అరబ్‌ దేశాల్లో ఆదాయంపన్ను లేదట సార్‌, ఆస్ట్రియాలో ధరలు పెరగవట, చైనాలో పీఎఫ్‌ కోత ఉండదట...
latestnews
గెలుపు ఘనం..లెక్క సమం..
ధావన్‌ ధనాధన్‌ 50
రెండో టీ20లో లంకను చిత్తు చేసిన టీమ్‌ ఇండియా
రాంచి


‘‘బ్యాట్స్‌మెన్‌ దాదాపుగా 200 పరుగులు చేశారు. అయితే.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకున్న బౌలర్లదే గెలుపు ఘనతంతా. ప్రయోగం అన్న మాటను భారత క్రికెట్లో నిషేధించారు! ఐతే ఈ సిరీస్‌లో వీలుచిక్కినప్పుడల్లా.. భిన్నమైన క్రికెట్‌ ఆడేందుకు ప్రయత్నిస్తున్నాం. టీ20 ప్రపంచకప్‌ ముందు జట్టులోని అందరికీ అవకాశం ఇవ్వాలన్నదే మా ప్రయత్నం’’
- మహ్రేంద సింగ్‌ ధోని
‘‘టీ20ల్లో తొలి అర్ధసెంచరీ సాధించినందుకు ఆనందంగా ఉంది. సహజ సిద్ధమైన ఆటను ఆడేందుకు ఇష్టపడతా. ఈ విషయంలో కెప్టెన్‌తో పాటు కోచింగ్‌ సిబ్బంది మద్దతు నాకు ఉంది’’
- ధావన్‌

 మొన్న మనోళ్లు పరాజయం మాత్రమే చవిచూశారు.. ఇప్పుడు లంకేయులకు పరాభవమే రుచి చూపించారు. బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం కారణంగా స్వల్ప తేడాతో ఓడిన భారత్‌.. ఈసారి ఆ బ్యాట్స్‌మెన్‌ మెరుపులకు బౌలర్ల ప్రతిభ కూడా తోడవడంతో భారీ విజయం నమోదు చేసింది. శుక్రవారం ధోని సొంతగడ్డ రాంచిలో 69 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి చివరిదాకా భారత్‌ ఆధిపత్యం సాగిన పోరులో లంక నుంచి పోటీనే లేకపోయింది. టీ20ల్లో తొలి అర్ధశతకం సాధించిన శిఖర్‌ ధావన్‌.. ఆరంభంలోనే మ్యాచ్‌ను లంకేయులకు దూరం చేశాడు.

లంకతో తొలి టీ20లో ఎదురైన షాక్‌ నుంచి భారత్‌ త్వరగానే కోలుకుంది. రెండో టీ20లో ఘనవిజయంతో సిరీస్‌పై ఆశల్ని సజీవంగా నిలుపుకోవడమే కాదు.. నిర్ణయాత్మక మూడో టీ20కి ముందు కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. శుక్రవారం బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు సమష్టిగా రాణించడంతో భారత్‌ రెండో టీ20లో సునాయాస విజయం సాధించింది. మొదట ఓపెనర్లు ధావన్‌ (51; 25 బంతుల్లో 7×4, 2×6), రోహిత్‌ (43; 36 బంతుల్లో 2×4, 1×6)లతో పాటు అజింక్య రహానె (25; 21 బంతుల్లో 3×4), సురేశ్‌ రైనా (30; 19 బంతుల్లో 5×4), హార్ధిక్‌ పాండ్య (27; 12 బంతుల్లో 1×4, 2×6) మెరుపులు మెరిపించడంతో 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసిన భారత్‌.. ప్రత్యర్థిని 127/9కే కట్టడి చేసింది. అశ్విన్‌ (3/14), నెహ్రా (2/26), జడేజా (2/24), బుమ్రా (2/17) లంక బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. ధావన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. చివరిదైన మూడో టీ20 ఆదివారం విశాఖపట్నంలో జరుగుతుంది.

