఈ మహానది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఈ నదికి ఇప్పుడు చెప్పిన నామాలు కాక మరికొన్ని పేర్లు కలుపుకొని మొత్తం పదిహేను నామాలున్నాయి. నర్మద పదిహేను ప్రవాహాలుగా దశదిశలను తడుపుతూ ప్రవహిస్తుంటుందని, అందుకే పదిహేను నామాలు స్థిరపడ్డాయని స్కందపురాణం రేవాఖండంలోని అయిదో అధ్యాయం వివరిస్తోంది. శోణమహానదం, నర్మద, సురస, అమృత, మందాకిని, దశార్ణ, చిత్రకూట, తమస, విశద, కరభ, యమున, చిత్రోత్పల, విపాశ, రంజన, వాయువాహిని పేర్లు ఎంతో పవిత్రంగా ఉండటానికి కారణం నర్మద రుద్రుడి నుంచి ఆవిర్భవించటమే. పదిహేను ప్రవాహాలలో ఎందులో స్నానం చేసినా ఈశ్వరానుగ్రహం పొందవచ్చు. ఈ పదిహేను నామాలను పురాణవేత్తలు, దేవతాగణాలు నిరంతరం స్తుతిస్తుండటం విశేషం. ప్రాతఃకాలంలో లేచి శుచి అయి ఈ పదిహేను నామాలను చదివినా, ఒకరు చదువుతుంటే మరొకరు విన్నా నర్మదాస్నాన పుణ్యఫలం లభిస్తుందని ఈ కథా సందర్భం పేర్కొంటోంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

అనుష్కలా పేరు తెచ్చుకుంటా!

ోడలింగ్‌లో రాణిస్తూ... వ్యాపార ప్రకటనల్లో మెరుస్తూ సినిమా పరిశ్రమ దృష్టినీ ఆకర్షిస్తుంటారు కొందరు భామలు. అలా కథానాయికలుగా అవకాశాల్ని అందుకొన్నవాళ్లు చాలా...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net