అరబ్‌ దేశాల్లో ఆదాయంపన్ను లేదట సార్‌, ఆస్ట్రియాలో ధరలు పెరగవట, చైనాలో పీఎఫ్‌ కోత ఉండదట...
latestnews
నిగనిగల్లో నిజమెంత?
మార్కెట్‌లో నిగనిగలాడుతున్న తాజా కూరగాయలను కొంటున్నారా ఒక్కసారి ఆలోచించండి.ఆకుకూరలు, గుత్తి వంకాయ, బెండకాయలు, టమాటా, మిర్చి, క్యాలీఫ్లవర్‌ తదితరాలను తీసుకునే ముందు ఓసారి వాసన చూడండి. వాటిపై పిచికారి చేసిన రసాయనాలు గుప్పుమంటున్నాయి. ఈ రసాయనాల అవశేషాలను కంటితో గుర్తించలేరు. నీటిలో బాగా కడగకుండా వంట చేశారా ఆహారం కాస్తా విషతుల్యం అవుతుంది.
నూజివీడు రూరల్‌, న్యూస్‌టుడే
తాజా కూరగాయలతో పాటు యాపిల్‌, అరటి, ద్రాక్ష, దానిమ్మ, సపోటా పండ్లలోనూ పురుగుమందుల అవశేషాలు ఉంటున్నాయి. ఈ అవశేషాలు ఆహారంలో శరీరంలోకి ప్రవేశించి నాడీ సంబంధ వ్యాధులు, కేన్సర్‌ వంటి రోగాల భారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.

తోటకూర, పాలకూర, గోంగూర వంటి ఆకుకూరలకు ప్రస్తుతం తెగుళ్ల బెడద అధికం. రైతులు విషపూరిత రసాయనాలను పిచికారి చేసి రోజు విడిచి రోజు సదరు ఆకుకూరలను మార్కెట్‌కు తరలిస్తున్నారు. కరివేపాకు, కొత్తిమీరలపైన ఈ పురుగు మందులు పిచికారి చేస్తున్నారు.

సేంద్రియ వ్యవసాయనికి ససేమిరా.. కూలీల కొరత అధికం కావడంతో సేంద్రియ వ్యవసాయనికి రైతులు ముందుకు రావడం లేదు. ఒకరిద్దరు రైతులు ప్రకృతి వ్యవసాయం చేసినా వారికి గిట్టుబాటు కాని పరిస్థితి. దీంతో పలువురు ఈ వ్యవసాయం చేసేందుకు నిరాసక్తత చూపుతున్నారు.

సేంద్రియ గ్రామాలున్నా.. స్వయం సహాయక సంఘాల మహిళలను సేంద్రియ వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని ప్రభుత్వం, అధికారులు భావించారు. ఒక్కో రైతుకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు రుణం మంజూరు చేస్తున్నారు. రుణం పొందిన రైతులు సాగు చేస్తున్న కూరగాయలకు చీడపీడలు అధికం అవ్వడంతో తిరిగి మళ్లీ పురుగు మందులనే ఆశ్రయిస్తున్నారు.

ప్రయోగశాల హైదరాబాద్‌లోనే.. మార్కెట్లకు వచ్చే వివిధ రకాల కూరగాయలను సేకరించి హైదరాబాద్‌లోని జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ కేంద్రం, ఆచార్య జయశంకర్‌ విశ్వవిద్యాలయంలో మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కడా ఈ పరీక్షా కేంద్రాలు లేవు. తక్షణమే ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

వండేముందు ఇలా చేయండి..
1. కూరగాయలను వండే ముందు నాలుగైదు సార్లు మంచినీటితో కడగాలి.
2. ఉప్పు ద్రావణంలో కొద్ది నిమిషాలు ఉంచడం వల్ల క్రిములు పోతాయి. తర్వాత మళ్లీ మంచినీటితో శుభ్రం చేయాలి.
3. పొటాషియం పర్మాంగనేట్‌ ద్రావణంతో శుభ్రంగా కడిగి తర్వాత నీటిలో కడగాలి.
4. అవకాశముంటే కూరగాయలు, పండ్ల పైపొరను తొలగించాలి. పైపొర తొలగించాలనుకుంటే ముందుగా రసాయన అవశేషాలు పోగొట్టడానికి నీటితో శుభ్రంగా కడగాలి.
5. సేంద్రియ సాగులో పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వినియోగించడం మేలు. ఇవి పరిమాణంలో చిన్నగా ఉన్నా ఆరోగ్యానికి మంచిది.

