వీటిలో ఎన్నింటిపై చర్చ జరగనిద్దాం మేడం?
latestnews
కారెక్కిన ఎర్రబెల్లి
ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌తో కలిసి
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో చేరిక
అభివృద్ధి లక్ష్యంతోనే ఈ నిర్ణయమని వెల్లడి
తెలంగాణ తెలుగు దేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ
తెరాసలో తెతెదేపా శాసనసభా పక్షం విలీనానికి అవకాశం!
వివేకా, ఎర్రబెల్లి, ప్రకాష్‌లపై తెదేపా సస్పెన్షన్‌ వేటు
ఈనాడు - హైదరాబాద్‌
తెలంగాణ తెదేపా శాసనసభా పక్ష(టీటీడీఎల్పీ) నేత ఎర్రబెల్లి దయాకరరావు, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌లు బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరారు. తెలంగాణ అభివృద్ధి తెరాసతోనే సాధ్యమని రాష్ట్ర ప్రజలంతా నమ్ముతున్నందున అందులో చేరుతున్నట్లు ఎర్రబెల్లి చెప్పారు. తొలుత ఎమ్మెల్యే క్వార్టర్లలోని ఎర్రబెల్లి నివాసానికి మంత్రి హరీశ్‌రావు వచ్చి ఆయనతో చర్చలు జరిపారు. అనంతరం వారు ప్రకాష్‌గౌడ్‌ను తీసుకుని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. తమ నియోజకవర్గాల అభివృద్ధికి సహకరించాలని సీఎంను కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు వారు చెప్పారు.

‘గ్రేటర్‌’ దెబ్బ మీద మరో దెబ్బ..
గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీకి దానినుంచి కోలుకోకముందే మరో దెబ్బ తగిలింది. ఏకంగా శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి, మరో ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌(రాజేంద్రనగర్‌) తెరాస తీర్థం పుచ్చుకోవటంతో మిగతా ఎమ్మెల్యేల్లో మరికొందరు కూడా అదే బాటలో నడవచ్చని తెలుస్తోంది. గతంలో శాసనమండలిలో ఇద్దరు తెదేపా ఎమ్మెల్సీలు మినహా మిగిలిన వారంతా తెరాసలో చేరడం తెలిసిందే. దీంతో తెలుగుదేశం శాసనసభాపక్షాన్ని తెరాసలో విలీనం చేసినట్లు శాసనమండలి ఛైర్మన్‌ ప్రకటించారు. ఇపుడు అసెంబ్లీలోనూ అలాంటి పరిస్థితే తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విలీనం సంగతి అటుంచి, తెరాసలో చేరిన ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించే అవకాశం మాత్రం లేదని శాసనసభా వర్గాలు తెలిపాయి.

గ్రేటర్‌ ఎన్నికల ముందు నుంచే..: 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇందులో ఆరుగురు హైదరాబాద్‌ మహానగరసంస్థ ఎన్నికలకు ముందు తెరాసలో చేరారు.వారిలో ఒకరైన తలసాని శ్రీనివాసయాదవ్‌ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్‌..ఆ వెంటనే ఎర్రబెల్లి, ప్రకాశ్‌గౌడ్‌ కూడా తెరాస గూటికి వచ్చారు. దీంతో తెదేపా నుంచి మొత్తం తొమ్మిది మంది ఆ పార్టీలో చేరినట్లయింది.

కీలకంగా మంత్రి హరీశ్‌..: మంత్రి హరీశ్‌రావుతో ఎర్రబెల్లి చర్చల తర్వాత తెరాసలో ఆయన చేరిక ఖరారైనట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ఖేడ్‌ ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు. అక్కడ ఎన్నికల బాధ్యుడిగా ఉన్న మంత్రి హరీశ్‌ కూడా సీఎంతో పాటు హైదరాబాద్‌ వచ్చారు. అనంతరం హరీశ్‌.. ఎర్రబెల్లి, ప్రకాశ్‌గౌడ్‌లతో సమావేశం కావడం, అంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్దకు వచ్చి తెరాసలో చేరడం చకచకా జరిగిపోయాయి. ఈ వ్యవహారంలో హరీశ్‌ కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

మరి కొందరూ అదే దారిలో..: ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం శాసనసభ్యుల్లో రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఆర్‌.కృష్ణయ్య, మాగంటి గోపీనాథ్‌, రాజేందర్‌రెడ్డి, ఎ.గాంధీ పార్టీ తరఫున మిగిలి ఉన్నారు. వీరిలోనూ కొందరు తెరాసలో చేరతారనే ప్రచారం సాగుతోంది. రేవంత్‌రెడ్డి తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, గోపీనాథ్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. సండ్ర వెంకటవీరయ్యను తితిదే బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశాక ఎర్రబెల్లి, ప్రకాశ్‌గౌడ్‌లు మాట్లాడుతూ తమబాటలో త్వరలోనే మరికొందరు తెరాసలోకి వస్తారని ప్రకటించటం గమనార్హం.

