Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu


పిల్లాపాపలను చల్లంగ చూసే తల్లి
ప్రతి ఇంటిలోనూ పిల్లా పాపలను చల్లంగ చూసేది తొలిగా కన్నతల్లే. ఆ తల్లి ఒక్కతేగాదు మరో తల్లి కూడా ఇంటింటా ఉండే చిన్నారి పాపలను చల్లంగ చూస్తుంటుంది. ఆ కన్నతల్లి లాంటిదేవతకు సంబంధించిన కథే ఇదంతా. ఈ దేవతకు సంబంధించిన కథ దేవీభాగవతం తొమ్మిదో స్కంధంలో వివరంగా కనిపిస్తుంది.

ప్రతి భాద్రపద శుక్లచవితిని వినాయక చవితి పండుగగా ఎలా చేసుకుంటారో ప్రతి భాద్రపద శుక్ల షష్ఠిని షష్ఠీదేవి పండుగగా జరుపుకోవటం సంప్రదాయంగా వస్తోంది. ఈ దేవత చరిత్రే ఓ విచిత్రంగా, గొప్పగా కనిపిస్తుంది. ప్రకృతిమాతలో ఆరో అంశంగా ఈమె అవతరించిన కారణంగా షష్ఠీదేవి అని పేరు వచ్చింది. బ్రహ్మ మానస పుత్రిక అయిన ఈ దేవత యుద్ధ సమయాలలో దేవతల సేనను నిరంతరం కాపాడుతూ దేవతలకు విజయం చేకూర్చి పెడుతున్న కారణంగా దేవసేన అని పేరు వచ్చింది. ఈ దేవసేన కుమారస్వామిని వివాహమాడింది. బాలబాలికలకు మంచి ఆయువును ఇచ్చి పెంపుడు తల్లిలా రక్షిస్తూ యోగమాయా రూపంలో పురిటింట్లో పిల్ల పక్కనే ఉంటుంది. పిల్లలకు అనారోగ్యం కలిగినప్పుడు తల్లిదండ్రులు ఈ దేవతను ఆర్తితో స్తుతిస్తే వారికి ఆరోగ్యాన్ని చేకూర్చి పెడుతుంది. దీనికి సంబంధించిన పూర్వ కథ ఒకదానిని దేవీ భాగవతం పేర్కొంటోంది.

