Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ప్యాకేజీ ఇవ్వండి''విలీనమా.. అనర్హతా?''అదనపు పనులన్నీ పాత గుత్తేదారులకే''భారతమాతను కించపరిస్తే సహించం''‘తెలంగాణ బ్రాండ్‌’ పేరుతో అమ్మకాలు''శాశ్వత ఉత్సవంగా మేడారం జాతర''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''విలీన లేఖపై ఏమి చేయాలి?''వీరసేనానికి కన్నీటి వీడ్కోలు''అమ్మతనానికి అండ'
ఓలమ్మో... ఓల్వో!
మారిన డిజైన్‌ వల్లే అగ్ని ప్రమాదాలు
దుర్ఘటనలపై నిగ్గుతేల్చిన నిపుణులు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
ల్వో బస్సుల్లో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవించి పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు కోల్పోవటానికి ఆ బస్సుల డిజైన్‌ లోపాలే కారణమని తేలినా తగు చర్యలు తీసుకోవటంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేయటంపై విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ ప్రమాదాలపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వం తొక్కిపెట్టిందనీ తెలిసింది. ఉన్నతస్థాయిలో వచ్చిన ఒత్తిళ్ల వల్లే కేంద్ర ప్రభుత్వం తగిన నివారణా చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. అత్యాధునిక టెక్నాలజీతో అతి వేగంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడానికి అనువుగా ఉండటంతో రవాణా రంగంలోని అనేక మంది ఓల్వో బస్సులను సమకూర్చుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా వినియోగిస్తున్న బస్సులు ఇవే కావటం గమనార్హం. మూడేళ్ల కిందట వరకు ఈ బస్సులు అత్యంత సురక్షితమైనవిగానే అంతా భావించేవారు. వివిధ కారణాల వల్ల ఓల్వో కంపెనీ తమ బస్సుల డిజైన్‌లో మార్పులు చేసిందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాతే ప్రమాదాలు పెరిగిపోయాయి.

మూడేళ్ల కిందటి డిజైన్‌ ప్రకారం బస్సు అడుగు భాగాన మధ్యలో మూడు డీజిల్‌ ట్యాంకులు ఉండేవి. వీటిల్లో 600 లీటర్ల వరకూ డీజిల్‌ను నిల్వ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మార్చిన డిజైన్‌ ప్రకారం..ఈ మూడు ట్యాంకులను బస్సు ముందు భాగంలోకి మారాయి. ప్రయాణికులు కిందికి దిగే ఫుట్‌బోర్డు- డ్రైవర్‌ సీటు మధ్యన ఉండే అడుగు భాగాన అమర్చారు. డ్రైవర్‌ సీటు కింద బ్యాటరీ, సీటు వెనుక ఎలక్ట్రికల్‌ స్విచ్‌ బోర్డును ఏర్పాటు చేశారు. బ్యాటరీకి స్విచ్‌ బోర్డుకు దగ్గరలో(కింది భాగాన) డీజిల్‌ ట్యాంకును ఏర్పాటు చేయడం వల్ల బాటరీలో గానీ స్విచ్‌ బోర్డులో గానీ షార్టు సర్క్యూట్‌ ఏర్పడితే ఈ ప్రభావం వెంటనే డీజిల్‌ ట్యాంకుపై పడి ఒక్కసారిగా మంటలు చెలరేగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫుట్‌బోర్డు మెట్లకు అనుకొనే డీజిల్‌ ట్యాంకు ఉండటంతో అక్కడ మంటలు ఎగసినప్పుడు తలుపు తెరిచే అవకాశం ఉండటంలేదు. ఈలోగా బస్సులో దట్టమైన పొగ అలముకోవటం వల్ల ప్రయాణికులు అద్దాలను పగలగొట్టి కిందికి దిగే ప్రయత్నమూ చేయలేక మంటల్లో మాడిపోయే పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు తేల్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లా పాలెం వద్ద ఓల్వో బస్సులో జరిగిన అగ్నిప్రమాదంలో 45 మంది చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా బెంగళూరులో ఇలాంటి ప్రమాదంలోనే పదిమందికిపైగా చనిపోయారు. బుధవారం థానే దగ్గర ఓల్వో బస్సు లారీని ఢీకొన్న ప్రమాదంలో మంటలు చెలరేగి 8మంది చనిపోయారు. గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా పది ఓల్వో బస్సులు అగ్నిప్రమాదాల్లో దగ్ధమయ్యాయని రవాణా అధికారులు తెలిపారు.

కేంద్రం తాత్సారం: పాలెం బస్సు ప్రమాదంపై కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నియమించిన నిపుణుల కమిటీ వాహన డిజైన్‌ లోపం వల్లే మంటలు చెలరేగి ప్రయాణికులు చనిపోయారని తేల్చింది. ఓల్వో బస్సుల డిజైన్‌లో మార్పులు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నెల రోజుల కిందటే నివేదిక ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక తదితర రాష్ట్రాలు కూడా తమ రవాణాశాఖ అధికారులతో ఈ ఘటనపై పరిశీలన చేయించాయి. వారూ డిజైన్‌ లోపమనే తేల్చారు. కొద్ది రోజుల కిందట త్రివేండ్రంలో రాష్ట్రాల రవాణా మంత్రులు, కమిషనర్ల సమావేశం జరగగా ఈ కార్యకమానికి హాజరైన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి అస్కార్‌ పెర్నాండెజ్‌ దృష్టికి డిజైన్‌ లోపం విషయాన్ని రాష్ట్రాల అధికారులు తీసుకెళ్లారు. డిజైన్‌ మార్చే వరకు బస్సుల విక్రయాలు జరగకుండా నిలిపివేయాలని కోరారు. దీనిపై పరిశీలన చేస్తామని మంత్రి తెలిపినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కొంతమంది ఉన్నతస్థాయిలో ఒత్తిడి తీసుకురావడం వల్లే నిపుణుల కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. మన రాష్ట్రంలో ప్రైవేటు, ఆర్టీసీలో కలుపుకుని 800 ఓల్వో బస్సులు ఉన్నాయి. వీటిలో దాదాపు 500 బస్సులకు డిజైన్‌ లోపం ఉందని అధికారులు చెబుతున్నారు.

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ప్రేమలు మెరిసే.. తారలు మురిసే!

ప్రేమ ఓ అనీర్వచనీయమైన అనుభూతి. ప్రేమలో పడితేనే దాని మాధుర్యం ఏంటో తెలిసేది. నిజ జీవితాల్లోనే కాదు వెండితెరపైనా ప్రేమ అద్భుతమైన విజయాలు అందించింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net