తెరాసలో విలీనానికి అవకాశం..: తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే తొమ్మిది మంది తెరాసలో చేరడం, మరికొందరు అదే బాట పట్టే అవకాశం ఉండటంతో ఒకట్రెండు రోజుల్లో సంఖ్యాధిక(మెజార్టీ) ఎమ్మెల్యేలంతా కలిసి తెరాసలో విలీనం చేయమని స్పీకర్‌ను కోరే అవకాశముంది. దీనికి అంగీకరిస్తూ తెరాస అధ్యక్షుడు లేఖ ఇస్తే ఈ ఎమ్మెల్యేలందరినీ తెరాస సభ్యులుగానే గుర్తించే అవకాశం ఉంది. మూడింట రెండువంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే వారి పరంగా ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని శాసనసభ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో వీరిని అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా గుర్తించడానికే తెరాస పరిమితమవుతుందా లేక మెజార్టీ ఎమ్మెల్యేలు విలీనం చేస్తున్నట్లు ప్రకటిస్తే దానికి అవకాశం ఉందా అన్నది చర్చనీయాంశం అవుతోంది. ఇందులో స్పీకర్‌ నిర్ణయం కీలకం కానుంది.

ముగింపు ఏ దిశగా..: కౌన్సిల్‌లో తెలుగుదేశం పక్షాన్ని తెరాసలో విలీనం చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించినపుడు తాము ఏ పార్టీకీ చెందనివారమని మిగిలిన ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రకటించారు. తర్వాత కొద్దిరోజులకే వీరి పదవీ కాలం ముగిసింది. అసెంబ్లీలో పరిస్థితి తద్భిన్నం. వీరికి మరో మూడేళ్ల గడువుంది. తెలుగుదేశం పార్టీకి చెందినవారు కొందరు మిగిలినా.. వారు ఆ పార్టీకి చెందినవారవుతారని, ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయనేది త్వరలోనే తేలుతుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

తెరాస ద్వారానే తెలంగాణకు న్యాయం: ఎర్రబెల్లి
ఈరోజు సీఎం కేసీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరడం జరిగింది. తెదేపా కార్యకర్తలందరినీ, ఎన్టీఆర్‌ అభిమానులందరినీ క్షమించాలని కోరుతున్నా. తెలంగాణ తెదేపాను కాపాడాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. ఎన్టీఆర్‌ స్థాపించిన తెదేపా అంటే ఇప్పటికీ ప్రేమ, అభిమానం ఉన్నాయి. కానీ, జీహెచ్‌ఎంసీ, వరంగల్‌ ఎన్నికల ఫలితాలు చూశాక తెదేపాకు ఇక ఇక్కడ మనుగడ లేదని తేలింది. 25 ఏళ్ల వయసులో తెదేపాలో చేరి 30 ఏళ్లుగా కొనసాగాను. ఇవాళ ఆ పార్టీని వీడుతున్నందున బాధ ఉంది. తెలంగాణలో తెదేపాను ప్రజలు విశ్వసించడం లేదు. పార్టీ ఇక లేచే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలకు తెరాస ద్వారానే న్యాయం జరుగుతుందని అందులో చేరాం. మావెంట ఇంకా కొందరు వస్తారు.

అభివృద్ధి పనుల కోసమే: ప్రకాష్‌గౌడ్‌
ఆరేళ్లుగా రాజేంద్రనగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేయలేకపోతున్నానే బాధ ఉంది. అక్కడ తాగునీటి సమస్య తీర్చాలని, జీఓ.111ను ఉపసంహరించాలని సీఎంను కోరా. ఈరోజు కార్యకర్తలందరితో చర్చించి తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నా. అభివృద్ధి పనులు చేయకపోతే మీవెంట ఎంత కాలం ఉంటామని కార్యకర్తలూ అడుగుతున్నారు. తెదేపాలో నాకు మంచి గౌరవం ఇచ్చారు. నొప్పించలేదు. చంద్రబాబు నన్ను గౌరవించారు.

