Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu


సర్వశుభాలకూ శాంతమే సోపానం
నిషికి శాంత స్వభావం ఎంత రక్షణ కల్పిస్తుందో వివరించే కథాంశమిది. తన శాంతమే తనకు రక్ష అన్న సూక్తిని ప్రతిబింబిస్తూ ప్రగాథుడు అనే ఓ ముని జీవితం మన పురాణ కథల్లో కనిపిస్తుంది. ఈ ప్రగాథుడు కణ్వమహర్షికి సోదరుడు. కణ్వమహర్షి మంత్రద్రష్ట. ఇంద్రియ నిగ్రహంతో ప్రవర్తిస్తున్న గొప్ప తపశ్శక్తి సంపన్నుడు అని ఆయనకు పేరుంది. ఈ సోదరులిద్దరూ కేశిని, ఘోరుడు అనే దంపతుల బిడ్డలు. ఆ పుణ్యదంపతుల మరణానంతరం కణ్వుడే తన సోదరుడిని పెంచసాగాడు. పేరుకు సోదరుడే కానీ సొంత బిడ్డలాగా కణ్వుడు, ఆయన భార్య ప్రగాథుడిని చూసుకుంటూ ఉండేవారు. కాలం గడుస్తుండగా కణ్వుడు ఏదో పని మీద గ్రామాంతరం వెళ్ళవలసి వచ్చింది. ఆ ముని అలా కొన్నాళ్ళు పాటు పొరుగూరిలో ఉండి తిరిగి వచ్చాడు. ఆ వచ్చిన సమయానికి కణ్వుడి భార్య ప్రగాథుడి తలను ఒళ్ళొ పెట్టుకొని నిద్రపుచ్చుతోంది. ఆ సన్నివేశాన్ని చూసిన కణ్వుడికి మనసులో కలగకూడని అనుమానం కలిగింది. తన భార్య సాధ్వి అని తెలిసినా, తన తమ్ముడు ధర్మమార్గవర్తనుడు అని తెలిసినా ఆ క్షణాన కణ్వుడి కెందుకో అనుమానం కలిగింది. భరించరాని కోపంతో తన చేతిలోని దండకమండలాలను దూరంగా విసిరికొట్టాడు. ప్రగాథుడిని నిద్రపుచ్చుతూ మనసులో ఎలాంటి దురాలోచన లేకుండా ప్రగాథుడిని నిద్ర లేపితే అతనెక్కడ బాధపడతాడోనని ఆమె అలాగే కూర్చుండిపోయింది. ఆ పరిస్థితికి కోపం మరీ రెట్టింపైన కణ్వుడు ప్రగాథుడిని గట్టిగా ఒక్క తన్ను తన్నాడు. తన భార్యను చూస్తూ ‘నీచురాలా!’ అని సంబోధించాడు. ఆ సంబోధన, ఆయన ప్రవర్తన అప్పటికి కానీ ప్రగాథుడికీ, కణ్వముని భార్యకూ అర్థం కాలేదు. కోపంతో మండిపడుతున్న కణ్వుడికి రెండు చేతులెత్తి నమస్కరిస్తూ ప్రగాథుడు ఎంతో శాంతంగా ఇలా అన్నాడు. కణ్వుడు తనకు అన్న మాత్రమే కాదని, కణ్వుడి భార్యను తాను ఒక్క వదినగా మాత్రమే చూసుకోవటం లేదని చెప్పాడు. కణ్వుడు తనకు తండ్రిలాంటి వాడని, వదిన తనకు తల్లిలాంటిదని ఎన్నో రకాలుగా చెప్పి ప్రశాంతంగా నిలుచున్నాడు ప్రగాథుడు. తాను అంతగా కోపగించుకుంటున్నా ఏ మాత్రం ఎదురు తిరగకుండా నిర్మలమైన మనసుతో నిలుచున్న ప్రగాథుడిని చూసే సరికి కణ్వుడి మనసుమారింది. ఇంతలో కణ్వుడి భార్య కూడా తన మనసులో మరేమీ లేదని వివరించి చెప్పింది. పుత్ర సమానుడైన ప్రగాథుడు వయసు వచ్చినప్పటికీ తనకు పుత్రుడితోనే సమానమని చెప్పింది. అప్పటికి కణ్వ మహర్షికి పరిస్థితి అంతా బాగా అవగతమై కోపం నశించి వాస్తవాన్ని గ్రహించిన స్థితికి వచ్చాడు. గ్రామాంతరం వెళ్ళి వచ్చిన మరుక్షణం నుంచి కణ్వుడు అలా ఏకపక్షంగా నిర్ణయించుకొని కోపంగా ప్రవర్తించినందుకు తగినట్లుగా ప్రగాథుడు కూడా ప్రవర్తించనందువల్లనే కణ్వుడు అతని మీదకు కత్తిని దుయ్యలేక పోయాడు. చిన్నవాడైప్పటికీ ప్రగాథుడు నడచిన శాంత మార్గమే చాలా గొప్పదని వివరిస్తుంది ఈ కథ. అలాంటి శాంత గుణాన్నే అందరూ అలవాటు చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక సామాజికపరమైన విషయాన్ని ప్రతివారూ గుర్తించాలి. ఒక వయస్సు వచ్చిన తర్వాత తల్లీ కొడుకులు, తండ్రీ కూతుళ్ళు, సోదరీ సోదరులైనా సరే మరీ చనువుగా, దగ్గరగా ఉండటం అంత మంచిది కాదు. చూపరులకు అపోహలు, అనుమానాలు కలగకుండా అంతా శాంతంగా ఉండటానికి ఈ విధానం అనుసరణీయమన్న విషయాన్ని కూడా ఇక్కడ గమనించవచ్చు.
-డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

అనుష్కలా పేరు తెచ్చుకుంటా!

ోడలింగ్‌లో రాణిస్తూ... వ్యాపార ప్రకటనల్లో మెరుస్తూ సినిమా పరిశ్రమ దృష్టినీ ఆకర్షిస్తుంటారు కొందరు భామలు. అలా కథానాయికలుగా అవకాశాల్ని అందుకొన్నవాళ్లు చాలా...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net