Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu


సర్వలోక పూజితుడు... శివుడు
కల దేవతలు, రుషులు, చక్రవర్తులు... ఇలా అందరూ ఆరాధించే దైవం శర్వుడు. ఆ శివుడు ఆజ్ఞాపిస్తేనే జగత్తంతా చైతన్యం అవుతుంది. శివాజ్ఞకు లోబడే అంతా జరుగుతుంటుంది... అని చాలా మంది అంటుంటారు. దానికి గల కారణమేమిటో తెలుపుతోంది శివమహాపురాణంలోని కోటిరుద్ర సంహిత ముప్పై ఏడో అధ్యాయం.

రాజులు, రుషులేకాదు దేవతలూ దేవదేవుడైన శివుడిని ఆరాధిస్తుంటారు. విష్ణువు లక్ష్మితో కూడి శివుడిని పూజించి తనకు కావాల్సిన కోర్కెల్ని తీర్చుకుంటుంటాడు. ముక్కంటిని అర్చించి బ్రహ్మ సృష్టి చేస్తుంటాడు. బ్రహ్మమానస పుత్రులైన సనక సనందాది మహర్షులు, ఇతర మహర్షులూ శివుడిని పూజిస్తుంటారు. వశిష్టుడు తదితర సప్త రుషులూ శివారాధన చేసేవారే. పతివ్రతలైన అరుంధతి, లోపాముద్ర, అహల్య శివానుగ్రహం పొందుతుంటారు. దూర్వాసుడు, కౌశికుడు, శక్తి, దధీచి, గౌతముడు, కణాదుడు, భార్గవుడు, బృహస్పతి, వైశంపాయనుడు శివపూజకులే. పరాశరుడు, వ్యాసుడూ శివనిష్ఠగలవారే. ఉపమన్యుడు శివపరమాత్మకు మహాభక్తుడు. యాజ్ఞవల్క్యుడు, జైమిని, గర్గుడు, శుకశౌనకాదులు శంకర పూజాతత్పరులే. దేవమాత అయిన అదితి నిత్యం పరమ ప్రేమతో పార్థివ శివలింగపూజను చేస్తుంది. ఆమెతోపాటు ఇంద్రుడి భార్య శచీదేవి ఆ పూజలో పాల్గొంటుంది. ఇంద్రుడు, లోకపాలకులు, వసువులు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు శివపూజా తత్పరులే. గంధర్వులు, కిన్నెరులు లాంటి వారే కాక రాక్షసులూ శివుడిని పూజించటం విశేషం. హిరణ్యకశిపుడు తన సోదరులతోనూ, పుత్రులతోనూ కలిసి మహాదేవుని పూజించాడు. విరోచనుడు, బలిచక్రవర్తి కూడా అలా చేసిన వారే. బాణుడు అనే అసురుడు మహాశైవుడని కీర్తిపొందాడు. హిరణ్యాక్షుడి కుమారులు, వృషపర్వుడు, ఇతర దానవులూ శివపూజకులే. శేషుడు, వాసుకి, తక్షకుడు లాంటి మహాసర్పాలే కాక గరుడుడి లాంటి గొప్పగొప్ప పక్షిరాజులూ శివభక్తులే. భూలోకంలో తమ తమ వంశాల్ని ప్రవర్తిల్ల చేసిన సూర్యచంద్రులు, ఆయా వంశాల్లోని వారంతా నిత్యం శివుడిని పూజించారు. స్వాయంభువ మనువు లాంటి మనువులంతా కూడా శివ వేషాల్ని ధరించి విశేషంగా పూజను చేశారు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, వారి కుమారులు, వారి వంశాల్లోని రాజులూ శివుడిని పూజించారు. ధ్రువుడు, రుషభుడు, భరతుడు, భరతుడి సోదరులైన తొమ్మిది మంది మహాయోగులూ గరళకంఠుని అర్చించిన వారే. వైవశ్వతుడు, తార్‌క్ష్యుడు, ఇక్ష్వాకువు తదితర రాజులు సర్వకాలాల్లోనూ శివుడిని నిష్ఠతో పూజించి శుభాల్ని అనుభవించారు. కకుత్సుడు, మాంధాత, సగరుడు, ముచుకుందుడు, హరిశ్చంద్రుడు, కల్మాషపాదుడు లాంటి చక్రవర్తులు గొప్ప శివభక్తులు. భగీరథుడు లాంటి అనేక మహారాజులు శివవేషాల్ని దాల్చి శివపూజను చేసేవారు. దేవతలకు సహాయం చేసిన ఖట్వాంగ మహారాజు యథావిధిగా పార్థివ శివలింగాన్ని పూజించాడు. దిలీప మహారాజు, ఆయన కుమారుడైన రఘు మహారాజు గొప్ప శివభక్తులు. రఘు వంశంలోని అజుడు, శ్రీరామచంద్రుడి తండ్రి అయిన దశరథ మహారాజు శివపూజను చేసిన వారే. వశిష్ట మహర్షి ఆజ్ఞతో దశరథుడు పుత్ర సంతానం కోసం పార్థివ శివలింగాన్ని విశేష శ్రద్ధతో ఆరాధించాడు. దశరథుడి భార్య కౌసల్య రుష్యశృంగుడి ఆదేశంతో శంకరుడి పార్ధివ మూర్తిని పుత్ర సంతానం కోసం పూజించింది. ఆమెతోపాటు సుమిత్ర, కైకేయి శివుడిని పూజించారు. శివానుగ్రహం వల్లనే శుభకార్యాల్ని చేసేవారు. గొప్పగొప్ప ప్రతాపం గలవారు, వీరులు, సన్మార్గంలో ప్రీతికలవారు అయిన పుత్రుల్ని వీరంతా పొందారు. శైవాగమ నియమాల్ని పాటిస్తూ వారు, వారి తర్వాతి తరాలవారు కూడా పార్థివ శివలింగాల్ని పూజించారు. సుద్యుమ్న మహారాజు అపరాధం చేసిన కారణంగా శివ శాపంతో స్త్రీ రూపాన్ని పొందాడు. ఆ తర్వాత మళ్లీ పార్థివ శివలింగాన్ని పూజించి శివ కృపతో పురుషుడయ్యాడు. ఒక నెల పురుషుడుగా, మరొక నెల స్త్రీగా ఉంటూ శివపూజ చేసి శాపాన్ని పూర్తిగా తొలగింప చేసుకొని పురుషుడిగా శాశ్వతంగా మిగిలిపోయాడు ఆ రాజు. ఆ తర్వాత వచ్చిన పురూరవుడు, భరతుడు తదితర రాజులు శివపూజ చేశారు. శంకరుడి అనుగ్రహం చేతనే శ్రీకృష్ణుడు తామర తంపరగా పుత్ర సంతానాన్ని పొందాడు. ఇలా సర్వులు శర్వారాధకులే నని ఈ కథా సందర్భం పేర్కొంటోంది.

-డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

‘బాహుబలి’ ఈ యేడాదే?!

‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన అద్భుతం ఇంకా కళ్లముందు కదులుతూనే ఉంది. ఇప్పుడు అందరి దృష్టీ ‘బాహుబలి 2’పైనే. ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net