తెదేపా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేల సస్పెన్షన్‌
ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి, ప్రకాష్‌గౌడ్‌, వివేకానందగౌడ్‌లను తెదేపా నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి దీన్ని విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు వీరిని సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు.


సుభద్ర భారతావని కోసం...

‘ఇప్పటికి ఏడేళ్లయింది... ముంబయి దాడులకు సూత్రధారులెవరో ఇండియా రుజువు చెయ్యలేకపోయింది... ఇప్పుడిక దాని తరం కాదు’...

Full Story...

లాంఛనప్రాయం... ఏకగ్రీవం!

నగర ప్రథమ పౌరుడి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర సమితికి పూర్తిస్థాయి ఆధిక్యం లభించడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇప్పటికే తెరాస తమ పార్టీ తరఫున మేయర్‌...

సైకిల్‌ వదిలి కారెక్కి..!

రంగారెడ్డి జిల్లా తెదేపా అధ్యక్షుడు, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీ తెరాసలో చేరారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను తెరాసలో చేరినట్లు...

మహా ఘట్టానికి శ్రీకారం

రెండేళ్లకోసారి జరిగే వన దేవతల మహా జాతరకు కీలకమైన మండ మెలిగే పండగతో ఆదివాసీ పూజారులు బుధవారం వైభవంగా శ్రీకారం చుట్టారు. కోటిమంది భక్తుల ఇలవేల్పులైన సమ్మక్క...

‘వాడా’.. అభివృద్ధి జాడ!

రాష్ట్ర ప్రభుత్వం శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ ప్రాంతీయ అభివృద్ధి ప్రాధికార సంస్థ(వాడా)ను ఏర్పాటు చేస్తూ.. వైస్‌ఛైర్మన్‌గా విశ్రాంత పాలనాధికారి ముద్దసాని పురుషోత్తంరెడ్డిని నియమించింది.

పైరవీలకే.. పెద్దపీట

‘నేను ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధిని. కార్పొరేషను రుణాల్లో నేను చూపించినవారినే ఎంపిక చేయాలి. బీసీ, ఎస్సీ రుణాలు మీ ఇష్టం వచ్చినట్లు ఎవరికిపడితే వారికి ఇస్తే...

స్వీయపర్యవేక్షణతో సర్వతోముఖాభివృద్ధి

నాది ఈ జిల్లానే. నేనూ మెదక్‌ బిడ్డనే. నేనేమీ ఆకాశం నుంచి రాలే. ఇక్కడి నుంచే సీఎంగా పనిచేస్తున్నా. జిల్లాలో ఖేడ్‌ ఇంత వెనుకబడి ఉంటే ఎక్కడికైనా వెళితే నా ముఖం చెల్లదు.

ఇంతింతై.. రెండింతలై

మాణిక్‌ప్రభు. గుర్రంపోడు డివిజన్‌లో ఏఎమ్మార్పీ డీఈఈగా చేస్తూ బుధవారం హైదరాబాద్‌లో అనిశా అధికారులకు చిక్కాడు. ఓ ఉన్నతస్థాయి అధికారి అవినీతికి పాల్పడుతూ చిక్కడంతో స్థానికంగా ఆయా వర్గాల్లో కలకలం రేగుతోంది.

‘బస్తి’మే సవాల్‌

ఖమ్మం కార్పొరేషన్‌పై జెండా పాతడమే..అజెండాగా పార్టీలు పావులు కదుపుతున్నాయి.. ‘చేర్పులు-మార్పులు’ చేస్తూ చక్రాలు తిప్పుతున్నాయి.. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూలు...

నేతలూ... ఒట్టిమాటలొద్దు... గట్టి‘కూత’ పెట్టండి!

ప్రస్తుత బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు 2003లో నిజామాబాద్‌కు రైల్వే డివిజను మంజూరు చేశారు. ఈ అంశంపై మహారాష్ట్ర నేతలు చురుగ్గా స్పందించారు.

‘విశ్వ’ప్రయత్నం..

జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కొన్నిరోజులుగా జరుగుతున్న ఆందోళనలకు బుధవారం నాగోబా దర్బార్‌ వేదికైంది. వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థి...

ఎవరికి వారు నీటి నిర్వహణలో తకరారు

జిల్లాలో సమగ్ర రక్షిత తాగునీటి పథకాల (సీపీడబ్ల్యూ) నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఈ...

