Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu


సూచనల సారాన్ని గ్రహించాలి
క్కోసారి కొన్ని విషయాల గురించి సూచన మాత్రంగా పెద్దలు చెబుతుంటారు. అదేమంత పెద్ద విషయం కాదని కొట్టిపారేయడం ఏమాత్రం సమంజసం కాదని నిరూపించే కథా సందర్భమిది. రామాయణం అరణ్యకాండలో ఇది కనిపిస్తుంది. సీతారామలక్ష్మణులు వనవాసానికి బయలుదేరి శరభంగమహర్షి ఆశ్రమానికి వచ్చారు. శరభంగుడు వారిని తగిన విధంగా ఆదరించి సుతీక్ష్ణుడి ఆశ్రమానికి వెళ్తే మరికొన్ని విషయాలు తెలుస్తాయని చెప్పాడు. శ్రీరాముడు ఆ రుషి దగ్గర సెలవు తీసుకొని సీతాలక్ష్మణులతో సుతీక్ష్ణుడి ఆశ్రమానికి చేరాడు. ఆ ఆశ్రమం ఓ పెద్ద కొండ మీద ఉంది. పరిసరాలన్నీ ప్రకృతి సౌందర్యంతో అలరారుతున్నాయి. ఎన్నెన్నో ఫలవృక్షాలు, మరెన్నో తియ్యని నీటితో నిండిన సరోవరాలు అక్కడ కనిపించాయి. ఆశ్రమం లోపలికి దృష్టి సారించాడు శ్రీరాముడు. మహాతపశ్శక్తి సంపన్నుడు, పరమ సాత్వికమూర్తి అయిన ఓ రుషి ధ్యానమగ్నుడై కనిపించాడు. సీతారామలక్ష్మణులు ఆశ్రమంలోకి వెళ్ళారు. ఆ సమయానికి మహర్షి ధ్యానాన్ని ముగించి మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. రాముడు ఆ మహర్షికి నమస్కరించి తానెవరో చెప్పి తనవారిని కూడా పరిచయం చేశాడు. మహర్షి శ్రీరాముడిని ఆపాదమస్తకం చూస్తూ ఆనందంతో పులకించిపోయాడు. తన జన్మ, తన తపస్సు ఈనాటికి ఫలించాయన్నాడు. శ్రీరాముడు చిత్రకూటానికి వచ్చిన విషయం తాను విన్నానని, రాముడిని చూడాలన్న కోరికతోనే తాను నిత్యం ఎదురు చూస్తున్నానని చెప్పాడు. సీతారామలక్ష్మణులకు తగిన ఆసనాలిచ్చి కూర్చోబెట్టి ఆ తర్వాత మరిన్ని విషయాలు రుషి వారికి వివరించి చెప్పాడు. తన తపస్సుకు మెచ్చి దేవేంద్రుడు అనేకసార్లు స్వర్గానికి ఆహ్వానించాడని, అయితే రామదర్శనాన్ని మించిన సుఖం స్వర్గంలో ఉండదనుకొని, ఇంద్రుడి ఆహ్వానాన్ని తిరస్కరించి రాముడి రాక కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. పట్టాభిషేకం భగ్నమైన విషయం కూడా తనకు తెలుసునని, ఇంద్రుడితో జరిపిన సంభాషణలోనే అదంతా తనకు అవగతమైందన్నాడు. అందుకే తాను రామదర్శనం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. సుతీక్ష్ణుడు అంతవరకూ మాట్లాడిన విషయాలన్నీ రాముడు ఎంతో ఆనందంగా విన్నాడు. ఆ తరువాత తాను ఎక్కడ ఆశ్రమం నిర్మించుకొని సీతాలక్ష్మణులతో ఉంటే బాగుంటుందో చెప్పమని ఆ రుషిని కోరాడు. అప్పుడు ఆ రుషి చిరునవ్వు నవ్వుతూ ‘ఈ పరిసరాల్లో ఎక్కడైనా సుఖంగానే ఉండవచ్చు. ఇక్కడ ఏ బాధా ఉండదు. ఏ మృగం ఇబ్బంది పెట్టదు. అయితే