latestnews

రూ.7.9 లక్షల కోట్లు ఎగిరిపోయాయ్‌
మదుపర్లను ముంచేసిన జనవరి
చిన్న, మధ్యస్థాయి షేర్లు కుదేలు
చైనా, చమురు ధరలే ప్రధాన కారణం
కొత్త సంవత్సరం వస్తూ వస్తూనే మదుపరిని గట్టి దెబ్బే కొట్టింది. ఏ క్షణాన ఎలా కదలాడుతాయో తెలియని గందరగోళ స్థితికి నెట్టేశాయి స్టాక్‌ మార్కెట్లు. మదుపర్లకు జనవరి నెల కంటి మీద కునుకులేకుండా చేసింది. ఈ నెలలోనే 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకిన సెన్సెక్స్‌.. ఇప్పటిదాకా 6 శాతానికి పైగా కోల్పోయింది. అంతర్జాతీయ వృద్ధిపై చైనా మందగమనం ప్రభావం పడుతుందనే ఆందోళనలతో ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీనికి మన సూచీలు ఏమీ మినహాయింపు కాదు. గతేడాది లాభాలను పంచిన చిన్న, మధ్య స్థాయి షేర్లు.. ఈ ఏడాది తొలినాళ్లలో కుదేలయ్యాయి. కొంత వూరట కలిగించే అంశమేమిటంటే.. మ్యూచువల్‌ ఫండ్‌లు దాదాపు రూ.5,000 కోట్లను స్టాక్‌ మార్కెట్లలోకి చొప్పించడమే.

జనవరిలో స్టాక్‌ మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. చైనా మందగమనం నేపథ్యంలో అంతర్జాతీయ వృద్ధిపై ఆందోళనలు పెరగడంతో పాటు చమురు ధరలు రికార్డు స్థాయిలో పతనం కావడం వల్ల షేర్లు కకావికలమయ్యాయి. ఎక్కడా చూసినా నష్టాలతో మదుపరి నెత్తురోడాడు. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు సెన్సెక్స్‌ 1,632 కోల్పోయింది. ఈ నష్టాలతో మదుపర్ల సంపద రూ.7,96,903 కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.100 లక్షల కోట్ల స్థాయి నుంచి రూ.92,40,831 కోట్లకు పడిపోయింది. అంతర్జాతీయ వృద్ధి భయాలతో విదేశీ మదుపర్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి ఈనెలలో రూ.9,900 కోట్లకు పైగా విలువైన షేర్లను విక్రయించారు. రూపాయి 28 నెలల కనిష్ఠానికి చేరడం, కార్పొరేట్‌ కంపెనీల బలహీన ఫలితాలు కూడా పతనానికి తోడ్పడ్డాయి.

వైదొలుగుతున్న ఎఫ్‌పీఐలు: ఓపక్క షేర్ల ధరలు భారీగా క్షీణిస్తున్నప్పటికీ.. స్టాక్‌ మార్కెట్‌పై మ్యూచువల్‌ ఫండ్‌లు సానుకూల ధోరణిని కనబరిచాయి. కొత్త సంవత్సరంలో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) మార్కెట్‌ నుంచి వైదొలుగుతుంటే.. దేశీయ మ్యూచువల్‌ ఫండ్లు (ఎంఎఫ్‌లు) మాత్రం ఇప్పటి వరకు ఈక్విటీల్లోకి రూ.5,023 కోట్లను గుమ్మరించడమే ఇందుకు నిదర్శనం. స్థిరాస్తి విపణి స్తబ్దుగా ఉండటంతో పాటు పసిడి ధరల పతనం కొనసాగుతుండటం వల్ల స్టాక్‌ మార్కెట్ల నుంచి ఫండ్‌ మేనేజర్లు భారీ లాభాలను ఆశించారు. గత ఏడాది మొత్తం మీద రూ.70,716 కోట్లు తీసుకొచ్చిన దేశీయ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు.. ఈ ఏడాది జనవరిలో రూ.5,023 కోట్లు పెట్టుబడి పెట్టాయి. ఎఫ్‌పీఐలు మాత్రం ఇదే సమయంలో రూ.9,963 కోట్లను వెనక్కి తీసుకోవడం గమనార్హం. మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన 2014 మే నుంచి దేశీయ ఎంఎఫ్‌లు స్టాక్‌ మార్కెట్‌పై సానుకూల ధోరణితో ఉన్నారని క్వాంటమ్‌ ఏఎంసీ డైరెక్టర్‌ సుబ్రమణియన్‌ పేర్కొనడం గమనార్హం.