ఏక దరఖాస్తు.. ఇసుక తదాస్తు !

కలికిరి మండలంలో ఇసుక మాఫియా ఒక్కటైంది. ఈ మండలంలో ఆరు రేవులను గుర్తించి వేలానికి ప్రకటనిచ్చారు. ఈ ప్రాంతంలో ఇసుక నాణ్యతతో పాటు, మంచి గిరాకీ ఉండటంతో...

మెట్రో’కోసం...

‘మెట్రో’ పథకాన్ని పట్టాలపైకి ఎక్కించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒకవైపు రెండో కారిడార్‌కు చెందిన టెండర్ల పరిశీలన కొనసాగుతుండగా మరోవైపు వివిధ దేశాల...

పట్టువదలని.. భగీరథులు!

ఇతని పేరు మల్లికార్జున. పెనుకొండ మండలం గొల్లపల్లి గ్రామ రైతు. ఇతనికి 11 ఎకరాల పొలం ఉంటే.. అది కాస్తా గొల్లపల్లి రిజర్వాయర్‌ కోసం ప్రభుత్వం సేకరించింది. పరిహారం కింద...

దయచేసి వినండి కోనసీమకు రైలొస్తుంది..!

పర్యటక సొబగులతో అలరారే పచ్చని సీమ.. పొంగిపొర్లే జల వనరులు, పుష్కలంగా పంటలు, భూగర్భంలో చమురు, సహజ వాయువుల లభ్యత, కొబ్బరి ఉత్పత్తులు..

తరుముకొస్తున్న తాగునీటి గండం

గత ఏడాది కరవు కోరల్లో చిక్కుకున్న కడప జిల్లాకు ఈసారి తాగునీటి ఎద్దడి రూపంలో పెద్ద సవాల్‌ ఎదురుకానుంది. అదృష్టం కొద్దీ గత ఏడాది చివర్లో కురిసిన భారీ వర్షాలు...

బస్తాలో బియ్యం చూస్తూనే మాయం

బియ్యం బస్తా కుట్టు జారదు.. రంధ్రం పడదు.. బియ్యమేమో మాయమవుతున్నాయి. ఇది అక్షరాల సత్యం. కొందరు కోసే కోతల వల్ల కార్డుదారులకు వాతలు పడుతున్నాయి. గోదాములలో జరిగే మోసాలతో...

పరిహారమా.. పరిహాసమా?

వారంతా దశాబ్ధాలుగా పంట పొలాలనే నమ్ముకున్న పుడమి పుత్రులు.. రక్తాన్ని చెమటగా మార్చి బంజరు భూములను సారవంతం చేసిన కర్షకులు.. ఒకప్పుడు పుట్టలు.. పిచ్చి కంప చెట్లు..

దారుణ హత్య

ఎక్కడో పశ్చిమ బంగ నుంచి కడుపు చేతబట్టుకుని ఒంగోలు వచ్చాడు. సోదరులు పని చేస్తున్న కంపెనీలోనే కూలీగా చేరాడు.. అలా వచ్చి పట్టుమని పది రోజులైనా కాలేదు.. ఆధార్‌ కార్డుల...

టౌను హాలు...‘మాయా’ మహలు!

ప్రభుత్వానిదా....కాదా?ప్రైవేటు వ్యక్తులదా...కాదా?ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ఏం కాబోతుంది?కొన్ని రోజులుగా ‘టౌన్‌హాలు’ పేరు చెబితే నడిచే చర్చ ఇదే. వందేళ్లకు పైగా చరిత్ర కలిగి...

దొరికితే.. ఇంతే సంగతులు!

లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు పెట్టి అరెస్టు చేసేది అవినీతి నిరోధక శాఖ. వారిపై అభియోగాలు రుజువైతే న్యాయస్థానాలు శిక్షలు విధించేవి.

ఎండి‘నది’

విజయనగరం నగర పాలక సంస్థ ప్రజలతోపాటు నెల్లిమర్ల, గుర్ల మండలాలకు నీటిని అందించే చంపావతి చంపావతి జలసంజీవని ఇప్పుడు ఏడారిని తలపిస్తోంది. నదీ గర్భం బీటలు వారిపోయింది.

మళ్లీ..కోటి ఆశల పల్లి!!

ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు చిరకాలంగా కోరుతున్న నరసాపురం -కోటిపల్లి మధ్య రైల్వేలైను మరోసారి తెరపైకి వచ్చింది. లైను ఏర్పాటుకు బుధవారం కేంద్రం...