దీన్ని కమ్యూనిస్టు పార్టీకీ, దీన్ని తృణ మూల్‌కూ, దీన్ని డీఎంకేకూ, దీన్ని...
latestnews

యాప్‌.. యాప్‌ హుర్రే
ఉచితంగా ప్రేమకానుకలు
నంద్యాల పట్టణం: ప్రేమగీతాలు.. ముద్దుమురిపాలు.. కోపతాపాలు.. విరహ వేదనలు ఏమైనా అన్నింటికి సాంకేతిక జోడించి అందించే కొత్త ప్రపంచం యాప్‌. దీని చుట్టూ తిరగని యువత ప్రేమించలేడేమో అన్నట్టు.. యువత బానిసలవుతున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వీటి ద్వారా యువత కొత్త లోకాన్ని చుట్టి రావచ్చు. వాటిలో కొన్ని..

ఫొటో ఫ్రేమ్స్‌ న్యూయాప్‌ ఆండ్రాయిడ్‌
ప్రేమ గుర్తులకు సంబంధించిన ఫొటో ఫ్రేమ్స్‌ ఇందులో ఉంటాయి. మన ఫొటోలను, అప్పుడప్పుడు తీసిన చిత్రాలను కెమెరాను తిప్పి ఫొటోలు తీసిన చాలా సులభంగా దీని ద్వారా గ్రీటింగ్స్‌ తయారు చేయవచ్చు. జూమ్‌ రొటేట్‌ మూవ్‌ ఫీచర్స్‌ ఇందులో ఉంటాయి. ఫొటోను బాగా దగ్గరగా తీసుకువచ్చి దిశను మార్చి జరుపుకోవచ్చు. ఎలా అయితే అలా ఫొటో ఫ్రేమ్స్‌ను ఇందులో చేసుకోవచ్చు. ఏటీఎం యాప్స్‌ను ఆండ్రాయిడ్‌ చరవాణిలో గూగుల్‌ ప్లే స్టార్‌లో ఈ యాప్‌ లభిస్తుంది.

వాలెంటైన్స్‌ డే గ్రీటింగ్‌ కార్డులు
గూగుల్‌ ప్లేస్టార్‌లో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్‌ యాప్‌. ఇందులో ఫొటోలను ఫ్రేమ్స్‌లో పెట్టడమే కాకుండా మంచి ఫ్రేమ్‌ సందేశాలూ ఇందులో ఉంటాయి. వీటిని మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ఈ యాప్‌ ద్వారా మనకు ఇష్టమైన వారికి సందేశాలు పంపుకోవచ్చు.

రొమాంటిక్‌ లైవ్‌ వాల్‌పేపర్‌ ఆండ్రాయిడ్‌ యాప్‌
గూగుల్‌ ప్లేస్టార్‌లో దొరుకుతుంది. దీని ద్వారా ప్రత్యక్ష వాల్‌పేపర్లు తయారు చేసుకోవచ్చు. మన ఫొటోలనూ ఇందులో పెట్టుకోవచ్చు. ఏ రకమైన ఆకృతిలోనైనా, భంగిమలోనైనా ఇష్టమొచ్చిన రీతిలో ఇందులో ఉంచుకోవచ్చు.

రొమాంటిక్‌ లవ్‌ రింగ్‌ టోన్స్‌
ప్రేమలో పడిన వారు తన ప్రేయసి/ ప్రియుడికి తమ భావాలను వ్యక్త పరచడానికి ఒక చక్కటి అనుకూలమైన ‘యాప్‌’ ఇది. ప్రేమ పాటలు, ప్రేమ శబ్దాలు, ముద్దులు లాంటివి దీని ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రింగ్‌టోన్స్‌ తయారు చేసుకోవచ్చు. వీటిని ఇష్టమైన వారికి పంపుకోవచ్చు. వారితో పంచుకోవచ్చు.

