అరబ్‌ దేశాల్లో ఆదాయంపన్ను లేదట సార్‌, ఆస్ట్రియాలో ధరలు పెరగవట, చైనాలో పీఎఫ్‌ కోత ఉండదట...
latestnews
శక్తులు కూడదీసుకుంటేనే ముందుకు
మూడో స్థానానికి చేరాలంటే ద్విముఖ వ్యూహం అవసరం
నిరుద్యోగం, మందగమన ఉత్పత్తి, ఆర్థిక ఇబ్బందులు అధిగమించాలి
ప్రభుత్వ పెట్టుబడులు, ప్రోత్సాహకాలు పెంచాలి
ఏపీ లక్ష్యాలపై స్వర్ణాంధ్ర దార్శనికపత్రం అభిప్రాయం
ఈనాడు - హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశిస్తున్నట్లు 2022 నాటికి దేశంలోని తొలి మూడు రాష్ట్రాల స్థాయికి ఏపీ ఎదగాలంటే శక్తులన్నీ కూడదీసుకొని పనిచేయాల్సి ఉంటుందని స్వర్ణాంధ్ర దార్శనికపత్రం ముసాయిదా చెబుతోంది. ఇందుకు మౌలికవసతుల కల్పన, పారిశ్రామిక అభివృద్ధి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, పేదరిక నిర్మూలన, సామాజిక సాధికారత సాధించాలని పేర్కొంది. ఏపీ అభివృద్ధికి నిరుద్యోగం, మందగమన ఉత్పత్తి, ఆర్థికపరమైన ఇబ్బందులు ప్రధాన ప్రతిబంధకాలుగా ఉన్నాయంది. అల్పాదాయ కుటుంబాల్లో నిస్పృహ పెరుగుతోంది. యువకులు ఉన్న ఆదాయాన్ని కోల్పోతూ పేదరిక ముప్పును ఎదుర్కొంటున్నారు. మున్ముందు వయస్సుమీదపడే జనసంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున నైపుణ్య ఆధారిత మార్గాల ద్వారా ఆదాయ అసమానతలను పరిహరించాల్సి ఉంటుంది. ఇందుకోసం స్వల్ప, దీర్ఘకాలంలో పటిష్ఠమైన నిర్మాణాత్మక మార్పులు తీసుకురావాలి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఆదాయ వృద్ధి భారీగా తగ్గిపోయింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయం జీఎస్‌డీపీలో 7.4% ఉంది. 2012-13లో ఇది 9.9%గా ఉంది. ఇదే సంవత్సరం 12% ఉన్న పన్నేతర ఆదాయ వాటా రాష్ట్ర విభజన తర్వాత 1.7%కి తగ్గిపోయింది. 2009-14 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక వృద్ధి రేటు 5.6% మధ్య ఆగిపోయింది. ఇది జాతీయ సగటుకంటే చాలాతక్కువ. ఇలాంటి

పరిస్థితుల్లో ఇప్పటికే అభివృద్ధి చెందిన రాష్ట్రాలను అధిగమించి ముందు వరుసలో నిలవాలంటే వ్యవస్థాగత మార్పులు తీసుకురావాలని దార్శనికపత్ర ముసాయిదా పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటురంగంలో గుర్తించదగ్గస్థాయిలో పెట్టుబడులు పెడుతూ ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని సూచింది. ఉత్పాదకత ఆధారంగా ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలని, ప్రోత్సాహకాలు అందించాలని సూచించింది. ఇంకా ఏమందంటే...

1. ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ: ప్రభుత్వం పెట్టే ఖర్చును సమర్థంగా తిరిగి రాబట్టుకొనేలా వినియోగరుసుముల విధానం తీసుకురావాలి. రాయితీలను అవసరమైన వారికి మాత్రమే అందించే పటిష్ఠమైన వ్యవస్థ రూపొందించాలి. ప్రణాళిక, బడ్జెట్‌ మధ్య పూర్తిస్థాయిలో సమన్వయం సాధించాలి.

