Mon, February 15, 2016

Type in English and Give Space to Convert to Telugu


వ్యామోహరహిత జీవితం అవసరం
శుపక్ష్యాదులు సయితం మానవులకు మంచిని నేర్పేవిగా ఉన్న కథలు భారతంలో ఎన్నో ఉన్నాయి. అలాంటివాటిలో అనుశాసనిక పర్వంలో కనిపించే ఓ కథ ఉంది. అందులో గోవులు అనుసరించిన తీరు మానవాళికి ఒక సందేశాన్నిస్తూ కనిపిస్తుంది. మనిషి ఎవరైనా తన స్వార్థాన్ని చంపుకొని సమాజం మొత్తానికి ఉపకారం కలిగేందుకు కృషి చేయాలని సూచించటమే ఈ కథలోని అంతరార్థం. ఏ జీవీ బాధపడకుండా చూడాల్సిన బాధ్యత రాజు మీద ఉందని ఈ కథలోని ఓ భాగం సూచిస్తుంది. పూర్వం త్రిశరం అనే పర్వత ప్రాంతంలో ఓ నది ప్రవహిస్తుండేది. ఆ నదీ తీరాన భృగువంశంలోని కొందరు మునులు ఆశ్రమాలను ఏర్పాటు చేసుకొని తీవ్రంగా తపస్సు చేస్తుండేవారు. వారిలో సుమిత్రుడు అనే ఒక ముని ఎంతో ఆదర్శవంతంగా తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఆ ముని మంచితనాన్ని చూసి అంగిరసుడు అనే మరో ముని అతడికి ఆవుపాలు, చక్కెర, అన్నం కలిపిన ఒక దివ్య ఔషధాన్ని ఇచ్చాడు. సుమిత్రుడు ఆ దివ్య ఔషధాన్ని తాను స్వీకరించక తన దగ్గర ఉన్న ఒక గోవుకు పెట్టాడు. ఆ ఔషధ ప్రభావంతో ఆ ఆవు బాగా బలిసి అందంగా తయారైంది. కొంత కాలానికి ఆ ఆవు ఒక కోడెదూడను, ఒక పెయ్యదూడను ఈనింది. అలా సుమిత్రుడి గోసంపద ఎంతో గొప్పగా ఎదిగింది. కానీ సుమిత్రుడు మాత్రం ఆవుల దగ్గర దూడలు పాలు తాగుతున్నప్పుడు గాలికి ఎగిరి వచ్చి పడుతున్న నురుగును మాత్రం స్వీకరిస్తూ జీవిస్తుండేవాడు. ఆ కారణంగానే సుమిత్రుడికి ఫేనవుడు అనే పేరు వచ్చింది. ఫేనం అంటే నురుగు అని అర్థం ఉండటం వల్ల ఆ పేరు అతనికి సార్థకమైంది. అలా కొంత కాలం గడిచాక ఓ రోజు ఎక్కడి నుంచో వచ్చిన గోవులు కొన్ని తమకున్న దివ్య శక్తితో అందమైన మహిళల రూపాలతో ఒక సరోవరంలో జలక్రీడలు ఆడసాగాయి. వాటిపి చూసిన ఫేనవుడి ఆవులకు ఎంతో ఆశ్చర్యం వేసింది. వెంటనే అవి కొత్తగా వచ్చిన ఆవుల దగ్గరకు వెళ్లి అలా రూపాలు మార్చే శక్తి మీకు ఎలా వచ్చిందో చెప్పమని అడిగాయి. అప్పుడా కొత్తగా వచ్చిన ఆవులు తాము నిత్యం లోకకల్యాణం కోసం యజ్ఞ యాగాదులు చేస్తున్న మునులకు నిరంతరం తమ పాలను అందించటం వల్ల, తమకు జన్మించిన కోడెదూడలు మునుల యజ్ఞ భూములను దున్నటం లాంటి పనులను చేస్తున్నందువల్ల తమకు అలాంటి గొప్ప శక్తి లభించిందని చెప్పాయి. ఆ శక్తి రావటానికి తమకు గోలోక నివాస భాగ్యం కలగటమేనని ఆ ఆవులు ఫేనవుడి ఆవులతో చెప్పాయి.