చెబితే వినలా, ధర తక్కువని పెట్రోలుకు బదులు విమాన ఇంధనం వేయించాడు!
latestnews
కారు ప్రమాదమే దారి మార్చింది!
ఇటీవల విడుదలైన ఆర్థిక ఫలితాల్లో ఇన్ఫోసిస్‌ అంచనాలకు మించి లాభాలను అందుకుంది. ఒక్కసారిగా ఆ సంస్థ విలువ పదివేల ఆరొందల కోట్ల మేర పెరిగింది. ఆ ఘనతంతా సీయీవో విశాల్‌ సిక్కాకే దక్కుతుందంటారు ఆర్థిక నిపుణులు. ఆయన బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నరలో ఉద్యోగుల వలస తగ్గింది. ఆదాయం భారీగా పెరిగింది. సంస్థ ఆస్తులూ, షేర్ల ధరలూ, ఉద్యోగుల జీవన ప్రమాణాలూ... అన్నింట్లోనూ అభివృద్ధే. ఆ మార్పులకు కారణమైన విశాల్‌ అందరు విజేతల్లానే అంచెలంచెలుగా ఎదిగారు.
ప్రమాదాలు చాలామందికి చెడే చేస్తాయేమో, నాకు మాత్రం ఓ ప్రమాదం మంచే చేసింది’... అమెరికాలో రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డ సంఘటనను గుర్తు చేస్తూ విశాల్‌ సిక్కా అన్న మాటలివి. ఓరోజు కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లినప్పుడు విశాల్‌ కారు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. కారులో భద్రతా ప్రమాణాలు ఎక్కువగా ఉండటంతో ఓ మోస్తరు గాయాలతో బయటపడ్డారు. కానీ ‘నేను చనిపోయుంటే ఏంటి పరిస్థితి. ప్రజలు నన్ను గుర్తుపెట్టుకునేంతలా ఏం సాధించాను’ అన్న ఆలోచనలు విశాల్‌ను కలవరపెట్టాయి. అప్పట్నుంచీ స్వేచ్ఛగా జీవించడం, ప్రతి క్షణాన్నీ ఆస్వాదించడం, కొత్తదారిలో అడుగులు వేయడం మొదలుపెట్టారు. ఆ అడుగులే ఇన్ఫోసిస్‌లో అత్యున్నత స్థానం దాకా తీసుకొచ్చాయి.

* విశాల్‌ తండ్రి సాధారణ రైల్వే ఉద్యోగి. తల్లి టీచర్‌. తండ్రి ఉద్యోగ రీత్యా ఆయన మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో పెరిగారు. గుజరాత్‌లో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చేస్తున్న సమయంలోనే అమెరికాలోని సైరాక్యూస్‌ యూనివర్సిటీలో సీటొచ్చింది. దాంతో ఇక్కడి చదువు మధ్యలోనే ఆపి, అమెరికా వెళ్లి కంప్యూటర్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు.

* డిగ్రీ చదువుతోన్న సమయంలో విశాల్‌ ప్రతిభ చూసి ప్రొఫెసర్లు అక్కడే పీహెచ్‌డీ చేయమని సలహా ఇచ్చారు. చిన్నప్పట్నుంచీ టెక్నాలజీ అంటే ఇష్టపడే విశాల్‌ ‘కృత్రిమ మేధస్సు’ అనే క్లిష్టమైన అంశాన్ని ఎంచుకుని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్‌ అందుకున్నారు.

* చదువుకునే రోజుల్లోనే విశాల్‌ భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు పరికరాలు రూపొందించే ప్రయోగాలు చేసేవారు. కాలేజీలో వివిధ సందర్భాల్లో అతడు ప్రదర్శించిన నమూనాలు జెరాక్స్‌ సంస్థ యాజమాన్యం దృష్టికి వెళ్లాయి. ప్రోత్సాహం ఉంటే అద్భుతాలు చేయగలడనిపించి విశాల్‌కి తమ పరిశోధనా విభాగంలో అవకాశం కల్పించింది. క్రమంగా పరిశోధనా బృందానికి నాయకుడిగా ఎదిగిన విశాల్‌ జెరాక్స్‌ సంస్థ నుంచి ఎన్నో ఉత్పత్తులు ప్రాణం పోసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. కొన్నాళ్లకు సొంతంగా కంపెనీ ప్రారంభించే ఉద్దేశంతో అక్కడ రాజీనామా చేసి బయటికొచ్చారు.

