Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu


సర్వశుభప్రదం... శతరుద్రీయం
స్తోత్రాల్లో కొన్నిటి పారాయణం వల్ల ఎంతో మేలు కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు. అలాంటి వాటిలో శతరుద్రీయం ఒకటి. ఈ శతరుద్రీయాన్ని గురించిన ప్రస్తావన మహాభారతంలో ఉంది. దీని నేపథ్యం దైవ సంబంధంగా కనిపిస్తుంది. శ్రీమహావిష్ణు స్వరూపుడైన కృష్ణుడు దీని గురించి వివరించాడు. విష్ణువు, శివుడు ఇద్దరూ పరస్పరం ఒకరి మహిమను ఒకరు కీర్తించడం మన పురాణాలలో అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. ఇలాంటి వాటిని గమనించైనా శైవ, వైష్ణవ భేదాలు పాటించడం మంచిది కాదని సమాజం గ్రహించాలన్నదే ఆ పురాణాల కథాసారం. మహాభారతం అనుశాసనిక పర్వంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు కలిగిన సందేహాలను తీర్చేటప్పుడు ఓ కథా సందర్భం కనిపిస్తుంది. ధర్మరాజు మహేశ్వరుడి మహిమ ఏమిటో చెప్పమని అడిగినప్పుడు విష్ణు అంశ సంభూతుడైన కృష్ణుడు ఇలా ప్రారంభించాడు.

మహేశ్వరుడి మహిమను తెలిపే శతరుద్రీయం ప్రతి నిత్యం ప్రాతఃకాలంలో నియమంతో పఠిస్తే ఎంతో మేలు కలుగుతుందని, తాను అలా చేస్తూ ఉంటానని అన్నాడు కృష్ణుడు. మహేశ్వరుడి మహిమ నిండి ఉన్న ఆ శతరుద్రీయాన్ని బ్రహ్మదేవుడు తన తపోదీక్ష అనంతరం స్పృజించాడు. అలాంటి శతరుద్రీయ పారాయణం వల్ల మేలు కలుగుతుందనడంలో సందేహం లేదని కృష్ణుడు పలికి శతరుద్రీయ మహిమ అంటే ఈశ్వర మహిమను తెలిపే ఓ సంఘటన వివరించాడు. దక్షయజ్ఞ విధ్వంస సమయంలో మహేశ్వరుడు యజ్ఞానికి వచ్చిన దేవతలందరినీ తీవ్ర కోపంతో కొట్టసాగాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక దేవతలంతా కలిసికట్టుగా శతరుద్రీయాన్ని పఠించారు. దాంతో ఆ రుద్రుడు ప్రసన్నుడయ్యాడు. ఆ ప్రసన్న రూపాన్నే మహేశ్వర రూపం అని కీర్తించారు దేవతలంతా. శివుడికి యజ్ఞంలో విశిష్ట భాగాన్ని కల్పించాడు. ఆనాడు శతరుద్రీయం అలా ప్రకటితమైంది. త్రిపురాసుర సంహారవేళ మహేశ్వరుడు విష్ణుమూర్తిని బాణంగా, అగ్నిని బాణాగ్రంగా, యముడిని పుంఖంగా, వేదాలను ధనువుగా, సావిత్రిని అల్లెతాడుగా, బ్రహ్మను రథసారథిగా చేసి త్రిపురాసురులను మట్టుపెట్టాడు. కనుక మహేశ్వరుడికి దేవతలంతా లోబడి ఉన్నట్టేకదా అని కృష్ణుడు ఇలా ఓ ఉదాహరణ పూర్వక కథను ధర్మరాజుకు చెప్పాడు. దీనివల్ల ఈశ్వర మహిమను కృష్ణుడు మరింత స్పష్టం చేసినట్లయింది. రుద్రుడు, పశుపతి, శివుడు, అగ్ని, శర్వుడు, ఈశానుడు, వాయువు, అశ్వినీదేవతలు, సూర్యచంద్రులు, వరుణుడు, రుతువులు, సంధ్యలు, దివారాత్రాలు, నక్షత్ర గ్రహతారకలు, మృత్యువు, కాలం అన్నీ ఆ మహేశ్వరుడే. మహాదేవుడి బహురూపాలుగా ఆ దేవతలంతా ఉన్నారు. ఆ దేవుని దేహాలను రెండుగా విభజించారు. ఒకటి ఘోర తనువు, రెండోది శివతనువు. ఘోరతనువు ఉగ్రమై కాంతులీనుతుంది. శివతనువు సౌమ్యమై అలరారుతుంది. ఆ శివుని మూర్తి సగం అగ్నిగాను, మిగతా సగం చంద్రునిగాను భాసిస్తుంటుంది. ఒక మూర్తి బ్రహ్మచర్యం, రెండోది పార్వతి. ఆయన తన ఘోర తనువుతో సంహార కార్యం చేస్తాడు. ఈశ్వరత్వం, మహత్త్వం కలగడంవల్లే ఆయనను మహేశ్వరుడు అని అందరూ అంటారు. ఉగ్రుడై దహిస్తుండటం వల్ల రుద్రుడు అనే పేరుతో పిలుస్తుంటారు. దేవతలందరిలోకీ మహత్తరుడు కనుక మహాదేవుడయ్యాడు. ఆయన జటారూపం ధూమ్రమై ఉండడం వల్ల ధూర్జటి అనే పేరొచ్చింది. మానవాళి శుభం కోరుతూ సమృద్ధిని కలిగిస్తుండడం వల్ల శివుడు అని పిలుపునందుకుంటున్నాడు. స్థిరుడు, స్థిరలింగుడు అయినందున స్థాణుడు అని పేరొచ్చింది. పశువులను పాలిస్తున్నందువల్ల పశుపతి అయ్యాడు. లింగరూపంలో ఉన్న శివుడిని పూజించినవారికి సమస్త సిరులూ లభిస్తాయి. దేవతలలో ప్రధముడూ, జ్యేష్ఠుడూ ఆ శివుడే. లోకమంతా వ్యాపించి ఉన్న ఆ శంకరుడి ముఖం నుంచే అగ్ని వెలువడింది. ఆ మహాదేవుడి మహిమ చెప్పుకొంటూ పోతే ఇంతా అంతా అని తేల్చి చెప్పటం సాధ్యం కాదు సుమా అని కృష్ణుడు ధర్మరాజుకు శివమహిమను చెప్పాడు. ఇలా ఈ కథాసారం శివ, శతరుద్రీయ మహిమలను తెలియజేస్తోంది. దాంతోపాటు కృష్ణుడే స్వయంగా శివ విశేషాలను తెలియజెప్పడం జూస్తే శైవ, వైష్ణవ మత భేదాలు అనవసరమన్న విషయం ఇక్కడ స్పష్టమవుతోంది.

-డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

హాలీవుడ్‌లో మెరుస్తున్న బాలీవుడ్‌

హాలీవుడ్‌లో బాలీవుడ్‌ జెండా ఎగరేస్తే ఎంత బాగుంటుందో... చాలాకాలంగా బాలీవుడ్‌ను వూరిస్తూ వచ్చిన ఈ లక్ష్యాన్ని మన తారలు ఒక్కొరొక్కరిగా సాధిస్తూ వస్తున్నారు....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net