తొలి బంతికే స్టంపింగ్‌:
బ్యాటింగ్‌ను ఎంత బాగా ఆరంభించిందో బౌలింగ్‌లోనూ అంతే మంచి ఆరంభాన్ని అందుకుంది భారత్‌. సొంతగడ్డపై పిచ్‌ గురించి పూర్తి అవగాహన ఉన్న ధోని.. నేరుగా అశ్విన్‌ చేతికి బంతి అప్పగించేశాడు. వైడ్‌తో బౌలింగ్‌ ఆరంభించిన అశ్విన్‌.. తర్వాత తొలి బంతికే దిల్షాన్‌ను ఔట్‌ చేసి లంకకు షాకిచ్చాడు. అశ్విన్‌ బంతిని ముందుకొచ్చి ఆడబోయిన దిల్షాన్‌ స్టంపౌటైపోయాడు. నెహ్రా తన తొలి బంతికే మరో ఓపెనర్‌ గుణతిలక (2)ను, తన రెండో ఓవర్లో ప్రసన్న (1)ను పెవిలియన్‌ చేర్చడంతో లంక ఓటమికి గట్టి పునాదే పడింది. 16/3తో నిలిచిన లంక.. 15 ఓవర్లయినా ఆడుతుందా, 70-80 పరుగులైనా చేస్తుందా అనిపించింది. ఐతే చండిమాల్‌ (31), కపుగెదర (32), సిరివర్ధన (28 నాటౌట్‌), శనక (27) నిలిచారు. లంక స్కోరును వంద దాటించారు. పేసర్‌ బుమ్రాకు ధోని 16వ ఓవర్లో కానీ బౌలింగ్‌ ఇవ్వలేదు. తొలి ఓవర్లో 13 పరుగులిచ్చుకున్న బుమ్రా.. తన రెండో ఓవర్లో ఒక్క పరుగే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఆ ఓవరంతా యార్కర్లతో బెంబేలెత్తించాడతను. అతడి బౌలింగ్‌లో చమీర బౌల్డయినపుడు.. స్టంప్‌ విరిగిపోవడం విశేషం. 18వ ఓవర్లోనే 9వ వికెట్‌ కోల్పోయిన లంక.. సిరివర్ధన, రజిత (3 నాటౌట్‌)ల పోరాటంతో ఆలౌట్‌ కాకుండా మ్యాచ్‌ ముగించింది.

200 దోబూచులాట!: పుణెలో లాగే రాంచిలోనూ భారత్‌ను కూల్చేద్దామనుకుందో ఏమో.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టాస్‌ గెలిచి బౌలింగే ఎంచుకుంది లంక. కానీ ఈసారి లంక బౌలర్ల పప్పులుడకలేదు. పేసర్లకు సహకరించిన పిచ్‌పై చెలరేగిపోయి సంచలన అరంగేట్రం చేసిన రజిత ఈసారి 4 ఓవర్లలో వికెట్‌ లేకుండా 45 పరుగులు సమర్పించుకున్నాడంటే.. భారత బ్యాటింగ్‌ జోరెలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ధోనీసేనతో ఈ మ్యాచ్‌లో 200 స్కోరు దోబూచులాడింది. ఓపెనర్ల జోరు చూస్తే భారత్‌ సునాయాసంగా 200 దాటేసేలా కనిపించింది. మధ్యలో తడబాటు చూస్తే ఆ స్కోరు అసాధ్యంలా కనిపించింది. మళ్లీ చివరి ఓవర్లలో మెరుపులతో 200 దాటేలా కనిపించింది. ఐతే తిసార పెరీరా హ్యాట్రిక్‌తో దెబ్బ కొట్టడంతో చివరికి భారత్‌ ఆ మార్కుకు 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