* ‘ఐ బ్రెయిన్‌’ పేరుతో ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల అభివృద్ధి కోసం పనిచేసే ఓ సంస్థను విశాల్‌ మొదలుపెట్టారు. దాన్ని కొన్నాళ్లకే ‘ప్యాటర్న్‌ ఆర్‌ఎక్స్‌’ అనే సంస్థ సొంతం చేసుకుంది. ఆ తరవాత స్థాపించిన ‘బోధా’ అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థనూ ‘పెరెగ్రైన్‌’ అనే కంపెనీ కొనుగోలు చేసింది. నాయకుడిగా, సాఫ్ట్‌వేర్‌ సృష్టికర్తగా దూసుకెళ్తొన్న విశాల్‌ తమ దగ్గరుంటే బావుంటుందని ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్‌ సంస్థ ‘శాప్‌’ భారీ మొత్తం చెల్లించి తమ పరిశోధనా విభాగంలోకి ఆహ్వానించింది.

* శాప్‌లో ఉండగా ‘టైంలెస్‌ సాఫ్ట్‌వేర్‌’ను కనిపెట్టి సాఫ్ట్‌వేర్‌ ప్రపంచంలో ఓ కొత్త అధ్యాయానికి విశాల్‌ తెరతీశారు. దాని ద్వారా వినియోగదారుల సేవలకు ఆటంకం కలగకుండానే అన్ని సాఫ్ట్‌వేర్లనూ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయొచ్చు. అతడి సామర్థ్యానికి గుర్తింపుగా ‘చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌’ అనే ఓ కొత్త స్థానాన్ని శాప్‌ సృష్టించింది.

* ‘హానా’... మార్కెట్లో విశాల్‌ విలువతో పాటు శాప్‌ సంస్థ ముఖచిత్రాన్నే మార్చేసిన సాఫ్ట్‌వేర్‌ ఇది. విశాల్‌ తయారు చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఇంటర్నెట్‌లోని లక్షల కిలోబైట్ల సమాచారాన్ని వేగంగా జల్లెడపట్టి కావాల్సిన దాన్ని మాత్రమే ముందుకు తీసుకురావొచ్చు. కేవలం ఆ సాఫ్ట్‌వేర్‌ అమ్మకాల ద్వారా శాప్‌ ఆరువేల కోట్ల రూపాయలను సంపాదించి రికార్డు సృష్టించింది. ఆ తరవాత కొన్నాళ్లు శాప్‌ కార్యవర్గ సభ్యుల్లోనూ ఒకడిగా పనిచేసిన విశాల్‌, వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసి పన్నెండేళ్ల శాప్‌ ప్రయాణాన్ని ముగించారు.

* ‘గతంలో నారాయణమూర్తి నన్ను కలిసినప్పుడు ఓ చిన్న పజిల్‌ ఇచ్చి పరిష్కరించమన్నారు. దాన్ని నేను సులువుగానే చేయగలిగా. కానీ తొలి పరిచయంలోనే నన్ను ఆయన అంచనా వేయడానికి ప్రయత్నించిన తీరు నచ్చింది. ఇన్ఫోసిస్‌ మాజీ ఛైర్మన్‌ కామత్‌ అంటే నాకు గౌరవం. అన్నిటికీ మించి నా మాతృదేశానికి ఎంతోకొంత సేవ చేసే అవకాశం దొరికింది’... ఇన్ఫోసిస్‌లో చేరడానికి విశాల్‌ చెప్పిన మూడు కారణాలివి. ఈ ఏడాదిన్నరలో ప్రతికూల పరిస్థితుల్లోనూ సంస్థను లాభాల బాట పట్టించి, ఇన్ఫోసిస్‌తో పాటు దేశ ఆర్థిక వృద్ధిలోనూ కీలక పాత్ర పోషించిన విశాల్‌, ఇన్ఫీని ప్రపంచ నంబర్‌ వన్‌ చేయడమే లక్ష్యం అంటున్నారు.


ఇంకొంత...
‘టైంలెస్‌నెస్‌’ పేరుతో నిర్వహిస్తోన్న బ్లాగులోనే అన్ని విషయాలూ పంచుకోవడానికి ఇష్టపడతారు.

