Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu


యోగశాయి - వారణాసి
వారణాసి పవిత్ర పుణ్యక్షేత్రం. అక్కడ అడుగుపెడితే చాలా పాపాలన్నీ నశించి పుణ్యం సమకూరుతుంది. దానికి కారణం ఏమిటి? అలా ఎవరికైనా పాప ప్రక్షాళన జరిగిందా? అక్కడున్న రెండు నదులు ఎలా ఏర్పడ్డాయి?... అనే విషయాల్ని వివరించే ఈ కథా సందర్భం వామన మహాపురాణం మూడో అధ్యాయంలో ఉంది.

పూర్వం బ్రహ్మకు, శివుడికి అహంకారం ఆవరించిన కారణంగా వివాదం తలెత్తింది. ఆ వివాదంలో కోపోద్రిక్తుడైన శివుడు తన ఎడమచేతి కొనగోటితో బ్రహ్మ ఐదో తలను తుంచివేశాడు. ఆ వెంటనే శివుడిని బ్రహ్మహత్యాపాపం ఆవరించింది. కాటుక కొండ లాంటి భయంకరాకారంతో, ఎర్రటి వెంట్రుకలతో కనిపించిన బ్రహ్మహత్యను చూసి శివుడు నీవెవరు? అని అడిగాడు. నేను బ్రహ్మహత్యను అంటూ ఆ భీకరాకృతి ముక్కంటి దేహంలో ప్రవేశించింది. వెనువెంటనే ఆయన దేహమంతా కంపించిపోతూ మంటలు చెలరేగాయి. దాంతో పాటుగా గరళకంఠుడు తుంచిన బ్రహ్మ ఐదో తల ఆయన ఎడమచేతికి అంటుకుపోయి ఎంత విదిల్చినా వూడిపోలేదు. బ్రహ్మహత్యా పాపంవల్ల తన దేహంలో చెలరేగిన మంటల్ని చల్లార్చుకోవటానికి యమునానది దగ్గరకు వెళ్ళాడు శివుడు. ఆ నది ఎండిపోయి కనిపించింది. అక్కడి నుంచి ప్లక్షజా నది దగ్గరకు వెళ్ళాడు. అదీ ఎండిపోయింది. నిత్యం పవిత్ర జలాలతో కళకళలాడే ఆ నదులు శివుడిలో బ్రహ్మహత్యాపాపం ఉన్నందువల్ల అక్కడి నుంచి మాయమయ్యాయి. అలా చాలా కాలంపాటు తిరిగి తిరిగి చివరకు ఎలాగో ఒకలాగా ధర్మారణ్య, నైమిశారణ్యాల్లో ఉన్న తీర్థాల్లో శివుడు స్నానం చేశాడు. అనేక తీరుల్లో యోగాభ్యాసాలు చేశాడు. ఎన్ని చేసినా ఆయన దేహం చల్లబడలేదు. చివరకు కురుజాంగల భూమిని చేరి అక్కడున్న శ్రీ మహావిష్ణువును దర్శించి, స్తుతించి తన విషయమంతా చెప్పాడు.

అప్పుడు ఆ శ్రీహరి శివుడికి బ్రహ్మహత్యానివారకం, శుభకరం అయిన ఓ విషయాన్ని గురించి వివరించాడు. వెంటనే ప్రయాగ క్షేత్రం దగ్గరకు వెళ్లాలని, అక్కడ తన అంశవల్ల జన్మించిన యోగశాయి నిత్యం నివసిస్తుంటాడని అన్నాడు. ఆ యోగశాయి కుడిపాదం నుంచి సర్వపాపనాశిని, శుభదాయిని అయిన వరణా నది, ఎడమపాదం నుంచి అసి అనే నది పూర్వం ఏర్పడ్డాయని, ఆ రెండు నదులు లోకపూజ్యాలు, పవిత్రాలు అని చెప్పాడు శ్రీహరి. ఆ నదులకు మధ్య ఉన్న యోగశాయి క్షేత్రం సర్వపాపాల్నీ పోగొట్టే పవిత్ర తీర్థమని అక్కడే మంగళకరమైన వారణాసి నగరం ఏర్పడి ఉందని చెప్పాడు శ్రీమహావిష్ణువు మహేశ్వరుడికి. విశిష్టమైన వారణాసి పుణ్యక్షేత్రంలో సర్వపాపహరుడైన యోగార్కదేవుడు, అక్కడికి సమీపంలోనిదే అయిన దశాశ్వమేధ క్షేత్రంలో తన అంశతో కేశవుడు ఉన్నాడని కనుక అక్కడి తీర్థాల్లో స్నానం చేసి బ్రహ్మహత్యా పాపాన్ని పోగొట్టుకోమని త్రినేత్రుడికి గరుడ వాహనుడు వివరించి చెప్పాడు. మహేశ్వరుడు వెంటనే వారణాసికి వెళ్ళి అక్కడున్న తీర్థాల్లో స్నానమాడి దశాశ్వమేధంలో ఉన్న లోలార్కభగవానుడిని దర్శించాడు. అలా చేయగానే శివుడి నుంచి బ్రహ్మహత్య తొలగిపోయింది. ఆయన ఎడమచేతికి అంటుకొని ఉన్న బ్రహ్మకపాలం మాత్రం అలాగే ఉండిపోయింది. అప్పుడు రుద్రుడు ఆ కపాలాన్ని కూడా వదిలించుకునే ఉపాయాన్ని చెప్పాలని విష్ణువును అడిగాడు. అప్పుడాయన తన ఎదుటనే ఉన్న దివ్యసరోవరాన్ని చూపి అందులో స్నానం చేయాలని ఆ వెంటనే చేతికి ఉన్న కపాలం విడిపోతుందని చెప్పాడు. ఆ నాటి నుంచి ఆ సరస్సుకు కపాలమోచన క్షేత్రమని, శివుడికి కపాలి అనే పేరూ వస్తుందని మహాదేవుడితో మహావిష్ణువు అన్నాడు. రుద్రుడు వైకుంఠుడి మాటలను అనుసరించి సరస్సులో స్నానం చేశాడు. వెంటనే కపాలమోచనం జరిగింది. విష్ణువు అన్నట్టుగానే ఆ రోజు నుంచి ఆ క్షేత్రానికి కపాలమోచన క్షేత్రమని, శివుడికి కపాలి అనే పేరు స్థిరపడ్డాయని వామన పురాణంలోని ఈ కథా సందర్భం వివరిస్తోంది. ఈ కథాంశంలో వరణ, అసి అనే రెండు నదులు యోగశాయి పాదాల నుంచి ఉద్భవించాయని, ఆ రెండు నదుల నడుమ ఉండే ప్రదేశం వారణాసిగా ప్రసిద్ధికెక్కిందని స్పష్టమవుతోంది. వారణాసి అన్నా, వారాణసి అన్నా సమానార్థకాలే. ఆ పదాల్ని స్మరిస్తే పాపాలు నశిస్తాయనటానికి కారణాన్ని ఈ కథ ఇలా వివరించింది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

‘ముఠామేస్త్రీ’ రానా

నటుడు దగ్గుబాటి రానా ముఠామేస్త్రీ అయ్యారు. మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా ప్రసారం కానున్న ‘మేముసైతం’ .........

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net