Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
జాబితా రెడీ!
కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థుల ఖరారు!
మహబూబ్‌నగర్‌ స్థానానికి జైపాల్‌రెడ్డి..
చేవెళ్ల నుంచి మర్రి శశిధర్‌రెడ్డి లేదా సబితారెడ్డి
పెద్దపల్లికి డాక్టర్‌ బాబూరావు పేరు పరిశీలన
ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా వెల్లడి
ఈనాడు - హైదరాబాద్‌
తెలంగాణలో లోక్‌సభ స్థానాలకు పోటీచేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైంది. ఒకట్రెండు స్థానాలు మినహా మిగిలిన స్థానాలన్నింటికీ అభ్యర్థులను కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ ఎంపిక చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కొన్నిరోజులుగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు, వడపోత కార్యక్రమాన్ని చేపట్టిన కాంగ్రెస్‌ అధిష్ఠానం తుది జాబితా ఖరారుకు బుధవారం ఢిల్లీలో సమావేశమై చర్చింది. సిట్టింగ్‌ ఎంపీలందరికీ మళ్లీ పోటీకి అవకాశం కల్పించాలన్న నిర్ణయానికే కాంగ్రెస్‌ అధిష్ఠానం కట్టుబడి ఉన్నట్లు తెలిసింది. ఈ దఫా చేవెళ్ల నుంచి కాకుండా మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేస్తానన్న కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి వినతినీ ఆమోదించినట్లు సమాచారం. జైపాల్‌రెడ్డిని మరోసారి చేవెళ్ల నుంచే పోటీ చేయించి మహబూబ్‌నగర్‌కు కొత్త అభ్యర్థిని రంగంలోకి తెచ్చే ప్రయత్నం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. జైపాల్‌రెడ్డి అభిప్రాయానికే అధిష్ఠానం మొగ్గు చూపినట్లు తెలిసింది. చెవేళ్ల లోక్‌సభ స్థానానికి సనత్‌నగర్‌ ఎమ్మెల్యే, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరిలో ఒకరి పేరును ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే, మర్రి శశిధర్‌రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. చేవెళ్ల లోక్‌సభ స్థానాన్ని తన కుమారుడికి కేటాయించి తనకు మహేశ్వరం అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని సబిత కోరారు. తెలంగాణ నుంచి ఈ సారి ఒక కుటుంబానికి ఒక్కటే టికెట్‌ అని అధిష్ఠానం సూత్రపాయంగా నిర్ణయించిన నేపథ్యంలో సబిత అభ్యర్థనను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి ఉస్మానియా వైద్యకళాశాల అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బాబురావు పేరు కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. గతంలో పార్టీని వదిలిపెట్టిన ఓ నాయకుడిని తిరిగి చేర్చుకొని ఇక్కడి నుంచి పోటీ చేయించాలని మొదట భావించినా ఆయన సానుకూలత వ్యక్తం చేయకపోవడంతో కొత్త అభ్యర్థిపై అన్వేషణ మొదలుపెట్టారు. పలుపేర్ల పరిశీలన తర్వాత బాబూరావు వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. ప్రభుత్వ వైద్యుల సంఘంలో పని చేయడం, ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక అమలులో పాలుపంచుకోవడం, తదితర అంశాలు బాబూరావుకు అనుకూలంగా ఉన్నాయి. తెరాస నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి చంద్రశేఖర్‌ పేరు నాగర్‌కర్నూలుకు పరిశీలనలో ఉంది. ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని సీపీఐకి కేటాయించడానికి నిర్ణయం తీసుకొన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానానికి గోండుల నుంచి ఎంపిక చేయాలనుకొంటున్నామని కాంగ్రెస్‌కు చెందిన ముఖ్యనాయకుడొకరు ‘ఈనాడు’కు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లోనే అధికారిక జాబితా వెలువడే అవకాశాలున్నాయని సమాచారం.

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

మోగ్లీ.. ఏప్రిల్‌ 15న వస్తున్నాడు

వాల్ట్‌డిస్నీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘ది జంగిల్‌ బుక్‌’ అనే యానిమేషన్‌ చిత్రాన్ని పేరణగా తీసుకుని అదే పేరుతో మళ్లీ తెరకెక్కిస్తున్నారు. గతంలో...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net