* ‘సిద్ధార్థ’ పుస్తకం తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిందని చాలా సందర్భాల్లో చెప్పారు.
* నడకంటే చాలా ఇష్టం. ఉద్యోగులతో, ఇతర సంస్థల అధినేతలతో నడుస్తూ సంభాషించడానికే మొగ్గు చూపుతారు.
* ‘నిత్య విద్యార్థినీ, ఒక్కోసారి అధ్యాపకుడినీ, తండ్రినీ, కొడుకునీ, భర్తనీ, స్నేహితుడినీ, పర్యాటకుడినీ, సృజనకారుడినీ, జీవితపు అలలపైన నావికుడినీ, ఇన్ఫోసిస్‌ సీయీవోని’... విశాల్‌ ట్విటర్‌, బ్లాగ్‌లలో తన గురించి ఇలానే రాసుకున్నారు.


స్ఫూర్తిమంత్రం!

తూర్పు నౌకాదళ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే అపూర్వ ఘట్టం విశాఖ సాగర తీరాన ఆవిష్కృతమైంది. యాభైకి పైగా దేశాలు...

Full Story...

మెట్రో రయ్‌రయ్‌

మెట్రోరైలు ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం కానుంది. నాగోల్‌ నుంచి మెట్టుగూడ, మియాపూర్‌ నుంచి ఎస్‌ఆర్‌నగర్‌ వరకు 20 కి.మీ. మెట్రో మార్గం పూర్తయి...

భావి పౌరులు... ఆకలి కేకలు

విద్యార్థి దశలో కడుపునిండా తిని ఆరోగ్యంగా ఎదిగితే మంచి ఆలోచనలు వస్తాయి. దేశానికి పనికొచ్చే యువకులుగా తయారవుతారు. అర్ధాకలితో మాడితే అసంపూర్ణంగా తయారవుతారు.

ప్రత్యేక రైలేదీ?

దేశంలోనే అతిపెద్ద జాతరల్లో ఒకటిగా చెబుతున్న మేడారం జాతరపై మొదటి నుంచి రైల్వే శాఖ శీతకన్ను వేస్తోంది. ఇన్ని సంవత్సరాల చరిత్రలో....

‘కంచె’లు.. కొంచెమే

ప్రభుత్వ భూమిని రక్షించాలని ఫిర్యాదు చేసినా స్పందించని యంత్రాంగం తీరిది. హుజురాబాద్‌ మండలం ఇప్పలనర్సింగపూర్‌ గ్రామంలో సీడ్‌మిల్లును అనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని....

అమృత్‌ ఇప్పట్లో లేనట్టే!

అమృత్‌ పథకంతో పాలమూరు పురపాలిక రూపురేఖలు మారుతాయనుకున్న పట్టణ ప్రజలకు నిరాశే మిగిలేట్టు కనిపిస్తోంది. పట్టణంలో తాగునీటి ఇబ్బందులతోపాటు మురుగు పారుదల....

కొల్లగొట్టుడే!

కోహీర్‌ మండలం దిగ్వాల్‌కు చెందిన ఎన్‌.వెంకట్‌రెడ్డి, ఎన్‌.ఇంద్రారెడ్డి, ఎన్‌.సుదర్శన్‌రెడ్డిలకు సర్వే నంబర్లు 74ఏ, 74ఏఏ, 74ఇలో 16 ఎకరాల 12 గుంటల భూమి ఉంది.

‘అప్పు’టడుగులు

రైతుల ఆత్మహత్యలు దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. వారికి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వాలు వీలయినంత ఆదుకోకపోవడం వల్లే వ్యవసాయ రంగం రోజురోజుకు....

తలంబ్రాలు అందే మార్గమేదీ?

భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఏప్రిల్‌ 15న శ్రీరామనవమి సందర్భంగా కల్యాణ మహోత్సవం జరగనుంది. ఇది భక్తులకు పరమానందం కలిగించే వేడుక.

ఆంగ్ల మాధ్యమ బోధనకు పచ్చజెండా..!

ప్రైవేటు పాఠశాలల పోటీని తట్టుకుని ప్రభుత్వ బడులు నిలబడేలా తగిన చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ పచ్చజెండా వూపింది. రోజురోజుకి ప్రభుత్వ బడుల...

