Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
ఇక ఒక్కటే జేఈఈ!
మెయిన్స్‌ పరీక్షలో అడ్వాన్సు్డ విలీనం
వచ్చే ఏడాది నుంచి అమలుకు
కేంద్ర మానవ వనరుల శాఖ యోచన
ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు ఒకే కౌన్సెలింగ్‌
ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్సు్డ పరీక్షలను 2015 నుంచి విలీనం చేయాలని కేంద్ర మానవ వనరుల శాఖ సూచనప్రాయంగా నిర్ణయించినట్లు తెలియవచ్చింది. విద్యార్థులపై ఒత్తిడిని, శిక్షణ సంస్థల ప్రాబల్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా త్వరలోనే అధికారికంగా నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఒకే పరీక్ష, ఒకే కౌన్సెలింగ్‌ ద్వారా వరుస క్రమంలో ఐఐటీ, ఎన్‌ఐటీ, ఇతర విద్యా సంస్థల్లో విద్యార్థులు ప్రవేశాలు పొందే అవకాశాలు మెరుగుపడతాయి. తొలుత ఏఐఈఈఈ, ఐఐటీ-జేఈఈ పేరుతో పరీక్షలు నిర్వహించి విడివిడిగా ఎన్‌ఐటీ, ఐఐటీ ప్రవేశాలు నిర్వహించారు. గత రెండేళ్ల నుంచి జేఈఈ మెయిన్స్‌ ద్వారా విద్యార్థుల కనబరిచే ప్రతిభను అనుసరించి 1,50,000ని మంది జేఈఈ అడ్వాన్సు్డకు అనుమతినిస్తున్నారు. జేఈఈ మెయిన్స్‌ ర్యాంకర్లకు ఎన్‌ఐటీ, ఇతర విద్యా సంస్థల్లో... జేఈఈ అడ్వాన్డ్సు ర్యాంకర్లకు ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. జేఈఈ మెయిన్స్‌లో ఇంటర్‌ మార్కులకు 40% ప్రాధాన్యత ఇస్తూ ర్యాంకులు కేటాయిస్తున్నారు. ఇందుకు నార్మలైజ్డ్‌ పర్సంటల్‌ విధానాన్ని అమలుచేస్తున్నారు. జేఈఈ అడ్వాన్డ్సులో ఇంటర్‌ బోర్డు పరీక్షల్లో టాప్‌ 20 పర్సంటైల్‌ ద్వారా ఎంపికచేసిన వారికి ర్యాంకులు కేటాయిస్తూ ప్రాధాన్య క్రమంలో ప్రవేశాలు కల్పిస్తున్నారు.

వాస్తవానికి ఒకే పరీక్ష ద్వారా విద్యార్థుల ప్రతిభను గుర్తించి ఐఐటీ, ఎన్‌ఐటీ, ఇతర సంస్థల్లో ప్రవేశాలు కల్పించాలని కేంద్రం యోచించింది. అయితే, ఐఐటీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. రెండు పరీక్షల విధానాన్ని గత రెండేళ్లల్లో అమలు చేశారు. రానున్న కొత్త విద్యా సంవత్సరంలోనూ ఇదే విధానాన్ని అమలుచేయబోతున్నారు. అయితే, 2015 నుంచి మాత్రం రెండు పరీక్షలను విలీనం చేయాలన్న నిర్ణయానికి కేంద్ర మానవ వనరుల శాఖ దాదాపుగా వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ విషయమై సంబంధిత వర్గాలు స్పందిస్తూ..‘‘రెండు పరీక్షలు, వేర్వేరు కౌన్సెలింగ్‌ల వల్ల సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. 2012లో ఎన్‌ఐటీ, ఐఐటీల్లో కలిపి 600 వరకు సీట్లు మిగిలిపోయాయి. ఎన్‌ఐటీ, ఐఐటీ సంస్థల్లో జరిగే ప్రవేశాల సమయంలో సమయాభావం, కోర్సుల ఎంపికలో విద్యార్థుల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. 2015 నుంచి ఈ విధానంలో మార్పుతెచ్చే చర్యల్లో భాగంగానే జేఈఈ రెండు పరీక్షలను విలీనం చేయాలన్న అంశానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాము. 2015 విద్యా సంవత్సరానికి కొత్త విధానాన్ని అమలుచేయబోతున్నందున తగిన సమయంలో వీటిపై నిర్ణయాలు ఉంటాయని’’ వివరించాయి. కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ పదవీకాలం త్వరలో ముగియబోతున్న తరుణంలో మానవ వనరుల శాఖ చేస్తున్న జేఈఈ విలీన ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయన్నది వేచిచూడాల్సిందే!

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

‘శ్రీశ్రీ’ డబ్బింగ్‌ పూర్తి

అలనాటి తెలుగు సూపర్‌స్టార్‌ కృష్ణ, ఆయన భార్య విజయ నిర్మల కీలక పాత్రధారులుగా తెరకెక్కిన ‘శ్రీశ్రీ’ చిత్రం దాదాపు పూర్తయ్యింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net