దీన్ని కమ్యూనిస్టు పార్టీకీ, దీన్ని తృణ మూల్‌కూ, దీన్ని డీఎంకేకూ, దీన్ని...
latestnews
సౌర సౌందర్యం!
తక్కువ స్థలంలో.. ఎక్కువ నాణ్యతతో సౌరఫలకలు
ఐఐటీ హైదరాబాద్‌ అంకురసంస్థ ప్యూర్‌ఎనర్జీ వినూత్న ప్రయోగం
ఇంజినీరింగ్‌ కళాశాలలకు విస్తరించాలని యోచన
ఈనాడు - హైదరాబాద్‌
సౌర విద్యుత్‌ ఏర్పాటు చేసుకోవాలని ఉంటుంది.. కానీ, మేడపైన, ఇంటిముందు ప్రాంగణం.. ఇలా స్థలమేదైనా సౌరఫలకలతో నిండిపోతోందనేది చాలామంది ఫిర్యాదు. ఇందుకు పరిష్కారాన్ని కనిపెట్టింది ఐఐటీ హైదరాబాద్‌లోని అంకుర సంస్థ ప్యూర్‌ఎనర్జీ. స్థల వృథాను నివారించడంతో పాటు అందంగా సౌర ఫలకలను అమర్చుకోవడమెలాగో చేసిచూపిస్తోందీ సంస్థ. కొబ్బరి చెట్టులా.. కారు పార్కింగ్‌లా.. రకరకాల ఆకృతుల్లో భూ ఉపరితలంపైకి లేపి సౌరవిద్యుత్‌ ఫలకలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ శివార్లలోని రామచంద్రమిషన్‌ ప్రాంగణంలో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేశారు. ‘‘కేవలం అందంగా కనిపించడమేగాకుండా బోలెడంత స్థలం కలసిరావడం; అందమైన ఆకృతికి అదనపు సౌకర్యాలను ఏర్పాటు చేసుకొనేలా ప్రయోగం చేశాం. వీటికి అమర్చే స్తంభాలకు అదనపు కెమెరాలు, డిస్‌ప్లే బోర్డులు వంటివాటిని ఏర్పాటు చేసుకోవచ్చు. రూ.3.5 లక్షల్లో మేం అత్యంత నాణ్యమైన పరికరాలతో 2.65 కిలోవాట్ల సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాం. ఇది మూడిళ్లకు 24 గంటలూ నిరంతరాయంగా సరఫరా అవుతోంది. నీటిబోరు కూడా పనిచేస్తోంది. మార్కెట్‌తో పోల్చితే ఇది చాలా తక్కువ ధర. భారీస్థాయిలో చేస్తే మరింత తగ్గుతుంది. రెసిడెన్షియల్‌ కమ్యూనిటీ, గేటెడ్‌ కమ్యూనిటీ, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రాంగణాల్లో వీటిని అమర్చుకుంటే ఎంతో లాభం. గోడకు అమర్చేలా రూపొందించిన నాణ్యమైన ఇన్వర్టర్‌కు యూఎస్‌బీ అవకాశం కూడా కల్పించాం. తద్వారా ఎంత విద్యుత్‌ ఉత్పత్తి అవుతోందో, ఎంత వినియోగమవుతోందో.. ఎప్పటికప్పుడు సంక్షిప్త సందేశం ద్వారా తెలుసుకునే అవకాశముంది’’ అని ప్యూర్‌ ఎనర్జీ వ్యవస్థాపకుడు, ఐఐటీ హైదరాబాద్‌ ఆచార్యుడు దొంగరి నిషాంత్‌ ‘ఈనాడు’కు తెలిపారు. తమ అంకుర ప్రయోగంలో రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలలను, విద్యార్థులను భాగస్వామ్యం చేయాలనుకుంటున్నట్లు నిషాంత్‌ తెలిపారు. ‘‘మన ఇంజినీరింగ్‌ కళాశాలల్లో వీటిని ఏర్పాటు చేస్తే అటు ఇంధన ఖర్చులపరంగానే కాకుండా.. విద్యార్థులకు ప్రాజెక్టు రూపంలోనూ అనుభవం వస్తుంది. ప్రయోగశాలలను, క్యాంటీన్లను ఈ సౌరఫలకలతో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్‌ కళాశాలలు ముందుకొస్తే వారికి ప్రాజెక్టులు చేసిపెడతాం. తద్వారా విద్యార్థులు డిజైనింగ్‌, పవన విశ్లేషణ, సౌరవిద్యుత్‌ ఏర్పాటులో అనుభవం గడిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీస్థాయిలో సౌరవిద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నాయి. కానీ, ఆ రంగంలో సాంకేతిక నైపుణ్యమున్న మానవ వనరుల కొరత మనకుంది. దీన్ని అధిగమించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది’’ అని నిషాంత్‌ వివరించారు. భవిష్యత్తులో తెలంగాణ రైతులకు ఉపయోగపడేలా తక్కువ ధరకు సౌర పంపుసెట్లను కూడా రూపొందించే ప్రయత్నం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.