అవశేషాలు చూపే ప్రభావం..
1. నరాల వ్యవస్థను దెబ్బ తీస్తుంది.
2. కాలేయం పనితీరు పాడయ్యే అవకాశం.
3. మూర్చ వచ్చే అవకాశం.
4 వినాళ గ్రంధులను విచ్ఛిన్నం చేస్తుంది.
5. కేన్సర్‌ వచ్చే అవకాశం

కోసేముందు మందులు పిచికారి చేయకూడదు
కూరగాయల మొక్కలపై పురుగు కనిపించినా, తెగులు కనిపించినా హెక్టాకొనజోల్‌, మోనోక్రోటోఫాస్‌, ఇధియాన్‌, సైపర్‌మిత్రిన్‌, క్లోరిఫైరీఫాస్‌, ఎసిపేట్‌ వంటి మందులను రైతులు చల్లేస్తున్నారు. ఈ మందుల పిచికారి వల్ల పురుగు మందు అవశేషాలు సంబంధిత కూరగాయలపై ఉంటాయి. పంట కోసే పది రోజుల మందు ఈ మందులను చల్లకూడదు. మొక్క మెత్తదనం కోసం, కాయ సైజు పెరగడం కోసం సేఫ్‌, కాల్షియం, నైట్రోజన్‌, మెగ్రీషియం, బోరాన్‌ ఉండే సూక్ష్మ పోషక ఎరువులు వాడతారు. వీటి ప్రభావం తక్కువైనా వారం పాటు రసాయన అవశేషాలు కూరగాయలపై ఉంటాయి. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారుల సూచనల కన్నా పురుగు మందుల దుకాణాల డీలర్లు చెప్పే మందులకు రైతులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

చెప్పినా వినడం లేదు: సత్యనారాయణ, నూజివీడు ఉద్యానాధికారి
రైతులు కూరగాయలు, ఆకుకూరలపై విపరీతమైన పురుగు మందులను పిచికారి చేస్తున్నారు. చెపుతున్నా పట్టించుకోవడం లేదు. పురుగు మందు కొట్టిన ప్రభావం పది నుంచి 15 రోజుల పైన ఉంటుంది. కొనుగోలు దారులు అప్రమత్తంగా ఉండాలి. గాఢత తక్కువ ఉన్న పురుగు మందులను మాత్రమే రైతులు వినియోగించాలి. లేనట్లయితే పురుగుల్లో రెసిస్టెన్స్‌ పవర్‌ పెరుగుతుంది. ఏ మందు పిచికారి చేసినా పురుగులు చావని పరిస్థితి వస్తుంది.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 30 వేల హెక్టార్లలో కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల సాగు చేస్తున్నారు. రైతులు అధిక దిగుబడులే లక్ష్యంగా ప్రకృతి వ్యవసాయానికి బదులు కాంప్లెక్స్‌, యూరియా తదితరాలతో పాటు అత్యధిక గాఢత కల్గిన పురుగు మందులను పిచికారి చేస్తున్నారు. మరి కొందరు మార్కెట్‌లో మంచి ధర దక్కేందుకు మరికొన్ని మందులను వాడేస్తున్నారు. రైతులు చేపడుతున్న పంటల సాగుపై ఉద్యాన, వ్యవసాయ, మర్కెటింగ్‌ శాఖ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది.


దోమకాటుకు తెర!

శతాబ్దాలుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి మలేరియాపై నరేంద్ర మోదీ ప్రభుత్వం యుద్ధభేరి మోగించింది. మశక సంతతి ద్వారా...

