Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu


భగవత్‌ పాలన
ప్రపంచంలో చీమ మొదలు బ్రహ్మ వరకూ అందరినీ పాలించేందుకు శ్రీ మహావిష్ణువు ఒక పాలనా వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కొన్ని సమూహాలకు కొందరిని పాలకులుగా నియమించాడు. ఈ పాలనా వికేంద్రీకరణ వల్ల ధర్మరక్షణ సులభతరం కావాలన్నదే భగవానుడి అసలు లక్ష్యం. మనచుట్టూ ఉండే దిక్కులకు, అంతటా కనిపించే జీవులకు పాలకులు ఉన్నారు. ఆ పాలనావ్యవస్థ ఎంతో విస్తృతమైంది. అందులో కొందరు ప్రధాన పాలకులు ఎవరెవరిని పర్యవేక్షిస్తుంటారనే విషయాన్ని వివరించే కథా సందర్భం ఇది. హరివంశ పురాణం పృథు చరిత్ర నాలుగో అధ్యాయంలో ఈ విషయం కనిపిస్తుంది.

శ్రీమహావిష్ణువు వేనుడి కుమారుడైన పృథు మహారాజును స్థూలంగా ప్రాణులన్నింటికీ రాజుగా నియమించాడు. బ్రహ్మదేవుడు ఆ పృథువును రాజుగా పట్టాభిషిక్తుడిని చేశాడు. అనంతరం విశాల విశ్వంలోని కొన్ని సమూహాలకు మరికొంతమంది పాలకులు నియుక్తులయ్యారు. తొలిగా బ్రాహ్మణులకు, తీగలున్న చెట్లకు, నక్షత్రాలకు, గ్రహాలకు, యజ్ఞాలకు, తపస్సులకు చంద్రుడు రాజుగా నియమితుడయ్యాడు. భృగు వంశంలో పుట్టిన వారందరికీ శుక్రాచార్యుడు, సూర్య వంశంలో పుట్టిన వారందరికీ విష్ణువు అధిపతులయ్యారు. వసువులకు అగ్నిదేవుడు, ప్రజాపతులకు దక్షుడు, మరుత్తులకు ఇంద్రుడు పాలకులుగా బాధ్యతల్ని స్వీకరించారు. రాక్షసులకు ప్రహ్లాదుడు, పితృదేవతలకు యముడు, మాతృకలకు, వ్రతాలకు, మంత్రాలకు, గోవులకు, యక్షులకు, సాధ్యులకు అధిపతిగా విష్ణువు ఉండేలా పాలనా వ్యవస్థ ఏర్పడింది. రుద్రులకు, సమస్త భూత పిశాచాలకు శివుడు అధిపతి. పర్వతాలకు హిమవంతుడు, నదులకు సముద్రుడు, అన్ని వాసనలకు, వాయువులకు, శబ్దానికి, ఆకాశానికి వాయుదేవుడు నేతగా బాధ్యతలు స్వీకరించాడు. ప్రత్యేకంగా గంధర్వులకు చిత్రరథుడు రాజయ్యాడు. సర్పాలకు వాసుకి, ఏనుగులకు ఐరావతం, గుర్రాలకు ఉచ్చైశ్రవం, పక్షులకు గరుడుడు, క్రూర జంతువులకు పెద్దపులి పాలకులయ్యారు. ఆవులకు, ఎద్దులకు ఆబోతు, వనస్పతులకు జువ్విచెట్టు, సముద్రాలకు, నదులకు, మేఘాలకు పర్జన్యుడు ఆధిపత్యాన్ని వహించాడు. కోరలున్న ప్రాణులకు శేషుడు, అప్సరసలకు మన్మథుడు, రుతు, మాస, పక్ష, దిన, రాత్రి, ముహూర్త, తిథి, పర్వ, కలా, కాష్ఠ, ప్రమాణాలకు, ఉత్తరాయణ దక్షిణాయాలకు, గణితానికి, యోగానికి సంవత్సరుడు ప్రభువయ్యాడు. ఈ విభాగాలన్నింటికీ బృహస్పతి అధిపతిగా ఉండి పర్యవేక్షిస్తుంటాడు. పృథు చక్రవర్తి పట్టాభిషేకం జరిగాక ఈ వ్యవస్థంతా ఏర్పడింది. తూర్పు దిక్కుకు సుధనుడు, దక్షిణ దిక్కుకు శంఖపదుడు, పడమట దిక్కుకు కేతుమంతుడు, ఉత్తర దిక్కుకు హిరణ్యరోముడు రాజులుగా అయ్యారు. వీరంతా భూమి మీద ధర్మపాలన సాగేందుకు నియమితులయ్యారని హరివంశపురాణం ఇలా వివరిస్తోంది. దైవపరంగా ఇలా సృష్టిలోని ప్రతి చిన్నజీవి మీదా వారికి సంబంధించిన కొందరు పాలకులు ఆధిపత్యాన్ని వహిస్తుండటం విశేషం. మానవాళి చేసే పనుల్నీ ఈ పాలకులంతా గమనిస్తూనే ఉంటారు. ధర్మం తప్పి ప్రవర్తించినప్పుడు ఆయా రాజుల దృష్టిలో పడుతుంటారు. మనం చేసే పనులను ఎవరు చూడొచ్చారులే అని అనుకోవటానికి వీలు లేదు. ఆస్తిక లోకంలో అడుగడుగునా భగవానుడు నియమించిన పాలకులు ఏ విభాగానికి ఆ విభాగాన్ని పర్యవేక్షిస్తుంటారు. కనుక తప్పుచేసి వారి కంటపడటం, పాపపు చిట్టాల్లోకి ఎక్కడం శ్రేయస్కరం కాదని హెచ్చరిస్తుంటుంది ఈ కథా సందర్భం. ఇంతటి విశాల విశ్వాన్ని ఇలాంటి ఎందరెందరో రాజులను నియమించి జగన్నాయకుడైన ఆ స్వామి తన పాలనను సాగిస్తుంటాడన్న విషయాన్ని ఈ కథా సందర్భం వివరిస్తోంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ఎన్టీఆర్‌ ‘దండయాత్ర’కు ఏడాది..!

‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం.. అదే ఒక్కడు మీదడిపోతే.. దండయాత్ర.. ఇది దయా గాడి దండయాత్ర’. పవర్‌ఫుల్‌ డైలాగులతో ఎన్టీఆర్‌ తెలుగు సినీ సెల్యులాయిడ్‌పై చేసిన దండయాత్రకు ఫిబ్రవరి 13తో ఏడాది పూర్తైంది. ‘వన్‌ ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net