బ్లూచిప్‌ షేర్లే మెరుగు: ఈ ఏడాది బ్లూచిప్‌ షేర్లతో పోలిస్తే.. చిన్న, మధ్య స్థాయి షేర్లు కుదేలయ్యాయి. ఈ నెలలో ఇప్పటిదాకా చిన్న, మధ్య స్థాయి (మిడ్‌క్యాప్‌) షేర్ల సూచీలు 10 శాతం చొప్పున కుదేలవ్వగా.. సెన్సెక్స్‌ 6 శాతం నష్టపోయింది. మిడ్‌క్యాప్‌ సూచీ 8.52 శాతం తగ్గి 10,217.05 పాయింట్లకు, చిన్న స్థాయి షేర్ల సూచీ 9.62 శాతం కుంగి 10,697.91 పాయింట్లకు చేరాయి. జనవరి 20న మిడ్‌క్యాప్‌ సూచీ 9,892.36 వద్ద 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. అనిశ్చితి నేపథ్యంలో చిన్న, మధ్య షేర్లు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. గతేడాదిలో చిన్న, మధ్య షేర్ల హవా నడిచిన విషయం తెలిసిందే. బ్లూచిప్‌ షేర్లతో పోలిస్తే సగటున 7.4 శాతం ప్రతిఫలాన్ని ఈ షేర్లు అందించగలిగాయి. ఈ వారంలో వెలువడనున్న ఫెడ్‌, బీఓజే సమావేశ నిర్ణయాలు.. మిగిలిన మూడు రోజుల ట్రేడింగ్‌కు దిశానిర్దేశం చేయనున్నాయి.


కేసీఆర్‌ ‘విజన్‌’కు నీరాజనం!

తెరాస ఉండగా వేరే పార్టీ వైపు చూపు సారించడం దండగని రాజధాని నగరవాసులంతా తీర్మానించినట్లుగా వెలువడిన తీర్పు- చార్‌ సౌ షహర్‌లో కొత్తచరిత్ర....

Full Story...

ముహూర్తం కుదిరింది ఖరారు మిగిలింది

హైదరాబాద్‌ మహానగర పాలకసంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల క్రతువు ముగియడంతో మేయర్‌ ఎన్నికకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎంజీ గోపాల్‌...

అప్పులిచ్చారా... కప్పిపుచ్చారా!

కలిసిరాని ప్రకృతి, కలిసిరాని ధరలు, విపణిలో అక్రమాలు వెరసి సేద్యమంటేనే రైతులు హడలుతున్నారు. ఎన్ని ప్రతికూలతలు ఉన్నా... లక్షలాది మంది ఇప్పటికీ...

మేడారంలో అధికారులకు ప్రత్యేక యూనిఫాం!

జాతర ఇప్పుడే మొదలైందా అన్నట్లుగా భక్తులు వరదలా వస్తున్నారు. ప్రతిరోజూ మేడారం కిక్కిరిసిపోతోంది. అధికారులు ముందే మేల్కోవాల్సిన అవసరం ఏర్పడింది.

నాణ్యత.. పైపూత!

48 కిలోమీటర్ల దూరం... రూ.23 కోట్లు నిధులు... అంటే ఒక కిలోమీటరు దూరానికి సగటున రూ.47 లక్షలు! ఇంత మొత్తం మరమ్మతులకు వెచ్చిస్తున్నారంటే ఆ రహదారి...

నిధులిచ్చినా..నెమ్మదే!

జిల్లాలో ఏళ్లతరబడి కొనసా..గుతున్న నాలుగు ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు. ఖరీఫ్‌కు.. లేదంటే రబీకి సాగునీరంటూ కాలం వెళ్లదీయడమే...

‘బండ’బడ.. ఇదేమి ఆగడం?

ఏదైనా ప్రభుత్వ ఆస్తిని అమ్మాలంటే ఆషామాషీ కాదు. తొలుత దాని విలువను నిర్ణయిస్తారు. నిబంధనల ప్రకారం టెండరు నిర్వహించి ఎక్కువ ధర ఎవరు ఇస్తామంటే వారికే దానిని...

తప్పుదారి

జిల్లాలో అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. అక్రమ పద్ధతిలో సొమ్ము చేసుకోవాలనుకున్న కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. డబ్బులకు కక్కుర్తిపడి రసాయనాలను సైతం అమ్మేసుకుంటున్నారు.

‘శత’విధీ..

ఒకటీ.. రెండూ కాదు.. ఏకంగా శత కోటి రూపాయలు వెచ్చించిన నిర్మించిన పథకం అది.. దీన్ని ఏ ప్రయోజనం ఆశించి నిర్మించారో అది ప్రస్తుతం అవసరం లేకుండా...

మధ్యాహ్న భోజనం నాణ్యత పరిహాసం

నవీపేట ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సొరకాయపప్పు కలిపి చేసిన భోజనం చేసిన కొద్దిసేపటికి ఒకొరితరువాత ఒకరు వాంతులు...