ఒకవేళ తమను చూసి అసూయపడితే దుర్గతి పాలు కావలసి వస్తుందని హెచ్చరించాయి. అప్పుడు ఫేనవుడి (సుమిత్రుడి) ఆవులు కొత్తగా వచ్చిన ఆ ఆవులకు వినయపూర్వకంగా ప్రణమిల్లుతూ తమకు అలాంటి గోలోకవాస ప్రాప్తి వచ్చేలా ఏదైనా మార్గం చెప్పమని వేడుకొన్నాయి. అప్పుడు అవి ఫేనవుడి ఆవులను సాదరంగా చూస్తూ రంతిదేవుడు లోకహితం కోసం గొప్ప యాగం చేస్తున్నాడని, జీవితాల మీద వ్యామోహం విడిచిపెట్టి ఆ యాగానికి పశువులుగా తరలివెళ్లమని చెప్పాయి. అప్పుడా గోవులు రంతిదేవుడి దగ్గరకు వెళ్లి తమను యాగ పశువులుగా వినియోగించుకోమని కోరాయి. రంతిదేవుడు ముందు కొంత వెనుకాడినా ఆ గోవుల అభ్యర్థనను మన్నించాడు. ఆ క్షణాన ఆ మందలో ఉన్న గోవులలో ఒక్క గోవు అయినా యాగ పశువుగా రావటానికి బాధపడినా ఆ క్షణమే తన యాగాన్ని విరమించుకుంటానని చెప్పాడు రంతిదేవుడు. ఇంతలో సుమిత్రుడి దగ్గరకు సరోవరంలో స్త్రీలుగా మారి ఉన్న గోవులు వెళ్లి ఆయనకు కూడా విషయమంతా వివరించి గోలోక ప్రాప్తి కలిగించాయి. రంతిదేవుడి యాగం లోకకల్యాణం కోసమే నిరంతరాయంగా సాగింది. ఓ రోజు ఒక గోవు తన దూడకు పాలిచ్చి తాను యాగ పశువుగా వెళ్లిపోయాక ఆ దూడకు ఎన్ని కష్టాలొస్తాయో అని భోరున విలపించసాగింది. ఆ ఆర్తనాదాలు రంతిదేవుడికి వినిపించాయి. గోవులకు తాను చెప్పిన ప్రకారమే ఆ క్షణానే తన యాగం ఆపివేశాడు. యాగ పశువులుగా మారిన గోవులన్నీ జీవితం మీద వ్యామోహాన్ని విడిచి పెట్టి లోకహితం కోసం రంతిదేవుడు చేస్తున్న యాగానికి తమ జీవితాలు అర్పించి అవి కోరుకున్న గోలోకానికి చేరుకున్నాయి. రంతిదేవుడు ఎంతవరకు యాగం చేయాలో అంతవరకే చేసి ఆ చేసింది తన స్వార్థం కోసం కాక లోకహితం కోసమే చేసినందువల్ల పుణ్యలోకాలకు చేరుకున్నాడు. ఈ కథలో ఉత్తమ ఆశయం కోసం పదిమందికీ మేలు జరగాలన్న ఆలోచన కోసం జీవితం మీద వ్యామోహాన్ని విడిచిపెట్టి ప్రవర్తించాలన్న సూచన అంతర్లీనంగా కనిపిస్తుంది. గోలోకవాసం, మాయలు, మంత్రాలు ఇవేవీ కాదనుకున్నా లోకానికంతటికీ ఉపకరించేలా ప్రతిమనిషీ తన జీవితాన్ని మలచుకోవాలని చెప్పటమే ఈ కథలోని అంతరార్థం. సంసార బంధాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వకుండా మోక్ష మార్గం వైపు వ్యామోహరహితంగా నడవమని చెప్పటం ఈ కథలో కనిపిస్తుంది.
- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

సీసీఎల్‌-6 విజేత తెలుగు వారియర్స్‌

సెలెబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ తెలుగు వారియర్స్‌ ఫైనల్లో అదిరిపోయే ప్రదర్శనతో కర్ణాటక బుల్డోజర్స్‌ను మట్టికరిపించి రెండోసారి విజేతగా నిలిచింది. ఉప్పల్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 208 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన అఖిల్‌...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net