వీటిలో ఎన్నింటిపై చర్చ జరగనిద్దాం మేడం?
latestnews
చేనేత వస్త్రం... పచ్చదన అస్త్రం
పర్యావరణ పరిరక్షణే భవిష్యత్తుకు రక్షణ
ప్రపంచాన్ని చుట్టేస్తున్న సందేశం
సంతకం చేసి మద్దతు తెలుపుతున్న ప్రముఖులు
న్యూస్‌టుడే, అబ్దుల్లాపూర్‌మెట్‌
ప్రజా చైతన్యమే చాలా సమస్యలకు పరిష్కారం. ప్రధానంగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే అందరి కృషి అవసరం. ఒక్కడినే ఏం చేయగలనని నిరాశపడకుండా తన సందేశంతో ప్రజల్లో చైతన్యం నింపడానికి కృషి చేస్తున్నారు సతీష్‌ సిఖ. భావితరాలకు పచ్చదనం, స్వచ్ఛమైన ప్రాణవాయువు అందించాలంటే మొక్కల పెంపకం ఒక్కటే మార్గమని చాటుతూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. స్వచ్ఛమైన చేనేత వస్త్రంపై ప్రపంచ ప్రముఖుల సందేశాలు సేకరించి ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో భాగస్వాములవాల్సిన అవసరాన్ని చాటిచెబుతున్నారు.
నగరంలోని వనస్థలిపురం ప్రాంతానికి చెందిన డాక్టర్‌ సతీష్‌ సిఖ (కెనడా పౌరసత్వం ఉంది) హెల్తీ కిడ్స్‌.. హ్యాపీ కిడ్స్‌ ఫౌండేషన్‌ ద్వారా పిల్లలకు సేవలందిస్తున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యంతో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి ఈ విషయంలో ఏమైనా చేయాలని నిర్ణయించుకున్నారు. భావితరాలకు స్వచ్ఛ ప్రాణవాయువు అందించాలంటే పర్యావరణ పరిరక్షణ ఒక్కటే మార్గమని.. ఎట్టి పరిస్థితుల్లో భారీ వృక్షాలను నరకొద్దని.. ప్రతి ఒక్కకు ఒక మొక్కను నాటి పెంచాల్సిన అవసరం ఉందనే విషయాలను ప్రచారం చేయాలని భావించారు. ఆలోచన వచ్చిందే తడవు 2009లో ఆచరణకు దిగారు. చేనేత ఆకుపచ్చ వస్త్రంపై సందేశాలను సేకరించటం ప్రారంభించారు. ఇలా మొదలైన ఆయన కృషి అనేక దేశాలకు చెందిన ఎందరెందరో ప్రముఖులను, దేశాధినేతలను, శాస్త్రవేత్తలను, విభిన్న రంగాల వారిని ఆకర్షించింది. పచ్చటి వస్త్రంపై పర్యావరణ ప్రాధాన్యం తెలిసేలా వారు రాసిన సందేశాలతో ప్రపంచ యాత్ర కొనసాగిస్తున్నారు. ఇలా ఇప్పటికి 48 దేశాల్లో ఈ పచ్చటి సందేశం ప్రదర్శించారు.
జైత్ర యాత్రలో ఎన్నెన్నో మజిలీలు
ప్రపంచ దేశాలకు సతీష్‌ పర్యావరణ సందేశం మోసుకెళ్తున్న వస్త్రం వెయ్యి మీటర్ల భారీ అస్త్రంగా మారింది. ఈ వస్త్రంపై రామోజీగ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు స్వయంగా రాసిన ‘అత్యాశే కాలుష్యానికి మూలం.. పచ్చదనమే భూతాపానికి పరిష్కారం’ అనే సందేశం అందరిని ఆకర్షిస్తోంది. బిగ్‌బీ అమితాబ్‌, అభిషేక్‌బచ్చన్‌, మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్‌, తెలుగు కథానాయకుడు మహేష్‌బాబు, బాలీవుడ్‌ నటి కంగనారనౌత్‌, క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ తదితరులు ఈ వస్త్రంపై వారి సందేశాన్ని రాశారు. షార్జా(యూఏఈ) రాజు షేక్‌ సుల్తాన్‌ వంటివారు దయచేసి రక్షించండి ధరిత్రిని.. మనకు మరో జగత్తు(ప్లానెట్‌) లేదంటూ ఈ వస్త్రంపై తన సందేశాన్ని చాటారు. తెదేపా అధినేత చంద్రబాబు రాసిన మొక్కలు నాటండనే సందేశమూ ఉంది. ఇలా ఎందరో ప్రముఖుల సందేశాలతో ప్రపంచ జైత్ర యాత్ర కొనసాగుతోంది. మంచుకొండల్లో ఉత్తర ధ్రువంలోనూ సందేశాన్ని ప్రదర్శించి సతీష్‌ సిఖ పర్యావరణ రక్షణే మహోద్యమంగా ముందుకు సాగుతున్నారు.
మనవంతుగా స్పందిద్దాం
భూమాతను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ప్రపంచానికి చాటుతూ నగర వాసి చేస్తున్న కృషికి మనవంతు తోడ్పాటును అందిద్దాం. ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా ఒక మొక్క నాటి.. ఆ చెట్టు నీడలో జనం సేదతీరేలా కృషి చేద్దాం. పర్యావరణాన్ని పచ్చదనంతో నింపి ప్రకృతి సిరిని పెంపొందిద్దాం.

