Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
అక్రమాలయా!
పద్మాలయా స్టూడియోలో నిబంధనల అతిక్రమణ
రూ.కోట్ల విలువైన భూమి అమ్మకం
చర్యలు తీసుకోండి: సీసీఎల్‌ఏ నివేదిక
ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలోని జూబ్లీహిల్స్‌లో పద్మాలయా స్టూడియోకు ప్రభుత్వం తక్కువ ధరకు ఇచ్చిన భూమిలో నాలుగు ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా అమ్ముకున్నట్టు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ విచారణలో వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ వ్యవహారం మొత్తం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కలెక్టర్‌ నివేదిక ఆధారంగా పద్మాలయా స్టూడియోకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకునే విషయంపై నిర్ణయం తీసుకోవాలంటూ సీసీఎల్‌ఏ బుధవారం ప్రభుత్వానికి నివేదిక పంపిందని రెవెన్యూ అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. స్టూడియో మొత్తం భూమిని స్వాధీనం చేసుకుంటారా? అక్రమంగా అమ్ముకున్న నాలుగు ఎకరాలనే స్వాధీనం చేసుకుంటారా? అనేది ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.

షేక్‌పేట రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్‌ 403లో 9.5 ఎకరాల భూమిని 1983లో అప్పటి ప్రభుత్వం సినిమా స్టూడియో కోసం ఎకరా రూ.8500 చొప్పున విక్రయించింది. సినిమా స్టూడియో నిర్మాణం కోసమే ఆ భూమిని అభివృద్ధి చేయాలని నిబంధన పెట్టింది. అయితే స్టూడియో అధినేత సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ ఇందులో నాలుగు ఎకరాలను 2000 సంవత్సరంలో ఒక సంస్థకు అమ్మారు. దీనిపై ఫిర్యాదు అందటంతో 2007లో అప్పటి హైదరాబాద్‌ కలెక్టర్‌ సమగ్రంగా దర్యాప్తు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా స్టూడియో అధినేతలు నాలుగు ఎకరాలను విక్రయించినట్టు తేల్చారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ సీసీఎల్‌ఏకు నివేదికను పంపించారు. కానీ కలెక్టర్‌ నివేదికను సీసీఎల్‌ఏ ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో నెల క్రితం ప్రస్తుత జిల్లా కలెక్టర్‌ ముఖేశ్‌ కుమార్‌ మీనా దీనిపై సమగ్ర దర్యాప్తు చేశారు. నాలుగు ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్టు తేలటంతో కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నాలుగు ఎకరాల్లో సంబంధిత సంస్థ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా భవన నిర్మాణంతో పాటు తాగునీరు, విద్యుత్తు కనెక్షన్లకు అనుమతి ఇవ్వొద్దని లేఖలు రాశారు. కలెక్టర్‌ పంపిన నివేదికను సీసీఎల్‌ఏ బుధవారం రెవెన్యూ అధికారులతో సమగ్రంగా చర్చించింది. పద్మాలయా స్టూడియో నిబంధనలకు విరుద్ధంగా భూములను విక్రయించినట్లు సీసీఎల్‌ఏ నిర్ణయానికి వచ్చింది. అక్రమాలు జరిగినట్టు నిర్ధరణ అయినందున పద్మాలయా స్టూడియోపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. నిబంధనలకు విరుద్ధంగా క్రయ విక్రయాలు జరిగాయి కాబట్టి భూములను స్వాధీనం చేసుకోవటమనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని రెవెన్యూ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం పద్మాలయా స్టూడియోపై రెవెన్యూ అధికారులు నిఘా పెట్టారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరా భూమి రూ.20 కోట్ల పైనే ధర పలుకుతోంది.

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

పచ్చబొట్టేసి...జోలీకి నచ్చేసి!

ఏంజెలీనా జోలీకి రెండంటే మహా ఇష్టం. ఒకటి పిల్లలు, రెండు టాటూలు. ముగ్గురు కన్నబిడ్డలతో పాటు మరో ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది జోలీ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net