2. వ్యవసాయం: వ్యవసాయ, దాని అనుబంధరంగాల ఉత్పత్తులను విక్రయించే మార్కెట్లన్నింటనీ ఎలక్ట్రానిక్‌ వ్యవస్థతో అనుసంధానించాలి. ప్రతి ఉత్పత్తికీ విలువను జోడించి, బ్రాండింగ్‌ చేసి, ఎగుమతి చేయగలగాలి.

3. పరిశ్రమ, వస్తు తయారీ రంగం: ప్రతి రంగానికి ప్రత్యేక విలువను జోడించాలి. మార్కెట్‌ లింకేజీ పెంచాలి.

4. మౌలికవసతులు, రవాణా, ఇంధనం: ప్రాజెక్టుల అమలు, పర్యవేక్షణ కోసం ప్రత్యేక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలి. మౌలికవసతుల రంగం అభివృద్ధికి పీపీపీ, పౌరవిమాన, నౌకా సంబంధ విధానాలను సవరించాలి. మల్టీమోడల్‌ లాజిస్టిక్‌పార్కులు/హబ్‌లు నెలకొల్పాలి. విద్యుత్తురంగాన్ని డిజిటలైజ్‌ చేయాలి. విద్యుత్తు టారిఫ్‌ను హేతుబద్ధీకరించాలి. అన్నిరంగాల్లో నైపుణ్యాలు పెంచాలి.

5. పర్యాటకరంగం: వినియోగదారులకు అనువైన పర్యాటక విధానాలను రూపొందించాలి. విస్తృతస్థాయిలో డేటాను సమీకరించి విశ్లేషించి అందుకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి.

6. వైద్యం, పౌష్టికాహారం: ఇప్పుడున్న వైద్యకళాశాలలన్నింటినీ ఆధునికీకరించి, అదనపు మానవ వనరులను సమకూర్చాలి. సమగ్ర వైద్య విధానాన్ని అభివృద్ధి చేయాలి.

7. విద్య, నైపుణ్యాభివృద్ధి: సాంకేతిక విద్యారంగంలో బహుళ కోర్సులు ప్రవేశపెట్టాలి. చదువుతోపాటే ప్రాక్టికల్‌ శిక్షణ అందించాలి. యూనివర్సిటీలకు పనితీరు ఆధారంగా నిధులు అందించాలి.

8. ప్రభుత్వ విధానాలు, వ్యవస్థాగత నిర్మాణం: పబ్లిక్‌ సర్వీసెస్‌ డెలివరీ గ్యారెంటీ యాక్ట్‌ తీసుకురావాలి. కొత్తగా ఏపీ కెపాసిటీ బిల్డింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నెలకొల్పాలి. జీటుబి, జీటుసి ఆన్‌లైన్‌ సేవలు అందించాలి.

9. జలవనరుల నిర్వహణ: ఏపీ జలవనరుల నియంత్రణ చట్టాన్ని అమల్లోపెట్టాలి. నీటిని పొదుపుగా, సమర్థంగా వాడుకున్న వారికి ప్రోత్సాహకాలు అందించాలి.

10. పట్టణాభివృద్ధి: ప్రస్తుతం ఉన్న పట్టణీకరణ సరళిని దృష్టిలో ఉంచుకొని విశాఖ, అమరావతి, తిరుపతిల అభివృద్ధిపై దృష్టిసారించాలి. వీటిని భవిష్యత్తు మెగాసిటీలుగా భావించి ప్రణాళికలు రూపొందించాలి. ఆకర్షణీయనగరాల అభివృద్ధికి ఆకర్షణీయ ప్రాంత ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలి. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగుళూరు కారిడార్లలో చిన్న, మధ్యతరహా పట్టణాలు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలి.