సుభద్ర భారతావని కోసం...

‘ఇప్పటికి ఏడేళ్లయింది... ముంబయి దాడులకు సూత్రధారులెవరో ఇండియా రుజువు చెయ్యలేకపోయింది... ఇప్పుడిక దాని తరం కాదు’...

Full Story...

లాంఛనప్రాయం... ఏకగ్రీవం!

నగర ప్రథమ పౌరుడి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర సమితికి పూర్తిస్థాయి ఆధిక్యం లభించడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇప్పటికే తెరాస తమ పార్టీ తరఫున మేయర్‌...

సైకిల్‌ వదిలి కారెక్కి..!

రంగారెడ్డి జిల్లా తెదేపా అధ్యక్షుడు, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీ తెరాసలో చేరారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను తెరాసలో చేరినట్లు...

మహా ఘట్టానికి శ్రీకారం

రెండేళ్లకోసారి జరిగే వన దేవతల మహా జాతరకు కీలకమైన మండ మెలిగే పండగతో ఆదివాసీ పూజారులు బుధవారం వైభవంగా శ్రీకారం చుట్టారు. కోటిమంది భక్తుల ఇలవేల్పులైన సమ్మక్క...

‘వాడా’.. అభివృద్ధి జాడ!

రాష్ట్ర ప్రభుత్వం శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ ప్రాంతీయ అభివృద్ధి ప్రాధికార సంస్థ(వాడా)ను ఏర్పాటు చేస్తూ.. వైస్‌ఛైర్మన్‌గా విశ్రాంత పాలనాధికారి ముద్దసాని పురుషోత్తంరెడ్డిని నియమించింది.

పైరవీలకే.. పెద్దపీట

‘నేను ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధిని. కార్పొరేషను రుణాల్లో నేను చూపించినవారినే ఎంపిక చేయాలి. బీసీ, ఎస్సీ రుణాలు మీ ఇష్టం వచ్చినట్లు ఎవరికిపడితే వారికి ఇస్తే...

స్వీయపర్యవేక్షణతో సర్వతోముఖాభివృద్ధి

నాది ఈ జిల్లానే. నేనూ మెదక్‌ బిడ్డనే. నేనేమీ ఆకాశం నుంచి రాలే. ఇక్కడి నుంచే సీఎంగా పనిచేస్తున్నా. జిల్లాలో ఖేడ్‌ ఇంత వెనుకబడి ఉంటే ఎక్కడికైనా వెళితే నా ముఖం చెల్లదు.

ఇంతింతై.. రెండింతలై

మాణిక్‌ప్రభు. గుర్రంపోడు డివిజన్‌లో ఏఎమ్మార్పీ డీఈఈగా చేస్తూ బుధవారం హైదరాబాద్‌లో అనిశా అధికారులకు చిక్కాడు. ఓ ఉన్నతస్థాయి అధికారి అవినీతికి పాల్పడుతూ చిక్కడంతో స్థానికంగా ఆయా వర్గాల్లో కలకలం రేగుతోంది.

‘బస్తి’మే సవాల్‌

ఖమ్మం కార్పొరేషన్‌పై జెండా పాతడమే..అజెండాగా పార్టీలు పావులు కదుపుతున్నాయి.. ‘చేర్పులు-మార్పులు’ చేస్తూ చక్రాలు తిప్పుతున్నాయి.. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూలు...

నేతలూ... ఒట్టిమాటలొద్దు... గట్టి‘కూత’ పెట్టండి!

ప్రస్తుత బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు 2003లో నిజామాబాద్‌కు రైల్వే డివిజను మంజూరు చేశారు. ఈ అంశంపై మహారాష్ట్ర నేతలు చురుగ్గా స్పందించారు.

‘విశ్వ’ప్రయత్నం..

జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కొన్నిరోజులుగా జరుగుతున్న ఆందోళనలకు బుధవారం నాగోబా దర్బార్‌ వేదికైంది. వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థి...

