వీటిలో ఎన్నింటిపై చర్చ జరగనిద్దాం మేడం?
latestnews
వెంకన్న స్వామికి... వేవేల దండాలు
ఎన్టీఆర్‌స్టేడియంలో కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి
ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు భక్తులకు దర్శనం
కవాడిగూడ, న్యూస్‌టుడే
గోవింద నామస్మరణతో మహానగరం మార్మోగుతోంది. ఎన్టీఆర్‌ స్టేడియంలో తిరుమలవాసుడు కళ్ల ముందు కనిపిస్తుంటే పట్టరాని ఆనందంతో భక్తులు స్మరిస్తున్నారు. మంగళవారం నాలుగోరోజు వేలాది మంది భక్తులు వెంకన్నను దర్శించుకున్నారు. వ్యాపారవేత్తలు హర్షవర్ధన్‌ నాయుడు, సుబ్బారెడ్డి, ప్రభాకర్‌రెడ్డిల సౌజన్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ స్టేడియంలో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు భక్తి పూర్వకంగా నిర్వహిస్తున్నారు.

అష్టదళ పాద పద్మార్చన
1984లో తిరుమల వెంకన్న స్వామికి ఓ ముస్లిం భక్తుడు 108 బంగారు కమలం పుష్పాలను సమర్పించారు. నాటి నుంచి అష్టదళ పాద పద్మార్చన ప్రత్యేక పూజగా నిర్వహించడం ఆరంభమైంది. అదే విధంగా ఎన్టీఆర్‌ స్టేడియం వేదికపై కొలువు తీరిన గోవిందుడికి సైతం బంగారు పుష్పాలతో పాద పద్మార్చన నిర్వహించారు. అర్చకులు ధూపం వేసి, దీపాలు వెలిగించిన తరువాత 108 బంగారు కమలం పుష్పాలను స్వామివారి పాదాలపై వేస్తూ శాస్త్రోక్తంగా మంత్రాలు పఠించారు. వేలాది మంది భక్తులు తిలకించారు.

కౌసల్యా సుప్రజా రామా..
తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. తోమాలసేవ, కొలువు, అర్చన, నివేదన, శాత్తుమొర పూజలు శాస్త్రోక్తంగా జరిపారు. సాయంత్రం సహస్రదీపాల కాంతులలో వెంకన్న స్వామి వెలిగిపోయారు. ఉత్సవమూర్తులను వూరేగించారు. ప్రత్యేక వాయిద్యాలు మోగుతుండగా, కాగడాలు పట్టుకుని సేవకులు కదులుతుండగా కలియుగ దైవం పల్లకిలో వూరేగారు. పల్లకిని పట్టుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. వెంకన్న పవళింపు సేవ తిలకించే అదృష్టం నగరవాసులకు లభించింది. ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని గోవిందనామ స్మరణ చేశారు.

ఆవరణలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరం రద్దీగా కనిపించింది. బీపీ, షుగర్‌, థైరాయిడ్‌లాంటి పలు పరీక్షలను ఉచితంగా చేశారు. తిరుపతి తిరుమల పాత, కొత్త చిత్రాలతో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను పలువురు తిలకించారు. గోశాలలో గోసేవ చేసుకున్నారు. తిరుపతి ప్రసాదాల రుచులను ఆస్వాదించారు.

ఏపీ మంత్రులు పల్లె రఘనాథరెడ్డి, పత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్‌, సినీ నిర్మాత అశ్వనీదత్‌, తితిదే బోర్డు ఛైర్మన్‌ కృష్ణమూర్తి, బోర్డు సభ్యులు భానుప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌తోపాటు అనేక మంది పుర ప్రముఖులు పాల్గొన్నారు.


 


 
 
 


 
 
 


 
 


 
 


 
 
 


 
 


 
 
 


 
 
 


 


 
 


సుభద్ర భారతావని కోసం...

‘ఇప్పటికి ఏడేళ్లయింది... ముంబయి దాడులకు సూత్రధారులెవరో ఇండియా రుజువు చెయ్యలేకపోయింది... ఇప్పుడిక దాని తరం కాదు’...

