Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu


అన్నదానంతో నాకలోక సుఖం
నాక లోకమంటే స్వర్గలోకం. ఆ స్వర్గలోక సుఖాన్ని మరణానంతరం సులువుగా పొందే మార్గాన్ని శివమహాపురాణం ఉమాసంహిత పదకొండో అధ్యాయం వివరిస్తోంది. ఆకలిగొన్న మనిషికి కడుపారా ప్రేమతో అన్నం పెడితే చాలు, అనంతమైన స్వర్గలోక సౌఖ్యాలను చేజిక్కించుకోవచ్చు. దానాలన్నిటిలోకీ అన్నదానం ఎంతో గొప్పదని మహర్షులు ఏనాడో నిరూపించారు. ఈ అన్నదానం వెనువెంటనే ప్రీతిని, ఉల్లాసాన్ని కలిగించి బలాన్ని, బుద్ధిని వర్ధిల్ల చేస్తుంది. అన్నదానంతో సమానమైన దానం లేదు. ప్రాణులు అన్నం నుంచి పుడుతున్నాయి. అన్నం లేకపోతే ప్రాణులు మరణిస్తాయి. రక్తం, మాంసం, కొవ్వు, శుక్రం అనేవి దేహంలో అన్నం వల్ల వృద్ధి చెందుతాయి. శుక్రం పునరుత్పత్తి కారకం. ఆ శుక్రం అన్నం వల్ల కలుగుతోందంటే జగత్తంతా అన్నం మీదే ఆధారపడి ఉందన్న విషయం స్పష్టమవుతోంది. ఆకలిగొన్న వారికి బంగారం, రత్నాలు, గుర్రాలు, గొప్పగొప్ప ఏనుగులు, గంధం, ఇలాంటివి ఎన్నిచ్చినా వారు వాటిని అనుభవించలేరు. గర్భస్థ శిశువుకైనా, అప్పుడే పుట్టిన బిడ్డకైనా, పిల్లలు, పెద్దలు, మధ్య వయస్కులు, దేవతలు, దానవులు ఇలా ఒకరేమిటి అందరూ ముందుగా కోరుకొనేది ఆహారమే. ఆకలి విషయంలో ఓ విచిత్రముంది. అది అన్ని రోగాలలోకి పెద్దరోగం. అన్నం అనే ఔషధం లేపనంగా పెడితే తప్ప అది నశించదు. ఆకలితో సమానమైన దుఃఖం మరొకటి ఏదీ లేదు. ఆరోగ్యంతో సమానమైన సుఖం, కోపంతో సమానమైన శత్రువు లేకపోవటం విశేషం. అన్నదానం మహాపుణ్యప్రదమని అందరూ నిర్ధరించి చెబుతుంటారు. ప్రాణులన్నిటినీ ఆకలి అనే అగ్ని దహిస్తుంది. అది మరణాన్ని కూడా కలిగిస్తుంది. ఆ ఆకలిని పోగొట్టడం కోసం చేసే అన్నదానం ప్రాణదానంతో సమానం. ఒక వ్యక్తికి ప్రాణాలను ఇవ్వటమంటే సర్వస్వాన్ని ఇచ్చినట్లే లెక్క. ఒక మనిషి ఎవరి అన్నాన్ని తిని బలాన్ని పొంది పుణ్యం చేస్తాడో ఆ పుణ్యం సగం అన్నదాతకు, మరో సగం అన్న స్వీకర్తకు దక్కుతాయి. అన్నదానాన్ని చేసేవారు ముల్లోకాలలో ఏయే శ్రేష్ఠ వస్తువులు, భోగాలు ఉన్నాయో వాటిని ఇహపరలోకాలు రెండింటిలోనూ పొందుతారు. ధర్మార్థ కామ మోక్షాలను పొందటానికి దేహం ముఖ్య సాధనం. కనుక మనిషి తన దేహాన్ని అన్నపానాలతో రక్షించుకోవాలి. లోకాలన్నిటా అందరూ అన్నాన్ని కీర్తిస్తుంటారు. దానికి ప్రధాన కారణం సర్వం అన్నాన్ని ఆశ్రయించుకొని ఉండటమే. ఆత్మ శ్రేయస్సును కోరే మనిషి ఎలాగైనా సరే యాచకులకు, పండితులకు, మహాత్ములకు అన్నదానం చేస్తూ ఉండాలి. దుఃఖితుడైన పండితుడికి పెట్టిన అన్నం పరలోకానికి శ్రేష్ఠమైన నిధిని చేకూరుస్తుంది. గృహస్థుడు అలసి ఇంటికి వచ్చిన పండితులను పూజించి ప్రశాంత చిత్తంతో అన్నం పెడితే చాలు ఇహలోక సుఖాలతోపాటు అనంతమైన స్వర్గలోక సుఖాలు కూడా దక్కుతాయి. పిసినారితనం లేకుండా అన్నం పెట్టినందువల్ల తాను నష్టపోతున్నానని బాధపడకుండా అన్నదానం చేయాలి. అలా చేసిన అన్నదానమే పుణ్యఫలాన్ని ఇస్తుంది. పితరులను, దేవతలను, అతిథులను అన్నంతో సంతోషపెట్టడమే మహాపుణ్యం. కులం, మతం, వంశం, చదువు అనే వివరాలను అడగకుండా ఎలాంటి భేదాన్ని మనస్సులో పాటించకుండా అన్నదానం చేయాలి. అలా చేసిన వారికి తప్పనిసరిగా స్వర్గలోకంలో సర్వసుఖాలు లభిస్తాయి. అన్నం సాక్షాత్తూ బ్రహ్మ, విష్ణువు, శివుడు కూడా. అందుకే అన్నదానంతో సమానమైన దానం మరొకటి ఏదీ ఉండదని శివపురాణం వివరించి చెబుతోంది. ఈనాటికీ చాలా చోట్ల అందరూ అన్నదానం చేయటానికి ఉత్సాహపడుతుండటానికి వెనుక ఉన్న ప్రధాన కారణం ఇదే.
-డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ప్రేమలు మెరిసే.. తారలు మురిసే!

ప్రేమ ఓ అనీర్వచనీయమైన అనుభూతి. ప్రేమలో పడితేనే దాని మాధుర్యం ఏంటో తెలిసేది. నిజ జీవితాల్లోనే కాదు వెండితెరపైనా ప్రేమ అద్భుతమైన విజయాలు అందించింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net