ప్రేమికుల రోజు

మనిషి దాచిపెట్టలేని విషయాలు రెండు ఉన్నాయన్నాడొక ఆంగ్ల రచయిత. తాగిన సంగతి, ప్రేమలో పడ్డ విషయం- రెండూ ఎదుటివారికి...

Full Story...

ఆన్‌లైన్‌లో సమాచారం ఇస్తే...పోలీసులే చూసుకుంటారు

‘‘సర్‌... నాపేరు రమేష్‌ యాదవ్‌... సికింద్రాబాద్‌లో ఉంటున్నా. నా ద్విచక్ర వాహనాన్ని అమ్మి 16 నెలలయింది. రెండు నెలల నుంచి ఇంటికి ఇ-చలానాలు వస్తున్నాయి.

ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిందే!

ప్రతిపక్ష పార్టీలు విఫలమైన నేపథ్యంలో ప్రజల సమస్యను పరిష్కరించే దిశగా తెలంగాణ రాష్ట్రంలో విద్యావంతుల వేదిక ప్రతిపక్ష పాత్ర పోషించాలంటూ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సూచించారు.

నేటి నుంచి ప్రత్యేక బస్సులు

మేడారం జాతర సందర్భంగా నేటి నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ జేఎండీ గండ్ర వెంకట రమణారావు పేర్కొన్నారు. శనివారం హన్మకొండ బాలసముద్రంలోని ఆర్టీసీ ప్రత్యేక...

అదిగో... జన జాతర!

రెండేళ్లకు ఒకసారి వచ్చే సమ్మక్క, సారలమ్మ జాతర ఉత్సవాల సందడి నెలకొంది. వరంగల్‌ జిల్లా మేడారంలో జరిగే మహా జాతరకు ఇప్పటికే భక్తజనం పెద్దసంఖ్యలో తరలుతోంది.

ఉలుకూ పలుకు లేని పీఎంఏవై

ఏడేళ్ల సుదీర్ఘ కాలవ్యవధి అనంతరం జిల్లాలోని మూడు పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసిన పీఎంఏవై (ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన) ఇళ్ల పథకం.. ఆచరణలో ఉలుకూ పలుకు...

ఓటెత్తారు

నారాయణఖేడ్‌ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోటెత్తారు. యువత నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా పోలింగ్‌...

మిషన్‌-2లో మనమే నం: 1

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చిన్న నీటి వనరుల పునరుద్ధరణ (మిషన్‌ కాకతీయ పథకం-2) వేగమందుకుంది. చెరువుల ఎంపిక మొదలుకొని టెండర్ల ప్రక్రియ, పనుల ప్రగతిలో...

జలపుష్ప’ విలాపం

చేపప్రియులకు చేదు సంవత్సరమే.. ఈసారి జలపుష్పాలు వికసించలేదు. వర్షాభావం, వ్యాధులు వెరసి జిల్లాలో చేపల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయి. మత్స్యసంపదకు పేరున్న మన...

మన కూరగాయలు... మనమే పండించాలి

‘మన రాష్ట్రానికి అవసరమైన కూరగాయలు మనమే పండించుకోవాలి. ఇతర రాష్ట్రాల దిగుమతులకు చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉంది.

బియ్యం దొంగలు

పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న దొంగల మెడకు ఉచ్చు బిగుస్తోంది. నిఘా వర్గాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపారు. అక్రమాల చిట్టా...

స్థానిక పాలన స్తంభన

పల్లె పాలనలో పారదర్శకత తేవడానికి, ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో తీసుకురావడానికి అన్ని గ్రామపంచాయతీలను డిజిటల్‌గా మార్చారు. తడి, పొడి చెత్త వేరుచేసి గ్రామానికి దూరంగా...