Full Story...

అన్నీ ...ప్రశ్నలే?

‘ఉదయ్‌కిరణ్‌ను సాయికుమార్‌ నా రివాల్వర్‌తో కాల్చాడు. నా చేతుల్లోంచి బలవంతంగా దాన్ని తీసుకున్నాడు... భయంతో నేను పారిపోయాను’ ...

ఆయకట్టు... అదిరేట్టు!

చెరువుల సుందరీకరణతోపాటు వాటి కింద ఉన్న పంటపొలాలకు సాగునీరు అందించడానికి జిల్లా అధికారులు పక్కాగా ప్రణాళికలు వేస్తున్నారు. ఈ మేరకు ఎనిమిది చెరువులను ఎంపిక...

2జీ నుంచి 5జీ.. వైఫై.. వాట్సప్‌!

జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తులకు అధునాతనమైన మొబైల్‌ సేవలు అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల టెలికాం ఆపరేటర్లు పోటీ పడుతున్నారు.

నిధులున్నా.. నిర్లక్ష్యమే!

వరుసగా నాలుగు పంటలకు సాగు నీరు లేదు.. కూలీలు పనులు వెతుక్కుంటూ వలస బాట పడుతున్నారు.. సన్న, చిన్నకారు రైతులు చేయడానికి పని లేక...

జిల్లా ప్రాజెక్టులకు రూ.8,690.30 కోట్లు

జిల్లాలో ప్రధాన ఎత్తిపోతల పథకాలకు జూరాల ప్రాజెక్టు కింద పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరందించి జిల్లాను సస్యశ్యామలం చేయటం కోసం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు వచ్చే మార్చి 2016-17 బడ్జెట్‌లో...

రూ.18.50 కోట్లకు తూట్లు

గజ్వేల్‌ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు పట్టణంలో నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వాస్పత్రి పనుల్లో నాణ్యత కొరవడుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదారు ...

అందరి జీవితాల్లో వెలుగులు

‘‘పాలకులు మారుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి. మా జీవితాలు మాత్రం మారడం లేదు. మాకు భరోసా కల్పించే నాయకులే కరవయ్యారు. ఫ్లోరైడ్‌ మహమ్మారీ వల్ల మా...

బెల్లం.. బంగారమే..!

24క్యారెట్ల బంగారం కొనుగోలు చేయాలనుకున్నా వినియోగదారుల చిరునామా అవసరం లేదు. ముత్యాలు, వజ్రాల వ్యాపార ప్రాంతాల్లో కూడా అధికారులు సీసీ కెమేరాలను ఏర్పాటు చేయలేదు.

పది పరీక్షల్లో ‘కెమెరా’ల కల్లోలం...

ప్రతి ఒక్కరికీ పరీక్ష అనగానే ఏదో తెలియని ఉత్కంఠ సహజం. కొందరికి పరీక్షా కేంద్రం ఫోబియా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సీసీ కెమెరాలు పెడితే మరింత ఆందోళనకు గురయ్యే ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గుండెదడ, ...

ముందే సగం డబ్బులు

గ్రామాల్లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమిస్తూ మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టిపెట్టిన ప్రభుత్వం తాజాగా నిర్మాణాల్లో కొత్త నిబంధనలను ప్రవేశ పెట్టింది. మరుగుదొడ్ల నిర్మాణాన్ని మరింత...

బహిరంగ విఫణిలోకి మార్క్‌ఫెడ్‌

బహిరంగ మార్కెట్‌లో ఈనెల 5న క్వింటాలు కందుల ధర రూ.7000లు... 6న మార్క్‌ఫెడ్‌ రంగంలోకి దిగాక క్వింటా ధర రూ.7677లు... 9న ఇదే ధర వద్ద కొనసాగిన కొనుగోళ్లు... దీంతో తప్పనిసరై ప్రైవేటు...