పూర్వం స్వాయంభువ మనువుకు ప్రియవ్రతుడు అనే ఓ కుమారుడు జన్మించాడు. ప్రియవ్రతుడు పెరిగి పెద్దయ్యాడు. కానీ ఎందుకో ఆయనకు వివాహం మీదకు మనస్సు పోలేదు. నిరంతరం తపస్సుకే తన జీవితాన్ని అంకితం చేశాడు. బ్రహ్మదేవుడు కలగజేసుకొని గృహస్థాశ్రమ ప్రాముఖ్యాన్ని వివరించి ప్రియవ్రతుడికి మాలినీదేవి అనే కన్యతో వివాహం జరిపించాడు. ఆ దంపతులకు ఎంత కాలానికీ సంతానం కలగలేదు. ఈ పరిస్థితిని గమనించిన కశ్యప ప్రజాపతి వచ్చి పుత్రకామేష్ఠి యాగాన్ని ప్రియవ్రతుడితో చేయించాడు. ఆ తర్వాత మాలినీదేవి గర్భవతి అయింది. ఓ శుభముహుర్తాన పండంటి బిడ్డను ప్రసవించింది. కానీ ఆ శిశువు మృతశిశువు. దాంతో ఆ దంపతులు ఎంతో శోకించారు. ప్రియవ్రతుడు మృతశిశువును తీసుకొని అడవిలోకి వెళ్లాడు. అక్కడ అతడికి దుఃఖం ఆగలేదు. దారుణంగా విలపించాడు. అలా విలపిస్తూనే కూర్చున్నాడు తప్ప శిశువును ఖననం చేయటానికి పూనుకోలేదు. ఇంతలో ఓ దివ్య విమానం అక్కడకు వచ్చి ఆగింది. ఆ విమానంలో నుంచి తెల్లని వస్త్రాలతో, పుష్పమాలికలతో ప్రకాశిస్తున్న ఒక దేవత అక్కడ నిలిచింది. ప్రియవ్రతుడు ఆమెను చూసి శిశువును కిందకు దించి లేచి నిలుచొని నమస్కరించాడు. ఆమె ఎవరో? తన దగ్గరకు ఎందుకు రావాల్సి వచ్చిందో? చెప్పమన్నాడు. అప్పుడు ఆ దేవి తన విషయాలన్నింటినీ చెప్పింది. తాను ఆదిపరాశక్తిలోని ఆరో అంశనని, తన వివరాలన్నీ చెప్పి శిశువును చేతిలోకి తీసుకొని ఒళ్ళు నిమిరింది. ఆ క్షణాన్నే ఆ బాలుడు జీవం పోసుకొని కిలకిలా నవ్వుతూ కళకళలాడాడు. పునరుజ్జీవుడైన ఆ పిల్లవాడు సూరతుడు అనే పేరుతో పెరిగి పెద్దవాడవుతాడని, ఎంతో యోగ్యుడిగా ఉంటాడని, గొప్ప కీర్తి గడిస్తాడని షష్ఠీదేవి ప్రియవ్రతుడికి చెప్పింది. తాను పసిపిల్లలను నిరంతరం రక్షిస్తూ ఉంటానని, అయితే కర్మ విపాకం బలీయమని పూర్వజన్మలో చేసుకున్న కర్మ ప్రకారం ఎవరికైనా కష్టాలు రాసుంటే వాటిని తప్పించటం అంత సులభ సాధ్యం కాదంది. ప్రియవ్రతుడు రోదిస్తూ ఉండటాన్ని, పక్కనే మృత శిశువు ఉండటాన్ని చూసి తాను తట్టుకోలేక అలా వచ్చానని చెప్పింది. ఆ తర్వాత ఆమె ప్రియవ్రతుడికి తిరిగి బతికిన బిడ్డను ఇచ్చి అంతర్థానమైంది. అప్పటి నుంచి ప్రతి నెలా శుక్లషష్ఠి నాడు అందులోనూ భాద్రపద శుక్లషష్ఠి నాడు ప్రియవ్రతుడు షష్ఠీదేవికి పూజలు జరిపించటం ప్రారంభించాడు. పురిటిళ్లల్లో ఆరో రోజు, పదకొండో రోజు, అన్నప్రాసన రోజు ప్రతి శుభకార్యం సందర్భంలోనూ షష్ఠీదేవి పూజలు చేయటం ఆనాటి నుంచే మొదలైంది. సాలగ్రామంలోనో, మంగళ కలశంలోనో, వటవృక్షం మూలనో షష్ఠీదేవిని ఆవాహన చేసి పూజలు జరిపిస్తారు. పుష్పాలతోను, షోడశోపచారాలతోనూ పూజ చేసి నైవేద్యం పెడతారు. ఇలా పూజలు చేసినవారింట శిశువులకు మంచి ఆరోగ్యమే కాక పెద్ద వారికి సుఖభోగాలు ప్రాప్తిస్తుంటాయన్నది నమ్మకం. పిల్లలను తల్లిలా కాపాడే ఓ ప్రత్యేక దేవత షష్ఠీదేవి గురించి దేవీభాగవతం వివరిస్తోంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

పరిశ్రమ వదిలి వెళ్లిపోదామనుకున్నా!

మానవీయ కోణాల్ని స్పృశిస్తూ సినిమాలు తీయడంలో దర్శకుడు మదన్‌ది ప్రత్యేక శైలి. మనిషి, మనసు, అనుబంధాల మధ్య సంఘర్షణల్ని ఆయన తెరపైకి తీసుకొచ్చే విధానం బాగుంటుంది.

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net