ఎవరికి వారు నీటి నిర్వహణలో తకరారు

జిల్లాలో సమగ్ర రక్షిత తాగునీటి పథకాల (సీపీడబ్ల్యూ) నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఈ...

ఏక దరఖాస్తు.. ఇసుక తదాస్తు !

కలికిరి మండలంలో ఇసుక మాఫియా ఒక్కటైంది. ఈ మండలంలో ఆరు రేవులను గుర్తించి వేలానికి ప్రకటనిచ్చారు. ఈ ప్రాంతంలో ఇసుక నాణ్యతతో పాటు, మంచి గిరాకీ ఉండటంతో...

మెట్రో’కోసం...

‘మెట్రో’ పథకాన్ని పట్టాలపైకి ఎక్కించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒకవైపు రెండో కారిడార్‌కు చెందిన టెండర్ల పరిశీలన కొనసాగుతుండగా మరోవైపు వివిధ దేశాల...

పట్టువదలని.. భగీరథులు!

ఇతని పేరు మల్లికార్జున. పెనుకొండ మండలం గొల్లపల్లి గ్రామ రైతు. ఇతనికి 11 ఎకరాల పొలం ఉంటే.. అది కాస్తా గొల్లపల్లి రిజర్వాయర్‌ కోసం ప్రభుత్వం సేకరించింది. పరిహారం కింద...

దయచేసి వినండి కోనసీమకు రైలొస్తుంది..!

పర్యటక సొబగులతో అలరారే పచ్చని సీమ.. పొంగిపొర్లే జల వనరులు, పుష్కలంగా పంటలు, భూగర్భంలో చమురు, సహజ వాయువుల లభ్యత, కొబ్బరి ఉత్పత్తులు..

తరుముకొస్తున్న తాగునీటి గండం

గత ఏడాది కరవు కోరల్లో చిక్కుకున్న కడప జిల్లాకు ఈసారి తాగునీటి ఎద్దడి రూపంలో పెద్ద సవాల్‌ ఎదురుకానుంది. అదృష్టం కొద్దీ గత ఏడాది చివర్లో కురిసిన భారీ వర్షాలు...

బస్తాలో బియ్యం చూస్తూనే మాయం

బియ్యం బస్తా కుట్టు జారదు.. రంధ్రం పడదు.. బియ్యమేమో మాయమవుతున్నాయి. ఇది అక్షరాల సత్యం. కొందరు కోసే కోతల వల్ల కార్డుదారులకు వాతలు పడుతున్నాయి. గోదాములలో జరిగే మోసాలతో...

పరిహారమా.. పరిహాసమా?

వారంతా దశాబ్ధాలుగా పంట పొలాలనే నమ్ముకున్న పుడమి పుత్రులు.. రక్తాన్ని చెమటగా మార్చి బంజరు భూములను సారవంతం చేసిన కర్షకులు.. ఒకప్పుడు పుట్టలు.. పిచ్చి కంప చెట్లు..

దారుణ హత్య

ఎక్కడో పశ్చిమ బంగ నుంచి కడుపు చేతబట్టుకుని ఒంగోలు వచ్చాడు. సోదరులు పని చేస్తున్న కంపెనీలోనే కూలీగా చేరాడు.. అలా వచ్చి పట్టుమని పది రోజులైనా కాలేదు.. ఆధార్‌ కార్డుల...

టౌను హాలు...‘మాయా’ మహలు!

ప్రభుత్వానిదా....కాదా?ప్రైవేటు వ్యక్తులదా...కాదా?ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ఏం కాబోతుంది?కొన్ని రోజులుగా ‘టౌన్‌హాలు’ పేరు చెబితే నడిచే చర్చ ఇదే. వందేళ్లకు పైగా చరిత్ర కలిగి...

దొరికితే.. ఇంతే సంగతులు!

లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు పెట్టి అరెస్టు చేసేది అవినీతి నిరోధక శాఖ. వారిపై అభియోగాలు రుజువైతే న్యాయస్థానాలు శిక్షలు విధించేవి.

ఎండి‘నది’

విజయనగరం నగర పాలక సంస్థ ప్రజలతోపాటు నెల్లిమర్ల, గుర్ల మండలాలకు నీటిని అందించే చంపావతి చంపావతి జలసంజీవని ఇప్పుడు ఏడారిని తలపిస్తోంది. నదీ గర్భం బీటలు వారిపోయింది.

మళ్లీ..కోటి ఆశల పల్లి!!

ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు చిరకాలంగా కోరుతున్న నరసాపురం -కోటిపల్లి మధ్య రైల్వేలైను మరోసారి తెరపైకి వచ్చింది. లైను ఏర్పాటుకు బుధవారం కేంద్రం...