Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
ఇక మొ‘బిల్‌’
రెండునెలల్లో ప్రత్యేక అప్లికేషన్‌
మొబైల్‌తో చెల్లింపులు
ఈ-పట్టాదారు పాసుపుస్తకాలు
అధిక వసూలుదారులపై జరిమానాలు
‘మీ సేవ’లో సమూల మార్పులు
ఈనాడు, హైదరాబాద్‌: ‘మీసేవ’లో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ఐటీశాఖ ప్రణాళిక రూపొందించింది. ఆన్‌లైన్లో పౌర సేవలను 300కు పెంచిన నేపథ్యంలో వీటిని మరింత పారదర్శకంగా, సత్వరంగా అందించాలని ప్రయత్నిస్తోంది. నూతన ప్రాజెక్టుల్లో భాగంగా ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌పై పనిచేసే సెల్‌ ఫోన్ల ద్వారా వినియోగ సేవల బిల్లులు చెల్లించేందుకు వీలుగా అధికారులు, సాంకేతిక సిబ్బంది ప్రత్యేక అప్లికేషన్‌ రూపొందిస్తున్నారు. మరో రెండు నెలల్లో దీనిని ప్రజలకు అందుబాటులో తీసుకురానున్నారు. రెవెన్యూ సర్వీసుల్లో కీలకమైన పట్టాదారు పాసుపుస్తకాల్ని ఆన్‌లైన్లో ఇప్పటికే జారీ చేస్తున్నారు. వారం క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు 130 పాసు పుస్తకాలకు ఆమోదం తెలిపారు. రైతు, కొత్తగా భూమి కొన్న వ్యక్తి తమ రిజిస్ట్రేషన్‌ పత్రాలను మీసేవ కేంద్రంలో అప్‌లోడ్‌ చేసి, దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత గడువులోగా తహసీల్దారు క్రయ, విక్రయదారులకు నోటీసులు జారీ చేసి, దరఖాస్తును ఆమోదిస్తారు. ఈ ఆమోదం పొందిన దరఖాస్తుకు సంబంధించిన ఈ-పాసుపుస్తకం చెన్నైలో పటిష్ఠభద్రత కింద ముద్రించి దరఖాస్తుదారుని చిరునామాకు పంపిస్తారు. మారుతున్న పరిస్థితుల మేరకు ఈ-సేవ కేంద్రాల్లో క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా రుసుములు స్వీకరించే ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. నిర్ణీత రుసుము కన్నా ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నవారు మరోసారి తప్పులు చేయకుండా ఉండేందుకు జరిమానాలు విధించాలని నిర్ణయించారు.

మీసేవ ద్వారా కార్మికశాఖలో రిజిస్ట్రేషన్లు, నవీకరణల్లో తలెత్తుతున్న సాంకేతిక లోపాలను సరిచేశామని, ఈ మేరకు ఐటీశాఖ తరపున సాంకేతిక సిబ్బంది, ఉన్నతాధికారులు అందుబాటులో ఉన్నారని ఈ-సేవ సంచాలకులు నాయక్‌ ‘ఈనాడు’కు తెలిపారు. మీసేవ కేంద్రాల్లోని సిబ్బందికి సేవలపై శిక్షణ ఇస్తున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు, ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారికి ప్రత్యేక నమూనా (ఫార్మేట్‌)లో ఓబీసీ ద్రువీకరణ పత్రం ఇచ్చే ఏర్పాట్లు చేశామన్నారు. దరఖాస్తు సమయంలో ఓబీసీ ధ్రువీకరణ పత్రం ఎందుకో స్పష్టంగా చెబితే, ఆ నమూనాలోనే దరఖాస్తు పూర్తిచేసేందుకు వీలుంటుందన్నారు.

‘మీసేవ’లు మరింత విస్తృతం
‘మీసేవ’లను మరింత విస్తృత పరిచే అవకాశమున్నట్లు అధికారులు చెప్పారు. ఎమ్మెల్సీ కె.ఆర్‌.ఆమోస్‌ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ కమిటీ సమీక్ష సమావేశంలో, అధికారులు ఈ వివరాలు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 300 వరకు మీసేవ కేంద్రాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని, మరో ఏడువేల కేంద్రాలు ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరు వేలకుపైగా కేంద్రాలున్నాయని, ఈ విషయంలో దేశంలో రాష్ట్రం ముందుందన్నారు. ఈ సమావేశంలో సభ్యులు డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ్‌, యాదవరెడ్డి, రాములు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మైనారిటీలకు ‘మీసేవ’లు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: వక్ఫ్‌బోర్డుకు సంబంధించిన నాలుగు రకాల సేవలను ‘మీసేవ’కు అనుసంధానం చేసినట్లు మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ శుక్రవారం తెలిపారు. ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. వక్ఫ్‌ బోర్డుకు సంబంధించిన సేవలను ముస్లింలు మీసేవ ద్వారా పొందేలా చర్యలు చేపట్టామని తెలిపారు. దీంతో మీసేవలో అందిస్తున్న సేవల సంఖ్య 300 దాటిందని పేర్కొన్నారు. ముస్లిం వివాహ ధ్రువీకరణ పత్రాలు, విడాకుల పత్రాలు, కుల పత్రాలు కూడా మీసేవ ద్వారా అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. ఈ సేవలపై ముస్లిం పెద్దలకు కొన్ని అపోహలున్నాయని, వాటిని తొలగించి తర్వాత అందుబాటులోకి తెస్తామన్నారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సమక్షంలో కొత్త సేవలను ప్రారంభించారు.

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

పరిశ్రమ వదిలి వెళ్లిపోదామనుకున్నా!

మానవీయ కోణాల్ని స్పృశిస్తూ సినిమాలు తీయడంలో దర్శకుడు మదన్‌ది ప్రత్యేక శైలి. మనిషి, మనసు, అనుబంధాల మధ్య సంఘర్షణల్ని ఆయన తెరపైకి తీసుకొచ్చే విధానం బాగుంటుంది.

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net