ఇప్పటిదాకా టీ20ల్లో అర్ధశతకమే సాధించని ధావన్‌.. శుక్రవారం చెలరేగిపోయి 22 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. రోహిత్‌ నెమ్మదిగా ఆడుతుంటే.. ధావన్‌ మాత్రం మెరుపు షాట్లతో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రెండో ఓవర్లో పెరీరాకు, మూడో ఓవర్లో సేననాయకెకు సిక్సర్ల రుచి చూపించిన ధావన్‌.. రజిత వేసిన నాలుగో ఓవర్లో హ్యాట్రిక్‌ ఫోర్లు బాదాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించడంతో భారత్‌ పవర్‌ప్లే ముగిసేసరికి 70/0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. తర్వాతి ఓవర్లో అర్ధశతకం పూర్తి చేసిన ధావన్‌.. చివరి బంతికి పెవిలియన్‌ చేరడంతో లంక వూపిరి పీల్చుకుంది. రోహిత్‌, రహానె బాగానే ఆడినా బౌండరీలు తగ్గిపోవడంతో స్కోరు వేగం కాస్త తగ్గింది. అయినప్పటికీ 13 ఓవర్లలో 122/1తో పటిష్ట స్థితిలోనే కనిపించింది భారత్‌. ఐతే తర్వాతి రెండు ఓవర్లలో రోహిత్‌, రహానె పెవిలియన్‌ చేరడం.. తొమ్మిది పరుగులే రావడంతో 15 ఓవర్లకు స్కోరు 131/3కు చేరుకుంది. ఈ దశలో కొత్త కుర్రాడు హార్ధిక్‌ పాండ్యను ముందు పంపాలన్న ధోని ఆలోచన ఫలించింది. రైనాతో కలిసి పాండ్య మెరుపులు మెరిపించడంతో 3 ఓవర్లలోనే 48 పరుగులొచ్చాయి. సేననాయకె ఓవర్లో పాండ్య రెండు వరుస సిక్సర్లు బాదడం విశేషం. చివరి 2 ఓవర్లలో ఒకే బౌండరీ రావడంతో 17 పరుగులే నమోదయ్యాయి.
 
తిసార హ్యాట్రిక్‌
తిసార పెరీరా లంక తరఫున టీ20ల్లో తొలి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. మొత్తంగా టీ20ల్లో ఇది నాలుగో హ్యాట్రిక్‌ మాత్రమే. 19వ ఓవర్‌ చివరి మూడు బంతులకు పెరీరా వరుసగా పాండ్య, రైనా, యువరాజ్‌లను పెవిలియన్‌ చేర్చాడు. మూడూ క్యాచ్‌ ఔట్లే. మ్యాచ్‌లో తిసార గణాంకాలు 3-0-33-3 కావడం విశేషం.
స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌:
రోహిత్‌ శర్మ (సి) అండ్‌ (బి) చమీర 43; ధావన్‌ (సి) చండిమాల్‌ (బి) చమీర 51; రహానె (సి) దిల్షాన్‌ (బి) సేననాయకె 25; రైనా (సి) చమీర (బి) తిసార పెరీరా 30; హార్ధిక్‌ పాండ్య (సి) గుణతిలక (బి) తిసార పెరీరా 27; ధోని నాటౌట్‌ 9; యువరాజ్‌ (సి) సేననాయకె (బి) తిసార పెరీరా 0; జడేజా నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 196

వికెట్ల పతనం:
1-75, 2-122, 3-127, 4-186, 5-186, 6-186

బౌలింగ్‌:
రజిత 4-0-45-0; తిసార పెరీరా 3-0-33-3; సేననాయకె 4-0-40-1; చమీర 4-0-38-2; ప్రసన్న 3-0-21-0; సిరివర్ధన 1-0-6-0; శనక 1-0-12-0

శ్రీలంక ఇన్నింగ్స్‌: గుణతిలక (సి) ధోని (బి) నెహ్రా 2; దిల్షాన్‌ (స్టంప్డ్‌) ధోని (బి) అశ్విన్‌ 0; ప్రసన్న (సి) యువరాజ్‌ (బి) నెహ్రా 1; చండిమాల్‌ (స్టంప్డ్‌) ధోని (బి) జడేజా 31; కపుగెదర (సి) పాండ్య (బి) జడేజా 32; సిరివర్ధన నాటౌట్‌ 28; శనక (సి) రైనా (బి) అశ్విన్‌ 27; తిసార పెరీరా (సి) రహానె (బి) అశ్విన్‌ 0; సేననాయకె ఎల్బీ (బి) బుమ్రా 0; చమీర (బి) బుమ్రా 0; రజిత నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 127