వాలెంటైన్స్‌ ఈ-గ్రీటింగ్స్‌ ఆండ్రాయిడ్‌ యాప్‌
ఈ మెయిల్‌, ఎంఎంఎస్‌, వాట్సప్‌ ద్వారా గ్రీటింగ్స్‌ తయారు చేసుకుని ఇష్టమైన వారికి పంపుకోవచ్చు. ఉత్తర, ప్రత్యుత్తరాల వలే ఒకరి నుంచి మరొకరికి పంపుకోవడానికి చాలా సులభమైన యాప్‌ ఇది. ఎక్కువగా దీని ద్వార శుభ సందేశాలు, ప్రేమ సందేశాలు, పలకరింపులు, జ్ఞాపకాల దొంతరల లాంటివి వీటి ద్వారా సాధ్యం.

లవ్‌ స్టిక్కర్‌ ఫర్‌ వాలెంటైన్స్‌ డే
స్టిక్కర్లు ఆకర్షణీయంగా, అబ్బురపరిచే అందమైన స్టిక్కర్లు ఇందులో లభ్యమవుతాయి. మధురంగా రూపొందించిన హృదయం గుర్తులు, నవ్వులు, ఐ లవ్యూ సందేశాలు, మిలమిల మెరిసే స్టిక్కర్లతో ఇరువైపులా వారితో ఇష్టమైన వారితో ప్రేమగా మాట్టాడుకోవడం కోసం ఇది పనికొస్తుంది. డౌన్‌లోడు చేసుకోవడం ద్వారా ఈ అవకాశం ఉంటుంది. ఇది www.getjar.com ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

వాలెంటైన్స్‌ డే ఎస్‌ఎం యాప్‌
వాలెంటైన్స్‌ డే రోజు ఇష్టమైన వారికి పంపించుకోవడానికి ముచ్చటైన, ప్రేమ పూర్వకమైన తమాషా, అబ్బురపరిచే ప్రేమ సందేశాలతో కూడినటువంటి యాప్‌ ఇది. ఈ యాప్‌ ద్వారా పొట్టి సందేశాలనూ పంపించుకోవచ్చు. దీనిని డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా ఈ అవకాశాలను పొందవచ్చు. ఇది కూడాwww.getjaer.com ద్వారా పొందవచ్చు.

క్యూట్‌ వాలెంటైన్‌ యాప్‌
వేల కొద్ది ఆకర్షణీయమైన ఆకృతులు కలిగిన అబ్జెక్టు. సిద్ధంగా ఉంచిన ఆకృతులు, తమాషా సందేశాలు వీటిలో ఉంటాయి. వీటిలో ఎవరి ఫొటోలైన ఆకర్షణీయంగా రూపొందించుకోవచ్చు. ఈ-మెయిల్స్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్లు, వాట్సప్‌ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఇష్టమైన వారితో వీటిని పంచుకోవచ్చు.www.getjaer.com ద్వార పొందవచ్చు.

హ్యాపీ వాలెంటైన్స్‌ 2016 యాప్‌
9యాప్స్‌ సైట్‌లో హ్యాపీ వాలెంటైన్స్‌ 2016 పేరిట 38 యాప్స్‌ ఉన్నాయి. వాలెంటైన్స్‌ డే ఫొటో, వాలెంటైన్స్‌ రొమాంటిక్‌ ఎడిటర్‌, లవ్‌ ఫొటో ఫ్రేమ్స్‌, లవింగ్‌ వాలెంటైన్స్‌, హ్యాపి వాలెంటైన్స్‌ క్యాలెండర్‌, హెడ్‌డీ కాల్‌ స్క్రీన్‌, వాలెంటైన్స్‌ ఎస్‌ఎంఎస్‌ 2016, లవ్‌ క్లాత్‌, రొమాంటిక్‌ రింగ్‌టోన్స్‌ లాంటి 38 యాప్స్‌ ఇందులో ఉన్నాయి. వీటిని 9 యాప్స్‌ నుంచి నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


ప్రేమికుల రోజు

మనిషి దాచిపెట్టలేని విషయాలు రెండు ఉన్నాయన్నాడొక ఆంగ్ల రచయిత. తాగిన సంగతి, ప్రేమలో పడ్డ విషయం- రెండూ ఎదుటివారికి...