Full Story...

ఇక మేయర్‌ పాలన

మహా నగరంలో ఇక మేయర్‌ పాలన మొదలు కానుంది. గురువారం మేయర్‌, డిప్యూటీ మేయర్ల ఎన్నిక లాంఛనప్రాయంగా సాగడంతో పాటు... ఆ ఇద్దరు శుక్రవారం నుంచి బాధ్యతలు...

నోటమాటే లేదు..!

పొలం వద్ద నుంచి మార్కెట్‌కు తీసుకువచ్చేందుకు రూ.500 ఖర్చు చేయాల్సి వచ్చింది. తీసుకువచ్చిన 55 పెట్టెల టమాట అమ్ముడుపోకపోవడంతో అక్కడే వదిలేశా. ఉదయం రూ.30కి...

‘స్వచ్ఛ మిషన్‌’ నత్తనడక

స్వచ్ఛ భారత్‌ నిర్మాణంలో వ్యక్తిగత మరుగుదొడ్డి అతి ముఖ్యమైన అంశం. ప్రతి ఇంటా వీటిని తప్పనిసరిగా నిర్మించాలచే అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్య అంశంగా...

జిల్లా అంతటికీ సాగునీరు

మన దగ్గర ఉన్న నిధులు.. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక రచించుకుంటే సమగ్రత ఉంటుందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. జిల్లా సాగు నీట...

ఆర్‌ఎంపీలపై నియంత్రణ డొల్ల

జిల్లాలో 2,809 ఆర్‌ఎంపీ ఆస్పత్రులు ఉన్నట్లు సంబంధిత వైద్యుల సంఘం వద్ద లెక్కలు ఉన్నాయి. సంఘానికి కూడా తెలియకుండా నిర్వహిస్తున్న ఆస్పత్రులు మరో వెయ్యి దాకా...

ప్రచారం.. పరిసమాప్తం

నారాయణఖేడ్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారపర్వానికి గురువారం సాయంత్రం 5 గంటలకు తెర పడింది. ఈ నెల 13న పోలింగ్‌ జరగనుండటంతో కొన్ని రోజులుగా మారుమూల...

యాదాద్రి విస్తరణకు పచ్చజెండా

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పించిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాభివృద్ధికి మార్గాలన్నీ సుగమమయ్యాయి. రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గురువారం యాడా అధికారులత...

గొంతు.. విప్పాలి గొంతు.. తడపాలి

ఈ చిత్రం కొణిజర్ల మండలం పెద్దగోపతి గ్రామానికి వెళ్లే రహదారి. గ్రామం సుమారు 5,250 మంది జనాభాతో విస్తరించి ఉంది. దీని పరిధిలో అనంతారం, బొట్లకుంట శివారు ప్రాంతాలు.

కంచె కుదించి... అక్రమానికి తెగించి!

భూభాగంలో 33 శాతం అటవీ ప్రాంతం లేకపోవడం పర్యావరణపై పెనుప్రభావం చూపుతోంది. ప్రకృతి విపత్తులు సంభవించేందుకు ఇదే ప్రధాన కారణం. అటవీ భూములు విచ్చలవిడిగా...

ముసుగేసి.. మూలన పడేసి..

ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంకోసం ఏర్పాటుచేసిన టీవీలు కనిపించకుండా పోతున్నాయి. ‘మన టీవీ’లు అటకెక్కాయి. వీటిని వినియోగించుకోవడంలో అధికారులు...

రూ.10 వేల కోట్ల పెట్టుబడి..

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరం విజయవాడ-గుంటూరు మధ్య నిర్మితమవుతుండడంతో గుంటూరుతోపాటు కృష్ణా జిల్లాలోనూ పారిశ్రామిక ప్రగతి వూపందుకుంది. ఔత్సాహిక...

‘ఇంటి గుట్టు’.. అవినీతి కనికట్టు

పురపాలక సంఘ కమిషనర్‌ బినామీతో చేజిక్కించుకున్న రాజీవ్‌నగర్‌లోని సర్వే నంబరు 367లోని ఇంటి సంఖ్య 248 ఇది. ఇందిరమ్మ పథకం కింద దీన్ని నిర్మించారు. దారిద్య్రరేఖకు...

