Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu


అంతా.. నోటి మాటతోనే...
మాట చక్కగా మాట్లాడితే ఎంత మంచి జరుగుతుందో దానికి విరుద్ధంగా మాట్లాడితే అంతకు పదింతల చేటు తెస్తుంది. కావాల్సిన పనిని కాకుండా చేయటం పెడసరంగా మాట్లాడే వారి వల్లే అవుతుంది. ఈ విషయాన్ని సమర్థిస్తూ మహాభారతం ఉద్యోగ పర్వంలో ఓ కథాంశం ఉంది. పాండవులు తమ రాయబారి (దూత)గా కౌరవుల దగ్గరకు ద్రుపదుడి పురోహితుడిని పంపాలని నిశ్చయించుకున్నారు. ద్రుపద పురోహితుడు అంత సామాన్యుడేం కాదు. సకల శాస్త్రాలు, విద్యలు తెలిసినవాడే. ద్రుపదుడే కాక పాండవులకు కూడా ఆ పురోహితుడి జ్ఞాన విజ్ఞానాల మీద మంచి నమ్మకం ఉంది. అయితే ఎటొచ్చీ వారు గమనించని విషయం ఒకటుంది. జన్మతః ఆ పురోహితుడికి కటువుగా మాట్లాడే అలవాటు ఉంది. ఆ ఒక్క విషయాన్ని వారు అంతగా గమనించలేక పోయారు. ఈ మాట కటువుతనంతోనే ద్రుపద పురోహితుడు విఫలుడై కౌరవ సభ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. దూతకు ఉండాల్సిన లక్షణాలను ఆంధ్ర భారతంలో తిక్కన స్పష్టంగా చెప్పాడు. కులశీలాలతో పాటు హిత వాక్యాలతో కార్యాన్ని సాధించగల దక్షుడే నిజమైన దూత అని ఆయన అంటాడు. కౌరవ, పాండవ సంగ్రామాన్ని తప్పించటానికి భారతంలో జరిగిన మూడు రాయబారాల్లో ద్రుపద పురోహితుడి రాయబారం కేవలం మాట వల్లనే చెడిపోయింది. ద్రుపద పురోహితుడు హస్తినకు వచ్చి ధ్రుతరాష్ట్రుడిని దర్శించాడు. కృప, ద్రోణ, విదుర, భీష్ముల మందిరాలకు వెళ్లి వారిని చూసి తగిన రీతిలో మాట్లాడాడు. ఆ తర్వాత దుర్యోధనుడిని కూడా దర్శించాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఓ రోజు సమయం చూసి తానొచ్చిన పనికి పూనుకున్నాడు. కురు సభలో ధ్రుతరాష్ట్రుడు, సమస్త సేనాపతులు, రాజ బంధువులు అంతా ఉన్న ఓ రోజున పురోహితుడు రాయబారాన్ని ప్రారంభించాడు.

సమస్త సేనాపతులను కలియజూసి తన ఉపన్యాసాన్ని ఇలా ప్రారంభించాడు. ‘జరిగిందంతా మీకందరికీ తెలిసిందే. కౌరవులు చెప్పిన వాటన్నిటినీ పాండవులు ఇప్పటివరకు చేస్తూనే వచ్చారు. కానీ దుర్యోధనుడు మోసంతో రాజ్యాన్ని పాండవుల దగ్గర నుంచి కాజేశాడు. ఆ తర్వాత పనులన్నిటికీ ఈ పెద్దరాజు తన సమ్మతిని తెలిపారు. దీన్నేమనాలి? నిండు కొలువులో ద్రౌపదిని అంతగా అవమానిస్తుంటే ఈ రాజు నోరు మెదపక కూర్చున్నాడు. ఇలాంటి కౌరవుల ప్రవర్తన, పాండవుల ప్రవర్తన గురించి ఇప్పుడు లోకానికంతటికీ తెలిసిందే. మాయజూదం ఆడి ధర్మ మార్గంలో ఉన్న పాండవులను మోసం చేయటం అధర్మానికి పరాకాష్ఠ. పాండవులకు సహాయంగా ఏడు అక్షౌహిణులు ఉన్నాయి. పాండవులలో భీముడు ఎంత సాహసికుడో లోకానికి తెలిసిందే. యుద్ధం జరిగితే పొట్టేలు కొండను ఢీ కొంటే ఏమవుతుందో కౌరవులకు అదే జరుగుతుంది. అర్జునుడి బలపరాక్రమాలు, పాండవుల పక్షాన ఉన్న శ్రీకృష్ణుడి రాజనీతిజ్ఞత అంత సామాన్యమైనవేం కాదు. అందువల్ల సమయం మించక ముందే మహాత్ములైన పాండునందనులను ప్రీతితో రప్పించి న్యాయంగా వారికి రావాల్సిన భూమిని వారికి ఇచ్చి మీరు సుఖించండి’ అని తన మాటలను ముగించాడు. దూతగా వెళ్లినవాడు ఎంతో నేర్పుగా, తన రాజు చెప్పింది చెప్పినట్లుగా, వక్రీకరించకుండా తన భావాలను వేటినీ ఆ మాటల్లో సమ్మిళితం చేయకుండా ఎదుటి పక్షం వారికి చెప్పాలి. ఇక్కడ ద్రుపద పురోహితుడు అలాకాక ఎదుటి వారి మనస్సు బాధపడేలా, సమస్య మరింత జటిలమయ్యేలా చేశాడు. తన ఉపన్యాస ప్రారంభంలోనే ద్యూత క్రీడను వారికి గుర్తుచేశాడు. వినమ్ర భావాన్ని కనబరచకుండా తన మనసుకు తోచిన భావాలను నిర్భయంగా పలికాడు. జరిగినదంతా తిరగదోడి సమయాన్ని వృధా చేశాడు. మీరు తప్పు చేశారని చెప్పటం దూత లక్షణం కానే కాదు. ఆ సమయాన పాండవుల బలపరాక్రమాలను చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని చెప్పి ఎదుటి పక్షం వారికి సంధి మీద ఆసక్తి లేకుండా చేశాడు. ఇవన్నీ ద్రుపద పురోహితుడి కఠిన వాక్కులతోనే ముడిపడి జరిగాయి. ఆయన అన్నీ తెలిసిన వాడే. కానీ ఆ చెప్పేదాన్ని కొంత మృదువుగా, సమయోచితంగా చెప్పి ఉంటే బాగుండేది. అలా జరగకపోబట్టే రాయబారం విఫలమైంది. నేటి సమాజంలో వివిధ చోట్ల చాలా మందికి దూతలతో అవసరం ఏర్పడుతుంటుంది. దూతను ఎన్నుకునేటప్పుడు ఎంత సంపన్నుడు, ఎంత చదువున్నవాడు అనే వాటిని గమనించడంతోపాటు, స్వతహాగా మృదువుగా మాట్లాడే తీరు ఉందా? లేదా? అని నిర్ధరించుకోవాలనే సందేశాన్ని ఇస్తుంది పంచమ వేదమైన భారతంలోని ఈ కథా సందర్భం.

-డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

అనుష్కలా పేరు తెచ్చుకుంటా!

ోడలింగ్‌లో రాణిస్తూ... వ్యాపార ప్రకటనల్లో మెరుస్తూ సినిమా పరిశ్రమ దృష్టినీ ఆకర్షిస్తుంటారు కొందరు భామలు. అలా కథానాయికలుగా అవకాశాల్ని అందుకొన్నవాళ్లు చాలా...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net