ఒప్పంద ఉద్యోగం.. అధికారులపై పెత్తనం

చేసేది ఒప్పంద (కాంట్రాక్టు) ఉద్యోగం.. పెత్తనం మాత్రం గజిటెడ్‌ అధికారులపై.. మరి అటువంటి ఉద్యోగి చెప్పినట్లు అధికారులు వింటారా? అంటే ఎవరైనా సరే అంతగా శ్రద్ధ పెట్టరనే...

ఎత్తిపోతల ధర్మ‘వరం’

దుర్గి మండలం ధర్మవరానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరం ఇచ్చారు. గ్రామ పరిధిలో 3500 ఎకరాలకు సాగునీరు అందించడానికి రూ.35 కోట్ల విడుదలకు ముఖ్యమంత్రి...

సొమ్ము నేసేశారు

శవాలపైన కూడా కాసులు ఏరుకోవడమంటే ఇదే. ప్రకృతి ప్రకోపించి బతుకులు కకావికలమైన చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం విదిల్చిన ఆ కాస్త నిధులపైనా దళారుల కన్ను...

నీరు దారి మళ్లొద్దు!

కృష్ణా, గుంటూరు జిల్లాల తాగునీటి అవసరాల నిమిత్తం నాగార్జునసాగర్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో, ఈ నీటిని సక్రమంగా పంపిణీ చేయడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది.

అడుగడుగునా ఆక్రమణ

1959, 1985, 2010లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రాచీన కట్టడాలు, పురావస్తు క్షేత్రాలు, శిథిలావశేషాల పరిరక్షణ చట్టం ప్రకారం జాతీయ ప్రాధాన్యత కట్టడంగా లేపాక్షిని గుర్తించారు.

దీక్షకు దన్ను

కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పలు గ్రామాల్లో...

ఎత్తిపోతలకు కొత్తరూపు

మెట్ట భూములకు ప్రతి నీటి బిందువు అమృత సింధువే. బీడువారిన పొలాలకు జలసిరి అందించి సస్యశ్యామలం చేయటానికి ప్రవహించే నీటిని ఎత్తిపోసేలా పలు పథకాలకు రూపకల్పన చేస్తున్నా...

చేతులు దులుపుకొన్నారా? చేతులు తడుపుకొన్నారా?

అవుకు మండలం పాతచెర్లోపల్లిగ్రామ పరిధిలో అక్రమ క్వారీ తవ్వకాల గుట్టును విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ రట్టు చేసింది. పదేళ్ల నుంచి ఈ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జరుగుతుంటే అధికారుల దృష్టికి రాలేదా?

లెక్క లేదు

దేశాభివృద్ధికి పల్లెలు పట్టుకొమ్మలు.. అలాంటి పల్లెల ప్రగతికి విడుదలయ్యే నిధులు పక్కదారి పడుతున్నాయి. పంచాయతీల ఆలనాపాలనా చూడాల్సిన పాలకులు నిధులు కైంకర్యం...

కష్టాల జడి కన్నీటి తడి

వర్షాభావ పరిస్థితుల ప్రభావం ఈ ఏడాదీ పొగాకు రైతులను వెన్నాడుతోంది.. పొగాకు పంట దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపుతోంది.. గత ఏడాదితో పోలీస్తే ఈసారి పొగ నాట్లు ఆలస్యం కావడం..

కూలితే.. కళ్లుతెరుస్తారేమో!

మీరు రూ. 5 కోట్లతో ఇల్లు కట్టుకున్నారు. పదడుగుల వెడల్పుతో ప్రధాన ద్వారానికి ఏర్పాట్లు చేసి... ఐదడుగుల మేరకే తలుపు బిగిస్తే! ఏమవుతుంది? చూసిన వారు నవ్వుతారు.

జయహో భారత్‌

నభూతో అన్నట్టుగా... చైనా, అమెరికా, ఫ్రాన్స్‌, గ్రేట్‌ బ్రిటన్‌ వంటి దిగ్గజ దేశాల నౌకాదళాధిపతులు అచ్చెరువొందగా.. మన నౌకాదళం అద్భుత పాటవాన్ని ప్రదర్శించింది. విశాఖ సాగర...

పాలకులేరీ?

పంచాయతీలకు 2013లో ఎన్నికలు జరిగాయి. సుమారు మూడేళ్లు కావస్తుంది. నేటికీ పలు పంచాయతీలకు పాలకులు కరవయ్యారు. జిల్లాలో సర్పంచులు, వార్డుసభ్యులు కలిపి 74...

మసి పూసి మాయచేసి!

ఇది ఏలూరు అగ్నిమాపక కేంద్ర కూడలి నుంచి కొత్త బస్టాండ్‌కు వెళ్లే దారి. ఇక్కడ కొత్త డ్రెయిన్‌ నిర్మిస్తున్నారు. ఇక్కడ వివిధ రకాల హోటళ్లు, దుకాణాలు, ఖరీదైన ఇళ్లు, ఆర్టీసీ గ్యారేజీ...