Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
దుమ్ము దులుపుతున్నారు
ఆక్రమణల చిట్టా తీస్తున్న రెవెన్యూ అధికారులు
కోట్లాది రూపాయల విలువైన భూములపై దృష్టి
ఇప్పటికే నగరంలో కొన్ని స్వాధీనం
ఈనాడు- సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
ప్రభుత్వ, సీలింగ్‌ భూములను దిగమింగి అమ్మకాలకు పెట్టిన ఘనుల చరిత్ర ఒక్కొక్కటిగా వెలుగుచూస్తోంది. హైదరాబాద్‌ నడిబొడ్డున శాసనసభకు చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన భూఆక్రమణలను సవాలుగా తీసుకున్న తహసీల్దార్లు ఆక్రమణల చిట్టా బయటకు లాగుతున్నారు. ఇప్పటికే కొన్ని భూములను స్వాధీనం చేసుకోగా మరికొన్నింటిపై చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ భూముల విలువ రూ.వందల కోట్లలోనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్‌లో ప్రస్తుతం ప్రభుత్వ భూమి అందుబాటులో లేదు. దీనితో ప్రభుత్వ ఆదేశాల మేరకు తహసీల్దార్లు పాత భూమి రికార్డుల దుమ్ము దులిపారు. క్షేత్రస్థాయికి ప్రత్యేక బృందాలను పంపి పరిశీలన ప్రారంభించారు. అనేక చోట్ల ప్రభుత్వ భూమితోపాటు సీలింగ్‌ భూమి ఆక్రమణకు గురయినట్లు గుర్తించారు. చాలా చోట్ల దౌర్జన్యంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి పదుల సంఖ్యలో ప్లాట్లు చేసి విక్రయించారు. ఇందుకోసం నకిలీ డాక్యుమెంట్లనూ సృష్టించారు. అధికారులు భూ రికార్డుల పరిశీలనతోపాటు రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోని దస్త్రాలనూ వడపోయగా నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లుతేలింది. ఇటువంటి స్థలాలన్నీ జూబ్లీహిల్స్‌, బంజరాహిల్‌ú్స, ఫిలింగనర్‌, ఖైరతాబాద్‌, యూసఫ్‌గూడ తదితర ఖరీదైన ప్రాంతాల్లో ఉన్నాయి. అనేక చోట్ల భూమి రియల్టర్ల చేతిలో ఉండటంతో అధికారులు 50 ఏళ్ల రికార్డులను బయటకు తీస్తున్నారు. వీటిలో కొన్ని పేదల ఇళ్లున్నా వాటి జోలికిపోకుండా పెద్దల చేతుల్లో ఉన్నవే స్వాధీనం చేసుకునేందుకురంగంలోకి దిగుతున్నారు.

ఆక్రమించి.. అమ్మకాలు
రాజధాని నడిబొడ్డున ఓ సొసైటీలో 3,227 చదరపు గజాల స్థలాన్ని 13 ప్లాట్లుగా చేసి విక్రయానికి పెట్టారు. రూ.కోట్ల విలువైన ఈ స్థలం సీలింగ్‌ భూమని రికార్డుల పరిశీలనలో తేలింది. ఖైరతాబాద్‌ తహసీల్దారు ఎన్‌.శ్రీనివాసరెడ్డి దీన్ని స్వాధీనంలోకి తీసుకున్నారు.

* ఖైరతాబాద్‌ మండల పరిధిలోని గంగానగర్‌లో 1,100 గజాల స్థలాన్ని నాలుగు ప్లాట్లుగా చేసి రియల్టర్‌ ఒకరు అమ్మకానికి పెట్టారు. దీన్ని ప్రభుత్వ భూమిగా గుర్తించి అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

* టోలీచౌక్‌ ప్రాంతంలోని గుల్షాన్‌కాలనీలో ఒక స్థిరాస్తి వ్యాపారి దాదాపు రూ.20 కోట్లకు పైగా విలువైన ఎకరా భూమిని ప్లాట్లు చేసి అమ్మకానికి పెట్టారు. అధికారులు పట్టించుకోకపోవటంతో పక్కనున్న మరో ఎకరం స్థలాన్ని 120 ప్లాట్లుగా మార్చేశారు. ఇది సీలింగ్‌ భూమిగా తేలడంతో అధికారులు ఎకరం భూమిని స్వాధీనం చేసుకున్నారు. మిగిలినదానిపైనా దృష్టి సారించారు.

* షేక్‌పేట మండలం జైహింద్‌నగర్‌లో రూ.20 కోట్ల విలువైన రెండెకరాల సీలింగ్‌ భూమి స్థిరాస్తి వ్యాపారుల చేతిలో ఉంది. అధికారులు అధీనంలోకి తీసుకున్నారు.

* బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 12లో వెయ్యి గజాల ప్రభుత్వ భూమి ఓ ప్రముఖుడి చేతిలో ఉంది. లక్డీకాపూల్‌లో రూ.10 కోట్ల విలువైన 1,400 గజాల స్థలం మరో పెద్దమనిషి ఆక్రమించారు. పరిశీలించిన అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు.

* బోరబండలో 76 ఎకరాల ప్రభుత్వ భూమిలో వేల సంఖ్యలో ఇళ్లు వెలిశాయి. ఇందులో నాలుగెకరాల్లో వాణిజ్య సముదాయాలూ నిర్మించారు. వీటిని కూడా స్వాధీనం చేసుకునే దిశగా అధికారులు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు తెలిసింది.

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

పచ్చబొట్టేసి...జోలీకి నచ్చేసి!

ఏంజెలీనా జోలీకి రెండంటే మహా ఇష్టం. ఒకటి పిల్లలు, రెండు టాటూలు. ముగ్గురు కన్నబిడ్డలతో పాటు మరో ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది జోలీ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net