Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ప్యాకేజీ ఇవ్వండి''విలీనమా.. అనర్హతా?''అదనపు పనులన్నీ పాత గుత్తేదారులకే''భారతమాతను కించపరిస్తే సహించం''‘తెలంగాణ బ్రాండ్‌’ పేరుతో అమ్మకాలు''శాశ్వత ఉత్సవంగా మేడారం జాతర''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''విలీన లేఖపై ఏమి చేయాలి?''వీరసేనానికి కన్నీటి వీడ్కోలు''అమ్మతనానికి అండ'
విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని?
గుంటూరు-కృష్ణా తెదేపా నేతలకు తెలిపిన అధినేత?
8వ తేదీ రాత్రి 7.27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం
8.35కు రైతు, డ్వాక్రా మహిళల రుణమాఫీపై తొలిసంతకం
తిరుపతిలో 4వ తేదీన శాసనసభాపక్ష సమావేశం
ఈనాడు - హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని విజయవాడ-గుంటూరుల మధ్య రానుందని సమాచారం. హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ల్లా విజయవాడ-గుంటూరులు జంటనగరాలుగా అభివృద్ది చెందుతాయని చంద్రబాబు పార్టీ నేతలతో అన్నట్లు తెలిసింది. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో బాబు గురువారం తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజధాని ప్రస్తావన వచ్చిందని సమాచారం. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి లాంటి పట్టణాలు కలిసి మహానగరంగా నూతన రాజధాని అభివృద్ధి చెందుతుందని నేతలు కూడా ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారని సమాచారం.

పోలవరంపై కేసీఆర్‌ అనవసర రాద్ధాంతం
పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంపై తెరాస అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ముంపు గ్రామాలను ఆంధ్రలో చేర్చాలని పునర్‌వ్యవస్థీకరణ బిల్లులోనే ఉందని, అప్పుడు నోరు మెదపని కేసీఆర్‌ ఇప్పుడు మాట్లాడడం, బంద్‌కు పిలుపివ్వడం సరైంది కాదని నేతలు అభిప్రాయపడ్డారు. ఇరుప్రాంతాలకు న్యాయం జరగాలని తాము కోరుకుంటుంటే...ఇంకా రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని కేసీఆర్‌ అనుకుంటున్నారని చంద్రబాబు విమర్శించినట్లు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు జూన్‌ 8వ తేదీ రాత్రి 7గంటల 27నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరోవైపు ఎన్నికల హామీని అమలుచేసే దిశగా అదే వేదికపై రాత్రి 8.35 నిమిషాలకు రైతు, డ్వాక్రా మహిళల రుణమాఫీపై తొలి సంతకం పెట్టనున్నారు. ఈ రెండు సమయాలు ఖరారయ్యాయని అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు తెదేపా శాసనసభాపక్ష సమావేశం జూన్‌ నాలుగో తేదీ సాయంత్రం తిరుపతిలో జరగనుంది. ఆ సందర్భంగా చంద్రబాబును ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకుంటారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా యువగర్జన సభను నిర్వహించిన మైదానంలో 8వ తేదీ ఉదయం 11.45 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయాలని తొలుత అనుకున్నా...ఆ సమయంలో ఎండ ఉంటుందని, మరోవైపు అంతకంటే మంచి ముహూర్తం ఉందని కొందరు సూచించడంతో రాత్రికి సమయం మారిందని తెలిసింది. తెదేపా రాష్ట్ర కార్యాలయంలో ఏటా పంచాంగ శ్రవణం చేసే శ్రీనివాస గార్గేయ, ఆయన కుమార్తె, పంచాంగ కర్త నందిని చంద్రబాబును కలిశారని తెలిసింది. రాత్రి ఏడు గంటల నుంచి 8గంటల మధ్య ముహూర్తం బాగుందని ఆయన సూచించినట్లు సమాచారం. ప్రజా క్షేమం కోసం మంచి ముహూర్తంలోనే ప్రమాణస్వీకారం చేయాలని నేతలూ చెప్పినట్లు సమాచారం. చివరకు రాత్రి 7.27 నిమిషాలకు ప్రమాణస్వీకార సమయాన్ని ఖరారు చేసినట్లు పార్టీకి చెందిన ఒక సీనియర్‌ నేత చెప్పారు.

రుణమాఫీపై బ్యాంకర్లతో సమావేశమైన చంద్రబాబు: మరోవైపు రుణమాఫీపై చంద్రబాబు గురువారం రాత్రి తన నివాసంలో బ్యాంకర్లతో చర్చించారు. రుణభారాన్ని ప్రభుత్వం తీసుకుని...కొన్నేళ్ల తర్వాత చెల్లించేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ అంశాలపై మరింత లోతుగా చర్చించేందుకు ఇంకో దఫా సమావేశం కావాలని చంద్రబాబు నిర్ణయించారు.

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ప్రేమలు మెరిసే.. తారలు మురిసే!

ప్రేమ ఓ అనీర్వచనీయమైన అనుభూతి. ప్రేమలో పడితేనే దాని మాధుర్యం ఏంటో తెలిసేది. నిజ జీవితాల్లోనే కాదు వెండితెరపైనా ప్రేమ అద్భుతమైన విజయాలు అందించింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net