Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu


సూర్యుడే సర్వాత్మకుడు
జీవరాశులన్నింటికీ సూర్యుడే ఆత్మ. సూర్యభగవానుడే ఆకాశం, దిక్కులు, స్వర్గ నరకాలు, మోక్షాల్ని నిర్దేశిస్తాడు. దేవతలు, మనుషులు, జంతువులు, సర్పాలు, పక్షులు, గడ్డిపోచలు, తీగలు, పొదలు... ఒకటేమిటి అన్నింటా ఆయనే ఆత్మ. ఈ విశేషాల్ని భాగవతం ఐదో స్కంధం రెండో ఆశ్వాసంలో పరీక్షిత్తుకు శుకయోగీంద్రుడు వివరించి చెప్పాడు. కాల విభాగానికీ ఆ సూర్యభగవానుడే మూలం. బ్రహ్మాండం మధ్యలో ప్రకాశించే రవి తన వెలుగుతో, వేడిమితో ముల్లోకాలనూ ప్రకాశింప చేస్తుంటాడు. ఆయనకు ఉత్తరాయణం, దక్షిణాయనం, విషువత్తు అనే మూడు గమనాలు ఉన్నాయి. ఉత్తరాయణంలో గమనం మందకొడిగా, దక్షిణాయనంలో తీవ్రంగా, విషువత్తులో సమానంగా ఉంటుంది. ఈ మూడు గమనాలనూ అనుసరించి ఆరోహణ, అవరోహణ, సమస్థానాల్లో రాత్రింబవళ్ళు దీర్ఘంగా, హ్రస్వంగా, సమానాలుగా మారుతూ ఉంటాయి. ఈ మార్పుల్ని సూరీడు వివిధ రాశుల్లో సంచరిస్తున్నప్పుడు గమనించవచ్చు. సూర్యుడు మేషరాశిలోనూ, తులారాశిలోనూ సంచరిస్తున్నప్పుడు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య... ఈ ఐదు రాశుల్లో సంచరించే సమయంలో ఒక్కొక్క గడియ ప్రకారం రాత్రి కాలం తగ్గుతూ వస్తుంది. పగటి కాలం పెరుగుతుంటుంది. వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం... రాశుల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క గడియ ప్రకారం రాత్రి పెరుగుతుంటుంది. పగటి కాలం తగ్గిపోతుంది. ఈ ప్రకారంగా అహోరాత్రులను ఉత్తరాయణ, దక్షిణాయనాల్లో పెంచుతూ తగ్గిస్తూ ఒక్క దినంలో తొమ్మిదికోట్ల యాభై ఒక్కలక్షల యోజనాల పరిమాణం కలిగిన దూరంలో మానసోత్తర పర్వతం నలువైపులా సూర్య రథం తిరుగుతుంటుంది. ఈ మానసోత్తర పర్వతానికి తూర్పుదిక్కున దేవధాని అనే ఇంద్రుడి పట్టణం, దక్షిణాన సంయమని అనే యముడి పట్టణం, పశ్చిమంలో నిమ్లోచని అనే వరుణుడి పట్టణం, ఉత్తరంలో విభావరి అనే సోముడి పట్టణం ఉన్నాయి. ఈ నాలుగు పట్టణాల్లోనూ సూర్యుడు క్రమంగా ఉదయం, మధ్యాహ్నం, అస్తమయం, అర్ధరాత్రం, అనే నాలుగు భేదాల్ని కల్పిస్తుంటాడు. ఈ ఉదయాదులు అక్కడి జీవుల ఉత్పత్తి నివృత్తులకు కారణాలవుతూ ఉంటాయి. సూర్యుడు ఇంద్రనగరం నుంచి యమ నగరానికి పయనించటానికి పదిహేను గడియల కాలం పడుతుంది. ఆ కాలంలో రెండుకోట్ల ముప్పై ఏడు లక్షల డెబ్బై ఐదువేల యోజనాల దూరం సూర్యుడి ప్రయాణం సాగుతుంది. యమనగరానికి అక్కడి నుంచి వరుణ, సోమ నగరాలకు ఇలాగే ఆయన ప్రయాణం సాగుతుంది. ఆ తర్వాత చంద్రాది గ్రహాలతో, నక్షత్రాలతో సంచరిస్తాడు సూర్యుడు. పన్నెండు ఆకులు, ఆరు కమ్ములు, మూడు కుండలు కలిగి ఏక చక్రంతో కూడి సంవత్సరాత్మకమైన సూర్యుడి రథం ఒక ముహూర్త కాలంలో ముఫ్పై నాలుగు లక్షల ఎనిమిది వందల యోజనాల దూరం ప్రయాణం చేస్తుంది. సూర్య రథానికి ఒక ఇరుసు, దానికి ఒకవైపు మేరు పర్వతం, రెండోవైపున మానసోత్తర పర్వతం ఉంటాయి. ఆ రెండు వైపులా వాయుపాశాలతో గట్టిగా బిగించి ఉంటాయి. ఈ రెండు పర్వతాలు భూమి రెండు ధ్రువాలకు అంటి ఉన్నాయి. అలాంటి సూర్య రథానికి ఒక కాడి అమర్చి ఉంటుంది. దాని పొడవు ముప్పై ఆరు లక్షల యోజనాలు. ఆ కాడి సూర్య రథానికి కట్టిన సప్తాశ్వాల మెడలపైన మోపి ఉంటుంది. గాయత్రీ, బృహస్పతి, ఉష్ణిక్‌, జగతి, త్రిష్టుప్‌, అనుష్టుప్‌, పంక్తి అనే ఏడు ఛందస్సులే సూర్య రథానికి పూన్చి ఉండే సప్తాశ్వాలు. ఆ రథానికి అరుణుడు రథసారథి. ఈ సప్తాశ్వరథారూడుడైన సూర్యభగవానుడే సర్వ జీవుల్లోనూ అంతరాత్మగా ఉంటాడని భాగవతం వివరించి చెబుతోంది.

ఈ కథా సందర్భంలో సూర్య గ్రహ సంబంధమైన విజ్ఞానాన్ని గురించి ఆ నాటి రుషులు ఎంత పరిశోధన చేశారో తెలుపుతుంది. భూగ్రహం, సూర్యమండలం లాంటి ఇతర మండలాల వైశాల్యాలు, చుట్టుకొలతలు, ఒక గ్రహానికి మరో గ్రహానికి మధ్య ఉన్న దూరం ఇలాంటివన్నీ ఇక్కడ ప్రస్తావితమయ్యాయి. ఈ అంచనాలను నేటి ఆధునిక ఖగోళ విజ్ఞానమూ అంగీకరిస్తోంది. దీన్నిబట్టి మన పూర్వీకుల మేథాసంపత్తి ఎంతటిదో గ్రహించుకోవచ్చు.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

వెండితెరపై కోట్ల ‘కాంతి’

సినిమా అనేది కచ్చితంగా వ్యాపారమే. ఏ కథానాయకుడికి ఎంత మార్కెట్‌ ఉంది? అనే లెక్కలు ఎప్పుడూ అవసరమే. పెట్టిన ప్రతీపైసాకీ గ్యారెంటీ ఉందన్న నమ్మకం కుదిరిన...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net