11. సామాజికాభివృద్ధి: యువకుల్లో నైపుణ్యాలు పెంచి కొత్త ఉపాధి అవకాశాలు కల్పించాలి. గుజరాత్‌ తరహాలో ఏపీ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత ప్రాధికారసంస్థను ఏర్పాటుచేసి పారిశ్రామికవేత్తల సేవలను ఉపయోగించుకోవాలి. కేరళ తరహాలో స్థానిక స్వయం పాలనను పెంపొందించాలి.


దోమకాటుకు తెర!

శతాబ్దాలుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి మలేరియాపై నరేంద్ర మోదీ ప్రభుత్వం యుద్ధభేరి మోగించింది. మశక సంతతి ద్వారా...

Full Story...

విశ్వనగరం... మా లక్ష్యం

‘‘ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించడం, పారిశుద్ధ్యానికి పెద్దపీట వేయడం, హైదరాబాద్‌ను ‘హరితనగరం’గా తీర్చిదిద్దడం.. మా ముందున్న లక్ష్యాలు. వర్షపు నీటిని సక్రమంగా వినియోగించుకునేలా...

వినిపించాలి... మురళీరవాలు

ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని మురళీనగర్‌, లేమూరు గ్రామాలు సాధించిన ప్రగతి చాలా బాగుందని గ్రామీణాభివృద్ధిపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు ప్రశంసించారు.

జాతర మార్గాల్లో ఇంకా లోపాలు..

గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ సారి మేడారం జాతరకు ఎక్కువ రహదారులు భక్తులకు అందుబాటులోకి వచ్చినా సంబంధిత పనుల్లో మాత్రం ఇంకా అలసత్వం...

తోటి ఉద్యోగినీ వదల్లేదు..

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి వికృత రూపానికి పరాకాష్ట ఈ ఉదంతం.. చేయి తడపనిదే పని జరగదనే అపవాదు ఇప్పటికే ఉన్నా.. దీని విశ్వరూపం మరింత విస్తృతమైంది.

తాగునీటికి గడ్డుకాలం

కరవులతో పంటల్లేక ఏటా వలసబాట పట్టే పాలమూరు ఈ ఏడాది తాగునీటికీ వలస వెళ్లాల్సి వస్తోంది. ప్రకృతి వైపరీత్యానికి తోడు ముందుచూపు కొరవడటంతోనే ఈ దుస్థితి నెలకొంది.

ఎవరిదో విజయం

ఖేడ్‌ నియోజకవర్గ చరిత్రలో తొలిసారిగా శనివారం ఉప ఎన్నిక జరుగబోతోంది. ఎమ్మెల్యే కిష్టారెడ్డి గత ఆగస్టు 25న గుండెపోటుతో కన్నుమూయగా అనివార్యమైన దీనిని...

‘సర్వే’జనా సుఖినోభవంతు

శతాబ్ద కాలం నాటి దస్త్రాలు.. అప్పట్లో నాటిన హద్దురాళ్లు కనుమరుగు.. చెదిరిపోయిన భూముల హద్దులు.. వెరసి నిత్యం ఎక్కడోఓచోట భూవివాదం.

స్వపక్షం.. విపక్షం.. గరం.. గరం

నన్ను జడ్పీ సమావేశానికి రమ్మని పిలిచారు.. సంతోషం.. కానీ నాకు అజెండా నకలు(కాపీ) పంపించలేదు.. నాది ఎస్టీ నియోజకవర్గం గిరిజనులు పోడు వ్యవసాయం...

చట్టానికి తూట్లు..!

విద్యా హక్కు చట్టం ఏం చెబుతోందంటే.... విద్యా రంగంలో ఉన్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది బోధనేతర పనులు చేయడానికి వీలు లేనే లేదు.

భక్తజనంతో పులకించిన బాసర

బాసరలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు అందజేశారు.

రయ్యి రయ్యిన..

నాగరికతకు చిహ్నాలైన రహదారులు బాగుంటేనే ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. అభివృద్ధి వేగవంతమవుతుంది. రాష్ట్ర విభజన తర్వాత రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర...

