Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu


ఆంజనేయ విజయం
ఆంజనేయస్వామి బలపరాక్రమాలకూ, విజయాలకూ మచ్చుతునకగా ఓ పెద్ద పర్వతమే కనిపిస్తుంది. ఆ పర్వతం పేరు విచిత్రంగా ఉంటుంది. దాని పేరు అరిష్ట పర్వతం. ఈ పర్వతం ఎక్కడుంది? దీని విశేషాలేమిటి? అనే విషయానికొస్తే హనుమంతుడి విజయగాథకూ, ఈ పర్వతానికీ ఓ గొప్ప సంబంధముందని రామాయణం సుందరకాండ యాభై ఆరో సర్గ వివరిస్తోంది. సీతమ్మ జాడ తెలుసుకుని ఆమెకు రాముడి విషయమంతా చెప్పి ఆమె నుంచి రాముడికి చూపడానికి ఆనవాలును కూడా తీసుకుని వెనుదిరిగాడు హనుమంతుడు. అలా చూసి వెనుదిరగడమే కాక లంకను అగ్నికి ఆహుతి చేసి మళ్ళీ సీతమ్మ దగ్గరకు వెళ్లి ఆమె క్షేమంగానే ఉందని తెలుసుకుని నమస్కరించి త్వరగా రాముడి దగ్గరకు చేరాలని బయలు దేరాడు. ఆ సందర్భంలోనే అరిష్టమనే పర్వతం ప్రసక్తి కనిపిస్తుంది. హనుమంతుడికి ఆసరాగా ఉండి ఆయన ఆకాశానికి ఎగిరేందుకు ఉపకరించింది ఈ పర్వతమే. అదేదో సాధారణమైన చిన్నపాటి కొండ మాత్రం కాదు. నల్లటి వనపంక్తులతో, ఎత్తైన వృక్షాలతో ఉన్న మహాగొప్ప పర్వతమది. ఆ పర్వత సౌందర్యానికి ఆనందిస్తూ ప్రేమాతిశయంతో సూర్యుడు తన కిరణాలతో స్పృశిస్తుంటాడు. సూర్యకిరణ స్పర్శతో పర్వతం మీద ఉన్న ధాతువులు మెల్లగా కళ్లు తెరుస్తూ మూస్తూ ఉన్నట్లుగా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ పర్వతం మీద నుంచి దూకే జలప్రవాహాల గంభీర ధ్వనులు వేదఘోషలా వినిపిస్తుంటాయి. అక్కడి సెలయేళ్ల వివిధ ధ్వనులు తాళ మృదంగాలతో సంగీతం ఆలపిస్తున్నట్లుగా ఉంటుంది. ఎంతో ఎత్తుకు ఎదిగిన దేవదారు వృక్షాలతో అలరారే ఆ పర్వతం చేతులు పైకెత్తి తపస్సు చేస్తూ ఉన్న మహర్షి మాదిరిగా దూరానికి కనిపిస్తుంది. గాలి తాకిడికి ఆ పర్వతం మీద ధ్వని చేస్తున్న వెదుళ్ళు పిల్లనగ్రోవులూదుతున్నట్లు సుస్వరాలు వినిపించాయి. భయంకరమైన విషసర్పాలతో ఆ పర్వతం కోపం వచ్చి బుసలు కొడుతున్నట్లు ఉంటుంది. ఎన్నెన్నో శిఖరాలతో, గుహలతో ఉన్న ఆ పర్వతపు శోభ నిరుపమానం. మద్ది, తాటి, ఇనుమద్ది చెట్లతోనూ, వాటికి అల్లుకున్న వివిధ లతలతోనూ సుందరంగా కనిపిస్తుంది. నేత్రపర్వంగా ఉండే ఆ పర్వతం మీద మహర్షులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, నాగులు నివసిస్తుంటారు. దాని గుహల్లో పులులు, సింహాలు ఉండడమేకాక ఆ పర్వతం అంతా రుచికరమైన పండ్లనిచ్చే చెట్లతోను, కందమూలాలతోనూ నిండి ఉంది. అలాంటి మహా సుందర పర్వతాన్నే తన తిరుగు ప్రయాణానికి ­తంగా ఎంచుకున్నాడు హనుమంతుడు. వెంటనే దాని మీదకు వెళ్ళి ­పుతో పైకి ఎగిరాడు. దాంతో కొండ శిఖరాలన్నీ మహాధ్వనులతో విరిగి పిండిపిండి అయ్యాయి. ఆ పర్వత శిఖరాలు, ఆ శిఖరాల మీద ఉన్న మహోన్నత వృక్షాలు మహాధ్వనులతో నేలమీద పడ్డాయి. హనుమంతుడి వేగానికి వజ్రాయుధపు దెబ్బతిన్నట్లు విరగబూసిన పూలతో ఉన్న చెట్లన్నీ నేలకూలాయి. గుహల్లోని పులులు, సింహాలు ఆకాశం బద్ధలయ్యేలా గర్జించాయి. అక్కడ విహరిస్తూ ఉన్న విద్యాధర కాంతలు భయపడి తటాలున ఆకాశానికి ఎగరటంతో వారి వస్త్రాలు జారి, ఆభరణాలు చెల్లాచెదురయ్యాయి. అక్కడున్న పెద్దపెద్దవి, మహాబలవంతమైనవి అయిన సర్పాలు తలలు, మెడలు నలిగిపోయి మంటలు మండుతున్న నాలుకలతో బయటకు వచ్చాయి. కిన్నెర, గంధర్వ, యక్ష, విద్యాధరులు అంతా ఆ పర్వతాన్ని వదిలి ఆకాశానికి ఎగిరారు. మహోన్నత వృక్షాలతో, శిఖరాలతోనూ ఉన్న ఆ పర్వతం సామాన్యమైనదేమీ కాదు. ముప్ఫై యోజనాల ఎత్తు, పది యోజనాల వెడల్పు ఉంది. అంతటి పర్వతం హనుమంతుడి పాదాల తాకిడికి నేలమట్టమైపోయింది. భవిష్యత్‌లో లంక వినాశనానికి అదో గుర్తుగా, హనుమంతుడి విజయానికి సంకేతంగా అరిష్టం అనే ఆ పర్వతం అలా నేలమట్టమైపోయింది. ఈ కథా సందర్భంలో హనుమంతుడి బలపరాక్రమాలతోపాటు వాల్మీకి మహర్షి కొండ, గుట్ట, చెట్టు, పుట్టలను ఎంత సుందరంగా వర్ణించాడో తెలుసుకోవటానికి వీలుకలుగుతుంది.
-డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

‘శ్రీరస్తు శుభమస్తు’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net