Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
రుజువైతే ఏడేళ్ల జైలు
అక్కడ ముడుపు ముట్టింది... ఇక్కడ ఫైలు కదిలింది!
కొట్టింది రూ.68 కోట్లు
అక్రమాస్తుల కేసులో ‘పెన్నా’ఛార్జిషీటు
ఈనాడు, హైదరాబాద్‌
అధికారం దన్నుతో తండ్రి భారీగా మేళ్లు చేసిపెట్టటం.. ఆ వెంటనే కొడుకు అందినకాడికి భారీగా రాబట్టుకోవటం.. ఇదీ ‘వైఎస్‌’ల మార్కు అరాచకం. పెన్నా సిమెంట్స్‌కు తండ్రి భారీగా భూములు కట్టబెడితే.. వారి నుంచి అబ్బాయి రూ.68 కోట్ల వరకూ పిండుకున్నారు. ఈ వ్యవహారంలో వైఎస్‌ జగన్మోహనరెడ్డిని ‘ఎ1’ ముద్దాయిగా పేర్కొంటూ సీబీఐ ‘420’తో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఇవి రుజువైతే జగన్‌కు 7 ఏళ్ల జైలు తథ్యం.
రాజన్న ఒకవైపు రాజ్యం ఏలుతుంటే.. మరోవైపు యువ నేత చీకటి రాజ్యం ఏలారు! వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వంలో ఫైలు కదలాలంటే.. అందుకు జగన్‌కు ముడుపు ముట్టాల్సిందే. సీబీఐ దాఖలు చేసిన ‘నీకిది-నాకది’ కేసులన్నీ ఘోషించేది ఇదే. అయితే ఈ ముడుపుల తతంగాన్ని కళ్లకు కట్టే చిత్రవిచిత్రమైన అంశాలను ఎన్నింటినో సీబీఐ వెలుగులోకి తీసింది. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. పెన్నా సిమెంట్స్‌ కేసులో దొరికిన తేదీల మతలబు!

ఒకవైపు ఇట్నుంచి వై.ఎస్‌. ప్రభుత్వం వారికో మేలు చేసి పెడుతుంది..నాలుగు రోజులు అటూఇటూగా వాళ్లు జగన్‌ కంపెనీల్లో ‘పెట్టుబడులు’ చెల్లించుకుంటూ ఉంటారు! ఇదేదో ఒకటి రెండు సార్లు కాకతాళీయంగానో.. అనూహ్యంగానో జరిగిందికాదు. వీటి మధ్య మాయదారి లంకె ఏదో ఉందని ఆ తేదీలు చెప్పకనే చెబుతున్నాయి. అనంతపురం జిల్లా యాడికి మండలంలో పెన్నాకు భూముల కేటాయింపులో జరిగిన ఈ వ్యవహారాన్ని సీబీఐ తన అభియోగ పత్రంలో పేర్కొంది. ఇందులో జగన్‌ కంపెనీలోకి ముడుపులు అందిన తేదీలూ.. దానికి కొంచెం అటూఇటూగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలూ స్పష్టంగా చూడొచ్చు.

వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి సీఎంగా చక్రం తిప్పుతున్నప్పుడు తమ కుటుంబానికి సన్నిహితుడైన పెన్నా గ్రూపు అధినేత పి.ప్రతాప్‌రెడ్డికి ప్రజల సంపదను దోచిపెట్టారు. ఈ వ్యవహారంలో జగన్‌ వసూళ్లు చేసుకున్న మామూళ్లు రూ.68 కోట్లు! ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందో జగన్‌ అక్రమాస్తుల కేసులోని తన ఛార్జిషీటులో (సీసీ 26/13)లో సీబీఐ స్పష్టంగా వివరించింది. ఈ కేసులో జగన్‌ ప్రధాన నిందితుడు. ఈ అభియోగ పత్రంలో అతని మీదున్న ఆరోపణలు రుజువైతే గరిష్టంగా 7 వరకూ జైలు శిక్ష, జరిమానా పడే అవకాశం ఉంది. దీన్ని ఐపీసీ సెక్షన్‌ 120-బి రెడ్‌విత్‌ ‘420’ కింద పరిగణనలోకి తీసుకున్నారు. కుట్ర పన్నడం, మోసపూరితంగా అనైతికంగా ఆస్తుల బదలాయింపు చేసుకోవటం... వంటివి ఈ సెక్షన్‌ కిందకు వస్తాయి.

జగన్‌పై అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 9 కింద కూడా అభియోగం నమోదైంది. అధికారులను వ్యక్తిగతంగా ప్రభావితం చేసి తద్వారా లబ్ధి పొందడం, ఇతరులకు లబ్ధి చేకూర్చడానికి ముడుపులు అంగీకరించడం వంటి నేరాలకు సంబంధించిదీ సెక్షన్‌.