Full Story...

ఆన్‌లైన్‌లో సమాచారం ఇస్తే...పోలీసులే చూసుకుంటారు

‘‘సర్‌... నాపేరు రమేష్‌ యాదవ్‌... సికింద్రాబాద్‌లో ఉంటున్నా. నా ద్విచక్ర వాహనాన్ని అమ్మి 16 నెలలయింది. రెండు నెలల నుంచి ఇంటికి ఇ-చలానాలు వస్తున్నాయి.

ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిందే!

ప్రతిపక్ష పార్టీలు విఫలమైన నేపథ్యంలో ప్రజల సమస్యను పరిష్కరించే దిశగా తెలంగాణ రాష్ట్రంలో విద్యావంతుల వేదిక ప్రతిపక్ష పాత్ర పోషించాలంటూ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సూచించారు.

నేటి నుంచి ప్రత్యేక బస్సులు

మేడారం జాతర సందర్భంగా నేటి నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ జేఎండీ గండ్ర వెంకట రమణారావు పేర్కొన్నారు. శనివారం హన్మకొండ బాలసముద్రంలోని ఆర్టీసీ ప్రత్యేక...

అదిగో... జన జాతర!

రెండేళ్లకు ఒకసారి వచ్చే సమ్మక్క, సారలమ్మ జాతర ఉత్సవాల సందడి నెలకొంది. వరంగల్‌ జిల్లా మేడారంలో జరిగే మహా జాతరకు ఇప్పటికే భక్తజనం పెద్దసంఖ్యలో తరలుతోంది.

ఉలుకూ పలుకు లేని పీఎంఏవై

ఏడేళ్ల సుదీర్ఘ కాలవ్యవధి అనంతరం జిల్లాలోని మూడు పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసిన పీఎంఏవై (ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన) ఇళ్ల పథకం.. ఆచరణలో ఉలుకూ పలుకు...

ఓటెత్తారు

నారాయణఖేడ్‌ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోటెత్తారు. యువత నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా పోలింగ్‌...

మిషన్‌-2లో మనమే నం: 1

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చిన్న నీటి వనరుల పునరుద్ధరణ (మిషన్‌ కాకతీయ పథకం-2) వేగమందుకుంది. చెరువుల ఎంపిక మొదలుకొని టెండర్ల ప్రక్రియ, పనుల ప్రగతిలో...

జలపుష్ప’ విలాపం

చేపప్రియులకు చేదు సంవత్సరమే.. ఈసారి జలపుష్పాలు వికసించలేదు. వర్షాభావం, వ్యాధులు వెరసి జిల్లాలో చేపల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయి. మత్స్యసంపదకు పేరున్న మన...

మన కూరగాయలు... మనమే పండించాలి

‘మన రాష్ట్రానికి అవసరమైన కూరగాయలు మనమే పండించుకోవాలి. ఇతర రాష్ట్రాల దిగుమతులకు చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉంది.

బియ్యం దొంగలు

పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న దొంగల మెడకు ఉచ్చు బిగుస్తోంది. నిఘా వర్గాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపారు. అక్రమాల చిట్టా...

స్థానిక పాలన స్తంభన

పల్లె పాలనలో పారదర్శకత తేవడానికి, ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో తీసుకురావడానికి అన్ని గ్రామపంచాయతీలను డిజిటల్‌గా మార్చారు. తడి, పొడి చెత్త వేరుచేసి గ్రామానికి దూరంగా...

ఏడు కొండలవాడు..

రథసప్తమి పర్వదినాన.. శ్రీనివాసుని భక్తకోటి ఆరాధించనుంది. మాఘశుద్ధ సప్తమి పర్వదినాన సూర్యజయంతి సందర్భంగా అరుణోదయ కాలంలో స్నానం చేయడం, సూర్యుణ్ణి ధ్యానించడం...