వికెట్ల పతనం:
1-2, 2-3, 3-16, 4-68, 5-68, 6-116, 7-117, 8-119, 9-119

బౌలింగ్‌:
అశ్విన్‌ 4-0-14-3; నెహ్రా 3-0-26-2; యువరాజ్‌ 3-0-19-0; జడేజా 4-0-24-2; రైనా 2-0-22-0; బుమ్రా 3-0-17-2; పాండ్య 1-0-5-0


దోమకాటుకు తెర!

శతాబ్దాలుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి మలేరియాపై నరేంద్ర మోదీ ప్రభుత్వం యుద్ధభేరి మోగించింది. మశక సంతతి ద్వారా...

Full Story...

విశ్వనగరం... మా లక్ష్యం

‘‘ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించడం, పారిశుద్ధ్యానికి పెద్దపీట వేయడం, హైదరాబాద్‌ను ‘హరితనగరం’గా తీర్చిదిద్దడం.. మా ముందున్న లక్ష్యాలు. వర్షపు నీటిని సక్రమంగా వినియోగించుకునేలా...

వినిపించాలి... మురళీరవాలు

ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని మురళీనగర్‌, లేమూరు గ్రామాలు సాధించిన ప్రగతి చాలా బాగుందని గ్రామీణాభివృద్ధిపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు ప్రశంసించారు.

జాతర మార్గాల్లో ఇంకా లోపాలు..

గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ సారి మేడారం జాతరకు ఎక్కువ రహదారులు భక్తులకు అందుబాటులోకి వచ్చినా సంబంధిత పనుల్లో మాత్రం ఇంకా అలసత్వం...

తోటి ఉద్యోగినీ వదల్లేదు..

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి వికృత రూపానికి పరాకాష్ట ఈ ఉదంతం.. చేయి తడపనిదే పని జరగదనే అపవాదు ఇప్పటికే ఉన్నా.. దీని విశ్వరూపం మరింత విస్తృతమైంది.

తాగునీటికి గడ్డుకాలం

కరవులతో పంటల్లేక ఏటా వలసబాట పట్టే పాలమూరు ఈ ఏడాది తాగునీటికీ వలస వెళ్లాల్సి వస్తోంది. ప్రకృతి వైపరీత్యానికి తోడు ముందుచూపు కొరవడటంతోనే ఈ దుస్థితి నెలకొంది.

ఎవరిదో విజయం

ఖేడ్‌ నియోజకవర్గ చరిత్రలో తొలిసారిగా శనివారం ఉప ఎన్నిక జరుగబోతోంది. ఎమ్మెల్యే కిష్టారెడ్డి గత ఆగస్టు 25న గుండెపోటుతో కన్నుమూయగా అనివార్యమైన దీనిని...

‘సర్వే’జనా సుఖినోభవంతు

శతాబ్ద కాలం నాటి దస్త్రాలు.. అప్పట్లో నాటిన హద్దురాళ్లు కనుమరుగు.. చెదిరిపోయిన భూముల హద్దులు.. వెరసి నిత్యం ఎక్కడోఓచోట భూవివాదం.

స్వపక్షం.. విపక్షం.. గరం.. గరం

నన్ను జడ్పీ సమావేశానికి రమ్మని పిలిచారు.. సంతోషం.. కానీ నాకు అజెండా నకలు(కాపీ) పంపించలేదు.. నాది ఎస్టీ నియోజకవర్గం గిరిజనులు పోడు వ్యవసాయం...

చట్టానికి తూట్లు..!

విద్యా హక్కు చట్టం ఏం చెబుతోందంటే.... విద్యా రంగంలో ఉన్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది బోధనేతర పనులు చేయడానికి వీలు లేనే లేదు.

భక్తజనంతో పులకించిన బాసర

బాసరలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు అందజేశారు.

రయ్యి రయ్యిన..

