Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu


ఇలా నడుచుకోవాలి...
న పురాణాలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ పనికొచ్చే హితాన్ని బోధిస్తున్నాయి. ఎవరికి కావాల్సిన బోధనల్ని వారు ఆ పురాణాల నుంచి పొందవచ్చు. చిరుద్యోగి నుంచి దేశాధినేత వరకూ ఎవరు ఎప్పుడు ఎలా నడుచుకోవాలో తెలియజెప్పే కథాసందర్భాలు పలు పురాణాల్లో ఉన్నా వాటి కంటే మరికొంత ఎక్కువగా విష్ణుధర్మోత్తర మహాపురాణం ద్వితీయ ఖండం ఇరవై అయిదో అధ్యాయం అనుజీవులకు(ఉద్యోగులకు) పనికొచ్చే విషయాల్ని ఇలావివరిస్తోంది...

పూర్వం రాచరికపు వ్యవస్థ ఉండేది. రాజును కేంద్ర బిందువుగా చేసుకొని ఆయన వద్ద పనిచేసే ఉద్యోగులు ఇలా నడుచుకోవటం మేలు అని చెప్పింది విష్ణుధర్మోత్తర పురాణం. ఆ విషయాల్ని ప్రస్తుతం ఉద్యోగులంతా అన్వయించుకొనేలా కనిపిస్తాయి. ఆనాటి రాజు స్థానంలో ప్రతి ఉద్యోగీ తన పైఅధికారిని వూహించుకొని వారి ముందు ఎలా మెలగాలో ఈ కథా సందర్భం ద్వారా గ్రహించుకోవచ్చు. రాజాజ్ఞను, పై అధికారి చెప్పిన పనిని ఏ విధంగానైనా సరే తన శక్తికొద్దీ నెరవేర్చాలి. అతడి మాట కాదని ఎన్నడూ మాట్లాడకూడదు. పది మందిలో ఆయనకు అనుకూలంగా మాట్లాడాలి. ఏకాంతంగా పై వారితో కలిసే సందర్భం వచ్చినప్పుడు వారికి హితమైనదే చెప్పాలి. రాజు ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే ఇతరుల ప్రయోజనానికి అవసరమైన వాటిని చెప్పాలి. తనకు సంబంధించిన విషయాల్ని తానుగా కాక మిత్రుల చేత చెప్పించాలి. రాజు ఇచ్చిన ధనాన్ని, గౌరవాన్ని తిరస్కరించి ఆయనకు బాధ కలిగించ కూడదు. రాజు వేషం, ఆయన పలికిన పలుకులు, చేష్టల్ని కిందిస్థాయి ఉద్యోగులు అనుసరించకూడదు. రాజు అనుభవించిన విలాసాల్ని తాను అనుభవించకూడదు. రాజుతో సమానమైన ఆహార్యాన్ని ధరించకూడదు. జూదం లాంటి క్రీడల్లో తప్ప మరెక్కడా ఆయన ముందు తన నేర్పరితనాన్ని ప్రదర్శించకూడదు. అంతఃపురాధ్యక్షులు, ధనాధ్యక్షులు, శత్రువుల నుంచి వచ్చిన వారు, రాజు నిరాదరణను పొందిన దూతల్ని రాజాజ్ఞ లేకుండా కలవకూడదు. రాజు తనమీద చూపిన అయిష్టతను, అవమానాన్ని రహస్యంగా ఉంచాలి తప్ప పదిమందికీ చెప్పకూడదు. పాలకుడికి సంబంధించిన రహస్యాల్ని బహిర్గతం చేయకూడదు. ఏకాంతంలో రాజు తనకు చెప్పిన రహస్యాతి రహస్యాల్ని ఇతరులెవరికీ వినిపించకూడదు. ఇలా ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తించే వారే రాజుకు ఇష్టులుగా ఉండగలుగుతారు. రాజు ఎప్పుడెప్పుడు ఆజ్ఞ ఇస్తాడా, ఆ ఆజ్ఞను తాను ఎంత త్వరగా నిర్వర్తించాలా