Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'భారత్‌లో తయారీకి బ్రహ్మరథం''ఐపీఎస్‌లను పెంచండి''పాకిస్థాన్‌కు అధునాతన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు''ఖేడ్‌లో 81.72 శాతం పోలింగ్‌''దిండి మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు''మెదక్‌ నిమ్జ్‌లో చైనా పెట్టుబడులు..''చెలకల్లో.. అవినీతి మొలకలు!''మార్చి 10 నుంచి శాసనసభ సమావేశాలు''మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు''కళతో సామాజిక సందేశం'
నిప్పు రగులుతోంది..
అగ్నిమాపక వ్యవస్థలేని భవనాలపై కన్ను
ఉల్లంఘనలపై అగ్నిమాపక శాఖ కొరడా
న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు
భవనాల యజమానులకు కోర్టు వారెంట్లు
కేసులకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నియామకం
ఈనాడు - హైదరాబాద్‌
ప్రజల సంరక్షణ గాలికి వదిలేసి.. నిబంధనలను ఉల్లంఘించి.. ఎడాపెడా అంతస్థులపై అంతస్థులు నిర్మించే బడా బాబులకు గడ్డు రోజులు ఎదురవబోతున్నాయి. ఇంతకాలం నోటీసులు, సంజాయీషీలకే పరిమితమైన తెలంగాణ అగ్నిమాపకశాఖ ఇక ప్రత్యక్ష కార్యాచరణకు దిగింది. నిబంధనలు పాటించని భవనాల యజమానులకు తెలంగాణ అగ్నిమాపకశాఖ న్యాయస్థానం ద్వారా బెయిలుకు వీల్లేని వారెంట్లు జారీ చేస్తోంది. శుక్రవారం మియాపూర్‌ న్యాయస్థానం హైదరాబాద్‌లో ప్రముఖ దుఖాణ సముదాయాలున్న నాలుగు భవనాల యజమానులకు వారెంట్లు జారీ చేసింది. అంతేకాదు ఈ శాఖ నమోదు చేసే కేసుల విషయంలో ప్రభుత్వం మొదటిసారిగా ఒక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను కూడా కేటాయించింది. ఇప్పటి వరకూ మాటలకే పరిమితమైన అగ్నిమాపకశాఖ ప్రత్యక్ష కార్యాచరణకు దిగబోతుందన్నమాట. బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు తప్పనిసరిగా అగ్నిమాపశాఖ నిర్దేశించిన ప్రమాణాలు పాటించాల్సిందే. ఫైర్‌ అలారం ఏర్పాటు చేయడం, భవనం సామర్థ్యాన్ని బట్టి పైనా, కిందా రెండు భారీ నీటి సంపులు నిర్మించడం, అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకునేందుకు ప్రత్యేకమార్గం ఏర్పాటు చేయడం వంటివి వీటిలో ముఖ్యమైనవి. అలాగే ప్రతి భవనం చుట్టూ ఫైర్‌ ఇంజిన్‌ తిరగడానికి వీలుగా ఖాళీ ప్రదేశం ఉండాలి. కాని చాలామంది స్థిరాస్తి వ్యాపారులు లాభాల ఆశతో అంగుళం స్థలం కూడా వదలడంలేదు. భవన యజమానులు అనవసరపు ఖర్చు ఎందుకన్న ఉద్దేశంతో అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడంలేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే గతంలో అనేకమార్లు అగ్నిమాపకశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి నిర్దేశిత ప్రమాణాల ప్రకారం లేని భవనాలకు నోటీసులు జారీ చేశారు. అసలు అగ్నిమాపకశాఖ నుంచి నివాసయోగ్య (ఆక్యుపెన్సీ) ధ్రువపత్రం తీసుకున్న తర్వాతనే భవనాన్ని ప్రారంభించాలి. కాని వీటిని పాటిస్తున్నవారి సంఖ్య స్వల్పమే. అగ్నిమాపకశాఖకు సరైన న్యాయవిభాగం లేకపోవడం వల్ల ఇప్పటి వరకూ నోటీసులు జారీ చేయడంతోనే సరిపెట్టుకునేది. కేసులు నమోదు చేస్తే మిగతా న్యాయప్రక్రియ కొనసాగించడానికి ఎలాంటి వ్యవస్థా లేదు. అందుకే నమోదు చేస్తున్న కేసులు అలానే ఉండిపోతున్నాయి. అగ్నిమాపకశాఖ ఏమి చేయలేదన్న భరోసాతో భవనాల యజమానులు ఎడాపెడా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. అంతిమంగా ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి అగ్నిమాపశాఖ తీవ్రంగా పరిగణించింది.

వారెంట్లు జారీ చేసిన న్యాయస్థానం
నిబంధనలు ఉల్లంఘించిన భవనాలను గుర్తించి వాటిపై న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌రతన్‌ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టింది. మొత్తం 689 భవనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా న్యాయస్థానంలో పిటిషను దాఖలు చేసింది. ఇందులో హైదరాబాద్‌లో 325 భవనాలు ఉన్నాయి. మియాపూర్‌లోని మెట్రోపాలిటిన్‌ న్యాయస్థానాలు 4 భవనాల యజమానులకు వారెంట్లు జారీ చేశాయి. కూకట్‌పల్లిలోని కళానికేతన్‌ భవనం యజమాని పావులూరి లోకేశ్వరరావు, ఆర్‌.ఎస్‌.బ్రదర్స్‌ భవన యజమాని కె.వెంకటరెడ్డి, ఎస్‌.ఎస్‌.టవర్స్‌ భవనం యజమాని సుగుణ, కల్యాణి జ్యూయెలర్స్‌ భవన యజమాని శ్రుతి వెంకటరమణలకు న్యాయస్థానం బెయిలుకు వీల్లేని వారెంట్లు జారీ చేసినట్లు అగ్నిమాపకశాఖ తెలిపింది. తెలంగాణలో నిబంధనలు ఉల్లంఘించిన అన్ని భవనాలకు దశలవారీగా వారెంట్లు జారీ చేయిస్తామని, చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని అగ్నిమాపక విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌రతన్‌ ‘ఈనాడు’కు తెలిపారు.

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

‘శ్రీరస్తు శుభమస్తు’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net