పెట్టుబడుల రూపంలో పెన్నా నుంచి జగన్‌ సంస్థల్లోకి వచ్చిన మొత్తం:
కార్మెల్‌ ఏసియాలోకి రూ.23 కోట్లు
జగతిలోకి రూ.45 కోట్లు

వై.ఎ®.ý సర్కారు చేసిన మేళ్లు
మేలు 1: అనంతపురం జిల్లాలో 231.09 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టటం.
సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటు నిమిత్తం పెన్నా గ్రూపు అధినేత పి.ప్రతాప్‌రెడ్డి అడిగిందే తడవుగా అనంతపురం జిల్లా యాడికి మండలం కమలపాడు, గుడిపాడు, కుందనకోట, నిట్టూరు గ్రామాల్లో 231.09 ఎకరాలను ఎకరా రూ.50 వేల చొప్పున ఇచ్చారు. ఇందులో పేదల కోసం కేటాయించిన 114 ఎకరాల అసైన్డ్‌ భూములను నోటీసులు కూడా ఇవ్వకుండా లాగేసుకున్నారు. పెన్నా కంపెనీ ప్రతినిధులకు రెవెన్యూ అధికారులు తోడై చుట్టూ కంచె వేసి పొలాలకు దారి లేకుండా చేస్తామని నానా రకాలుగా బెదిరించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఫోన్‌ కాల్‌తో సీసీఎల్‌ఏ ఈ భూముల కేటాయింపు ప్రక్రియను సాధికారిక కమిటీ ముందు పెట్టడం, మొక్కుబడి తీర్మానాలతో 231.09 ఎకరాలకు పెన్నాకు వైఎస్‌ సర్కారు కట్టబెట్టేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

మేలు 2: కర్నూలు జిల్లాలో పెన్నాకు 304.74 హెక్టార్ల లీజు మంజూరు
కర్నూలు జిల్లా బూర్గుల గ్రామంలో పెన్నాకు 304.74 హెక్టార్లలో ప్రాస్పెక్టింగ్‌ లీజు మంజూరు చేసింది వై.ఎస్‌. సర్కారు. అప్పటికే మైనింగ్‌ లీజు నిమిత్తం అల్ట్రాటెక్‌ సిమెంట్‌ లిమిటెడ్‌తో పాటు మరో వ్యక్తి పెట్టుకున్న దరఖాస్తులను పక్కన బెట్టి మరీ ఈ భూముల లీజును పెన్నాకు కట్టబెట్టారు!

మేలు 3: రంగారెడ్డిలో 1021.26 ఎకరాల ప్రాస్పెక్టింగ్‌ లీజులను కట్టబెట్టటం
వైఎస్‌ జమానా అడ్డగోలుగా రంగారెడ్డి జిల్లాలో వెయ్యికిపైగా ఎకరాల సున్నపురాయి మైనింగ్‌ లీజును పెన్నాకు కట్టబెట్టింది. నిజానికి 60లలోనే ఈ గనులను వాల్‌చంద్‌ తాండూర్‌కు ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. కానీ సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడంతో ఆ లీజు రద్దయింది. మరోసారి పునరుద్ధరించాలని కోరినా ప్రభుత్వం నిరాకరించడంతో వాల్‌చంద్‌ తాండూర్‌ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది. ఇదే సమయంలో ఆ కంపెనీని పెన్నా గ్రూపు స్వాధీనం చేసుకుంది. అంతకుముందు వాల్‌చంద్‌ పేరుతో ఉన్న లీజుల పునరుద్ధరణకు ససేమిరా అన్న వైఎస్‌ ప్రభుత్వం ఆ కంపెనీ పెన్నా చేతికి వస్తూనే వెంటనే నిర్ణయాలు మార్చేసింది. ఒకసారి లీజు తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంటే దాన్ని పునఃసమీక్షించే అధికారం లేదని అధికారులు, మంత్రి స్పష్టం చేసినప్పటికీ వైఎస్‌ తన విచక్షణాధికారాలను ఉపయోగించి మరీ పెన్నాకు అనుకూల నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం న్యాయవాదిని ఢిల్లీ హైకోర్టుకు పంపి కేసు మూసేయించి పెన్నా తాండూర్‌ సిమెంట్‌ కంపెనీకి లీజు మంజూరు చేశారు.

మేలు 4: పయనీర్‌ హోటల్‌కు రాయితీ
పెన్నా ప్రతాపరెడ్డికి చెందిన పయనీర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ హైదరాబాద్‌ బంజారా హిల్స్‌లో పర్యాటక విభాగంతో కలిసి 150 గదులతో 4 నక్షత్రాల హోటల్‌ నిర్మిస్తోంది. 2005లో పెన్నా ప్రతాప్‌రెడ్డి వైఎస్‌ను కలిసి.. అప్పటికే బ్లిట్జ్‌ హోటల్‌కు ఇస్తున్న రాయితీలన్నీ తమకూ ఇవ్వాలని కోరటంతో.. వై.ఎస్‌. తన విశేషాధికారాలను వినియోగించి వెంటనే అవన్నీ పయనీర్‌కూ ఇవ్వాలని ఆదేశించారు. నిజానికి అప్పటికే పయనీర్‌ ఒప్పందం గడువు తీరిపోయింది. అయినా దాన్ని పునరుద్ధరించాలని పట్టణాభివృద్ధి పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసేశారు.

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

అనుష్కలా పేరు తెచ్చుకుంటా!

ోడలింగ్‌లో రాణిస్తూ... వ్యాపార ప్రకటనల్లో మెరుస్తూ సినిమా పరిశ్రమ దృష్టినీ ఆకర్షిస్తుంటారు కొందరు భామలు. అలా కథానాయికలుగా అవకాశాల్ని అందుకొన్నవాళ్లు చాలా...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net