Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu


అమ్మలందరికీ అదితి ఆదర్శం
మాజంలో ధర్మం సన్నగిల్లుతున్నప్పుడు, అధర్మం రాజ్యమేలుతున్నప్పుడు అమ్మలంతా ఏం చేయాలి? అనే ప్రశ్నకు ఓ సందేశాత్మక సమాధానం ఇచ్చే కథా సందర్భం ఇది. మత్స్య మహాపురాణం 241 నుంచి 244వ అధ్యాయం వరకూ ఉన్న వామన చరితంలో ఈ సందేశం కనిపిస్తుంది. వామనావతార అవసరాన్ని ఇది వివరించి చెబుతుంది.

పూర్వం దైత్యులు దేవతల మీదకు దండెత్తి వారందరినీ రాజ్యహీనులను చేశారు. సాధుజనులు, సత్పురుషులు, మునులు, రుషులు, ధర్మాత్ములు లాంటి వారికి భూమ్మీద చోటే లేకుండా పోయింది. అన్ని చోట్లా ధర్మం పేరున అధర్మం చెలామణి కాసాగింది. సమాజం పరిస్థితి ఇంతేనా? మంచికీ మర్యాదకూ, నీతికీ ధర్మానికీ ఎక్కడా చోటే లేదా ? అని మిగిలిన మంచివారు కొందరు అనుకోవడం తప్ప ఏమీ చేసేందుకు ప్రయత్నం చేయలేదు. ఒకరిద్దరు ప్రయత్నం చేసినా అది విఫలమైంది. ఇది కశ్యపుడి భార్య అయిన అదితికి ఎంతో బాధ కలిగించింది. ఈ అధర్మాన్ని ఎవరూ అణచలేరా? అని ఆమె చాలా కాలం పాటు ఆలోచించింది. అయినా ఎవరో అణచాలని తాను ఎదురు చూడటమెందుకు. దానికి తగిన ప్రయత్నాన్ని తానే చేయొచ్చు కదా అని ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది.

ఆ తల్లి సమాజాన్ని చక్కదిద్దగల ధీరుడు తన కడుపునే పుట్టాలని, అలాంటి వాడిని కన్న తల్లిగా తాను ఆనందం పొందాలని అనుకొంది. వెంటనే అదితి జగద్వల్లభుడైన శ్రీమహావిష్ణువు గురించి తీవ్రంగా తపస్సు చేసింది. చివరకు స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడా తల్లి ఇలా అంది.

స్వామీ ! ప్రస్తుతం అంతటా అధర్మం రాజ్యమేలుతోంది. రాజ్యాన్నీ, యజ్ఞ భాగాలనూ అన్యాయంగా అపహరించే వారు ఎక్కువయ్యారు. ఈ అధర్మాన్ని అణిచేందుకు నాకొక పుత్రుడు జన్మించాలి. ఆ పుత్రుడివి కూడా నీవే కావాలి అని ఆ అమ్మ వైకుంఠవాసుడిని వరమడిగింది. ధర్మానికి హాని కలిగినప్పుడల్లా తానవతరించి ఆ ధర్మాన్ని మళ్లీ నిలబెట్టడమే శ్రీహరి లక్ష్యం కనుక అదితి, కశ్యపులకు తాను పుత్రుడినై జన్మిస్తానని వరమిచ్చాడు. సకల జగాలను మోసే తనను గర్భాన మొయ్యగల శక్తిని అదితికి ఆనాడు ప్రసాదించి అంతర్థానమయ్యాడు ఆ స్వామి. స్వామి వరంతో ఆ తల్లి గర్భాన్ని ధరించింది. నెలలు నిండాక ఓ శుభ ముహూర్తాన వామనావతారుడై శ్రీహరి జన్మించాడు. ఆ క్షణాన బ్రహ్మాది దేవతలంతా అక్కడికొచ్చి ఆ దేవదేవుడినీ, వామనావతారుడినీ స్తుతించారు. ఆయన జన్మించిన క్షణాన అధర్మాన్ని ఆచరించే దైత్యులకు చేష్టలుడిగాయి. వారికన్నీ అపశకునాలు ఎదురయ్యాయి. సజ్జనుల హృదయాలు ఆనందంగా పొంగిపోయాయి. దేవతలంతా ఆ స్వామిని స్తుతించాక చిన్నారి బ్రహ్మచారి రూపంలో ఉన్న ఆ వామనుడికి బ్రహ్మదేవుడు కృష్ణాజినాన్ని బహుకరించాడు. బృహస్పతి యజ్ఞోపవీతాన్ని, బ్రహ్మసుతుడైన మరీచి ఆషాఢదండాన్ని, వశిష్ఠుడు కమండలాన్ని, అంగిరుడు దర్భలను, పులహుడు రుద్రాక్షదండను, పులస్త్యుడు తెల్లని వస్త్రాలను ఇచ్చారు. ఆ వెంటనే ఓంకార నాదంతో కూడి వేదాలు అనేక శాస్త్రాలు, సాంఖ్యయోగం లాంటివన్నీ స్వయంగా వచ్చి ఆ స్వామిని ఆశ్రయించాయి. అప్పుడా వామనుడు గొడుగు, దండం, కమండలం లాంటివన్నీ ధరించి వెనువెంటనే ధర్మప్రతిష్ఠాపన కోసం ముందుకు అడుగులు వేశాడు.

ఈ కథా సందర్భంలో వామన జనన సందర్భ విశేషాలతో పాటు ఓ చక్కటి సందేశం కనిపిస్తుంది. సమాజంలో అన్యాయం పెరుగుతోంది, అధర్మం మీరుతోందని అనుకొంటూ కాలం వృధా చేసుకోక ఎవరికి వారు తమ స్థాయిలో తగిన ప్రయత్నం చేయాలి. తల్లులు తమకు జన్మించే బిడ్డలు అధర్మాన్ని జయించి, ధర్మాన్ని నిలబెట్టగలిగిన వారుగా ఉండాలన్న దీక్షతో బిడ్డలను కని పెంచాలి. ఇలా చేస్తే ధర్మం నిరంతరం చల్లగా వర్ధిల్లుతుందన్న సందేశం వామన జనన ఘట్టంలో కనిపిస్తుంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

చైనాలో విడుదలకు సిద్ధమవుతున్న బాహుబలి

బాహుబలి ది బిగినింగ్‌ చిత్రాన్ని చైనాలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమయిన సంగతి తెలిసిందే. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్రానికి కొన్ని మార్పులు చేయనున్నట్లు దర్శకుడు ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net