Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'
6350 టీఎంసీలు సముద్రం పాలు
గత ఏడాది కంటే రెట్టింపు నీరు వృథా
అవసరాలున్నా వినియోగించుకోలేని దుస్థితి
ప్రాజెక్టులు పూర్తి కాకపోవడమే ప్రధాన సమస్య
ఈనాడు - హైదరాబాద్‌
కవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు సాగు, తాగునీటి కోసం కటకట లాడుతుంటే... మరోవైపు భారీ స్థాయిలో వరద నీరు సముద్రం పాలవుతోంది. ఈ ఏడాది ఏకంగా 6350 టీఎంసీల నీరు వృథాగా కడలిలో కలసిపోయింది. గోదావరి, కృష్ణా, వంశధార ఇలా రాష్ట్రంలో అన్ని నదుల నుంచి వరద నీరు నిరుపయోగమయ్యింది. 2012-13లో 3080 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లగా, 2013-14లో అది 6350 టీఎంసీలకు పెరిగింది. నికరజలాలు, వరద జలాల వాడకానికి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికాకపోలేదు. ఈ కారణంగా ఈ ఏడాది భారీగా వరద వచ్చినా వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడింది. పాత ప్రాజెక్టుల్లో మాత్రం కేటాయింపులకు మించి వినియోగం జరిగింది. మరో రెండు రోజుల్లో ఖరీప్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. రిజర్వాయర్లన్నీ కనీస మట్టాలకు చేరుకొని కొత్త నీటి కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రతి సంవత్సరం జూన్‌ ఒకటి నుంచి మే 31 వరకు వచ్చిన నీటిని పరిగణనలోకి తీసుకొని ఆ ఏడాదిలో ఎంత వినియోగించుకొన్నదీ నీటిపారుదల శాఖ లెక్కలు కడుతుంది. కొన్ని ప్రాజెక్టుల కింద ఖరీఫ్‌, రబీలలో నీటి కేటాయింపులు ఉంటే కొన్నింటి కింద కేవలం ఖరీఫ్‌లోనూ, మరి కొన్నింటి కింద రబీలోనే నీటి కేటాయింపులున్నాయి. పాత ప్రాజెక్టుల కింద కేటాయింపులకు మించి వినియోగించుకోగా, కొత్త ప్రాజెక్టుల కింద నామమాత్రంగానే నీటిని తీసుకున్నారు. ఈ ఏడాది గోదావరి బేసిన్‌ నుంచి అత్యధికంగా 5828 టిఎంసీలు సముద్రంలోకి వెళ్లింది. గత ఏడాది ఇది 2969 టిఎంసీలు. అంటే దాదాపు రెండింతలు ఎక్కువ ఈ ఏడాది సముద్రం పాలైంది.. గోదావరి డెల్టాలో ఈ సంవత్సరం వినియోగించుకొన్నది 234 టీఎంసీలు మాత్రమే. ఎగువనున్న దేవాదుల కింద నామమాత్రంగా నీటిని తీసుకోగా, ఎల్లంపల్లి డ్యాం నిర్మాణం పూర్తయినా, ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే పనులు పూర్తి కాలేదు. రాజీవ్‌సాగర్‌, ఇందిరా సాగర్‌ ఎత్తిపోతల పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. కృష్ణా నది నుంచి గత ఏడాది 56 టీఎంసీలు , ఈ ఏడాది 394 టీఎంసీలు; వంశధారలో గత ఏడాది 55 టీఎంసీలు ...ఈ ఏడాది 126 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయి.

కృష్ణాలో కేటాయింపుల కంటే వినియోగం ఎక్కువ: కృష్ణాబేసిన్‌లో ప్రాజెక్టుల వారీగా నికరజలాల కేటాయింపులున్నాయి. మిగులు జలాల వినియోగం ఆధారంగా కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం చేపట్టింది. 2013-14 సంవత్సరంలో ఖరీఫ్‌, రబీలో నికర జలాల కేటాయింపులున్న ప్రాజెక్టుల కింద కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వినియోగించుకున్నారు. కృష్ణాడెల్టాకు 151 టీఎంసీల కేటాయింపు ఉండగా, ఖరీఫ్‌లో 129, రబీలో 77 టీఎంసీలు కలిపి మొత్తం 206 టీఎంసీలు ఉపయోగించుకున్నారు. నాగార్జునసాగర్‌ కుడి, ఎడమకాలువలకు కలిపి 264 టీఎంసీల కేటాయింపు ఉంది. కానీ వినియోగించుకొన్నది 345.540 టీఎంసీలు. ఎస్సార్బీసీకి 19 టీఎంసీల కేటాయింపు ఉండగా మొత్తం వినియోగించారు. మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో తెలుగుగంగలో 30, ఎ.ఎం.ఆర్‌.పి కింద 20 టీఎంసీలు వాడుకున్నారు. జూరాల, ఆర్డీఎస్‌లకు కలిపి 33.740 టీఎంసీల కేటాయింపు ఉండగా, 19.130 టీఎంసీలు మాత్రమే కాలువలకు విడుదల చేశారు. హంద్రీనీవా మొదటి దశకు ప్రారంభోత్సవం జరిగినా, 14 టీఎంసీలకు గాను సుమారు ఐదు టీఎంసీలు మాత్రమే విడుదల చేశారు. తెలుగుగంగలో భాగంగా ఉన్న వీరబ్రహ్మం రిజర్వాయర్‌ సామర్థ్యం 17 టీఎంసీలు. అయితే ఈ రిజర్వాయర్‌ కింద ఇచ్చింది 1.779 టీఎంసీలు మాత్రమే. కృష్ణాబేసిన్‌లో 394 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లినా, మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులు వినియోగంలోకి రాకపోవడంతో వినియోగించుకోలేకపోయారు. వంశధార కింద 2013-14లో వినియోగించుకొన్నది 18 టీఎంసీలు కాగా, సముద్రంలోకి వెళ్లింది 126.325 టీఎంసీలు కావడం గమనార్హం.

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

సావిత్రి... టీజర్‌ విడుదల

నారా రోహిత్‌, నందిత జంటగా పవన్‌ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సావిత్రి చిత్ర టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ప్రేమికుల రోజు శుభాకాంక్షలతో చిత్ర బృందం ఈ టీజర్‌ను విడుదల చేసింది. విజన్‌ ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net