అన్నట్టు నిరంతరం బాధ్యతల్లో ఉద్యోగులు సంసిద్ధులుగా ఉండాలి. ఎల్లప్పుడూ అదేపనిగా రాజాజ్ఞ కోసం ఆయన ముందు నిలిచి ఉండకూడదు. పని స్థాయిని బట్టి మాత్రమే ఇలా చేయాలి. ఎల్లవేళలా ఇలాగే తొందరపాటుతో ఉన్నా పైవారి ముందు ఆ వ్యక్తి తేలికైపోతాడు. రాజుకు ప్రియమైన విషయాల్ని చెప్పటం మంచిదే. వాటినే పదేపదే ఎక్కువగా చెబుతూ కూర్చోవాలనుకోవటం మంచిది కాదు. రాజు దగ్గర హాస్యాలాడటం, ముఖం చిట్లించుకొని కూర్చోవటం రెండూ మంచిది కాదు. ఎక్కువగా మాట్లాడటం, అసలు పలకకుండా కూర్చోవటమూ శ్రేయస్కరం కాదు. సమయం సందర్భాల్ని సరి చూసుకుంటూ తగిన విధంగా మాట్లాడుతూ నగుమోముతో ఉండాలి. రాజు మీద మాత్సర్యంతో ఉండటం, ఆయన చేసే చెడు పనుల్ని లెక్కిస్తూ ఉండటం మంచిది కాదు. పాలకుడు ఇచ్చిన వస్త్రం, పత్రం, అలంకారాల వంటి వాటిని ధరిస్తూ ఉండాలి. అంతేకానీ వాటిని ఔదార్యంతో ఇంకొకరికి ఇవ్వకూడదు. రాజుకంటే ముందుగా భోజనం చేయటం, పడుకోవటం చేయకూడదు. అనుమతి లేకుండా ఎన్నడూ ఆయన దగ్గరకు వెళ్ళకూడదు. రాజుకు కుడి, ఎడమ వైపుల్లో తగిన ప్రదేశం చూసుకొని కూర్చుంటూ ఉండాలి. అంతేకానీ రాజుకు ఎదురుగా కానీ, వెనుకగా కానీ కూర్చోవటం మంచిది కాదు. నడిచేటప్పుడూ ఇలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి. ఆవులించటం, చీదటం, కామం, కోపంతో ప్రవర్తించటం, మంచం మీద కూర్చోవటం, కిరీటం లాంటి రాజుకు సంబంధించిన వస్తువుల్ని ధరించటం, అపాన వాయువును విడవటం, బ్రేవ్‌మంటూ త్రేపటం లాంటివి రాజుముందు ఎప్పుడూ చేయకూడదు. కిందిస్థాయి ఉద్యోగి తన గుణాల్ని తాను గొప్పగా ఎప్పుడూ చెప్పుకోకూడదు. ఒకవేళ అవి రాజుకు తెలియాలని అనుకొన్నప్పుడు ఇతరుల చేత వాటిని చెప్పించాలి. పై వారిమీద భక్తి, ఉద్యోగం మీద శ్రద్ధతో ఉద్యోగులు నిత్యం ప్రవర్తిస్తుండాలి. మొండితనం, ఉబలాటం, పిశాచత్వం, లోభం, నాసిక్యం, దీనత్వం, చాపల్యం అనే గుణాలు ఉద్యోగికి పనికిరావు. చేస్తున్న పనిలో నేర్పరితనాన్ని పెంచుకొంటూ ముందుకు సాగే వారు పైవారికి ఎప్పుడూ ఇష్టమైన వారుగా ఉంటారు. అని విష్ణు ధర్మోత్తర పురాణం అనుజీవుల(ఉద్యోగుల) ప్రవర్తనకు సంబంధించిన విషయాల్ని వివరించింది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

మణిరత్నం వీరాభిమానిని!

హను రాఘవపూడి... తీసింది ‘అందాల రాక్షసి’ ఒక్కటే. దాని చుట్టూ బోలెడు కామెంట్లు.. కాంప్లిమెంట్లు. ‘మణిరత్నం ప్రభావం కుర్రాడిపై చాలా ఎక్కువ ఉంది’ అనుకొన్నారు చాలామంది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net