Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'

కొలిక్కి వస్తున్న తెదేపా, భాజపా చర్చలు
లోక్‌సభ స్థానాలపై అంగీకారం దిశగా ఇరు పార్టీలు
అసెంబ్లీ సీట్లపై కొనసాగుతున్న సంప్రదింపులు
తెలుగుదేశం నేతలతో జవదేకర్‌ భేటీ
ఈనాడు - హైదరాబాద్‌
పొత్తు, సీట్ల పంపిణీపై తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య చర్చలు కొలిక్కి వస్తున్నాయి. లోక్‌సభ స్థానాల సంఖ్యపై ఇరు పార్టీల వైఖరిలో పెద్ద తేడా లేదు. అసెంబ్లీ సీట్ల విషయంలో మాత్రం వ్యత్యాసం ఉంది. అయితే గతంలో ఈ తేడా 30 వరకు ఉండగా, గురువారం చర్చల్లో 15కు తగ్గింది. మరో రెండు రోజుల్లో సీట్ల పంపిణీపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీట్ల పంపిణీ ఉభయ పక్షాలకూ ఆమోదయోగ్యంగా మారితే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం రోజున తెదేపా, భాజపా పొత్తు ప్రకటన వెలువడే అవకాశముంది. మంగళవారం పునఃప్రారంభమైన మలిదఫా చర్చలు గురువారం మరో అడుగు ముందుకుపడ్డాయి. తెలంగాణ, సీమాంధ్రల్లో పొత్తుల వ్యవహారాన్ని చూస్తున్న భాజపా సీనియర్‌ నేత ప్రకాశ్‌ జవదేకర్‌ గురువారమిక్కడ ఇద్దరు తెదేపా ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. భేటీలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. సమావేశం దాదాపు మూడున్నర గంటల పాటు సాగింది. రెండు పార్టీల నేతలు గతంలోలాగా ఎవరి వాదనకు వారు కట్టుబడకుండా కొంత పట్టువిడుపు ధోరణి ప్రదర్శించారు. తెలంగాణలో 56 శాసనసభ స్థానాలు ఇవ్వాలని భాజపా అడగ్గా, తెదేపా అందుకు అంగీకరించలేదు. 30 స్థానాలు ఇస్తామని ప్రతిపాదించింది. ఈ సంఖ్యకు ఒప్పుకొనేది లేదంటూ కనీసం 48 స్థానాలు ఇవ్వాలని భాజపా కోరిందని తెలిసింది. తెదేపా స్పందిస్తూ- 33 సీట్లు ఇస్తామని చెప్పిందని సమాచారం. ఏడు ఎంపీ స్థానాలు- హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, భువనగిరి, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, మహబూబాబాద్‌లను భాజపాకు ఇచ్చేందుకు తెదేపా సుముఖత వ్యక్తంచేసినట్లు తెలిసింది. భాజపా తొమ్మిది స్థానాల కోసం పట్టుబట్టింది. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంతో కలిపి ఎనిమిది ఇస్తామని తెదేపా చెప్పినట్లు సమాచారం. శాసనసభ స్థానాల సంఖ్యపై రెండు పార్టీలూ అంగీకారానికి రావడానికి కొంత సమయం పట్టొచ్చని, ఈ విషయమై ఇంకా ఒకట్రెండు సమావేశాలు జరిగే అవకాశముందని తెలుస్తోంది.

సీమాంధ్రలో ఎనిమిది లోక్‌సభ స్థానాలు, 25 అసెంబ్లీ సీట్లు కావాలని భాజపా కోరుతోంది. లోక్‌సభ సీట్లు నాలుగు, శాసనసభ స్థానాలు 12 కేటాయిస్తామని తెదేపా సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. ఆరు ఎంపీ స్థానాలు, కనీసం 18 శాసనసభ స్థానాలు ఇవ్వడానికి ముందుకొస్తే ఆలోచిస్తామని భాజపా అంటున్నట్లు తెలుస్తోంది. సీమాంధ్ర సీట్ల పంపిణీపైనా ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే దిశగా సంప్రదింపులు సాగుతున్నాయి.

నేడు తేల్చాలన్న జవదేకర్‌!
శాసనసభ సీట్ల విషయంలో చర్చలు కొలిక్కి రాకపోవడంతో శుక్రవారంలోగా ఈ విషయంపై తేల్చాలని తెదేపా నేతలతో జవదేకర్‌ అన్నట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో మాట్లాడి చర్చల సారాంశాన్ని వివరిస్తామని, మరోసారి సమావేశమవుదామని తెదేపా నేతలు బదులిచ్చినట్లు తెలిసింది.

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

‘శ్రీశ్రీ’ డబ్బింగ్‌ పూర్తి

అలనాటి తెలుగు సూపర్‌స్టార్‌ కృష్ణ, ఆయన భార్య విజయ నిర్మల కీలక పాత్రధారులుగా తెరకెక్కిన ‘శ్రీశ్రీ’ చిత్రం దాదాపు పూర్తయ్యింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net