బియ్యమా.. బియ్యమా.. ఎందుకు తగ్గావు?

రేషన్‌ దుకాణంలో తూకం తగ్గుదలపై పొరపాటున ఎవరైనా ప్రశ్నించారా..చిన్నప్పుడు అందరం చదువుకున్న చేపా చేపా ఎందుకు ఎండలేదు కథ చెబుతారు...

పుష్కర నివేదిక సిద్ధం

రాజధాని ప్రాంతంలో 12 రోజులు జరిగే అతిపెద్ద వేడుక కృష్ణా పుష్కరాలని, అన్ని శాఖలూ బాధ్యతగా నిర్వహణను చేపట్టాలని కలెక్టర్‌ బాబు.ఎ అన్నారు. పుష్కరాల ఏర్పాట్లపై వివిధ శాఖల...

సూక్ష్మంలో అవినీతి సేద్యం!

కర్షక సంక్షేమమే ధ్యేయంగా తక్కువ నీటి వినియోగంతో పంటలు పండించి.. అధిక దిగుబడి పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సూక్ష్మసేద్యం...

అభ్యంతరాల ‘బృహత్తరం’

అన్నవరం దేవస్థానం అభివృద్ధికి ఇటీవల రూపొందించిన బృహత్తర ప్రణాళికపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరోసారి లోతుగా అధ్యయనం చేయాలని...

తరలిస్తోంది మన్ను కాదు.. భావితరాల దన్ను

జిల్లాలో సహజ వనరుల సంరక్షణకు కంకణం కట్టుకోవాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. జిల్లాలో పేరుమోసిన వృక్ష సంపదను...

పింఛనామం

జిల్లాలో పింఛన్ల పంపిణీలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. అర్హులు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం...

ఇక నామినేషన్‌పై పనుల పందేరం!

నెల్లూరు నగరపాలక సంస్థలో అభివృద్ధి పనుల టెండర్లలో రాజకీయ దుమారం రేగడంతో నామినేషన్‌ పనుల పందేరానికి తెర లేపారు. రూ.5 లక్షలలోపు పనులను...

రైతుకు కాదు.. ‘రారాజు’...

ఫలాల్లో రారాజు మామిడి. రుచికి తగ్గట్టే పండించిన రైతులకూ ఒకప్పుడు లాభాలను ఆర్జించి పెట్టింది. అయితే ఇప్పుడా పరిస్థితి మారింది. వరుసగా మూడో ఏడాదీ మామిడి రైతులు...

పాలనా సంస్కరణలతోనే అభివృద్ధి

చిన్నచిన్న తప్పులు చేసిన ఎందరో ఉద్యోగులు కష్టాలు అనుభవిస్తున్నారు. ఇందుకు వారు చేసిన అవినీతే కారణం. ఉద్యోగులు సమర్థంగా పని చేయాలన్నా...

మహా యోగం!

దేశంలోని ఆకర్షణీయ నగరాల ఉత్తమ 20 జాబితాలో స్థానం పొందిన మహా విశాఖ నేడు అమెరికా సహాయంతో అభివృద్ధి చెందనున్న తొలి నగరంగా గుర్తింపు దక్కించుకుంది. అభివృద్ధి కేవలం పరిమిత...

తాగునీటి సమస్యపై అప్రమత్తం

జిల్లాలో మే నెలనాటికి తాగునీటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. వేసవి నేపథ్యంలో ముందుగా అప్రమత్తమైనట్లు గ్రామీణ నీటిసరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీరు...

అగ్రిగోల్డ్‌ అధినేతలకు జైలు

అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దారులకు సొమ్ములు ఎగవేసిన కేసులో ప్రధాన నిందితులైన సంస్థ ఛైర్మన్‌ అవ్వా వెంకటరామారావు, ఎండీ అవ్వా వెంకట శేషు నారాయణలను...