Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu


జగదంబ చెప్పిన హయగ్రీవుడి కథ
శ్రీమహావిష్ణువు హయగ్రీవుడిగా ఎలా అవతరించాడనే విషయాన్ని గురించి దేవీభాగవతం ప్రధమస్కంధంలో ఓ చక్కటి కథ ఉంది. సాక్షాత్తూ జగజ్జనని ఇంద్రాది దేవతలందరికీ హయగ్రీవుడి వృత్తాంతాన్ని వివరించినట్లుగా ఈ పురాణ కథలో కనిపిస్తుంది. పూర్వం ఓసారి దేవతలంతా కలిసి ఓ మహాయజ్ఞాన్ని చేయాలని నిర్ణయించుకొన్నారు. వెంటనే బ్రహ్మ, శివుడు లాంటి దేవతలందరితో ఇంద్రుడు సమావేశమై యజ్ఞ విషయాన్ని చర్చించాడు. వారంతా కలిసి యజ్ఞమూర్తి, యజ్ఞప్రభువు అయిన శ్రీమహావిష్ణువుకు తమ నిర్ణయాన్ని గురించి చెప్పేందుకు వైకుంఠానికి బయలుదేరి వెళ్ళారు. అయితే అక్కడ శ్రీమహావిష్ణువు కనిపించలేదు. వెంటనే వారంతా దివ్య దృష్టితో స్వామి ఎక్కడ ఉన్నాడా అని వెతికారు. పదివేల సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా యుద్ధం చేసి గెలిచిన శ్రీమహావిష్ణువు బాగా అలసిపోయి తన విల్లు కొన మీద గడ్డం ఆనించి నిలుచొని నిద్రపోతూ ఉండటం దేవతలకు కనిపించింది. ఆ స్వామి శరీర భారమంతా ధనుస్సు మీద మోపి ఉంది. శ్రీమహావిష్ణువును నిద్ర లేపటానికి దేవతలెవరూ సాహసించలేదు. అప్పుడు బ్రహ్మ క్షణకాలం పాటు ఆలోచించి తాను సృష్టించిన ఒక వమ్రి (చెదపురుగు)ని పంపాడు. శ్రీమహావిష్ణువు గడ్డం ఆనించి నిలుచొని నిద్రపోతున్న ధనుస్సు అల్లెతాడును కొరకమని, అలా చేస్తే ధనుస్సు వదులై స్వామికి మెలకువ వస్తుందని వమ్రికి చెప్పాడు బ్రహ్మ. నిద్రాభంగం, కథాభంగం, దాంపత్య భేదనం, తల్లీబిడ్డలను విడదీయటం అనేవి బ్రహ్మహత్యతో సమానమైనవని కనుక విష్ణువుకు నిద్రాభంగాన్ని కలిగించే పాపపు పనిని తను చేయనంది ఆ చెదపురుగు. అయినా అంతటి పాపం చేసినా తనకేమీ లాభం ఉండదు కనుక తానసలు వింటినారిని కొరకనే కొరకను అని బ్రహ్మతో చెప్పింది చెదపురుగు. ఆ మాటలను విని క్షణకాలంపాటు ఆలోచించాడు బ్రహ్మ. వెంటనే చెదపురుగుతో ఇలా అన్నాడు. హోమాలు చేసేటప్పుడు హోమకుండంలో వ్రేల్చే హవిస్సులు కుండం చుట్టూ చెదిరి పడుతూ ఉంటాయి. అవి కూడా ఎంతో పవిత్రమైనవే. ఆ హవిర్భాగాలను తినే అవకాశాన్ని వింటి నారిని కొరికితే చెదపురుగుకు ఇక మీదట నుంచి కల్పిస్తానని బ్రహ్మ మాట ఇచ్చాడు. అల్పమైన ఆ చెదపురుగు హవిర్భాగాలు అందుతాయని బ్రహ్మ చెప్పిన మాటలకు ఆనందించి వెంటనే వెళ్లి నేలకు ఆని ఉన్న ధనుస్సు అల్లెతాడును