Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'
‘ఆదర్శా’నికి అవరోధం!
పాఠశాలల నిర్మాణాలు మధ్యలోనే నిలిపివేసిన గుత్తేదార్లు
ఒక్కో బడికి అదనంగా రూ.40 లక్షలివ్వాలని డిమాండ్‌
సిండికేట్‌గా మారి ప్రభుత్వంపై ఒత్తిళ్లు
నిర్మాణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు
అయినా బిల్లులు మంజూరు చేసిన అధికారులు
ఈనాడు - హైదరాబాద్‌
ర్కారీ బడుల్లో ఉన్నత విద్యా ప్రమాణాలు నెలకొల్పాన్న ప్రభుత్వ ‘ఆదర్శా’నికి భవనాల నిర్మాణ దశలోనే గండిపడుతోంది. ఆదర్శ పాఠశాలల నిర్మాణ వ్యయాలు అంచనాలను మించుతున్నా భవనాల నాణ్యత.. ప్రమాణాలను పరిహసించేలా ఉంటోంది. అయినా ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరు చేయించుకుంటున్న గుత్తేదార్లు తాజాగా నిర్మాణ వ్యయాన్ని ఒక్కో పాఠశాలకు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేస్తూ నిర్మాణాలను నిలిపివేశారు. తమ డిమాండ్‌ను సాధించుకునేందుకు సిండికేట్‌గా మారి ప్రభుత్వంపై వివిధ మార్గాల్లో ఒత్తిళ్లు తెస్తున్నారు. దీనికి పలువురు ప్రజాప్రతినిధులు వత్తాసు పలుకుతున్నారు. 15 నెలల కాల వ్యవధిలో ఒక్కో ఆదర్శ పాఠశాలకు రెండు అంతస్తులతో 36 గదులను ఇప్పటికే నిర్మించాల్సిన గుత్తేదార్లలో అత్యధికులు ఏకమై పనులకు విరామం ప్రకటించటం వల్ల రానున్న (2014-15) విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అనేక సమస్యలు తలెత్తబోతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 355 ఆదర్శ పాఠశాలలు మంజూరు కాగా వాటిలో 325 కిందటేడాది నుంచే ప్రారంభమయ్యాయి. ఒక్కో ఆదర్శ పాఠశాలను ప్రభుత్వం గుర్తించిన స్థలంలో గుత్తేదార్లు 31వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మొదటి అంతస్తు నిర్మాణాలను మాత్రమే పూర్తిచేసిన గుత్తేదార్లు.. ఒక్కొక్క పాఠశాల నిర్మాణానికి విద్యాశాఖ అందచేసే రూ.2.70 కోట్లు సరిపోవడం లేదని మొరాయిస్తున్నారు. వీరి డిమాండ్లకు ఇంజినీర్లు వత్తాసుపలుకుతున్నారన్న ఆరోపణలున్నాయి. విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో ఈ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ సంస్థకు గతంలో మేనేజింగ్‌ డైరెక్టరుగా వ్యవహరించిన జె.వి.కె.టి.ప్రభాకరరావు ఏకపక్షంగా రూ.2.72 కోట్లతోనే నిర్మాణాలను చేపట్టాలని, అవసరమైతే ఫ్లోరింగ్‌, తలుపులు, కిటికీలు, ఎలక్ట్రిక్‌ తదితర పనులను నిలిపి వేయవచ్చునని జిల్లాలకు ఆదేశాలు పంపారు. ఈ ఆదేశాల ఆసరాతో కొందరు గుత్తేదారులు పనులను ఆపివేసి ప్రభుత్వం అదనంగా నిధులు కేటాయిస్తేనే నిర్మాణాలు కొనసాగించటం సాధ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు.

నాసిరకం పనులు: అనంతపురం జిల్లా పమిడి, కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూరు, నిజామాబాద్‌ జిల్లా ధర్‌పల్లి, కర్నూలు జిల్లా కల్లూరు, నల్గొండ జిల్లా లోతుకుంట, విజయనగరం జిల్లా సాతివాడ, విశాఖపట్టణం జిల్లా వేములపూడి ఆదర్శపాఠశాల నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అనంతపురం జిల్లా గార్లదిన్నెలో మొదటి అంతస్తులో 18 గదులు నిర్మించాల్సి ఉండగా తొమ్మిది మాత్రమే కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల మరుగుదొడ్ల నిర్మాణాలు దారుణంగా ఉన్నాయి. విద్యుత్‌ బోర్డులు పట్టుకుంటే వూడిపోయేలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని ఆదర్శ పాఠశాలల నిర్మాణాల పరిస్థితి వర్ణనాతీతం. కొందరు గుత్తేదార్లు చేపట్టిన నిర్మాణాల్లో పెచ్చులు వూడిపోవడం ఇప్పటికే మొదలైంది. అసలివి కొత్తగా నిర్మించిన గదులేనా అన్న సందేహం కలుగుతుందని అధ్యాపకవర్గాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. నిర్మాణాల పరిస్థితులు ఇలా ఉండగా..గుత్తేదార్లు ఇప్పటికే 90% బిల్లులను మంజూరు చేయించుకున్నారు. నిధుల చెల్లింపు విద్యాశాఖలో ప్రహసనంగా కొనసాగుతోంది.

వ్యయంపెంపునకు సాకులివీ..
పాఠశాలల నిర్మాణాలు చేపట్టిన స్థలం కొండల్లో, రవాణా మార్గాలకు దూరంగా ఉండడం; రవాణా వ్యయం, స్టీలు ధరలు పెరగడం వంటి కారణాలతో తమకు చెల్లించే మొత్తాలను పెంచాలని గుత్తేదార్లు పట్టుబడుతున్నారు. ఆదర్శ పాఠశాలల్లో 2013-14 విద్యా సంవత్సరం నుంచి 6,7,8,11 తరగతులను ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరం 9, 12 తరగతులను ప్రారంభించనున్నారు. ఇంటర్‌ విద్యార్థులకు ప్రయోగశాలల అవసరం ఎంతైనా ఉంది. వచ్చే ఏడాది తరగతులు పెరుగుతున్నందున విద్యార్థుల సంఖ్యకు తగినట్లు నిర్మాణాలు జరగకుంటే అనేక కొత్త సమస్యలు తెరపైకి వస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుత్తేదార్ల డిమాండ్లను పరిష్కరించాలంటే అదనంగా రూ.100 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

40ల నాటి సెట్స్‌లో ఫరా ఖాన్‌, విశాల్‌ భరద్వాజ్‌

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో కంగనా రనౌత్‌, షాహిద్‌ కపూర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌లు ప్రధాన తారాగణంగా........

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net