Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu


శాంతం లేకుంటే సౌఖ్యం లేదు!
ప్రతి మనిషీ శాంతంగా మెలగడం ఎంతో అవసరం. శాంతం లేకపోతే సౌఖ్యం లేనేలేదు. జన్మజన్మలకూ లేనేలేదు. ఒక్కసారి అశాంతికి గురైతే ఆ అశాంతి మనసును విరిచేస్తుంది. విచక్షణను కోల్పోయేలా చేస్తుంది. ఎదురుగా ఉన్న వారు పెద్దవారా? చిన్నవారా? వారంటున్న మాటల్లో ఆంతర్యమేమిటి? అనే ఆలోచన లేకుండా దురుసుగా మాట్లాడి ఆ పెద్దల కోపానికి గురయ్యే పరిస్థితి వస్తుంది. మానవ జీవితంలో తటస్థించే స్థితిని తెలియజేస్తుంది ఈ కథ.

శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాముడి భార్య పేరు రేవతి. ఆమె పూర్వజన్మలో జ్యోతిష్మతి అనే పేరుతో ఉండేది. శ్రీకృష్ణుడికి కలిగిన సంతానం తామరతంపరగా వృద్ధి చెందింది. అయితే కృష్ణుడి సోదరుడైన బలరాముడికి సంతానం ఎందుకు కలగలేదు? అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. ఇలాంటి సందేహాలకు, జ్యోతిష్మతి రేవతిగా అవతరించటానికి గల కారణాల గురించి తెలియజెప్పే ఈ కథా సందర్భం గర్గసంహిత బలభద్రఖండం మూడో అధ్యాయంలో కనిపిస్తుంది.

పూర్వం చాక్షుష మనువు యజ్ఞం చేసిన సందర్భంగా జ్యోతిష్మతి అనే కన్య ఉద్భవించింది. ఆమెకు తగిన వరుడిని వెతకాలని మనువు నిర్ణయించుకున్నాడు. ముందుగా ఎలాంటి వరుడు కావాలో చెప్పమని ఆమెనే అడిగాడు. అప్పుడు జ్యోతిష్మతి అందరికంటే బలవంతుడు, సత్యం చెప్పేవాడు కావాలని అంది. వెంటనే చాక్షుష మనువు ఇంద్రుడు, వాయువు లాంటి దేవతలందరినీ పిలిచి దేవతలలో ఎవరు బలవంతుడో చెప్పమన్నాడు. అప్పుడు అంతా కలసి సంకర్షణ భగవానుడు ఒక్కడే జ్యోతిష్మతికి తగినవాడని చెప్పారు. ఆ దేవుడు అనంతగుణ సంపన్నుడు, వాసుదేవరూపుడు, సహస్రముఖధారి, కోటిసూర్య ప్రకాశమానుడు, తన శిరస్సున భూమండలాన్ని ధరించి మోస్తున్న శక్తిసంపన్నుడు అని కూడా సంకర్షణుడిని గురించి దేవతలు వివరించి చెప్పారు. అంతటి శక్తిసంపన్నుడైన దేవుడు పతిగా లభించటానికి తపస్సు చేయటమే మేలని భావించి జ్యోతిష్మతి వెంటనే తన తండ్రి ఆజ్ఞ తీసుకొని వింద్యాద్రికి వెళ్ళి తపస్సు ప్రారంభించింది. అలా ఆమె తపస్సులో ఉన్నపుడు ఓ రోజు ఇంద్ర, యమ, కుబేర, అగ్ని, వరుణ, సూర్య చంద్రాదులు ఏదో పనిమీద అటుగా వెళ్తూ తపస్సు చేస్తున్న జ్యోతిష్మతిని చూశారు. ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె ఎవరో, ఏమిటోనన్న విషయం తెలుసుకొన్నారు. సంకర్షణుడు కన్నా మేమే అందగాళ్ళం, తమలో ఎవరో ఒకరిని వివాహమాడమని వారంతా అన్నారు. ఆమె మరొక్కసారి గట్టిగా తాను సంకర్షణుడిని తప్ప వేరొకరిని వివాహమాడనని అంది. అయినా దేవతలంతా తమ గొప్పతనాలను ఒక్కొక్కరుగా వరుస క్రమంలో వివరించి చెప్పి ఇంత శక్తి సంపన్నులం కనుక తమలో ఎవరో ఒకరిని వివాహమాడవచ్చు కదా అని మళ్ళీ మళ్ళీ అన్నారు.

అంత కఠోర తపస్సు చేస్తున్న జ్యోతిష్మతికి ఉండాల్సిన శాంతం ఉండకుండా పోయింది. అహంకారం కూడా మితిమీరింది. వెంటనే ఆ దేవతలందరికీ ఒక్కోసారి ఒక్కో విధమైన శాపం పెట్టింది. అలా శాపాలపాలైన ఆ దేవతలంతా బాధపడుతూ ఉన్నారు. వారిలో దేవరాజైన ఇంద్రుడు మాత్రం ­రుకోక ఆమెకు మళ్ళీ ప్రతిశాపం ఇచ్చాడు. తామంతా వచ్చి సాధారణ రీతిలో అడిగినప్పటికీ శాంతంతో తిరస్కరించాల్సిందిపోయి క్రోధంతో స్థాయి మరచి శపించటం మంచిది కాదన్నాడు. అందుకే తన శాపం ప్రకారం సంకర్షణుని పతిగా పొందినప్పటికీ ఆమెకు సంతానం కలగదని కటువుగా పలికి ఇంద్రుడు ఇతర దేవతలతో కలసి వెళ్ళిపోయాడు.

మళ్ళీ జ్యోతిష్మతి తపస్సుకు ఉపక్రమించింది. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. తనకు కావాల్సిన వరాన్ని అడిగింది. బ్రహ్మ ఆమెకు సంకర్షణుడు పతిగా అయ్యేలా అనుగ్రహించాడు. అనంతకాలంలో ఆమె ఆనర్తదేశ రాజు రేవతుడికి పుత్రికగా జన్మించి రేవతి అనే పేరున పెరిగింది. ఆ రేవతినే సంకర్షణ అవతార రూపుడైన బలరాముడు వివాహం చేసుకొన్నాడు. జ్యోతిష్మతి జన్మజన్మల కోరిక ఇలా నెరవేరింది. ఈ కథాంశంలో జ్యోతిష్మతి రేవతిగా ఉద్భవించి తనకిష్టమైన పతిని పొందితే పొందవచ్చునేమో కానీ ఆమె కోపం ఆమెకు నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆనాడు జ్యోతిష్మతిగా ఉన్నప్పుడు ఇంద్రుడి శాపం కారణంగా బలరామ, రేవతులకు సంతానం కలగకుండా పోయింది. శాంతం వీడి కోపాన్ని అవలంబిస్తే ఎప్పటికైనా నష్టమేనన్న ఓ అంతరార్థం ఈ కథలో దాగి ఉంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ఎన్టీఆర్‌ ‘దండయాత్ర’కు ఏడాది..!

‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం.. అదే ఒక్కడు మీదడిపోతే.. దండయాత్ర.. ఇది దయా గాడి దండయాత్ర’. పవర్‌ఫుల్‌ డైలాగులతో ఎన్టీఆర్‌ తెలుగు సినీ సెల్యులాయిడ్‌పై చేసిన దండయాత్రకు ఫిబ్రవరి 13తో ఏడాది పూర్తైంది. ‘వన్‌ ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net