కలిసి సాగితే.. కదులు జలం

జిల్లా వాసుల తాగునీటి అవసరాల కోసం ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల ప్రారంభమైంది. పురపాలక, గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీరాజ్‌, నీటి పారుదల...

మేల్కొంటేనే.. గొంతు తడిచేది!

ఈ చిత్రంలో కనిపిస్తున్న సమగ్ర రక్షిత నీటి పథకం తలుపుల మండలం సంకటివారిపల్లి గ్రామానికి చెందినది. ఏడాది కిందట బోరు వేశారు. ఆరు నెలల కిందట మోటారు కాలిపోయింది.

ఆగని దందా

జిల్లాలో ఇసుక ర్యాంపుల నిర్వహణ అధికారికంగా లేకపోయినా ఇసుకాసురులకు మాత్రం కొరత కనిపించడం లేదు. ఓ వైపు ఇసుక తవ్వకాలకు సంబంధించి నూతన విధానానికి టెండర్ల...

వేగంగా పనులు చేయకుంటే రూ.కోట్ల నిధులు వెనక్కి

నిధులు తక్కువగా ఉన్నాయని శాఖల వారీగా అధికారులు గగ్గోలు పెట్టారు.. పనుల్ని పరుగెత్తించాలంటే నిధులు కావాలన్నారు.. తీరా ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చేసరికి వివిధ...

ఈ జంటలపై ‘ప్రేమ’ ఎప్పుడు?

కులాల మధ్య అంతరాలను తొలగించే కుల, మతాంతర వివాహాలు చేసుకునే దంపతులకు ఇచ్చే ప్రోత్సాహకానికి ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. సొంతంగా నిలదొక్కుకోవడానికి పనికొస్తుందని ప్రేమ జంటలెన్నో ఎదురుచూస్తున్నా ఫలితం అందడం లేదు.

అవినీతిపై ‘నిఘా’

నెల్లూరు నగరపాలక సంస్థకు ప్రధాన ఆదాయం ఆస్తి పన్ను. ఏడాదికి దాదాపు రూ.60 కోట్లు రావాల్సి ఉంది. వాస్తంగా వసూళ్లు రూ.20 కోట్లు మించడంలేదు. కారణం సిబ్బంది...

మొక్కు‘బడులు’

ఉపాధ్యాయుల సర్దుబాటు ద్వారా విద్యాప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యానికి ఆదిలోనే గండిపడడంతో జిల్లాలోని పశ్చిమంలో గురువుల కొరతతో విద్యార్థులు చదువులకు దూరమవుతున్నాయి.

ప్రాణానికి ఖరీదు!

ప్రమాదాలు చెప్పి జరగవు. అనుకోని విధంగా ఎదురవుతాయి. తలరాతను మార్చేస్తుంటాయి. అలా అని ప్రమాదాలెలా జరిగాయో...

కళ్ల ముందు కలల వాహనం

రయ్‌ రయ్‌మని దూసుకుపోయే కుర్రకారును ఆకట్టుకునే బైక్‌లు...సకల సౌకర్యాల సమాహారంగా నిండిన కార్లు... మహిళలు మెచ్చే ద్విచక్ర వాహనాలు... రవాణాకు ఉపయోగించే ఆటోలు...

విజయ‘నగరం’ కాదు

విజయనగరం నగర పాలక సంస్థ ఆవిర్భవించి రెండు నెలలు గడవక ముందే మళ్లీ పురపాలక సంస్థగా మారిపోయింది... కార్పొరేషన్‌గా మారితే విజయనగరం పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతుంది ఇక...

తెల్లబోయేలా తూకాలు!

విపణిలో లభిస్తున్న వివిధ రకాల కంపెనీల బియ్యం బస్తాల్లో తూకం తరుగు ఉంటోంది. 25 కిలోల బియ్యం బస్తా కొంటే అది కచ్చితంగా 24 కిలోలో, 23.50 కిలోలో ఉంటోంది.