Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
50వేల మందినే!
రాష్ట్ర స్థాయి పోస్టుల్లో పంచుకునే ఉద్యోగులింతమందే
మిగతా ఉద్యోగులు ఎక్కడివారు అక్కడే
34 వేల ఖాళీ పోస్టులూ పంపిణీ
3 నెలల్లో కసరత్తు కష్టమే
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర స్థాయి క్యాడర్‌ పోస్టుల్లో పని చేస్తున్న దాదాపు 50 వేల మంది ఉద్యోగులను మాత్రమే భౌతికంగా విభజించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీరుకాక ఇవే తరహా మరో 34 వేల ఖాళీలనూ ఉభయ రాష్ట్రాలకూ పంపిణీ చేస్తారు. రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసి నోటిఫిషన్‌ వెలువడ్డ తర్వాత ఉద్యోగుల విభజనపై మార్గదర్శకాలు జారీ అవుతాయి. ఉద్యోగుల విభజనకు మూడు నెలల వ్యవధిలో కసరత్తును పూర్తి చేయాలని తాత్కాలికంగా భావిస్తున్నా.. అదేమంత సులువు కాదనే వాదనలూ అధికారుల్లో వినిపిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో బదిలీలకు అర్హమై ఉండే పోస్టులకు విభజన వర్తిస్తుంది. ఇటువంటి పోస్టులు 84 వేలు ఉన్నట్టుగా కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. అయితే వీటిలో ఖాళీలను మినహాయిస్తే ప్రస్తుతం దాదాపు 50 వేల మంది ఉద్యోగులే పనిచేస్తున్నారని, అందువల్ల భౌతికంగా వీరికే విభజన వర్తిస్తుందని ఆర్థిక శాఖ అధికారులు లెక్కలేసినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి నిర్వహించిన భేటీలో అధికారులు ఈ వివరాలను వెల్లడించినట్టు తెలిసింది. ఖాళీలను కూడా ఉభయ రాష్ట్రాలకు విభజిస్తారు. కేంద్రం నుంచి మార్గదర్శకాలు వెలువడినప్పటి నుంచి కసరత్తు మొదలవుతుంది. ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి కేంద్ర సర్వీసు అధికారుల విభజనను మాత్రం కేంద్రంలోని సంబంధితశాఖలే చేపడతాయి. వీరి సంఖ్య స్వల్పంగా ఉంటుంది కనుక వీరిని ఉభయ రాష్ట్రాలకు విభజింటం తేలికేనని, రాష్ట్ర ఉద్యోగులను విభజించటానికి చాలా సమయం పడుతుందని అధికార వర్గాలు వ్యాఖ్యానించాయి. విభజన అమల్లోకి వచ్చేరోజు నుంచి రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు పనిని మొదలు పెట్టాలి. అంటే ఆ రోజుకే ఉద్యోగుల కేటాయింపులూ కొలిక్కి రావాలి. అందుకే విభజనకు మార్చి నుంచి మే వరకు 3 నెలల సమయాన్ని నిర్ధేశించుకోవాలని అధికారులు తాత్కాలికంగా భావిస్తున్నారు. అయితే ఇది తక్కువ వ్యవధే అవుతుందనే వాదనలు అధికారుల నుంచే వినిపిస్తున్నాయి. ఉద్యోగుల విభజనకు కేంద్రం వివిధ దశల్లో ఇచ్చే గడువుల మొత్తమే 6 నెలల పాటు ఉండనుంది. ఉద్యోగుల విభజనకు రాష్ట్ర స్థాయిలోని సలహా సంఘం పనిని మొదలు పెట్టాక పోస్టుల విభజన, ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపుల జాబితా తయారీ, ఉద్యోగుల నుంచి వినతుల స్వీకరణ, వాటి పరిశీలన, తుది జాబితా వెల్లడి తదితరాలకు ఈ సమయం పడుతుంది. రాష్ట్ర స్థాయి క్యాడర్‌ పోస్టులు తప్ప మిగతా పోస్టులు గల ప్రాంతాలు ఏ రాష్ట్ర పరిధిలోకి వెళ్తే అవీ ఆ రాష్ట్రంలోనే ఉంటాయి కనుక నిర్ణీత తేదీ నాటికి మిగతా క్యాడర్లలోని ఉద్యోగులు అందుబాటులో ఉంటారని అధికార వర్గాలు చెప్పాయి.

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

ఆటో నడిపిన సినీనటుడు అఖిల్‌

సినీనటుడు అఖిల్‌ మంగళవారం ఖమ్మం నగరంలో ఆటో నడిపి సందడి చేశాడు. స్థానిక నరసింహస్వామి దేవాలయ సమీపంలో కిడ్నీ వ్యాధితో.....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net