కొరికింది. అల్లెతాడు పట్టువిడిపోవటంతో ధనుస్సు పైకొన ఒక్కసారిగా పైకి లేచింది. అప్పుడా కొనమీద ఆని ఉన్న శ్రీహరి శిరస్సు ఎటో దూరంగా వెళ్లిపడిపోయింది. ఆ పరిస్థితి చూసిన దేవతలంతా హాహాకారాలు చేశారు. ఇంద్రాది దేవతలు సైతం భయకంపితులయ్యారు. అయితే దేవగురు బృహస్పతి ఇంద్రుడికి ధైర్యం చెప్పి దేవతలందరినీ కలిసి జగజ్జనని స్తుతించమని, అలా చేస్తే ఆ తల్లి ఏదో ఒక ఉపాయం చెబుతుందని అన్నాడు. అప్పుడు దేవతలంతా కలిసి జగన్మాతను స్తుతించారు. ఆమె అనుగ్రహించి శ్రీమహావిష్ణువుకు దేవశిల్పి అయిన త్వష్ట ఒక చక్కని గుర్రపు తలను తెచ్చి అమర్చితే పరిస్థితి చక్కపడుతుందని చెప్పింది. వెంటనే సమీపంలోనే ఉన్న ఓ గుర్రపు తలను తెచ్చి త్వష్టకు ఇచ్చారు దేవతలు. ఆయన ఆ తలను శ్రీమహావిష్ణువు మొండేనికి జాగ్రత్తగా అతికించాడు. అలా దేవి అనుగ్రహంతో హయగ్రీవ స్వామి అవతరణ జరిగింది. అలా జరగటానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయని దేవతలకు దేవి చెప్పింది. పూర్వం హయగ్రీవుడనే రాక్షసుడు తపస్సుతో తనను మెప్పించి గుర్రపు తల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం ఉండేలా వరం కావాలన్నాడని, ఆ వరాన్ని తానే అనుగ్రహించానని, ఆ మాత దేవతలకు చెప్పింది. హయగ్రీవ రాక్షసుడు గుర్రపుతల ఉన్నవాడు ఎవడూ భూమి మీద జన్మించడు కనుక తనకు చావు ఉండబోదని విర్రవీగి లోకాలన్నిటినీ హింసిస్తున్నాడు. వాడిని సంహరించేందుకే విష్ణువును హయగ్రీవుడిగా తాను అవతరింపచేసినట్లు జగన్మాత చెప్పింది. పూర్వం ఒక సందర్భంలో శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిని చూసి హేళనగా నవ్వినప్పుడు ఆమె కోపగించి ఆ శిరస్సు తెగిపోవాలని శపించిందని, ఆ కారణంతో విష్ణువు శిరస్సు తెగి గుర్రపు తల ఆయనకు ప్రాప్తించబోతుందని జగజ్జనని దేవతలకు చెప్పి అంతర్థానమైంది. గుర్రపు తలతో ఉన్న హయగ్రీవ స్వామిని దేవతలంతా స్తుతించారు. ఆ తర్వాత హయగ్రీవాసురుడి వధతో పాటు దేవతలు తలపెట్టిన గొప్ప యజ్ఞం పూర్తయింది. ఇలా హయగ్రీవుడు అవతరణ కథను దేవీభాగవతం వివరిస్తోంది.
-డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

ఉప్పల్‌లో పరుగుల పండగ

మ్యాచ్‌ అంటే ఇదీ.. ఆడేది సినిమావాళ్లే అయినా, అంతర్జాతీయ మ్యాచ్‌కి ఏమాత్రం తీసిపోదు. టీ ట్వంటీలో ఉండే అసలైన మజా... మరోసారి తెలిసొచ్చింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net