కాసుల ‘పట్టా’లు

సమయం ఆదా కావాలి.. చదువూ పూర్తి కావాలి. చదవకున్నా మంచి మార్కులు రావాలి. పదోన్నతి పట్టా కావాలి. ఇలాంటి ఆలోచనలతో ఉన్నవారికి కొన్ని అధ్యయన కేంద్రాల....

కనిష్ఠం

సుమారు 22 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తూ తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా పేరుపొందిన నాగార్జునసాగర్‌ జలాశయం బోసిపోతోంది.

బండేసి.. బాదేసి..

గ్యాస్‌ బండ.. పేరు వింటేనే ప్రజలు హడలి పోతున్నారు. ఓ వైపు ప్రభుత్వం ధరలు పెంచేస్తుండగా.. మరోవైపు డెలివరీ బాయ్‌లు అదనపు వసూళ్లతో ప్రజలపై భారం మోపుతున్నారు.

రద్దీ రూట్లపై దృష్టి

విజయవాడకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు కీలక ప్రాంతాలకు నూతన సర్వీసుల ఏర్పాటుపై ఆర్టీసీ దృష్టి సారించింది. విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌...

ఆశల పొద్దు.. కన్నీరే హద్దు!

కుందుర్పి మండలం రుద్రంపల్లిలో ఆదివారం ఉదయం రైతు గంగన్న తన పొలంలో బోరుబావికి అమర్చిన మోటారును బయటకు తీస్తుండగా.. పైపు అదుపు తప్పి సమీపంలోని....

ఎగసిన నిరసన

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులు చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి. ముద్రగడ దీక్షకు....

ఆక్రమణల గుట్టు.. నిండిన చెరువులతో రట్టు

కడప - రాయచోటి ప్రధాన రహదారిలోని గువ్వలచెరువు ఘాట్‌ కింద ఉన్న పెద్దచెరువు. రామాపురం మండలంలోని గువ్వలచెరువు పొలంలోని సర్వే సంఖ్య...

‘కాసు’కో

గడువు సమీపిస్తోంది.. లక్ష్యం ఆమడదూరంలో ఉంది.. వివిధ కార్పొరేషన్ల ద్వారా అర్హులకు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తున్నా.. క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు కానరావడం లేదు.

టెండర్ల దుమారం!

వివిధ అభివృద్ధి పనుల కోసం నెల్లూరు నగరపాలక సంస్థలో పిలిచిన టెండర్లు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అధికార పార్టీలోనే పరస్పర ఆరోపణలకు దారితీస్తోంది. మరోవైపు....

చౌక బియ్యం.. మాకేం భయం

అక్రమార్కుల జేబులు నింపుతున్నాయి. ఏళ్ల తరబడి ఒకే ప్రాంతం నుంచి వందల కొద్దీ లారీల సరకు జిల్లా సరిహద్దులు దాటుతున్నాయి. ఆట కట్టించాల్సిన అధికారులు లంచాల మత్తులో....

మహోదయం.. మహా సంరంభం

అమావాస్య సమయం ప్రారంభం కావడంతో ఆదివారం రాత్రి అలల ఉద్ధృతి అకస్మాత్తుగా పెరిగింది. అప్పటికే బారువ తీరానికి లక్ష మందికిపైగా భక్తులు చేరుకున్నారు.

అహో సార్వభౌమ

ఆకాశం గర్జించినట్టు దూసుకెళ్లిన యుద్ధ విమానాలు... సాగరాన నిప్పులు చిమ్ముతూ పేలిన బాంబులు... త్రివర్ణపతాకాన్ని సగర్వంగా ఎగరేస్తూ ‘చేతక్‌’ హెలికాప్టర్ల విన్యాసాలు...

వ్యాకులమాత యాత్రా మహోత్సవం

విశాఖపట్నం అతిమేత్రాసనం పరిధిలో గల విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కొండడాబాలులోని వ్యాకులమాత పుణ్యక్షేత్రంలో ఆదివారం యాత్ర మహోత్సవం...

ఇసుక పర్ర.. కాసులకు ఎర

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు.. అంటారు. ఇసుక అక్రమ రవాణాకు ఎన్ని ఎత్తులు వేయాలో అన్నీ అమలు చేస్తున్నారు అక్రమార్కులు. పొలాల్లో ఏర్పడిన...