Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
కొత్త నియామకాలతోనే అటవీశాఖ బలోపేతం
ప్రస్తుతం సగం ఉద్యోగాలు ఖాళీనే
అధికారుల పరంగా ఏపీలో
ఎక్కువ.. తెలంగాణలో తక్కువ!
ఈనాడు, హైదరాబాద్‌: అటవీశాఖలో సింహభాగం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం చేపట్టిన నియామకాలు పూర్తయితే తెలంగాణ జిల్లాల్లో ఈ శాఖ పరిపుష్ఠం అవుతుంది. సహాయకుల(అటెండరు) నుంచి అత్యున్నత అధికారైన పీసీసీఎఫ్‌తో కలిపి రాష్ట్రంలో మొత్తం 13,738 ఉద్యోగాలుండగా విధుల్లో ఉన్నది 7,637 మందే.. అంటే ఏకంగా 6,101 పోస్టులు ఖాళీగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇక రాష్ట్రానికి దక్కిన 149 ఐఎఫ్‌ఎస్‌ పోస్టులకుగాను పనిచేస్తున్నది 125 మంది. మంజూరుచేసిన ఉద్యోగాలను పరిగణనలోకి తీసుకుంటే ఐఎఫ్‌ఎస్‌ నుంచి సాధారణ ఉద్యోగులకు వరకు ఆంధ్రప్రదేశ్‌లోనే వారి సంఖ్య కాస్త ఎక్కువ. అటవీశాఖలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 3,975 మంది పనిచేస్తుండగా, తెలంగాణకు చెందిన సిబ్బంది 3,662 మంది ఉన్నారని విభజన నేపథ్యంలో అధికారులు లెక్కలు తేల్చారు. గడిచిన దశాబ్దకాలంగా ఈ శాఖలో నియామకాలు చేపట్టకపోవటంతో పెద్దసంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కొన్నేళ్ల వ్యవధిలో ఎర్రచందనం స్మగ్లర్లు, మరోవైపు ఆటవీ భూములను ఆక్రమించుకున్న అక్రమార్కులు చేసిన వేర్వేరు దాడుల్లో పలువురు అధికారులు హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఖాళీలను భర్తీ చేయాల్సిందిగా అధికారులు పదేపదే కోరటంతో గత ఏడాది ప్రభుత్వం సుమారు 3,400 పోస్టులను మంజూరుచేసింది. వాటిలో సుమారు 2,177 ఉద్యోగాలకు ఇటీవల రాతపరీక్షలను నిర్వహించారు. రానున్న రెండు, మూడు నెలల వ్యవధిలో ఇవి భర్తీ కాన్నాయి. తద్వారా తెలంగాణలోని అటవీశాఖ మరింత బలోపేతం కానుంది. మిగిలిన పోస్టులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేయాలని ప్రభుత్వం గడిచిన ఏడాది జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.

అక్కడ 42... ఇక్కడ 15
అఖిల భారత స్థాయిలో ఉన్న ఐఎఫ్‌ఎస్‌ అధికారులు రాష్ట్రంలో 125 మంది పని చేస్తున్నారు. వారిలో 57 మంది రాష్ట్రానికి చెందినవారు కాగా మిగిలిన 68 మందీ ఇతర రాష్ట్రాలవారే. రాష్ట్రం నుంచి ఉన్న 57 మందిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే ఎక్కువమంది. 42 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారుల్లో 24 మంది నేరుగా నియమితులయ్యారు. మిగిలిన 18 మంది పదోన్నతుల ద్వారా ఐఎఫ్‌ఎస్‌ అధికారులు అయ్యారు. తెలంగాణకు చెందినవారు కేవలం 15 మందే ఉన్నారు. ఏడుగురు నేరుగా ఐఎఫ్‌ఎస్‌లుగా నియమితులవగా తొమ్మిది మంది పదోన్నతులపై ఆ స్థాయి అధికారులయ్యారు. వీరంతా అఖిల భారత సర్వీసులకు చెందిన అధికారులు కావటంతో ఐఎఎస్‌, ఐపీఎస్‌ల మాదిరే ప్రత్యూష్‌సిన్హా కమిటీ రూపొందించే నియమావళి కోసం ఎదురుచూస్తున్నారు. విభజనకు సంబంధించి రెండు మూడు రోజుల్లో విధి విధానాలు ఖరారు అవుతాయని భావిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు మంగళవారం ‘ఈనాడు’తో చెప్పారు.

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

ఉగ్రవాదులకు శ్రీకాంత్‌ ‘టెర్రర్‌’

హీరో శ్రీకాంత్‌ ఇంటెలిజెన్స్‌ పోలీస్‌ అధికారిగా ఉగ్రవాదంపై చేసే పోరాటమే ‘టెర్రర్‌’. ఓ పోలీస్‌ అధికారి నగరాన్ని ముట్టడించిన ఉగ్రవాదులను ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశాన్ని దర్శకుడు ఎంతో...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net