Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu


సంప్రదాయం వెనుక సందేశం
రలక్ష్మీ వ్రతాన్ని ప్రతి శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం జరుపుకోవటం సంప్రదాయం. ఒకవేళ ఆ రోజు కుదరకపోతే శ్రావణమాసంలో వచ్చే ఏదో ఒక శుక్రవారం నిర్వహిస్తారు. ఈ వ్రతాన్ని సత్సంతానప్రాప్తి, దీర్ఘ సుమంగళిగా ఉండటం కోసం స్త్రీలు చేస్తుంటారని భవిష్యోత్తర పురాణంలో కనిపించే కథ. ఈ వ్రత కథలు భగవద్భక్తిపరంగానే కాక సామాజిక సందేశాన్నీ ఇస్తుంటాయి. ఈ కథల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే సత్యపాలన, స్త్రీ గృహిణిగా నిర్వర్తించాల్సిన ధర్మాల పాలనకు సంబంధించిన విషయాలెన్నో కనిపిస్తాయి. భవిష్యోత్తర పురాణంలోని ఈ కథను పరిశీలిస్తే పలు అంశాలు అవగతమవుతాయి.

కైలాస శిఖరంపైన ఓ రోజున పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో సరస సల్లాపాల్లో ఉన్నప్పుడు ఒకరితో ఒకరు పోటీపడి ఆటలాడుకుంటున్నారు. ఆ ఆటలో ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారన్నది తేల లేదు. ఆ విషయాన్ని తేల్చే బాధ్యతను శివుడి అనుచరుడైన చిత్రనేమి ముందుంచారు ఆది దంపతులు. చిత్రనేమి శివుడికి భయపడి పార్వతే ఓడిపోయిందని అబద్ధం ఆడాడట. దానికి ఆమె కోపించి కుష్ఠురోగిగా మారాలని చిత్రనేమిని శపించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న శంకరుడు పార్వతిని అనునయించాడు. ఆమె శాంతించి చిత్రనేమికి శాపాంతం చెప్పింది. భవిష్యత్తులో మానస సరోవర తీరాన అప్సరసలు ఒక వ్రతం చేస్తారని, అది ఏమిటని చిత్రనేమి అప్సరసల్ని అడిగినప్పుడు వ్రత విషయాన్ని వారు చెబుతారని, దానిని వినగానే శాప విమోచనం కలుగుతుందని పార్వతి చెప్పింది. పార్వతీ మాత శపించినట్లుగానే వ్యాధిగ్రస్తుడయ్యాడు చిత్రనేమి. అతను మెల్లగా మానస సరోవర తీరానికి చేరుకున్నాడు. చాలాకాలం గడిచాక ఓ రోజున అప్సరసలంతా మానస సరోవరానికి వచ్చి స్నానాదికాలు ముగించుకుని ఏదో వ్రతం చేయటం చిత్రనేమికి కనిపించింది. ఆ కార్యక్రమం అయ్యాక అప్సరసల్ని చిత్రనేమి అదేమి వ్రతమని అడిగాడు. అతడి భక్తినీ, ఉత్సాహాన్నీ గమనించిన అప్సరసలు వరలక్ష్మీ వ్రతమని చెప్పి ఆ విధానాని అతడికి తెలిపారు. చిత్రనేమి ఆ వ్రతాన్ని భక్తిప్రపత్తులతో నిర్వహించి శాపం వల్ల కలిగిన రోగాన్ని పోగొట్టుకున్నాడు. అంతేగాక అతడి శరీరమంతా మేలిమి బంగారు ఛాయతో ఆరోగ్యంగా మారింది. ఆ తర్వాత కైలాసానికి వచ్చి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి ఆశీస్సులందుకున్నాడు. ఇదే వ్రతాన్ని పార్వతీదేవి ఆచరించి షణ్ముఖుడిని కుమారుడిగా పొందింది. ఈ వ్రతాన్ని చేసిన భూలోక కాంతల్లో చారుమతి అనే ఆమె ప్రసిద్ధురాలు. చారుమతి అనే ఒక ఇల్లాలు ఉండేది. ఆమె భర్తను ప్రేమతో గౌరవిస్తూ ఇల్లాలు నిర్వహించాల్సిన ధర్మబద్ధమైన కార్యాలన్నింటినీ నిర్వహిస్తూ జగజ్జనని కొలుస్తూ ఉండేది. అయితే చారుమతి పేదరికంతో బాధపడుతూ ఉండేది. అంతటి దైన్య స్థితిలో ఉన్నప్పటికీ అమ్మవారిని ఆరాధించడం, భర్తను సేవించడం మాత్రం ఆమె విడవలేదు. ఆమె ధార్మిక వర్తనం జగజ్జననికి ఎంతగానో నచ్చింది. ఓ రోజున కలలో ఆ మాత ప్రత్యక్షమై చారుమతితో తాను వరలక్ష్మీదేవినని, తన వ్రతాన్ని చేసి దీర్ఘసుమంగళిగాను, భోగభాగ్యాలతోను, సత్సంతానంతోను వర్ధిల్లమని చెప్పింది. నిద్రమేల్కొన్న చారుమతి ఆ విషయాన్ని ఇంట్లోని పెద్దలకు చెప్పింది. అంతా ఎంతో ఆనందంతో శ్రావణపౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు జగజ్జనని చెప్పిట్లుగా వ్రతాన్ని చేశారు. ఆ తర్వాత ధన కనక వస్తు వాహన సమృద్ధితో ఆ ఇల్లు వరలక్ష్మీమాత అనుగ్రహంతో హాయిగా వర్ధిల్లింది. ఇక్కడ పేర్కొన్న రెండు వ్రత కథల్నీ పరిశీలిస్తే తొలి గాథలో అసత్యాన్ని చెబితే ఎలాంటి వారైనా కష్టాలపాలు కావాల్సిందేనని, ఆ తర్వాత దైవానుగ్రహంతో బయటపడ్డా ముందు కష్టాలు తప్పవనే ప్రబోధం ఉంది. రెండో కథలో చారుమతి పేదరికంతో ఎంత బాధపడుతున్నా భర్తనూ, దైవాన్నీ భక్తితో ఆరాధిస్తూ గృహిణిగా తన ధర్మాన్ని నిర్వర్తించింది. ఇలా ధర్మాన్ని పాలించినవారికి దైవానుగ్రహం ఉంటుందన్న సత్యం ప్రకటితమైంది. వరలక్ష్మీ వ్రతం వెనుక ఇలా సత్య, ధర్మ పాలనల ఔన్నత్యం నిరూపితమై కనిపిస్తుంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

అనుక్షణం ఉత్కంఠగా... ‘క్షణం’

అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగే కథనంతో తెరకెక్కిన చిత్రం ‘క్షణం’. పీవీపీ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి రవికాంత్‌....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net