ఒక్క విషయం గమనించు. అప్పుడప్పుడూ ఇక్కడకు కొన్ని లేళ్లు వచ్చి ఏ మాత్రం భయం లేకుండా సంచరిస్తూ మాలాంటి వాళ్ళను కూడా ప్రలోభ పెడుతూ ఉంటాయి. అంతకంటే ఇక్కడ నీకు ఎదురయ్యే బాధ ఏదీ ఉండదు’ అని సూచనప్రాయంగా అన్నాడు రుషి. రాముడు ఆ మాటను తేలికగా తీసుకొని లేళ్ళ వల్ల తనకేమీ భయం లేదని, తన దగ్గర మంచి ధనుస్సు, బాణాలు ఉన్నాయి కనుక అలాంటిదేమైనా జరిగితే వాటిని సంహరించేస్తానని అన్నాడు. ఆ మాటలు విన్న రుషి మరి మాట్లాడలేదు. అప్పటికే సాయం సమయమైంది. సాయంసంధ్యా విధుల కోసం రుషి, రాముడు ఇద్దరూ సంధ్యావందన విధులు ఆచరించేందుకు వెళ్ళిపోయారు. ఆ రాత్రికి సుతీక్ష్ణమహర్షి సీతారామలక్ష్మణులకు మధురమైన ఫలాలను ఆహారంగా ఇచ్చాడు. తరువాత అంతా నిద్రకు ఉపక్రమించారు. మరుసటి ఉదయం రుషి దగ్గర సెలవు తీసుకుని ఆశ్రమ నిర్మాణానికి తగిన ప్రదేశం చూసేందుకు రాముడు సీతాలక్ష్మణులతో కలసి ముందుకు సాగిపోయాడు. సుతీక్ష్ణ మహర్షి మాయలేడి గురించి ముందుగానే శ్రీరాముడికి సూచన చేశాడు. కానీ రాముడు ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. చాలా సందర్భాలలో ఇలాగే జరుగుతుంటుంది. కొన్ని కొన్ని అతి కీలకమైన అంశాలు సూచన మాత్రంగానే తెలుస్తుంటాయి. ఆ దానిదేముందిలే అని వదిలేస్తే ప్రమాదం ఎదురవుతుంది. అలాకాక ప్రతి విషయాన్నీ సునిశితంగా పరిశీలిస్తూ, దానికి తగినట్లు ప్రవర్తిస్తూపోతే ప్రమాదాల బారిన పడకుండా తప్పించుకునేందుకు వీలు కలుగుతుంది. రుషి చెప్పినప్పుడే రాముడు సందేహించి మాయలేళ్ళు ఆ వనంలో ఎందుకు తిరుగుతుంటాయి? అవి ఏమిటి? అని పూర్తిగా రుషినడిగి తెలుసుకొని ఉంటే ఇబ్బందులు ఎదురయ్యేవి కావు. అక్కడ రామాయణ కథ జరగాలి కనుక శ్రీరాముడు ఆ విషయాన్ని ఆనాడు అంతగా పట్టించుకొని ఉండకపోవచ్చు. ఇలాంటి కథలు విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు మానవాళి కొంత చైతన్యం పొందాల్సి ఉంటుంది. ఆ లక్ష్యం కోసమే మన పురాణాలు, ఇతిహాసాలలోని ఇలాంటి కథలు ఉన్నట్లుగా తోస్తుంది. ఏ విషయాన్నీ తేలిగ్గా కొట్టిపారేయకుండా, జాగ్రత్తగా పరిశీలించి భవిష్యత్‌లో సమస్యలు రాకుండా చూసుకోవటం మంచిదనే అంతరార్థాన్ని రామ, సుతీక్ష్ణ సంభాషణ ద్వారా తెలుసుకోవచ్చు.
-డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ప్రేమలు మెరిసే.. తారలు మురిసే!

ప్రేమ ఓ అనీర్వచనీయమైన అనుభూతి. ప్రేమలో పడితేనే దాని మాధుర్యం ఏంటో తెలిసేది. నిజ జీవితాల్లోనే కాదు వెండితెరపైనా ప్రేమ అద్భుతమైన విజయాలు అందించింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net