హామీకి ఏడాది...ఆచరణకు దారేది

ఎక్కడపడితే అక్కడ పెంటకుప్పలు లేకుండా.. గ్రామం మొత్తం పశువులు ఒకే స్థలంలో ఉంటూ.. పాలను మద్దతు ధరకు అమ్ముతూ.. పశువులకు అందుబాటులో వైద్యులు, గడ్డి నిల్వ గోదాము..

మరో సంగమం

నదుల అనుసంధానంలో భాగంగా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు తరలించిన రాష్ట్ర ప్రభుత్వం.. పశ్చిమ కృష్ణాలోనూ మరో ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది. తిరువూరు...

చిత్రావతిలో ఇసుక దొంగలు!

చిత్రావతి నదిలో ఇసుకాసురులు తిష్టవేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వెరసి సహజ వనులు ధ్వంసం అవుతున్నాయి. అక్రమ రవాణాను అరికట్టాల్సిన యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది.

రబీ సాగుకు ఎత్తిపోతలు

జిల్లాలో రబీలో సాగునీటి ఎద్దడి నివారణకు నీటిపారుదల శాఖ యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. రబీలో పంటకు నీటి సమస్య తలెత్తకుండా గోదావరిలో తాత్కాలిక...

కొత్త పారిశ్రామికవేత్తలకు ‘వసతుల’ హారతి

చుట్టుపక్కల జిల్లాలకు కొత్త పరిశ్రమలు వరుసగా వస్తుంటే.. కడప జిల్లా వైపు మాత్రం ఎవరూ తొంగి చూడడం లేదు. వేలాది ఎకరాల భూమి అందుబాటులో...

కళ్లను పొడిచే రెప్పలు.. గుడ్లను మింగే పాములు

గ్రామీణ నిరక్షరాస్యత.. కొందరి వైద్యుల అత్యాశ.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం... ఆడశిశువులకు మరణశాసనం రాస్తున్నాయి. లింగనిర్ధారణ పరీక్షలపై నిఘా ఉంచాల్సిన యంత్రాంగం...

జిల్లాలో ‘జిందాల్‌’ పవర్‌

నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయనున్న కినెట థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌పై ప్రతిష్టంభన తొలగింది. థర్మల్‌ పవర్‌ ప్లాంటు నిర్మాణం చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ థర్మల్‌ కేంద్రం వాటాలను...

పీజీ.. ఈజీ కాదు

రిమ్స్‌కు రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది.. ఇప్పుడిప్పుడే అరుదైన శస్త్రచికిత్సలతో పేదల మనసులకూ దగ్గరవుతోంది.. కానీ.. అందుకు తగ్గట్లు వైద్యుల సంఖ్య పెరగకపోవడం కొత్త సమస్యలకు దారి తీస్తోంది.

పలాసలో నాణ్యత పలాయనమే!

నీటి పథకం అంటే... ‘అవినీతి మయం’ అనే మాట ఇక్కడ రుజువవుతోంది. తాగునీటి సరఫరా నిధులంటే... జేబులో వేసేసుకొవచ్చనే ఆరోపణలు ఇక్కడ నిజమే అనేలా పనులు సాగుతున్నాయి.

వెళ్లొస్తాం..

భౌగోళికంగా విడివిడిగా ఉన్నా.. మహా సాగరాల్లో మనమంతా ఒక్కటే అన్న నినాదం మారుమోగించి.. విశాఖ సాగర తీరాన మనతో మమేకమై.. మన ఆతిథ్యానికి మెచ్చి.. జనంతో సందడి...

పచ్చ‘ధనానికి’ రెక్కలు...!

సాధారణంగా మన ఇంటివద్ద ఒక మొక్క వేస్తే ప్రతిరోజూ ఎలా ఉందో చూసుకుంటాం. ఎండిపోతే నీరు పోసి సంరక్షణ చర్యలు చేపడతాం. ఎదిగే వరకూ అన్ని చర్యలు...

చిన్న మోసం.. పెద్ద లాభం

తూనికలు-కొలతలు శాఖ మొద్దునిద్ర పోతోంది. ఎంతలా అంటే వారి అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో వివిధ విభాగాలకు సంబంధించి 28 వేల దుకాణాలు నమోదై ఉంటే కేవలం వీటిలో...