నాగరికతకు చిహ్నాలైన రహదారులు బాగుంటేనే ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. అభివృద్ధి వేగవంతమవుతుంది. రాష్ట్ర విభజన తర్వాత రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర...

బియ్యమా.. బియ్యమా.. ఎందుకు తగ్గావు?

రేషన్‌ దుకాణంలో తూకం తగ్గుదలపై పొరపాటున ఎవరైనా ప్రశ్నించారా..చిన్నప్పుడు అందరం చదువుకున్న చేపా చేపా ఎందుకు ఎండలేదు కథ చెబుతారు...

పుష్కర నివేదిక సిద్ధం

రాజధాని ప్రాంతంలో 12 రోజులు జరిగే అతిపెద్ద వేడుక కృష్ణా పుష్కరాలని, అన్ని శాఖలూ బాధ్యతగా నిర్వహణను చేపట్టాలని కలెక్టర్‌ బాబు.ఎ అన్నారు. పుష్కరాల ఏర్పాట్లపై వివిధ శాఖల...

సూక్ష్మంలో అవినీతి సేద్యం!

కర్షక సంక్షేమమే ధ్యేయంగా తక్కువ నీటి వినియోగంతో పంటలు పండించి.. అధిక దిగుబడి పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సూక్ష్మసేద్యం...

అభ్యంతరాల ‘బృహత్తరం’

అన్నవరం దేవస్థానం అభివృద్ధికి ఇటీవల రూపొందించిన బృహత్తర ప్రణాళికపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరోసారి లోతుగా అధ్యయనం చేయాలని...

తరలిస్తోంది మన్ను కాదు.. భావితరాల దన్ను

జిల్లాలో సహజ వనరుల సంరక్షణకు కంకణం కట్టుకోవాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. జిల్లాలో పేరుమోసిన వృక్ష సంపదను...

పింఛనామం

జిల్లాలో పింఛన్ల పంపిణీలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. అర్హులు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం...

ఇక నామినేషన్‌పై పనుల పందేరం!

నెల్లూరు నగరపాలక సంస్థలో అభివృద్ధి పనుల టెండర్లలో రాజకీయ దుమారం రేగడంతో నామినేషన్‌ పనుల పందేరానికి తెర లేపారు. రూ.5 లక్షలలోపు పనులను...

రైతుకు కాదు.. ‘రారాజు’...

ఫలాల్లో రారాజు మామిడి. రుచికి తగ్గట్టే పండించిన రైతులకూ ఒకప్పుడు లాభాలను ఆర్జించి పెట్టింది. అయితే ఇప్పుడా పరిస్థితి మారింది. వరుసగా మూడో ఏడాదీ మామిడి రైతులు...

పాలనా సంస్కరణలతోనే అభివృద్ధి

చిన్నచిన్న తప్పులు చేసిన ఎందరో ఉద్యోగులు కష్టాలు అనుభవిస్తున్నారు. ఇందుకు వారు చేసిన అవినీతే కారణం. ఉద్యోగులు సమర్థంగా పని చేయాలన్నా...

మహా యోగం!

దేశంలోని ఆకర్షణీయ నగరాల ఉత్తమ 20 జాబితాలో స్థానం పొందిన మహా విశాఖ నేడు అమెరికా సహాయంతో అభివృద్ధి చెందనున్న తొలి నగరంగా గుర్తింపు దక్కించుకుంది. అభివృద్ధి కేవలం పరిమిత...

తాగునీటి సమస్యపై అప్రమత్తం

జిల్లాలో మే నెలనాటికి తాగునీటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. వేసవి నేపథ్యంలో ముందుగా అప్రమత్తమైనట్లు గ్రామీణ నీటిసరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీరు...

అగ్రిగోల్డ్‌ అధినేతలకు జైలు

అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దారులకు సొమ్ములు ఎగవేసిన కేసులో ప్రధాన నిందితులైన సంస్థ ఛైర్మన్‌ అవ్వా వెంకటరామారావు, ఎండీ అవ్వా వెంకట శేషు నారాయణలను...