Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu


పెద్దలే జాగ్రత్తపడాలి
పెద్దలు ఎలా ప్రవర్తిస్తున్నారో చూసి పిల్లలు ఆ పనులను అనుకరిస్తుంటారు. అవి మంచి పనులైతే ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ చెడుపనులైతే మాత్రం కచ్చితంగా పిల్లల జీవితాల మీద పెను ప్రభావాన్ని చూపి, ఆ జీవితాలను నాశనం చేస్తాయి. ఇది ఈనాడు అందరూ ఒప్పుకొనే సామాజిక సత్యమే. కుటుంబంలో తండ్రి బాహాటంగా దురలవాట్లతో నడుచుకొంటుంటే అది చూసి పాడైపోయిన పిల్లలు ఎందరో. అందుకని పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు, ఇతర పెద్దలు చాలా జాగురూకతతో ఉండాలి. దీన్ని సమర్థిస్తూ పద్మమహాపురాణం భూమిఖండం ముప్ఫయ్యో అధ్యాయంలో ఓ కథ కనిపిస్తుంది. ఇది మరెవరి పరంగానో చెప్పిన కథ కాదు. సాక్షాత్తూ మృత్యుదేవతకు, ఆయన కుమార్తెకు సంబంధించిన కథ. మృత్యువు దుష్టబుద్ధితో ఉన్న పాపాత్ములకు శాసకుడు. ఆయన కాలరూపుడిగా ఉంటాడు. జీవుల పాపకర్మలకు తగ్గట్టుగా ఎవరెవరిని ఎంతెంత ఘోరంగా హింసించాలో అంత హింసిస్తుంటాడు. అది ఆయన ధర్మమే అయినా ఎక్కడో దూరంగా కాకుండా తన కుటుంబసభ్యుల ముందే పాపులను బాధిస్తూ ఉండేవాడు. ఆ మృత్యువుకు సునీధ అనే ఓ కుమార్తె ఉంది. తండ్రి దగ్గర చనువు కొద్దీ ఆయనతో ఎక్కువసేపు ఆ సునీధ ఉంటూ ఉండేది. దాంతో తండ్రిలాగా తానూ ఇతరులను ఎవరినైనా హింసిస్తే బాగుండునన్న ఒక పైశాచిక ఆనందపుటాలోచన ఆమె మనసులో పేరుకు పోయింది. సునీధ ఓ రోజు తన స్నేహితురాళ్ళతో కలసి పరిసరాలలో ఉన్న ఓ వనానికి వెళ్ళింది. అక్క ఓ సుశంఖుడు అనే గంధర్వుడు తన దారిన తాను తపస్సు చేసుకొంటూ ఉండటం ఆమె కంటపడింది. సుశంఖుడు ఆమె వంక కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. అయినా ఆమె మనస్సులో ఏ నాటి నుంచో పేరుకుపోయి ఉన్న హింసాపూరిత ఆలోచనలు బయటకొచ్చాయి. సుశంఖుడి తపస్సును అనేక రకాలుగా చెడగొడుతూ ఉండేది. చాలా రోజులపాటు సుశంఖుడు ఏమీ అనకుండా చిన్నపిల్ల కదా అని శాంతంగా ఉండిపోయాడు. కానీ ఓ నాడు మృత్యుకుమార్తె మరింత భీకరంగా హింసించటంతో ఆ గంధర్వుడు ‘అసలు నువ్వెవరు? ఎందుకిలా చేస్తున్నావు?’ అని గద్దించి అడిగాడు. అప్పుడు ఆమె ఏ మాత్రం తొణక్కుండా తాను మృత్యుదేవుడి కుమార్తెనని, తన తండ్రి తన కన్నా ఘోరంగా ఎంతో మందిని కొడుతూ ఉంటాడని చెప్పింది. సుశంఖుడు ఎంతగా ఆమెకు మంచి మాటలు చెప్పి ఆమె మనస్సును మరల్చాలని చూసినా ఆమె మారలేదు. దాంతో క్రోధం ముంచుకొచ్చిన ఆ గంధర్వుడు అన్ని విధాలా దుర్మార్గుడు, పాపకార్యాల మీద ఆసక్తి కలవాడితో నీకు వివాహం అవుతుందని, పుట్టే సంతానం కూడా అలాంటి వారే పుడతారని శపించి తన దోవన తాను తపస్సు చేసుకోసాగాడు.

సునీధ ఇంటికొచ్చి తన తండ్రికి జరిగిందంతా చెప్పి, అదేమిటి నీవు ఇంతమందిని హింసిస్తుంటే ఏ ఒక్కరూ నిన్ను శపించలేదు. మరి అతడెవరో నన్ను ఇంత ఘోరంగా శపించాడు. కారణమేమిటని అడిగింది. మృత్యువుకు తాను చేసిన తప్పేమిటో అప్పటికి తెలిసొచ్చింది. ఎన్నో విధాలుగా ఆమెకు ఆ క్షణాన ధర్మాన్ని గురించి, ధర్మాత్ములను గురించి వివరించాడు. పుణ్యాత్ములనూ, ధర్మాత్ములనూ తానెప్పుడూ హింసించటం లేదని, తన చేతిలో దెబ్బలు తినే వారంతా పాపాత్ములేనని అన్నాడు. అలా అప్పుడాయన తన కుమార్తెకు ఎన్ని విషయాలు చెప్పినా ఫలితం శూన్యమే అయింది. సుశంఖుడి శాపం తప్పించుకోవటానికి వీలుపడనిదే అయింది. ఇలా ఈ కథలో ఈనాటికి కూడా పనికొచ్చే ఓ సామాజిక సందేశం మనకు కనిపిస్తుంది. పాపాత్ములను హింసించటం, మృత్యువు బాధ్యత అయితే అయి ఉండవచ్చు. అంతటి హింసను చిన్నపిల్లైనా తన కుమార్తె చూస్తోందని, అది ఆమెకు శ్రేయస్కరం కాదని ఆయన భావించి ఉంటే భీకరమైన శాపానికి ఆమె గురై ఉండేది కాదు. కనుక పెద్దలు పిల్లల ముందు ఎంతో జాగ్రత్తగా మసలుకోవటం భవిష్యత్తరాలకు మంచిది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

అనుక్షణం ఉత్కంఠగా... ‘క్షణం’

అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగే కథనంతో తెరకెక్కిన చిత్రం ‘క్షణం’. పీవీపీ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి రవికాంత్‌....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net