Sat, February 06, 2016

Type in English and Give Space to Convert to Telugu


అరటిచెట్టు... ఆశీర్వచనం
నకు సంప్రదాయకంగా వస్తూ ఉన్న వ్రతాలలో స్త్రీలకు మరీ మరీ మేలు చేసే ఓ వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని చేస్తే ఎంచక్కా అరటిచెట్టు ఆశీర్వచనం పొంది వ్రతం చేసిన స్త్రీ భర్తతో కలకాలం హాయిగా కలిసుండే అదృష్టం లభిస్తుందంటున్నాయి వ్రత గ్రంథాలు. ఆ వ్రతం పేరు రంభావ్రతం. సంస్కృతంలో రంభ అనే పదానికి అరటి అనే అర్థం ఉంది. అరటి పండును రంభాఫలం అని అంటారు. రంభావ్రతాన్ని జ్యేష్ఠమాసంలో శుద్ధ తదియనాడు చేస్తారు. సంప్రదాయాన్ని బాగా పాటించేవారు జ్యేష్ఠ శుద్ధ తదియ నుంచి ఆషాఢ శుద్ధ తదియ వరకు నెల రోజులపాటు నిష్ఠతో ఈ వ్రతాన్ని చేయటం కనిపిస్తుంది. రంభావ్రతం పార్వతీదేవి వైవాహిక జీవిత కథతో ముడిపడి ఉండటం విశేషం. సాక్షాత్తూ జగజ్జనని అయిన పార్వతీదేవి ఈ వ్రతాన్ని చేసి జగత్తుకంతటికీ తండ్రి అయిన శివుడిని భర్తగా పొందిందని వ్రత కథ చెబుతోంది. పూర్వం ఓసారి శివుడు కఠోర తపస్సుకు ఉపక్రమించాడు. ఆ శివుడికి పరిచర్యలు చేయటం కోసం హిమవంతుడు తన కుమార్తె అయిన పార్వతిని నియమించాడు. ఇంతలో దేవకార్య సిద్ధికోసం ఇంద్రాది దేవతల ఆజ్ఞ మేరకు మన్మథుడు శివుడి మీదకు తన బాణాలను సంధించాడు. శివుడికి చిత్తం చెదిరింది. క్షణకాలం అయిన తర్వాత శివుడు తన మనోవికారానికి కారణం ఏమిటా అని తెలుసుకొన్నాడు. వెంటనే దానికి కారణం మన్మథుడే అని తెలిసి తన మూడో కన్నును తెరిచి మన్మథుడిని భస్మం చేసి శివుడక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పార్వతి తన తల్లి దగ్గరకొచ్చి బాధపడింది. తల్లి ఆమెను హిమవంతుడి దగ్గరకు తీసుకెళ్ళింది. ఆ తల్లిదండ్రులు పార్వతికి ఇష్ఠుడైన శివుడు పార్వతిని పెళ్ళాడనందుకు వ్యథ చెందసాగారు. అదే సమయంలో ఆ పర్వతరాజును చూడాలని సప్తరుషులక్కడి కొచ్చారు. హిమాలయుడు తన కుమార్తె సంగతి వారికి వివరించాడు. అప్పుడు సప్తరుషులలో ఉన్న భృగువు పార్వతికి కోరుకున్న భర్త దక్కాలంటే ఓ మంచి వ్రతం చెయ్యాల్సి ఉంటుందని అన్నాడు. ఆ వ్రతాన్ని చేస్తే శివుడు పార్వతిని వివాహమాడి తీరుతాడని, ఆ వ్రతం పేరే రంభావ్రతమని అన్నాడు. జ్యేష్ఠశుద్ధ తదియ నాడు ఆ వ్రతాన్ని చేయాలని చెప్పాడు. ఉదయాన్నే స్నానం చేసి ఒక అరటిచెట్టు పాదు దగ్గర అలికి పంచవన్నెల ముగ్గులు అలంకరించాలి. అరటి చెట్టుకు అలా అలంకారం చేసి పూజలు చేయటం వల్ల సావిత్రీ దేవత కరుణిస్తుంది. అరటి చెట్టుకు అధిష్ఠాన దేవత సావిత్రీదేవి అని భృగుమహర్షి చెబుతున్నప్పుడు సావిత్రీ దేవత అంటే ఎవరో వివరంగా చెప్పమని భృగువును అడిగింది పార్వతి. అప్పుడు భృగువు ఇలా చెప్పటం ప్రారంభించాడు. బ్రహ్మదేవుడికి సావిత్రి, గాయత్రి అని ఇద్దరు భార్యలు ఉండేవారు. సావిత్రి తానందగత్తెనని గర్వపడుతూ రంభను నిరాదరించసాగింది. దాంతో బ్రహ్మకు కోపం వచ్చి భూలోకంలో విత్తనాలు లేని చెట్టువై పుట్టమని ఆమెను శపించాడు. ఆ శాపానికి భయపడి శాపాంతం చెప్పమని బ్రహ్మను ప్రార్థించింది సావిత్రి. తన శాపానికి తిరుగులేదని సావిత్రి భూలోకానికి వెళ్ళాల్సిందేనని అన్నాడు బ్రహ్మదేవుడు. ఆ శాపం ప్రకారం సావిత్రీదేవి భూలోకానికొచ్చి విత్తనాలు లేని అరటిచెట్టై మొలిచి అప్పటి నుంచి బ్రహ్మను గురించి తపస్సు చేసింది. ఆ తపస్సు బ్రహ్మనెంతో సంతోషపెట్టింది. జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు బ్రహ్మ సావిత్రికి ప్రత్యక్షమై ఆమెను అనుగ్రహించాడు. ఆ నాటి నుంచి సావిత్రికి సంబంధించిన ఒక అంశ అరటి చెట్టును ఆశ్రయించుకొని ఉంటుందని, ఆ చెట్టును పూజించేవారికి కోరిన కోర్కెలు తీరుతాయని చెప్పి సావిత్రీదేవిని తీసుకొని బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయాడు. అరటిచెట్టును ప్రధానంగా స్త్రీలు వ్రతం చేసి పూజిస్తే కోరిన భర్తను పొందుతారని భృగువు పార్వతికి చెప్పాడు. రంభావ్రతం చేసేవారు అరటి చెట్టుకింద అలికి ముగ్గులుపెట్టి రసవంతమైన పిండివంటలను నైవేద్యం పెట్టాలి. ఆ అరటి చెట్టు నీడన పద్మాసనం వేసుకొని సాయంకాలం వరకూ సావిత్రీదేవికి సంబంధించిన స్తోత్రాన్ని చదవాలి. రాత్రికి జాగరణ చేయాలి. ఇక ఆ మరునాటి నుంచి రాత్రి పూట జాగరణ మానేసి కేవలం పగటిపూట అరటిచెట్టు కింద కూర్చొని సావిత్రీ స్తోత్రం చేస్తూ రాత్రికి అదే చెట్టు కింద విశ్రమించాలి. ఇలా నెల రోజులపాటు చేసి అరటిచెట్టు కింద అమర్చిన మంటపాన్ని, పిండి వంటలను అన్యోన్యంగా ఉండే దంపతులకు దానం ఇవ్వాలి అని భృగుమహర్షి పార్వతికి చెప్పాడు. ఈ రంభావ్రతం చేశాకే పార్వతిని శివుడు పెళ్ళాడాడు. జ్యేష్ఠ శుద్ధ తదియ నుంచి ఆషాఢశుద్ధ తదియ దాకా నెల రోజులపాటు అరటిచెట్టు కింద ఉండటం ఆరోగ్యప్రదమని అనుభవజ్ఞులు చెబుతున్నారు. అరటిచెట్టు ఇచ్చే ఆశీర్వచనం వల్ల అతివలకు కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్త జనావళి విశ్వసిస్తోంది.
- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

బల్గేరియాలో శివాయ్‌

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శివాయ్‌’. ఈ చిత్ర షూటింగ్‌ బల్గేరియాలో శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net