ఏడు కొండలవాడు..

రథసప్తమి పర్వదినాన.. శ్రీనివాసుని భక్తకోటి ఆరాధించనుంది. మాఘశుద్ధ సప్తమి పర్వదినాన సూర్యజయంతి సందర్భంగా అరుణోదయ కాలంలో స్నానం చేయడం, సూర్యుణ్ణి ధ్యానించడం...

కలిసి సాగితే.. కదులు జలం

జిల్లా వాసుల తాగునీటి అవసరాల కోసం ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల ప్రారంభమైంది. పురపాలక, గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీరాజ్‌, నీటి పారుదల...

మేల్కొంటేనే.. గొంతు తడిచేది!

ఈ చిత్రంలో కనిపిస్తున్న సమగ్ర రక్షిత నీటి పథకం తలుపుల మండలం సంకటివారిపల్లి గ్రామానికి చెందినది. ఏడాది కిందట బోరు వేశారు. ఆరు నెలల కిందట మోటారు కాలిపోయింది.

ఆగని దందా

జిల్లాలో ఇసుక ర్యాంపుల నిర్వహణ అధికారికంగా లేకపోయినా ఇసుకాసురులకు మాత్రం కొరత కనిపించడం లేదు. ఓ వైపు ఇసుక తవ్వకాలకు సంబంధించి నూతన విధానానికి టెండర్ల...

వేగంగా పనులు చేయకుంటే రూ.కోట్ల నిధులు వెనక్కి

నిధులు తక్కువగా ఉన్నాయని శాఖల వారీగా అధికారులు గగ్గోలు పెట్టారు.. పనుల్ని పరుగెత్తించాలంటే నిధులు కావాలన్నారు.. తీరా ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చేసరికి వివిధ...

ఈ జంటలపై ‘ప్రేమ’ ఎప్పుడు?

కులాల మధ్య అంతరాలను తొలగించే కుల, మతాంతర వివాహాలు చేసుకునే దంపతులకు ఇచ్చే ప్రోత్సాహకానికి ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. సొంతంగా నిలదొక్కుకోవడానికి పనికొస్తుందని ప్రేమ జంటలెన్నో ఎదురుచూస్తున్నా ఫలితం అందడం లేదు.

అవినీతిపై ‘నిఘా’

నెల్లూరు నగరపాలక సంస్థకు ప్రధాన ఆదాయం ఆస్తి పన్ను. ఏడాదికి దాదాపు రూ.60 కోట్లు రావాల్సి ఉంది. వాస్తంగా వసూళ్లు రూ.20 కోట్లు మించడంలేదు. కారణం సిబ్బంది...

మొక్కు‘బడులు’

ఉపాధ్యాయుల సర్దుబాటు ద్వారా విద్యాప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యానికి ఆదిలోనే గండిపడడంతో జిల్లాలోని పశ్చిమంలో గురువుల కొరతతో విద్యార్థులు చదువులకు దూరమవుతున్నాయి.

ప్రాణానికి ఖరీదు!

ప్రమాదాలు చెప్పి జరగవు. అనుకోని విధంగా ఎదురవుతాయి. తలరాతను మార్చేస్తుంటాయి. అలా అని ప్రమాదాలెలా జరిగాయో...

కళ్ల ముందు కలల వాహనం

రయ్‌ రయ్‌మని దూసుకుపోయే కుర్రకారును ఆకట్టుకునే బైక్‌లు...సకల సౌకర్యాల సమాహారంగా నిండిన కార్లు... మహిళలు మెచ్చే ద్విచక్ర వాహనాలు... రవాణాకు ఉపయోగించే ఆటోలు...

విజయ‘నగరం’ కాదు

విజయనగరం నగర పాలక సంస్థ ఆవిర్భవించి రెండు నెలలు గడవక ముందే మళ్లీ పురపాలక సంస్థగా మారిపోయింది... కార్పొరేషన్‌గా మారితే విజయనగరం పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతుంది ఇక...

తెల్లబోయేలా తూకాలు!

విపణిలో లభిస్తున్న వివిధ రకాల కంపెనీల బియ్యం బస్తాల్లో తూకం తరుగు ఉంటోంది. 25 కిలోల బియ్యం బస్తా కొంటే అది కచ్చితంగా 24 కిలోలో, 23.50 కిలోలో ఉంటోంది.