కాసులిస్తేనే పని..

కృష్ణాజిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాల్లో హల్‌చల్‌ చేస్తున్న బ్రోకర్ల దందాపై అవినీతి నిరోధక శాఖ (అనిశా) స్పందించింది. గురువారం ఉదయం విజయవాడ ఉపరవాణా కమిషనర్‌...

అతుకుల పనుల్లో.. అడ్డగోలు దోపిడీ!

నీటి సంరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, మరమ్మతుల మాటున భారీ దోపిడీ జరుగుతోంది. పనులు తూతూమంత్రంగా చేపట్టి నిధులు కాజేస్తున్నారు.

నిధులున్నా నిర్లక్ష్యం

జిల్లాలో ఇందిర ఆవాస్‌ యోజన కింద ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. అర్హులైన లబ్ధిదారులకు గతంలోనే ఇళ్లు మంజూరైనా కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా జాప్యం...

ఇసుకాసురుల ‘సిండికేట్‌’ యత్నాలు

ఇసుక రీచ్‌లను దక్కించుకోవడానికి కీలక నేతలు, వారి అనుయాయులు తెరవెనుక ఉండి అంతా నడిపించారు. ముఖ్యంగా అధిక రీచ్‌లలో సిండికేట్‌ అయ్యేందుకు ప్రయత్నాలు చేశారు.

అమరుడా అహమ్మద్‌... దేశమే వందనమంది

‘కుటుంబంలో చిన్నవాడు ముస్తాక్‌ అహమ్మద్‌. దీంతో గారాబంగా పెంచుకొన్నాం. అందుకు తగ్గట్టే కుటుంబసభ్యుల్ని అభిమానంగా చూసుకొనేవారు.

నేతల కన్ను!

జిల్లాలో ఇసుక రేవులను దక్కించుకొనేందుకు నేతలు రంగంలోకి దిగారు.గుత్తేదారులను రింగు చేసి పోటీ లేకుండా చేయాలనే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఉత్కంఠ.. ఉద్విగ్నం

పోలీసుల అదుపులో మృతి చెందిన వేటపాలెం మండలం రావూరిపేటకు చెందిన బొప్పన పరిపూర్ణచంద్రరావు మృతదేహానికి గురువారం పోస్టుమార్టం నేపథ్యంలో ఒంగోలు రిమ్స్‌లో...

చినుకు రాలనంది.. చింత తీరకుంది

‘భారత వ్యవసాయ రంగం పురోగతి సాధించినప్పటికీ పూర్తిగా వాతావరణ పరిస్థితులపైనే ఆధారపడి ఉంది. సరైన వర్షాలు లేక పంటల దిగుబడి తగ్గడం తీవ్ర ఆందోళనకరం’-ప్రణబ్‌ముఖర్జీ,...

సాగుకు సరే... మరివిద్యుత్తు?

ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రభుత్వం సాగునీటికే ప్రాధాన్యం ఇస్తుండటంతో సీలేరు కాంప్లెక్స్‌లోని జలవిద్యుత్కేంద్రాల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. గోదావరి డెల్టాలోని రబీ...

కదిలిన అధికార యంత్రాంగం

జిల్లా కేంద్రం విజయనగరం పట్టణం, నెల్లిమర్ల, గుర్ల మండలాలకు తాగునీరు అందించే చంపావతి నది ఎండిపోవడంపై ‘ఈనాడు’ పత్రికలో గురువారం ప్రచురితమైన ‘ఎండినది’ ...

నీ స్పర్శ కోసం..!

కడుపులో ఓ నలుసు పడిందన్న మాటతో ఆనందబాష్పాలతో మైమరిచావు.. నెలనెలా కొత్త వూపిరి అందిస్తూ.. జీవితంపై ఆశలు రెకేత్తించావు.. 9 నెలల యాతనను ఆనందంగా అనుభవించావు..